Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sāī Vāhini · Prayer
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
వేరొక
మార్గము
మృగ్యమైనపుడు
గత్యంతరములేక
దేవుని
ప్రార్థించవలెనని
తలంచిన
ఎట్లు
ప్రార్థించవలెను?
ఏమని
ప్రార్థించవలెను?
అవసరమునకు
ప్రార్థించక
తీరదు.
అమాంతముగా
"ఓ
దేవుడా!
నా
పొలములోని
పైరులు
వర్షములేక
మలమల
మాడిపోవుచున్నవి.
కాలువలలో
నీరు
చుక్క
అయిననూ,
త్రాగుటకైననూ
లేకయున్నది.
కాన
త్వరలో
వర్షము
కురిపించుము.
కాలువలలో
నీరును
ప్రవహింపచేయుము"
అని
ప్రార్థింతుమనుకొనుము.
మరొక
సందిగ్ధావస్థలో
బడుట
తటస్థించుచున్నది.
అదే
సమయమున
నీ
పొరుగింటి
యతడు
తాను
ఏదియో
మంగళకార్యమును
చేయబూని,
ఆ
కార్యము
పూర్తి
అగువరకూ
వర్షము
కురియకుండునటుల
చేయమని
దేవుని
దీనుడై
ప్రార్థించును.
ఈ
విధముగా
ప్రార్థనను
సలుపు
ఇరువురూ
దైవమునకు
అత్యంత
భక్తులే,
పరమభక్తులే
కావచ్చును.
వర్షము
కావలయునని
ఒక
భక్తుడు,
వర్షము
అక్కరలేదని
మరొక
భక్తుడు
ప్రార్థించుటవలన
ఈ
పరిస్థితియందు
దేవుడు
ఏమి
చేయవలయును?
ఎవరి
కోర్కెలను
దేవుడు
నెరవేర్చవలయును?
ఈ
కోర్కెలు
నెరవేర్చుట
దేవుని
నియమమా?
ఈ
విధమైన
కోర్కెలు
భగవంతుడు
ఏ
విధమున
నెరవేర్చును?
దేవునకు
సర్వ
స్వతంత్రమున్ననూ
కొన్నింటికి
తాను
కూడా
బద్ధుడే
కదా!
ఒక
దేశమునకు
రాజు,
తాను
ప్రభువును
కదా
అని
తన
దేశ
ప్రజల
కోరికలన్నియూ
పూర్తిగా
తీర్చజాలకున్నాడు.
తాను
ప్రభువునని
ఇచ్చ
వచ్చినట్లు
చేయబూనినచో
ప్రజలు
అతనిని
పదవీ
భ్రష్టుని
చేతురు.
చేయవచ్చును.
2
▾
Meaning
Keep
ఎందువలన?
ఎంత
రాజైననూ
సక్రమ
పరిపాలన
నిమిత్తము
ఏర్పడిన
కొన్ని
నియమములకు,
చట్టములకు
లోనై
యుండవలయును.
ఈ
చట్టములు
తనచే
నియమించబడిన
వైననూ
అవి
తనచే
నియమించిన
తరువాత
తానునూ
ఆ
చట్టములకు
బద్ధుడు
అవుతాడు,
కావలెను.
వానిని
తాను
ధిక్కరించినా,
మితిమీరి
నడచినా
"యథా
రాజా
తథా
ప్రజా"
అను
ధర్మము
అమలులోనికి
రాగలదు.
అందువలన
చట్ట
నిర్మాత,
చట్ట
నియమములను
అనుసరించి
మెలగవలసియుండును.
వేరు
మార్గమున
పోవ
వీలుపడదు.
ప్రజల
యోగక్షేమములను
ప్రభువు
చూచుకొనుట
కర్తవ్యము
వారల
క్షేమమే
ప్రభుక్షేమము,
కనుక
వారల
క్రమమైన
కోరికలను
తీర్చుట
అతని
విధ్యుక్తధర్మము.
అందువలన
అందులకు
రాజ్యాంగతంత్రముననుసరించి,
సర్వ
విషయములు
స్వయంగా
తనకు
తాను
నిర్వహించక,
తన
పాలనావిధానము
సక్రమముగా
నడచిపోవుటకై
వివిధ
శాఖలను
నియమించును.
ఇహలోకములోని
ప్రభువే
ఇన్ని
కట్టుదిట్టములు
ఏర్పరచి
దేశక్షేమ
పరిపాలనను
గావించుచుండ
సర్వలోక
శరణ్యుడైన
భగవంతుడు,
జగత్పరిపాలకుడు,
లోకనాథుడు,
విశ్వనాథుడు
సృష్టి
తంత్ర
నిర్వహణమునకు
నిర్దుష్టమైన
కట్టుబాట్లు,
విధులు
ఎన్ని
నియమించవలసియుండునో
యోచించుడు.
సృష్టిక్రమము
అనేక
శాఖోపశాఖసమన్వితము.
ఏ
శాఖ
కాశాఖ
విభజింపబడియున్నది.
ప్రతి
శాఖకు
అధిపతులు,
వారికి
తగిన
పరివారము
తగినరీతిగా
నేర్పాట్లు
జరిగియున్నవి.
ఇక్కడ
భక్తుల
ప్రార్థనలు
ఏ
శాఖకు
చెందినవో
ఆ
శాఖకే
అందజేయవలసి
యుండును.
కనుక
అజ్ఞానముననో,
పొరపాటుననో
వేరొక
శాఖకు
పంపబడినయెడల
ఆ
శాఖాధిపతి
ఏమి
చేయును?
ఆ
పత్రము
తన
శాఖకు
చెందినది
కాదనియును,
దానితో
తనకేమీ
సంబంధము
లేదనియును
దానిలో
జోక్యము
కలిగించుకొనక
ప్రక్కకు
నెట్టును.
కావున
మన
ప్రార్థనలు
ఏ
శాఖకు
చెందియుండునో
ఆ
శాఖకు
మాత్రమే
నియమితములు.
వర్షమునకు
వరుణుడు
ప్రభువు.
ఈ
వర్షమునకు
సంబంధించిన
ప్రార్థన
వరుణుని
3
▾
Meaning
Keep
శాఖ.
దానిపై
అతనికి
మాత్రమే
అధికారము.
అటులనే
సూర్యుడు
తేజము,
ఆరోగ్యమున
కధిపతి.
గణపతి
విఘ్నశాఖాధికారి.
సస్యములకు
భూదేవి.
పంట
ఓషధులకు
చంద్రుడు.
ఇటులనే
వివిధ
శక్తులకు
వానివానికి
తగిన
అధిపతి
కలడు.
వీరికి
అధిష్ఠానదేవతలు
కలరు.
వారిని
అధిష్ఠాన
అధిపతులని
అందురు.
మన
ఇంద్రియ
శక్తులకన్నింటికినీ
ఒక్కొక్క
అదిష్ఠానదేవత
కలదు.
"అయితే
దేవుడొక్కడేకదా,
ఆయనను
ప్రార్థించుచుంటిమికదా,
ఇక
మన
కోరికలు
తీరకుండుటెట్టిది?"
అని
అనుకొనుట
పొరపాటు.
అదియే
మనలోని
బలహీనత.
దేవుడొక్కడే.
నిజమే
ప్రధానమంత్రి,
లేక
రాజు
ఒక్కడే.
కానీ
శాఖలు
వేరు
వేరు
అని
గ్రహించలేకపోవుచున్నాము.
ఎవరికో
జాబు
వ్రాసి
మరొకరి
అడ్రసుకు
పోస్టుచేస్తే
అది
ఎవరికి
పోయి
చేరును?
అడ్రసు
కలవానికి
చేరునేకానీ
అసలువానికి
చేరదు.
అదే
విధముగా
నీ
ప్రార్థన
ఎవరికి
సంబంధించినదో
ఆ
శాఖాధికారికే
నీవు
అడ్రసు
చేయవలసియుండును.
అనగా
విలాసము
వ్రాయవలసి
యుండును.
అట్లు
వ్రాసినపుడే
ఆ
విషయము
అతనికి
చెందును,
దానిపై
అతను
చర్యను
తీసికొనును.
మన
మనోరథము
సిద్ధించుటకు
మనము
అర్హులమా?
కాదా?
యని
విమర్శించుకొనుట
అత్యవసరము.
మనలోని
భావములు,
సంకల్పములు,
కోరికలు
దృఢవిశ్వాసపూరితము
లగునో
కాదో
తేలిపోవును.
ఇందుకు
భగవంతునిచే
ఏర్పడిన
క్రమవిధానా
చరణమే
గీటురాయి.
మన
సంకల్పములు
దృఢమై,
పవిత్రమై
అతని
కరుణా
కటాక్ష
వీక్షణముల
నాకర్షించుకొన
శక్తిమంతములగును.
కర్మకాండ
మానవాభ్యుదయమునకు
జీవగఱ్ఱి.
బ్రతుకునకు
వాయువు.
ఆకలి
నివారణకు
అన్నము,
దాహశాంతికి
జలము,
ఎట్టి
సంబంధముననున్నవో
మానవునకును
అతని
పరమార్థమునకును
మధ్య
కర్మకాండయట్టి
సంబంధమున
గలదు.
అందువలన
వేదచోదిత
కర్మానుష్ఠానము
మన
కర్తవ్యము.
భగవంతునకు
చేరు
కర్మలు
మూడు
కలవు.
నిష్కామకర్మ,
నిస్స్వార్థప్రేమ,
నిర్మలహృదయమునుండి
వెలువడు
ప్రార్థన
ఇవి
మాత్రమే
భగవంతుని
శాఖలు.
ఈ
విధమైన
ప్రార్థనలు
సరాసరి
భగవంతునకు
4
▾
Meaning
Keep
చేరును.
కాన
భక్తులు
చేయు
ప్రార్థనలు,
నిస్స్వార్థ,
నిర్మల,
నిష్కామమైనవిగా
నుండవలెను.
లేనిచో
అవి
భగవంతునకు
సరాసరి
చేరవు.
మరొక
అధిష్ఠానదైవము
అనగా
మరొక
శాఖకు
చెందినవగుటచే
అవి
దైవమునకు
చెందజాలవు.
శాస్త్రమనగా
శాసించునది.
ఆహారము
తినుటకు
వంట
వండు
కొనుము.
పొలము
చక్కగా
దున్ని
పండించుము.
ఇట్టివి
శాస్త్రములు
ఉపదేశించనవసరము
లేదు.
అప్పుడు
పుట్టిన
లేగదూడ
తల్లి
స్తనమును
నోటనిడక
పూర్వమే
ఆ
స్తనములలో
దూడ
క్షుద్బాధ
నివారణార్థము
క్షీరము
అమరియుండును.
ఈ
విషయమెంతటి
మహాసిద్ధాంతమును
సూక్ష్మముగా
వెల్లడించుచున్నదో
గమనార్హము.
జీవుని
భుక్తి
అతనితోడనే
కలదని
విశదమగుచున్నది.
భుక్తిముందు
జన్మించుచున్నది.
పిమ్మట
జీవుడు
జన్మించుచున్నాడు.
జీవుని
భోజ్యభోగములు
అతని
పూర్వ
కర్మాధీనములు.
వీనికొరకు
ఆచరింపబడు
కర్మ
నిమిత్తమాత్రము.
మానవుడు
తన
బుద్ధిని
ఉపయోగించుకొని
లోకవ్యవహార
కర్మనాచరించు
కొనుచుండును.
మానవులకు
తెలియనివి,
బుద్ధికి
గోచరముకానివి,
అసాధ్యమగునవి,
మానవాభ్యుదయమునకు
మార్గదర్శకమైనవి,
అట్టివాని
ఆచరణ
విధానములను
వేదములు
తెలుపుచున్నవి.
శాస్త్రములు
నిర్ణయించు
చున్నవి.
కావున
మానవ
శ్రేయమునకు
లౌకికకర్మలెంత
ముఖ్యమో
వైదికకర్మలుకూడా
అంతముఖ్యము.
వైదిక
కర్మలయొక్క
ఫలమంతా
ఐహిక
ఆముష్మిక
సంపదలని
విజ్ఞులు
గ్రహించవలసియుండును.
లోకోపకారమను
ధర్మము
ఒకటి
కర్మభాగములో
అగ్రస్థానమును
ఆక్రమించుచున్నది.
ఈ
కాలములో
ఈ
లోకోపకారము
చేయబూనిన
వాడును
లోకములో
ఒక
జీవుడైవుండుటవలన
లోకమునకు
జరుగు
ఉపకారములో
తానునూ
ఒక
భాగస్థుడే
అని
తెలిసికొనగలిగిన
యెడల
అది
లోకోపకారమునకు
ప్రథమోపకారము.
నేడు
మానవ
సేవయే
మాధవ
సేవ,
లోకసేవయే
లోకేశునిసేవ,
జనసేవయే
జనార్దనసేవ,
జీవునిసేవయే
దేవునిసేవ
అని
5
▾
Meaning
Keep
వాడబడుచున్నది.
ఈ
సూత్రము
పరమసత్యం.
కానీ
దీనిని
ఎట్లు
చేయవలెనన్న
విధానము
ఎవ్వరునూ
అంతగా
గమనించుటలేదు.
లోకోపకారదృష్టి
అంకురింపవలెనేకానీ
అది
కలిగిన
పిమ్మట
దానినెట్లు,
ఎచ్చట
మొదలు
పెట్టవలెనన్న
ప్రశ్నయేలేదు.
ఎవరికి
తోచిన
విధానాన్ని
వారు
అవలంబించుట
కానవచ్చుచున్నది.
నిజముగా
విచారించిన
స్వలాభాపేక్షను
లోకోపకారమను
ముసుగుతో
కప్పుచున్నారు.
లోకోపకారార్థమై
ప్రజల
నైతికబుద్ధి
బలపరచు
ప్రేమ
శ్రేయోమార్గములకన్నా
దాని
విధ్వంసక
విధానములవతరించుచున్నవి.
సహాయపడుట,
మరొకరితో
సహకరించుట,
ఇతరుల
కష్టనష్టములందు
సానుభూతి
చూపుట,
కేవలము
స్వార్థమునకే
తావునీయకుండా,
మనము
దేనినొనరించిననూ,
అది
లోకోపకారక
క్రియగనే
పరిగణింపబడును.
ఇది
నేడు
క్రొత్తగా
ఏర్పరచిన
విధానముకాదు.
అనాది
కాలమునుండి,
సృష్టి
ఆదినుండి
మన
పూర్వీకులనుండి
ఆచరణలో
వచ్చుచున్నది.
అయితే
మన
పూర్వీకులు
ధర్మము
నాచరించుటయే
స్వకీయ,
పరకీయ
లోకోపకార
సూత్రమని
గ్రహించియుండిరి.
ఏనుగు
పాదము
జాడయందు
తదితర
జంతుపాదముల
జాడ
ఇమిడి
యుండగలిగినట్లు
ధర్మ
పాదమున
సర్వోపకారములు
ఇమిడియుండునని
మన
పూర్వుల
విశ్వాసము.
ఉన్నత
ఆశయాలు,
ధర్మచింతనలు
మన
పూర్వీకులు
ఉగ్గుపాలతో
నేర్చినవి.
అందువలన
వారి
ధర్మాచరణ
మిక్కిలి
ప్రశస్తముగా,
ప్రశంసనీయముగా
నుండెడిది.
పూర్వము
వసతిగృహ,
కూప,
తటాక,
దేవాలయాది
నిర్మాణములు,
మృష్టాన్నదానము
మున్నగునవి
లోకోపకారకమని
తలంచెడివారు.
విద్యలను,
కళలను
పోషించుట
లోకోపకారకమని
తలంచి,
అట్టివానిని
పోషించి
సంరక్షించు
మహనీయులను
చేరదీసి,
అగ్రహారములు,
గ్రామాలు,
భూవసతులు
మున్నగు
దానధర్మములకు
గడంగిన
లోకోపకార
ధర్మనిరతుల
యశశ్చంద్రికలు
నేటికినీ
నిదర్శన
సూచకములై
గ్రహతారలవలె
కట్టుకదలక,
చెక్కుచెదరక
నిలచియున్నవి.
Previous
←
Action and Karma
Next
The Main Purpose
→