Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sāī Vāhini · Colour and Caste
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ప్రపంచమున
అనేక
వస్తువులు,
ఆ
వస్తువులకు
ఒక్కొక్క
నామము
కలదు.
అయితే
ఈ
వస్తువునకు
ఈ
నామమెందుకు
ఏర్పడినది?
అని
ఎవ్వరునూ
చెప్పలేరు,
చెప్పుటకు
వీలుకాదు.
ఒక
వేళ
చెప్పుటకు
ప్రయత్నింతురా,
అది
వారి
ఊహాగానమే
కానీ
సత్యము
కానేరదు.
అంతా
దైవ
నిర్ణయమేకానీ
మరొకటి
కాదని
గుర్తించినవారు
ధన్యులు.
పుట్టినప్పటినుండి
చచ్చువరకూ
ఉండు
మాటలుకానీ,
పుట్టుటకు
పూర్వముకానీ,
లేక
చచ్చిన
తదుపరిగానీ
ఉండు
మాటలకు
గానీ,
తల్లీ,
బిడ్డలూ-ఈ
శబ్దములు
గానీ,
ధర్మము,
అధర్మము,
స్వర్గము,
నరకము,
బ్రాహ్మణ,
వైశ్యులు
ఇత్యాది
పదములు
మానవులు
సృష్టించినవి
కావు,
ముమ్మాటికీ
కావు,
కావు
అని
చెప్పుటకు
వేదములే
ప్రమాణములు.
ఒక్క
విషయము
యోచింతము.
పదము
మాత్రమే
కలిగి
అర్థము
లేనివి
ఈ
లోకముననో,
లేక
మరే
లోకముననో
ఉన్నటుల
ఎవరైననూ
చూపగలరా?
చూపలేరు,
సాధ్యముకాదు.
అందువలన
ప్రతి
పదమునకు
అర్థమున్నదన్న
విషయము
ఆ
అర్థము
దైవనిర్ణయమన్న
విషయము
మానవులు
గుర్తించినపుడే
జీవిత
రహస్యము
తెలుసుకొనగలరు.
కావున
"బ్రాహ్మణోఽస్య
ముఖమాసీత్"
అనిననూ
"చాతుర్వర్ణ్యం
మయా
సృష్టం
గుణకర్మ
విభాగశః"
అనిననూ
అందులోగల
పదముల
అర్థములను
సూచించు
వర్ణములును
దానికి
తార్కాణముగ
పురుషులును
ఉండియుండవలెను
కదా!
వీరలను
గుణకర్మల
ననుసరించి
నేనే
సృజించుచుంటినని
2
▾
Meaning
Keep
దైవమే
తెలుపుచుండుట
లేదా?
వర్ణములు
గుణ
కర్మలపై
ఆధారపడి
యున్నవనుటలో
గుణములకునూ,
వర్ణములకునూ
సంబంధమున్నట్లు
స్పష్టమగుచున్నది.
కనుక
వర్ణము
అను
పదమును
కొంత
దీర్ఘముగా
ఆలోచించి,
విచారించిన
సులభముగా
తెలియును.
ఇపుడు
వర్ణమనగా
రంగు.
ఈ
అర్థము
సర్వసామాన్యముగా
లోకములోని
వాడుక.
అందరికీ
తెలిసిన
విషయమే
కానీ
దీని
ఉత్పత్తి
అర్థమును
అందరూ
ఎరుగరు.
దానిని
తెలిసికొనినపుడే
వర్ణము
అను
సత్య
అర్థము
స్పష్టమగును.
వృ
అనగా
వివరించుట
లేక
ఎన్నుకొనుట
అని
అర్థము.
ర్న్,
రమ్
అనగా
రమణ
అని
అర్థము
కలదు.
రమించుట
అని
కూడా
కలదు.
కనుక
వరించి,
ఎన్నుకొనుట
అనగా
ప్రీతిపూర్వకముగా
స్వీకరించుట
అని
వర్ణము
అను
శబ్దమునకు
అర్థము
తేలుచున్నది.
ఇక
రంగులలో
తెలుపు,
ఎరుపు,
నలుపు
రంగులు
చాలా
ప్రధానములు.
ఇక
మిగిలిన
రంగులు
వీటిలో
మిశ్రమమైనవేకానీ
ప్రత్యేకించినవి
కావు.
తెలుపునకు
సత్త్వగుణమనియు.
ఎరుపునకు
రజోగుణమనియు,
నలుపునకు
తమోగుణమనియు
సృష్టిరహస్యము.
లోకసహజము.
పదముల
అర్థము,
జీవులు
ఏ
గుణములను
అభిమానించుచున్నారో,
వరించుచున్నారో,
కోరుచున్నారో
ఆయా
గుణములకు
అనుబంధముగా
జన్మించుచున్నారు.
కాన
వర్ణములు
తమకు
తాము
కోరి
తెచ్చుకున్నవేకాని,
ఒకరు
కల్పించినవి
కావు.
ఈ
కోరిక
జీవుని
బుద్ధిననుసరించియుండును.
సామాన్యముగా
కోరికననుసరించి
బుద్ధి
అని
అందురు.
బుద్ధిననుసరించి
కర్మలు
సాగుచుండును.
కర్మలననుసరించి
జన్మలు
కలుగును.
"ఇదే
గుణకర్మ
విభాగశః"
అను
దాని
తాత్పర్యము.
ఇంత
విపులముగా
జాతి,
మత,
కుల
గోత్రాదులయందు
జనన,
మరణముల
కారణములు
శ్రుతి
స్మృతులు
నిరూపించుచుండ
మానవులు
గ్రహించలేక
తమ
తెలివితేటలకు
తోచినటుల
అర్థములు
చెప్పుకుని
ఆనందించుచుండుట
అజ్ఞానముతప్ప
మరేమి?
3
▾
Meaning
Keep
లేక
అన్నియూ
తెలిసిన
వారమను
అహంకారముతప్ప
మరేమి?
అహంకారము
కూడనూ
అజ్ఞానసంతతియే
కదా!
దీనినిబట్టి
జాతి,
మత,
కులాదులు
గుణకర్మలాధారముగా
చేసికొని
కలుగును
అనుట
నిస్సంశయము.
ఇవి
మానవుల
విభజనలు
కావు
అన్న
సత్యాన్ని
గుర్తించడము
అత్యవసరము.
వీటికి
వేదమే
ప్రమాణము.
వేదమే
ఆధారము.
భారతభూమి
కర్మభూమి
అని
అందురు.
ఇది
కర్మక్షేత్రము.
ప్రతిమానవుడూ
ఈ
కర్మక్షేత్ర
యాత్రికుడు
కనుక
ఈ
దేశములో
కర్మ
ప్రధానము.
కనుకనే
దీనికి
ఈ
నామము
అమరెను.
ఉచ్చనీచ
జన్మము,
భాగ్యభోగములు,
బంధమోక్షములు
మన
చేతిలోనివే
అని
శ్రుతి
యెలుగెత్తి
చాటుచున్నది.
ఏమని?
"సయధాక్రతు
రస్మిన్
లోకే
పురుషో
భవతి
తధేతః
ప్రత్యే
భవతి"
అని.
ఈ
లోకములో
పురుషుడు
ఎట్టి
రూపమును
ప్రార్థించునో
అట్టి
రూపము
తిరిగి
మరణానంతరము
ప్రాప్తించును
అని
దీనియొక్క
అర్థము.
కర్మానుగుణముగా
జన్మకలుగుచున్నది
అనుట
సత్యము.
ఇప్పటి
భోగభాగ్యాదులు,
మన
స్వభావాలు,
గుణములు
బుద్ధులు,
సుఖ
దుఃఖాదులు
పూర్వజన్మార్జితములు.
అటులనే
ఈ
జన్మమున
ఎట్టి
బుద్ధులను
అనుసరించి
కర్మలు
చేతుమో
దానికి
అనుగుణముగా
ముందు
జన్మమేర్పడును.
కొందరు
మంచి
జాతియందు
జన్మించియూ
చెడు
కర్మలనాచరింతురు.
హీనజాతియందు
జన్మించి
మంచి
కర్మలు
చేతురు.
వీని
విషయమేమి
అని
మనలో
మనము
సామాన్యముగా
చర్చించుచుందుము.
అనగా
బ్రాహ్మణకులమందు
పుట్టి
చెడు
కర్మలు
అనగా
రజోతమో
గుణ
కర్మలు
ఆచరింతురు.
తక్కువ
జాతియందు
జన్మించి
సాత్వికమైన
మంచి
కర్మలు
చేయుచుందురు.
ఇట్టివారు
జన్మ
బ్రాహ్మణులు
మాత్రమే,
కానీ
కర్మబ్రాహ్మణులు
కారు.
జన్మహీనులేకానీ
కర్మహీనులు
కారు.
జన్మ,
కర్మలను
రెండింటినీ
ఏకీభవించిన
పురుషులే
సరియైన
జాతికి
తార్కాణము
అని
కూడా
వేదము
అంగీకరించుచున్నది.
4
▾
Meaning
Keep
లోకములో
శుద్ధ
సాత్వికులు
ఉండుట
అరుదు.
అట్టివారిలో
రజో
సాత్విక
మిశ్రమములు
ఉండును.
అట్టివారు
జన్మమున
ఉన్నతస్థాయియందుండి,
కర్మమున
రాజసిక
చర్యలను
అనుభవింతురు.
ఇట్టివికూడా
వర్ణమిశ్రమములని
వేదము
దాచక
చూపుచున్నది.
వేదము
నిష్పక్షపాతి.
ఒకరిని
మెచ్చుకొనుటగానీ,
మరొకరిని
తూలనాడుటకానీ
ఉండదు.
ఉన్న
సత్యాన్ని
ఉన్నటుల
చెప్పుచున్నది.
చిన్న
ఉదాహరణము.
కౌశికుడు
క్షత్రియుడు
అనగా
రజోగుణ
సంపన్నుడు.
అయితే
జన్మాంతర
కర్మఫలముగా
అతనిలో
సాత్విక
భావములు
ప్రవేశించి
సత్యవ్రతుడుగా
సంచరించెను.
స్వచ్ఛ
చిత్తుడుగా
తన
జీవితమును
మార్చుకొనెను.
అతడు
ఉచ్చరించిన
మంత్రమే
గాయత్రి
మంత్రము.
ఈ
మంత్రమునకు
కర్త
కౌశికుడే,
అతడే
విశ్వామిత్రుడు.
విశ్వమునకే
మిత్రుడాయెను.
ఆ
మంత్రమును
బ్రాహ్మణులందరూ
పవిత్ర
ప్రసాదముగా
అందుకొని
ఆచరించి,
ఆనందించుచున్నారు.
ఇతడు
జన్మక్షత్రియుడే
కానీ,
కర్మబ్రాహ్మణుడు.
దీనిని
స్మృతి
అంగీకరించింది.
కాని
దైవవాణి
అయిన
వేదము
సర్వమానవులకూ
సమాననీతి
బోధించుచున్నదే
కాని
పక్షపాతము
ఏమాత్రమూ
అందులో
లేదు.
జీవుని
కర్మగుణములననుసరించి
జన్మకులములు
కలుగుచున్నవి.
ఇక్కడ
ఈ
ఆధునిక
యుగపురుషులకు
సామాన్యముగా
సందియములు
కలుగవచ్చును.
ఇది
సహజమే.
ఏమిటా
సందియము?
సృష్టిలోనే
వర్ణవిభాగములు
ఉన్నవనుట
సత్యమయిన
ఇవి
అన్ని
దేశములలోనూ
ఉండవలెను
కదా!
ఒక
భారతదేశమునందే
ఎందుకు
ఉండాలని?
సృష్టియందుగల
అన్ని
విషయములు
అన్ని
తావులలోనూ
ఉన్నవా!
ఉండనేరవు.
ఆయా
ప్రాంతమును,
ఆయా
వాతావరణమును,
ఆయా
శాస్త్రములను
అనుసరించి
ఆయా
తావులకు
అనుగుణ్యముగా
ఆయా
నీమములు
ఏర్పడుట
ప్రకృతి
సహజము.
భరతఖండమునగల
వృక్షజాతులన్నియూ
ఇతర
ఖండములలో
ఉండవలెనని
నియమము
లేదు.
ఆకాశముననున్న
నక్షత్రములు
భూమిపైనుండవలెనని
కోరుట
సాధ్యముకాదు,
నీటిలో
జీవించే
చేపలు
5
▾
Meaning
Keep
కొండలలో
నివసించాలని
నిబంధన
లేదు.
ఏది?
ఎక్కడ?
ఎందుకు?
ఎప్పుడు?
జరగవలెనో
దాని
నియామకుడు
అయిన
సర్వేశ్వరునకు
తెలియును.
అందరూ
దానిని
నిర్మించ
సాధ్యముకాదు.
జననాదులు,
దేశకాల
కర్మ
పరిస్థితులలో
సంబంధించి
యుందునుకానీ
అవి
మన
అనుకూల
ప్రతికూలములలో
చేరియుండవు.
ప్రత్యక్షమునే
ఆధారముగా
చేసికొని
జీవించు
బుద్ధికి
ఈ
వర్ణము
లేమిటని
సంశయము
కలుగును
ఇది
సహజము.
దీనినే
అహంకారమని
అందురు.
వస్తుతత్త్వము
వేరు
అహంకారము
వేరు.
వస్తుతత్త్వము
తెలియక
చిత్తమొచ్చినట్లు
చేయబూనిన,
చెప్పదొడగిన
ఇది
అజ్ఞానలక్షణ
మనవచ్చును.
Previous
←
Man and God
Next
Action and Karma
→