Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sāī Vāhini · Action and Karma
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
కర్మభూమియని,
భోగభూమియని
నానా
దేశములు
రెండు
భాగములుగా
విభజించబడి
అందలి
ప్రజల
ఆదర్శముల
గూర్చియు
తెలుపబడినది.
అందులో
భారతభూమి
కర్మభూమి
అనియు,
కర్మ
రహస్యము
బాగుగా
గుర్తించినదనియు
నిర్ణయింపబడినది.
"వ్యాపార
మంత్రం
కర్మ"
ఇది
లౌకికమని,
వైదికమని
రెండు
విధములు.
అందులో
జీవన
హేతుభూతమగు
కర్మ
అంతయు
లౌకికమనబడును.
వైదిక
కర్మ
శ్రౌతమని,
స్మార్తమని
రెండు
విధములు.
నిత్య
నైమిత్తికాదులు,
స్మార్తకర్మ,
సర్వలౌకిక
వైదిక
కర్మలు
కరణభేదమువలన
మానసిక,
వాచిక,
కాయికములని
త్రివిధములు.
ఇవి
మరీ
పూర్వజన్మకృతమని,
ఇహజన్మ
కృతమని
రెండువిధములు.
దీని
ఫలములే
సంచిత,
ఆగామి,
ప్రారబ్ధములని
మూడు
విధములు.
ఈ
జన్మయందు
అనుభవించునది
ప్రారబ్ధము.
ప్రస్తుతము
చేయబడునది
ఆగామి,
అనేక
జన్మలనుండి
సంపాదింపబడి
ముందు
అనుభవముకొరకు
కాచుకుని
నిలువయున్నది
సంచితము.
ఇట్లు
కర్మతంత్రము
కర్మయొక్క
వ్యవహారమంతయు
శ్రుతి
స్మృతులు
నిర్ణయించినవి.
కర్మ
అను
పదము
బహుచిన్నది.
అయినప్పటికీ
అర్థబాహుళ్యమునందు
అపారమైనది.
ఎవరికి
వారు
వారి
వారి
బుద్ధిననుసరించి
ఈ
కర్మమునకు
అర్థమును
నిర్వచించుకొనవచ్చును.
ఈ
కర్మ
మనోవాక్కాయములను
త్రికరణములచే
జరుగుచుండును.
లౌకిక,
వైదిక,
పారమార్థిక
విషయ
సంబంధమంతయు
ఇందే
యిమిడియున్నది.
2
▾
Meaning
Keep
దేనికది
విడదీయ
వశముకాదు.
ఇవి
మూడునూ
అవినాభావ
సంబంధము
గలవి.
కర్మ
నిరంతరం
నదీప్రవాహమువలె
సాగుచుండును.
సృష్టిలోని
చేతనాచేతనములన్నియు
ఈ
కర్మప్రవాహ
వేగమునకు
లోనై
సంసారచక్రమున
నిర్విరామముగ
పరిభ్రమించుచున్నవి.
కర్మ
అనగా
చలనమని.
చలనమునకు
అవకాశ
మైనది
ఆకాశము.
అందు
చలించునది
వాయువు.
వాయుచలనమునుండి
అగ్ని
ఉద్భవించును.
ఆ
రెండింటి
రాపిడి
వలన
అగ్ని
ఉద్భవించునని
అందరికీ
తెలియును.
మరియు
ఉచ్ఛ్వాస
నిశ్వాసముల
చలనము
సాగుచున్నంతవరకు
జీవుల
దేహములు
ఉష్ణత్వము
కలిగియుండుట,
ఇది
మరొక
నిదర్శనము.
ఉష్ణత్వము
అగ్ని
లక్షణమని
వేరుగ
చెప్పనక్కరలేదు.
అగ్నినుండి
జీవము
ఉద్భవించుననుటకు
సూర్యతేజమునుండి
కలుగు
మేఘముల
ఉత్పత్తి
ప్రబల
నిదర్శనము.
జలముయొక్క
అణువులు,
ఇతర
భూతముల
చేరికవలన
ఘనీభవము
చెంది
పృథివినుండి
ఓషధులు
జనించునను
విషయము
మనకు
విశదమే.
ఓషధులనుండి
అన్నము,
అన్నమువలన
తేజస్సు.
దానివలన
పురుషుడు
జనించును.
ఇదంతయు
సృష్టికర్తయొక్క
విధానము.
ఇది
శ్రుతి
తాత్పర్యము.
అనగా
ఇవన్నియూ
చలన
ప్రభావమువలనను,
పరిణామము
వలనను
పరంపరముగా
జరుగుచున్నవి.
ఇంత
మహాచలన
ప్రవాహమునకు
పునాదిగా
అచల
వస్తువొకటి
ఉండవలయును
అని
వేరు
చెప్పనక్కరలేదు.
ఇట్టి
నిశ్చలమగు
పరతత్త్వమునే
ఆత్మ
లేక
పరబ్రహ్మము
అందురు.
పరమేశ్వరుని
జ్ఞానేచ్ఛ
క్రియాశక్తులే
స్పందనము.
స్పందనమునే
కర్మ
అని
చెప్పబడెను.
సృష్టికినీ,
కర్మకునూ
అవినాభావ
సంబంధము
కలదు.
ఈ
కర్మ
ప్రభావమువలననే
బ్రహ్మ,
విష్ణు,
మహేశ్వర
స్వరూపములు
సృష్టి
స్థితిలయకారులగుట
తటస్థించుచున్నది.
సమస్త
గ్రహసంచలనములు
తదితర
లోకవ్యవహారములన్నియు
కర్మకులోనై
జరుగుచున్నవి.
3
▾
Meaning
Keep
కర్మకు
మొదలు
అనునది
లేదు.
ఏది,
ఎందులకు,
ఎప్పుడు,
ఏవిధముగ
జరుగబోవునను
అంశము
చెప్పుటకు
ఎవరికీ
సాధ్యముకాదు.
ఇది
అనాదిసిద్ధమై
జరుగుచూవచ్చుచున్నది.
ఒక
పనిచేయుట
కర్మ
అని
చెప్పినటులనే
ఎట్టిపనీ
చేయక
ఊరకుండుటయూ
కర్మ
అని
చెప్పబడును.
ఊరక
ఉన్నవారిని
చూచి
సామాన్యముగ
మనము
వారేమీ
పనిచేయుట
లేదని
అందుము.
ఏమియూ
చేయక
అతడేమి
చేయుచున్నాడని
తిరిగి
ప్రశ్నించిన
తిరిగి
అదే
సమాధానము
అనగా
అతనేమి
చేయక
ఊరకున్నాడని
జవాబు
వచ్చును.
ఊరకుండుట
అననేమి?
ఏమియూ
చేయక
మిన్నకుండుట
అనగా
మిన్నకుండుట
అను
కర్మను
అతను
చేయుచున్నాడని
తెలియును.
అందువలన
మానవుడొకపుడు
ఒక
కర్మ
చేయుననియు,
మరొకపుడు
ఏమియు
చేయకపోవుట
అను
కర్మము
చేయుచున్నాడని
గ్రహించవలెను.
కర్మ,
అకర్మ
అనునవి
రెండునూ
భిన్నాభిన్న
కర్మలే
అని
మనము
భావించవలసియుండును.
కర్మయందు
అకర్మను,
అకర్మయందు
కర్మను
చూడవలయును.
ఉచ్ఛ్వాసనిశ్వాసములు,
ప్రాణస్పందనము
ఇది
జీవితమున
మొట్టమొదటి
క్రియ.
ఇది
జరుగుచుండుట
చాలా
ఆశ్చర్యకరము,
అద్భుత
విషయము.
తాను
ఉచ్ఛ్వాసనిశ్వాసములు
చేయవలెనని
ఏ
మానవుడును
సంకల్పించి
చేయుటలేదు.
ఈ
కార్యము
సంకల్పరహితముగా
జరుగుతున్నది.
ఇది
ఒక్క
మానవ
జీవితమునకే
కాక,
సర్వ
జీవరాసులయందు
అగుపించుచున్నది.
సంకల్ప
రహితముగ
ఇది
యెట్లు
జరుగుతున్నదనియు
సంకల్ప
రహితముగ
ఏ
క్రియయు
ఉండజాల
దనియు
మనకు
సందేహము
కలుగవచ్చును.
సంకల్ప
రహితముగ
కర్మప్రవృత్తి
జరుగదు.
కావున
శ్వాసక్రియకు
గల
సంకల్పము
మన
దృష్టి
పథమున
లేదని
చెప్పుట
సమంజసము.
అట్లుకాక
ఇది
సర్వ
జీవరాసులకు
ప్రకృతి
అని
సమాధాన
పరచుకొన
ప్రయత్నించినచో,
ప్రకృతి
అననేమి
అను
ప్రశ్న
4
▾
Meaning
Keep
జనించక
తీరదు.
ఉచ్ఛ్వాసనిశ్వాసములు,
జీవ
ప్రకృతి
అననేమి?
ఇవి
జీవులకు
సహజములు
అను
సమాధానము.
ఇట్టి
సమాధానమునుబట్టి
'ప్రకృతి',
'స్వభావము',
'నైసర్గికము'
లను
పదములకు
భావము
అజ్ఞానమనినను
ప్రకృతి
అనినను
అర్థమొక్కటే.
నాకు
సంబంధించిన
శ్వాసను
గురించి
నాకే
తెలియ
లేదన్నమాట.
యోగులు
మనోబలమున
నాడీచలనము,
హృదయ
స్పందనముల
నాపు
చుండుట,
సంకల్పమే
కర్మప్రవృత్తి
సూచితమని
మనకు
గోచరింప
జేయగలదు.
కర్మ
అనగా
గాలిలో
నిరాధారముగా
అల్లాడు
విషయము
కాదు.
మనము
కర్తలమైనగాని
కర్మ
వ్యవహారము
బయలుదేరదు.
"న
జాతి,
యిచ్ఛతి,
యతతే."
ఇది
న్యాయశాస్త్ర
సూత్రము.
తన
జ్ఞానముననుసరించి
కోరిక,
దానిననుసరించి
కర్మ
చేయుట
తటస్థించును.
"యద్
ధ్యాయతి
తత్
ఇచ్ఛతి,
యద్
ఇచ్ఛతి
తత్
కరోతి,
యత్
కరోతి
తద్భవతి"
ఇది
వేదాంత
సూత్రము.
మనసులో
దేనిని
ధ్యానించుచుండునో
దానిని
ఇచ్చగించును.
ఇచ్చననుసరించి
కర్మ
చేయును.
చేసినదానిని
అనుసరించి
తాను
పొందుచుండును.
పురుషుని
వ్యక్తిత్వస్వరూపము
కామమయము.
తాను
కోరిన
ప్రకారము
సంకల్పించును.
సంకల్పముననుసరించి
కర్మను
చేయును,
కర్మనను
సరించి
తనను
సృజించుకొనును.
అనగా
తన
బుద్ధిననుసరించి
జన్మ
తెచ్చుకొనును.
ఈ
బుద్ధినే
ప్రకృతి
అనుట,
కనుక
ప్రకృతి
తన
బుద్ధి
నిర్మాతయని
తెలిసికొనిన
అట్టి
ప్రకృతి
విడివడుటకు
చూచుకొనవచ్చును.
జీవుడు
ప్రకృతికి
వశుడయి
ఉన్నాడని
కానీ
ప్రకృతిలో
జీవుడు
కూర్చొని
ఉన్నాడని
కానీ
గ్రహించనగును.
ఇంతటి
గంభీరార్థములుగల
శాస్త్రములోని
కర్మ
విషయము
ప్రస్తుతము
వదలి
మానవుల
సామాన్య
బుద్ధికి
అందనటువంటిదియు,
సంబంధించనటువంటిదియునగు
కర్మను
గురించి
కూడా
ఒకింత
తెలిసికొనవలసియున్నది.
5
▾
Meaning
Keep
కర్మ
అన
సామాన్యముగ
మనకందరికీ
తెలిసిన
అర్థము
పని
అని.
ఎట్టి
వ్యవహారమునైననూ,
వ్యాపారమునైననూ
కర్మ
అనవచ్చును.
కర్మయందు
ఉచ్చనీచములు
లేవు.
ప్రతి
కర్మను
పూజ్యభావముతో
జూచి,
ఆచరించవలెను.
కర్మ
ప్రశంసాసూత్రములు
అనేకములు.
హిందువులు
సామాన్యముగ
కర్మ,
కర్మ,
కర్మ
అని
సర్వము
కర్మకు,
ప్రారబ్ధమునకు
వదలి
సోమరులైయున్నారని
కొందరనుటయు
తటస్థించుచున్నది.
ఇది
అపస్మారకపులంకె.
ఇది
కర్మసిద్ధాంతమునకును
లౌకిక
కర్మకును
ముడి
పెట్టుటవలన
సంభవించినది.
ఇట్టి
హెచ్చరికలు,
హితబోధలు
ఎందులకో,
ఎవరిని
ఉద్దేశించియో
మానవులకు
తెలియదు.
అయినను
సాధారణముగ
మన
అనుభవములోగల
వారిని
చూడుడు.
ఒక
కచేరియందు
పని
చేయు
గుమాస్తా,
భూమి
దున్ని
బ్రతుకు
కృషీవలుడు,
కాయకష్టములు
చేసి
జీవించు
కూలి,
కుమ్మరి,
కమ్మరి,
వడ్రంగి,
చాకలి,
మంగలి
మొదలగు
వారు
తమ
తమ
విధ్యుక్త
ధర్మములను
ఎరుగుదురు.
ఎవరి
కర్మ
వారు
చేయకున్న
తమ
జీవితము
సక్రమ
మార్గమున
నడువదని
వారెరుంగుదురు.
అందులకు
వారి
వారి
శక్తియుక్తుల
ననుసరించి
తమ
తమ
కర్మలు
వారు
నెరవేర్చుకొనుచుండు
సందర్భమున
హెచ్చరికలు
ఏలకో?
వారి
వారి
కర్మలు
వారు
నెరవేర్చుకొనలేని
సమయముననే
హెచ్చరికలు
అత్యవసరము.
మోహాంధుడై
తన
కర్తవ్యమేదో
పాలుపోక
విరక్తిభావముతో
"యుద్ధము
చేయను"
అనిన
అర్జునునకు
శ్రీకృష్ణ
భగవానుడు
"కర్మణ్యే
వాధికారస్తే"
అన్నారు.
అనగా
కర్మనాచరించుటయే
కర్తవ్యమని
బోధించిన
ఉపదేశామృత
వాక్కులను
కొందరు
ఉదాహరించుటయు
జరుగుచుండును.
ఈ
ఉపదేశములు
కేవలము
ధర్మసంస్థాపనార్థము,
శాస్త్రీయమైన
కర్మమార్గమునందు
ప్రవృత్తి
కలిగియుండుటకు
మాత్రమే
చేయబడినవికానీ
భౌతిక,
పశు
సామాన్య
ధర్మములైన,
ఆహారభయాదులకు
సంబంధించి
నవి
కావు.
ధర్మరాజాదులు
లౌకిక
వ్యవహార
దురంధరులు,
వర్ణాశ్రమాచార
ధర్మనిరతులైయున్నారు,
ఇట్టి
వారలకు
యుద్ధము
చేయుమని
చేయు
హిత
బోధ
తాత్పర్యమేమి?
6
▾
Meaning
Keep
అనేక
కారణములను
పురస్కరించుకుని
'యుద్ధము
చేయను'
అను
పార్థునితో
నీవు
క్షత్రియ
వంశ
జనితుడవు,
క్షత్రియునకు
వంశధర్మ
మొకటి
కలదు,
అట్టి
వర్ణ
ధర్మము
అగు
యుద్ధమును
విసర్జించి
వ్యవహరింపకుము.
మానవుడు
ప్రకృతి
గుణములకు
వశుడైయున్నాడు.
కావున
ఏదో
ఒక
కర్మ
చేయుచునే
యుండును.
ఒక్క
క్షణమైననూ
కర్మ
చేయకుండ
ఉండజాలడు,
కావున
దీనిని
గ్రహించి
నీ
కులధర్మమును
త్యజింపకుమ'ని
చేసిన
హితబోధ
ఇది.
కర్మ
అనగా
ఆహారాదులకు
అనువగు
కృషియనియేనా
అర్థము?
విమానములు,
పడవలు,
కర్మాగారములు,
చికిత్సాలయములు,
ఆహారోత్పత్తి
ప్రణాళికలు
మాత్రమే
కర్మభాగమనరాదు.
దీనిని
కేవలము
ఐహిక
కర్మయందురు.
ఐహిక,
ఆధ్యాత్మికములు
దైవికమునకు
జతపడియున్నవి.
ఇహలోక
సుఖమునకు
ఇట్టి
కర్మలన్నియు
అనివార్యములు.
ఇట్టి
కార్యాచరణము
నందెంతెంత
లోపముండునో,
అంతంత
వ్యక్తి
సంఘ
దేశ
గత
సుఖానుభూతి
లోపించుచుండును.
ఇందు
రెండు
అభిప్రాయములు
ఉండజాలవు.
కాని
ఐహికమునకిచ్చు
ప్రాధాన్యము
ఆముష్మిక
కర్మకు
కూడ
నొసంగబడినచో
మనము
వగవ
పనిలేదు.
ఐహిక
కర్మలకును
దైవికమునకును
గల
సంబంధము
కూడ
నొక్కింత
పరికింతము.
మనము
పొలమును
చక్కగా
బలపరచి
దున్నుదుము.
మంచి
విత్తనములను
అందులో
చల్లుదుము.
దానిని
సకాలములో
నూడ్చుదుము,
కలుపులు
దీయుదుము,
నీరు
పెట్టుదుము.
చక్కగా
కంచె
గట్టి
కాపలా
కాయుదుము.
ఏ
కర్మకు
ఆ
కర్మ
యథావిధిగా
నుత్సాహపూరితముగా
చేయుదమనుకొనుడు.
అంతటితో
మన
కర్మ
ఫలితము
నిరాటంకముగ
మన
యింటికి
చేరునను
నమ్మకమేమి?
కాలువలలో
నీరు
లేమి
వలననో
లేక
అతివృష్టి,
అనావృష్టి
వలననో,
లేక
రోగములు,
తెగుళ్ళవలననో
పైరు
నశించును.
అట్టి
నిరాశాపూరిత
మానవ
జనసత్వమును
చంపుకొనుట
భావ్యము
కాదు.
వర్షములు
కురియని
పక్షమున
వాయు
విమానముల
సహాయమున
అంతరిక్షము
వనో
లేక
7
▾
Meaning
Keep
వేరు
మార్గముననో
మేఘ
మాలికలపైకెగసి
వానిపై
మందులు
ప్రయోగించి
కృత్రిమ
వర్షముల
బలవంతముగ
కురిపింతు
మనుకొనుము.
ఆ
వర్ష
బిందువులు
మన
పొలములోనే
పడునను
నిశ్చయమేమి
కలదు?
ప్రధంజనుని
ఆగ్రహ
అనుగ్రహములపై
ఆధారపడవలసినదే
కాని
ఈ
కృత్రిమ
వృష్టిపై
ఆధారపడ
వీలుకాదు.
Previous
←
Colour and Caste
Next
Prayer
→