Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sāī Vāhini · The Main Purpose
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
లోకోపకారమనగా
దీనికి
ప్రథమ
సోపానము
'ఎవరి
ధర్మమును
వారు
ఆచరించుట'యని
గ్రహించినచో
తాను
లోకమున
ధన్యతజెందును.
మానవుడు
తన
ధర్మమును
తాను
సక్రమముగా
ఆచరించినచో
అదియే
స్వకీయ,
పరకీయ
ఉపకారముగా
పరిణమించును.
ధర్మమన
దేశ
సంప్రదాయ
కర్మాచరణమేకాని
వేరొండు
కాదని
మనము
గ్రహించవలెను.
మన
ఆచారములన్నింటియందును
లోకోపకారమనెడి
అంశము
ఇమిడియున్నది.
"అథాతో
కర్మ
జిజ్ఞాసా"
అని
మొదలిడి
కర్మ
సిద్ధాంత
మహారహస్యమంతయు
విఫులీకరించియున్నది.
దానధర్మాదులోనర్చుట
మహోత్తమ
కార్యము
కానీ
దానియందును
స్వార్థమిమిడియున్నదని
తెలియవలెను.
మానవుడు
తానొనర్చిన
కర్మయొక్క
ఫలమును
ఉత్తర
జన్మానుభవము
కొరకు
దాచుకొనుట
అని
దాని
అర్థము.
ఇది
శాస్త్ర
సమ్మతము,
ఎవరేకర్మ
నొనర్చినను
'స్వార్థమునకే
కానీ
ఇతరులకొరకు
కాదు'
అన్నది
స్పష్టమగుచున్నది.
ఇది
పరమ
సత్యము.
మొదటనే
జీవుడు
ఈ
పరమ
సత్యమును
గ్రహింపజాలడు.
ఏదో
ఇతరులకు
ఉపకారము
చేయుచున్నాడని
గర్వించును,
ఉప్పొంగును,
విఱ్ఱవీగును.
ఇది
అజ్ఞానము
యొక్క
లక్షణము,
అమాయకత్వముయొక్క
ప్రోద్బలము,
మాయయొక్క
నాటకము.
వేదశాస్త్రములందు
విధి
నిషేధ
ప్రణాళికలను
అహింస,
భూత
దయ,
లోకోపకారము,
దానధర్మాదులగూర్చి
చెప్పబడియున్నది.
దీనికే
విద్యారణ్యులవారు
భారతీయ
విజ్ఞానసారమని
పేరు
పెట్టిరి.
విజ్ఞానమనునది
2
▾
Meaning
Keep
సర్వవిద్యలనుండి
వెలువడిన
సర్వశాస్త్రములను
మధించి
అందించిన
సుధానిధి.
అనగా
నవనీతము.
సామాన్యముగా
విజ్ఞానమనగా
ఇది
బల్ల,
ఇది
గుండు,
ఇది
ఇల్లు,
ఇది
ముల్లు
అని
చెప్పుటకాదు.
ఇది
సామాన్య
జ్ఞానము.
తరువాత
ఈ
పనివలన
నాకును,
ఇతరులకును
మేలు
కలుగునని
తెలియుట
సుజ్ఞానము.
ఈ
రెండును
బుద్ధి
భాగములు.
ఇక
సత్య,
అహింస,
భూతదయాది
గుణములతో
జతపరచినయెడల
కలుగు
హృదయ
పరివర్తనమును
విజ్ఞానము
అనజెల్లును.
ఇట్టి
పరివర్తనమువలన
మానవునకును,
సృష్టితంత్రమునకును,
సృష్టికర్తకును
గల
సంబంధబాంధవ్యమును
గుర్తెరిగి
సంఘర్షణరాని
విధానమవలంబించుట
విజ్ఞానలక్షణమనబడును.
అజ్ఞానము
దుఃఖమును,
విజ్ఞానము
సుఖమును
కలుగజేయును.
'ఇది
విజ్ఞానమా?
కాదా?'
అను
సంశయవిచ్ఛేదమునకు
గీటురాయి
అంతఃకరణము.
ఏ
వ్యవహారమైనను
భౌతికమగునో,
ఆధ్యాత్మికమగునో
నిష్కళంక
సుఖమునిచ్చిన
అదే
విజ్ఞానము.
విజ్ఞానమును
కొలుచు
కొలబద్ద
ధర్మము.
ధర్మమెంత
అనుసరింపబడునో
విజ్ఞానమంతగా
పెరుగును.
దీనికి
దేశశాంతి,
దేశసౌభాగ్యములు
నిదర్శనములు.
ధర్మహీనత
విజ్ఞానరాహిత్యమును
సూచించును.
ధర్మాచరణముననుసరించి
యుగభేదములు
కలిగినవి.
ధర్మము,
నీతినియమములు
సక్రమముగా
నడచిన
కాలమున
ధర్మము
నాలుగు
పాదముల
నడచెననియు,
అట్టిదే
కృతయుగమనియును,
పై
నీతి
నియమాదులు
కొద్దిగా
సన్నగిల్లుటచేత
ధర్మము
మూడు
పాదములతో
నడచెననియు,
అట్టి
స్థితిని
త్రేతాయుగమనియు,
ధర్మము
రెండు
పాదములతోనే
నడచుటచే,
అనగా
నీతి
నిజాయితీలు
రెండు
భాగములు
క్షీణించుటచే
దీనిని
ద్వాపర
యుగమనియు,
ఇక
రెండు
పాదములు
వదలి
కేవలము
ఒకే
పాదముతో
ధర్మము
నడచుటచే,
అనగా
నీతి
నిజాయితీలు
పూర్తిగా
కోల్పోవుటచేత
దీనిని
కలియుగమనియు
తెలిపిరి.
భారతీయుల
విజ్ఞానమంతయు
ధర్మ
తత్త్వమునందు
కుదింపబడి
యున్నది.
సృష్టి
అసత్యమనియు
అనగా
మాయ
అనియు,
సంసారము
దుఃఖపూరితమనియు,
3
▾
Meaning
Keep
శాస్త్రములు
ఒక
వంక
తెలుపుచున్నను
అవి
ధర్మమును
నిరసింపవు.
ఆ
పరమ
సత్యమును
తెలుపుటకు
ధర్మమే
మూలము.
సృష్టి
సత్యమని
భావించుచున్న
పురుషుని
బుద్ధి
ననుసరించి
పురుషార్థములు
నిర్ణయింపబడెను.
అందులోను
అనగా
'ధర్మ'
అర్థ,
కామ,
మోక్షములనే'
చతుర్విధ
పురుషార్థములందును
ధర్మమునకే
మొదటి
స్థానమీయబడెను.
కానీ
ముఖ్య
పురుషార్థము
అనగా
గమ్యము
మోక్షము.
ధర్మయుక్తమగు
అర్థకామాదులు
తృప్తినిచ్చును.
శ్రేయోదాయకమగు
మోక్షపదము
మార్గదర్శియగును.
అటులనే
జీవుడు
కామమాయా
స్వరూపుడగుటవలన
పురుషార్థములలో
ధర్మమోక్షములు
అతని
దృష్టినుండి
పోయిన
యెడల
స్వస్వరూపములై
మిగిలియున్న
అర్థకామములలో
మునిగితేలుట
విపరీతము
కాదు.
ఆహార
భయనిద్రాదులలో
మానవుడు
పశుసమానుడు.
ధర్మమోక్షములను
భావములు
పశుత్వబుద్ధినుండి
మానవుని
వేరుచేయును.
అట్టి
భావములు
లేనియెడల
మానవుడు
జంతువునకు
భిన్నుడు
కాజాలడు.
హిందూదేశౌన్నత్యము
విజ్ఞాన
వైలక్షణము.
అది
ఈ
దేశజులచేతను,
ఇతర
దేశజులచేతను
ప్రశంసింప
బడుచున్నది.
సర్వదేశములందును
దేవుడున్నాడను
నమ్మకము
కలదు.
ధర్మ
అధర్మ
ప్రసక్తియు
కలదు.
నీతి
నియమాదులు
కూడా
కలవు.
భూతదయ,
అహింసాది
గుణములు
కూడా
కలవు.
సత్య
అసత్యాది
భేదములు
కూడా
కలవు.
భారతదేశములు
దేవాలయ
రూపమున
విరాజిల్లునటువంటివే
ఇతర
దేశములలో
చర్చీలు,
మసీదులు,
ప్రార్థన
శాలలు,
మందిరములు,
వివిధ
రూపనామములతోనున్నవి.
కానీ
భారతదేశము
ఇతర
దేశములకన్న
విలక్షణమైన
స్థాయిని
అందుకొన్నది.
మతములందు
సర్వమతములు
ఒక్కటే
అని
తెలుపుచున్నది
భారతదేశము.
తదంగములలో
భేదమున్నను
సర్వమతములు
ఒక్క
సత్యమునే
తెలుపుచున్నవి.
భారతీయుల
సిద్ధాంతము
దైవప్రార్థనలకు
ఒక్క
రాతిని
ఏర్పరచుకొన్నది.
మరొకరు
లోహమును,
మరొకరు
కర్రను
ఆధారము
చేసుకొనుచున్నారు.
దైవ
ప్రార్థన
4
▾
Meaning
Keep
అన్ని
దేశములందును
జరుగుచున్నది.
ఒకరు
ప్రార్థనకు
తూర్పు
ముఖము
పెట్టిన,
వేరొకరు
పడమర
ముఖమును
పెట్టును
గానీ
ప్రార్థనాంశము
ఒక్కటే
అని
భారతదేశమున
నిర్ధారితమైయున్నది.
ఎవరెవరి
మతగ్రంథసిద్ధాంతములు
వారలకు
గలవు.
ఇట్టి
తరి
భారతీయులుగానీ,
ఇతర
మతములవారు
కానీ
చెప్పునట్టి
విలక్షణత
యెంతయున్నదో
యోచించవచ్చును.
భారతదేశములో
దేవుని
"రావేమిరా,
రక్షింపవేమిరా,
వినవేలరా
నా
మొర"
అని
యేకవచన
సంబోధన
చేతురు.
ఇతర
మతములలోనివారు
ఈవిధముగా
సంబోధించరు
ఎవరు
ఏవిధముగా
భావింతురో
వారు
ఆవిధముగానే
మారుదురు.
"నేను
దేవుడను"
అనినచో
వానిని
దేవునిగానే
భావించును
కానీ
"నేను
రాజును"
అనినచో
ఆ
దేశపు
రాజు
వానిని
పిచ్చివానిగ
భావించును.
లేక
శిరచ్ఛేదనము
చేయును.
ఈ
విధముగా
దేవుడు
చేయడు.
ఇదియే
భారతీయ
విజ్ఞాన
చరమ
సిద్ధాంతము.
కేవలము
బుద్ధినే
అనుసరించి
సలిపిన
విషయ
విచారణవలన
తెల్పబడు
సిద్ధాంతములు
పూర్తి
సత్యములు
కాజాలవు.
విషయములకు
ఆరు
కోణములు
కలవు.
అందు
ఒక
ప్రక్కమాత్రమే
బుద్ధి
చూడగలదు.
వేద
చోదిత
కర్మానుష్ఠానమువలన
లెస్సగా
సంస్కరింపబడిన
బుద్ధి
ఇరుప్రక్కల
చూడనేర్పును.
అట్లు
సంస్కరింపబడని
బుద్ధియొక్క
చూపు
భౌతికమైన
సరిహద్దులమధ్య
బంధింపబడియుండును.
అందువలన
బుద్ధి
సాధించి
తెల్పునట్టి
సిద్ధాంతములు
విధిగ
ఖండసత్యములైయుండును.
సంస్కరింపబడిన
బుద్ధియొక్క
చూపు
పూర్ణత్వమొందును.
అట్టి
చూపునకు
విషయసత్త్వమఖండముగా
నుండును.
ఇతర
మత
సిద్ధాంతములు
బుద్ధి
పరిమితిలోనివి.
తమ
తమ
సిద్ధాంతములు
మాత్రమే
సత్యమనును.
మానవ
బుద్ధి
స్వతంత్రముగ
ప్రసరింపగలుగునట్టి
అవధిని
చూపునట్టి
దివ్యజ్యోతులు
శాస్త్రములని
తెలుపునవి
భారతీయ
సిద్ధాంతములు.
జగత్తు
బ్రహ్మాండము.
అందు
జీవుడొక
పిండము.
ఈ
రెంటియందలి
మూలసత్యము
మాత్రమొక్కటే.
ఈ
మూలసత్యము
నెద్దాని
తోడను
సంబంధించని
సత్యముగా
చూడగలిగినచో
నద్దానిని
బ్రహ్మమందురు.
జగత్సందర్భమున
5
▾
Meaning
Keep
వ్యవహరించునపుడు
బ్రహ్మమునే
పరబ్రహ్మమందురు.
జగత్తులోని
మూల
సత్యము
ఆత్మ.
మానవునిలోని
మూలసత్యము
కూడా
ఆత్మయే.
ఈ
ఆత్మకు
భిన్నముగాతోచునదంతయు
మిథ్యాస్వరూపము.
అనగా
విచారించునంతవరకు
సత్యమువలె
కానవచ్చి
విచారించినతరువాత
అసత్యమని
తెలియబడు
దానిని
మిథ్య
అందురు.
ఇట్టి
మిథ్యా
ప్రపంచము
మాయా
జీవితము.
మన
ఆత్మకు
భిన్నమగు
స్థానము
లేదు.
అందువలన
మాయ
ఆత్మయొక్క
శక్తి
అనబడును.
శక్తిసంబంధితుడుగా
ఆత్మ
వ్యవహరింపబడుచున్నపుడు
పరమాత్మ
అనబడును.
ఆత్మ
స్వరూపము
సచ్చిదానందము.
సత్తు
చిత్తు
ఆనందమని
మూడుగ
వ్యవహరింపబడుచున్నను
అవి
భిన్నములుకావు.
అవి
అతని
యొక్క
ఏకస్వరూపము.
అటులనే
దేవాత్మకశక్తి
అనబడు
మాయకును
సత్వము,
రజస్సును,
తమమను
మూడు
గుణములు
కలవు.
అవియే
జ్ఞానేచ్ఛా
క్రియేచ్ఛా
శక్తులుగ
పరిణమించును.
సత్వము
జ్ఞానమును,
రజస్సును
ఇచ్చును.
తమము,
క్రియాశక్తి
తనతో
కలిసి
యున్నదగుటవలన
అనేకమువలె
భాసిల్లును.
ఈ
అనంతశక్తియే
జగన్నిర్మాణకర్త్రి.
ఆమె
ప్రథమమున
శుద్ధ
సత్త్వప్రధానురాలు.
అద్దమువలె
నిర్మలమగుట
వలన
ఎదుటి
వస్తువును
తనయందు
ప్రతి
ఫలింపజేసికొను
శక్తిమంతురాలు.
తన
ఆశ్రయమగు
నాత్మయందు
ప్రతి
ఫలించునపుడు
ఈశ్వర
సంజ్ఞను
బొందును.
అట్టి
పరమాత్మయే
తనశక్తి
మహిమవలన
జగత్స్వరూపముగ
పరిణమించును.
ఈ
పరిణామము
మాయదే
కానీ
అందుగల
ప్రతిబింబమైన
ఈశ్వరునిదికాదు.
నిర్మలమగు
జలము
క్షోభిల్లుటవలన
మలినమగు
నురుగుగను,
బుడగలుగను
వ్యవహరింప
బడునట్లు
మాయా
విజృంభణము
వలన
ఆత్మయే
జగదాకారముగ
నామరూపములతో
భాసిల్లును.
మాయ
యొక్క
రజస్తమోగుణములు
చలించని
స్థితిని
అవ్యక్తమని
అందురు.
ఈ
అవ్యక్త
స్థితియందు
సర్వజగత్తు
బీజభావమున
ఆమెయందు
అణగియుండును.
6
▾
Meaning
Keep
రజస్తమములు
చలించినపుడు
సృష్టి
వ్యక్తమగును.
వీని
చలనములు
జీవుల
కర్మ
సంబంధములు.
శుద్ధిసత్త్వప్రాధాన్యమునుబట్టి
ఆమెను
"మాయ"
అని
అందురు.
రజోగుణ
ప్రాధాన్యమును
బట్టి
"అవిద్య"
లేక
"అజ్ఞాన"మని
అందురు.
తమోగుణ
ప్రధానమును
బట్టి
"తామసి"
అని
అందురు.
సాత్త్విక
మాయ
యందు
ప్రతిబింబించిన
ఆత్మ
ఈశ్వరుడనియు,
రజోగుణమైన
అవిద్యయందు
ప్రతిబింబించిన
ఆత్మ
జీవుడనియు
తమోగుణమైన
తామసికమునందు
ప్రతిబింబించిన
ఆత్మ
ద్రవ్యమనియు
అందురు.
దీనినిబట్టి
ఉపాధులభేదమువలననే
ఈశ్వరుడని,
జీవుడని,
ద్రవ్యమని
సంజ్ఞలు
కలిగెను.
కానీ
ఉపాధులు
లేని
యెడల
మూడును
ఆత్మ
పదార్థమనియే
చెప్పవచ్చు.
ఈ
ప్రపంచమంతయూ
ఈశ్వర
జీవ
భూతములనెడి
మూడు
తత్త్వముల
పరిణామములే.
జీవుని
భోగార్థమై
ఈశ్వర
సృష్టి
యేర్పడినది.
మాయ,
అవిద్య,
తమములయందు
ఆత్మ
ప్రతిఫలించెననునప్పుడు
ముఖ్యముగ
గమనించదగిన
ఆంశమొకటి
కలదు.
అద్దమొక
ఉపాధి,
దీని
శక్తి
యెదుటి
వస్తువులను
ప్రతిబింబింప
చేసికొనుట.
కానీ
అద్దము
యొక్క
మలిన
వక్రాదులతో
అందలి
ప్రతిబింబములకు
వాస్తవముగ
నెట్టి
సంబంధమును
లేదు.
అట్లున్నను
మనచే
అజ్ఞానమువలన
అద్దమునందలి
మాలిన్యవక్రాదులను
ప్రతిబింబమునకు
ఆపాదింపబడుచున్నది.
అటులనే
బ్రహ్మమునకు
మాయావిద్యల
సంబంధము
లేకున్నను
అజ్ఞానంవలన
నున్నట్లుగా
భావింపబడుట
తటస్థించుచున్నది.
పరమేశ్వరుని
ప్రతి
బింబముతో
కూడి
మాయయే
పాలు
పెరుగుగ
పరిణమించినట్లు
చంద్రూపముతో
పరిణమించినది.
ఈ
పరిణామము
మాయదేకానీ
అందలి
ప్రతిబింబముది
కాదు.
మాయ
తన్నాశ్రయించి
యుండుటవలన
అనగా
స్వాధీనము
కలవాడు
కనుక
మాయా
శక్తి
ప్రభావములకు
తానే
ప్రభువు.
అందుచే
పరమేశ్వరుడు
సర్వశక్తిమంతుడు,
సర్వజ్ఞుడు
అని
తెలియబడుచున్నాడు.
జీవేశ్వర
భూతములను
మూడు
7
▾
Meaning
Keep
తత్త్వములలో
జీవుని
భోగార్థమై
ఈశ్వర
సృష్టి
యేర్పడినది.
ఈశ్వరుడు
ఆప్తకాముడు.
విశ్వమునందలి
సర్వభోగములు
అతని
నుండియే
ప్రభవిల్లుచున్నందున
ఆతడు
కోరునదెట్టిదియూ
నుండజాలదు.
ఈశ్వరుని
సృష్టి
రచన
జీవభోగార్థమే
కానీ
తన
ప్రయోజనము
కొరకు
కాదు.
"నమేపార్థాస్తి
కర్తవ్యం
త్రిషులోకేషు
కించన."
సృష్టి
అతని
స్వభావము
కావుననే
లీలా
వినోది
అనుట
తటస్థించినది.
ఈతని
శక్తివలననే
సర్వజీవరాసులు
చైతన్యము
కలిగి
ప్రవర్తిల్లుచున్నవి.
అతడు
కర్మఫలముల
నొసంగువాడగుట
వలన
కర్మఫలప్రదాత
అనబడును.
పరమేశ్వర
సంబంధ
రహితముగ
కర్మ
ఫలముల
నొసంగజాలదు.
ఈ
కర్మకు
ఇట్టి
ఫలమని
జడమగు
కర్మ
నియోగించుకొనజాలదు.
అదియునుగాక
కర్మ
క్షణికము
అని
ఆర్యవచనము.
కర్మానంతరము
చేకూరినది
ఫలము.
ఈ
ఫలము
ఎప్పుడు
చేకూరునని
గానీ,
కర్మవాసన
యెప్పటిదని
కానీ
చెప్పుట
సాధ్యముకాదు.
అట్టి
విషయమునే
ఈశ్వరాజ్ఞ
అనుట
తటస్థించెను.
మన
బుద్ధి
కందనిది
ఈశ్వరాజ్ఞ,
ఎన్ని
జన్మలెత్తినను
కర్మఫలము
ననుభవింపక
తీరదు.
ఈ
కర్మ
ఎప్పటిది
అను
ప్రశ్నకు
చోటులేదు.
ఇందులకు
కర్మ
యొక్క
అనాదిత్వము
కారణమైయున్నది.
ఈశ్వరుడు,
జగత్తు,
జీవుడు,
కర్మ,
అజ్ఞానము
అను
వానికి
మొదలగునది
లేదు.
ఇవి
అనాదులని
చెప్పబడును.
అందులకే
భగవద్గీత
యందు
కృష్ణుడు
"గహనాకర్మణోగతి"
కర్మయొక్కగతి
దుర్జ్ఞేయమని
సూచించియున్నాడు.
కర్మఫలములనేక
జన్మల
అనంతరము
కూడా
రాగలవు.
అందువలన
సర్వ
కర్మాధ్యక్షుడు,
సర్వ
సాక్షియునగు
పరమేశ్వరుడు
ఒక్కడే
కర్మఫల
ప్రదాయకుడు.
అతనొక్కడే
అర్హుడును,
ప్రభువును
అయి
ఉన్నాడు.
ఈ
దృక్పథమునుండి
పరిశీలించిన
ఈశ్వరుని
యునికి
జీవునియొక్క
ఉనికితో
సంబంధము
కలిగియున్నదని
తట్టకపోదు.
చెప్పక
తప్పదు.
జీవులు
లేనియెడల
ఈశ్వరుడుండబోడు.
పుత్రుడు
లేనియెడల
తండ్రి
అను
నామ
మర్థరహితము.
కావున
జీవుల
కర్మఫల
భోగార్థమే
పరమేశ్వరుడు
సృష్టి
రచనకు
8
▾
Meaning
Keep
పూనుకొనుననునది
యుక్తి
సిద్ధము,
ఇక
భూతపదార్థము
అనగా
ఆకాశాది
పంచభూతములు
జీవభోగార్థములకును,
జీవుల
దేహ
నిర్మాణమునకును,
వారల
కర్మల
ననుసరించి
నివసించు
లోకాదులకును
జీవనోపకరణములుగను
వినియోగింపబడును.
కర్మలననుసరించి
నివసించు
లోకాదులనుట
యేలయనుకొన్న
మహత్తర
పుణ్యములకును
కొన్ని
ఘోర
పాపములకును
మనకు
కానవచ్చు
లోకముకానీ,
దేశములు
కానీ
పనికిరావు.
అట్టివానికి
తగినదేహములు
వానికికనుకూలమగు
లోకములుండి
తీరవలెను.
అవియే
స్వర్గనరకాదులు.
జీవత్వము
లేదా
వ్యక్తిత్వమను
పదములు
ఒక
అర్థమునే
సూచించును.
ఈ
వ్యక్తిత్వము
లేదా
జీవత్వము
యొక్క
మూలము
అవిద్య.
అవిద్య
గుణత్రయములు
కలది
అయినను
రజోగుణము
ప్రాధాన్యముగ
గలది.
జగత్తుయొక్క
ఉనికియే
అవిద్య
యొక్క
ఉనికి.
గుణసంయోగములననుసరించి
జీవుడు
నానా
భేదముల
నొందుచున్నాడు.
ఈ
సంయోగము
కర్మఫలాధీనము.
జీవుడు
సత్యగుణ
ప్రధానుడగు
నెడల
దేవాది
భాగవతుడగును.
రజోగుణ
ప్రధానుడగుట
వలన
మానవత్వము
పొందును.
తమోగుణ
ప్రధానుడగుట
వలన
పశు
పక్ష్యాది
రూపముల
నొందును.
జీవుడు
తానొక
కార్యమనియు,
ఈశ్వరుడు
కారణభూతుడనియు
తలంచుటచే
కార్యమాయెను.
అవిద్య
కారణోపాధి
ఆయెను.
అవిద్య
మూలము.
అది
ఆత్మవిద్యవలన
నిర్మూలింపబడిన
యెడల
జీవ
జగద్భ్రాంతులు
నశించును.
ఇట్టి
అవిద్యా
నిర్మూలనార్థము
వేదోక్త
కర్మకాండ
విలసిల్లుచున్నది.
అవిద్య
ఉండునంతవరకూ
జగత్తు,
జీవత్వము,
ఊర్ధ్వ
అధోలోకాదులు,
ధర్మాధర్మములు,
కర్మ
భక్తి
జ్ఞానాదులు
పరమసత్యములు,
అవశ్య
ఆచరణీయములై
యున్నవి.
సత్యత్వ
భ్రాంతియుండినంతవరకూ
మానవకర్మ
ఈశ్వర
నియతికిలోనై
ప్రవర్తిల్లును,
జగత్తు
భావపదార్థముకానీ
అభావపదార్థము
కాదు.
కావున
జీవతత్త్వము
చక్కగా
తెలియనియెడల
బ్రహ్మతత్త్వము
గ్రాహ్యము
కాదు.
ఆకాశము
నందు
దాని
యథార్థతత్త్వము
తెలియని
వారలచే
భ్రాంతివలన
పొగ,
9
▾
Meaning
Keep
దుమ్ము,
మలత్వాదులు
ఆరోపింపబడియున్నటులనే
అవిద్యాప్రభావము
వలన
ఆత్మను
బుద్ధి
అధిఉపాధి,
విశిష్టునిగను,
కర్తృత్వ,
భోక్తృత్వ
సమన్వితునిగను,
సుఖదుఃఖాద్యనుభావునిగను,
బంధమోక్షసమన్వితుని
గను,
వ్యవహార
సత్యత్వ
దృక్పథమునుండి
పరమార్థమునకు
భిన్నముగ
తలంచుట
సహజము.
జ్ఞానమువలన
భ్రాంతి
నశించగా
యథార్థము
గోచరించును.
ఆకాశము
ఏకముగ
నొక్కటైయున్నను
ఉపాధులనను
సరించి
గృహాకాశం,
ఘటాకాశం,
మఠాకాశం,
పటాకాశం
అను
భేదము
లతో
వ్యవహరింపబడుచున్నది.
ఇట్లు
ఉపాధికృత
భేదములతో
వ్యవహరింపబడుచున్నది.
కానీ
వాస్తవమునకు
ఆకాశము
నందెట్టి
భేదమును
లేదు.
చెంబు,
గృహము,
చెరువు,
కుండ
మొదలగు
ఆకారములు,
నామములు
మరియు
వానియొక్క
ఉపయోగాదులు
వేరువేరుగా
నున్నను
అందుగల
ఆకాశమునకు
భేదములేక,
ఏకమై
యెటుల
నున్నదో
ఆవిధముగనే
జీవులయొక్క
నామరూపాదులు,
వ్యవహారములు
భిన్నభిన్నముగనున్నను
పూసలలోని
దారమువలె
చైతన్యము
మాత్రము
ఏకమైయున్నది.
అదియే
ఆత్మ
అనియు,
ప్రస్తుతము
జీవుడనియు
భ్రాంతిలో
నున్నట్టి
నీవే
అట్టి
ఆత్మవనియు,
ఇట్టి
జ్ఞానము
కలుగనంతవరకూ
సంసారము
వదలదనియు
శ్రుతి
స్పష్టపరచి
యథార్థతత్త్వమును
ఉపదేశించుచున్నది.
ఏ
విషయము
తెలిసిన
సర్వము
తెలియబడగలదు?
ఆత్మను
తెలియుము,
సర్వము
తెలిసినవాడవగుదువని
శ్రుతియే
తెలుపుచున్నది.
జగత్తు
మిథ్యావిషయము,
అనృతాంశము.
అట్టి
దానిని
తెలియుటవలన
ఎట్టి
లాభమూ
కలుగదు.
దీనిని
తెలిసికొనుట
పురుషార్థము
కాదు.
ఆత్మ
తత్త్వ
జ్ఞానమువలన
పురుషార్థసిద్ధి
కలుగునని
అనేక
విధముల
శ్రుతి
హెచ్చరించుచున్నది.
జగత్తు
ఎటుల
సృజింపబడినదను
అంశము
తెలియవలయునని
కానీ,
లేక
దానిని
తెలిసికొనుమని
కానీ
శ్రుతి
స్మృతి
ఇతిహాస
పురాణాది
శాస్త్రములందెచటను
బోధించలేదు.
అట్లు
తెలిసికొనక
పోయినంత
మాత్రమున
అనర్థములు
కలుగునని
కూడా
తెలియజేయలేదు.
తెలుసుకొనుట
అసంభవమనికూడా
నుడువుచున్నది.
10
▾
Meaning
Keep
జగత్తు
ఎటుల
పుట్టిననేమి?
ఎటుల
గిట్టిననేమి?
అందు
పడి
పరితపించుచున్న
నీ
సంగతి
ముందు
చూచుకో,
తెలిసికొమ్మని
మాత్రము
గట్టిగా
శ్రుతి
స్మృతులు
బోధించుచున్నవి.
నీవెవరో
నీ
సంగతి
నీవు
తెలిసికొనిన
తదితరమంతయు
సవిస్తరముగా
దానంతట
అదియే
విశదమగును.
బ్రహ్మాండములో
నీవొక
పిండమనుటవలన
ఏకమృత్పిండ
జ్ఞానమువలన
సకల
మృణ్మయ
పాత్రలు
మృణ్మయమనియే
తెలియునట్లు
నీ
సంగతి
తెలిసిన
సర్వము
తెలిసిన
వాడవగుదువు.
బాలుని
రోదనము
మాని,
సుఖము
చేకూర్చుటయే
ముఖ్యోద్దేశముగా
గలిగిన
దాది
ఒక
కట్టుకథను
కల్పించి
బాలునకు
వినోదార్థము
చెప్పుచు
తృప్తిపరచుచుండును.
దాది
ముఖ్యోద్దేశము
బాలుని
సుఖమొక్కటే.
అందులకు
అనుగుణముగ
దాని
బుద్ధి
ననుసరించి
తృప్తిపరచుటకు
ఒక
కథను
ఉపాయభూతముగ
తీసికొనినది.
అటులనే
అనాది
మాయామోహితమైన
అనేక
జన్మసంస్కార
వాసనాయుతులగు
జీవులు
ప్రత్యక్షముగా
జగత్తును
చూచుచూ
అనుభవించుటవలన
ఇదెట్లు
సంభవించెనని
అడుగతీరదు.
అట్టి
వారలకు
శ్రుతి
ఉపశాంతి
ప్రవచనములు
పలుకకను
తీరదు.
ఈ
స్మృతి
పరవాక్యములన్నియు
తత్తుల్యములని
గ్రహించవలయును.
సృష్టి
ఎట్లు
కలిగినదను
ప్రశ్నకు
ఒక్కటే
సమాధానము
కలదు.
కలలు
ఎట్లు
కలుగుచున్నవన్న
ప్రశ్నకు
జవాబు
కుదిరినయెడల
సృష్టి
యెట్లు
వచ్చెనను
ప్రశ్నకును
జవాబు
వచ్చును.
కలలు
కనుటకు
ఏది
కారణమో
జగత్సృష్టికి
కూడా
అదియే
కారణము.
నిద్రాశక్తి
కలలను
సృజించుచున్నది.
మాయా
శక్తి
జగత్తును
సృజించుచున్నది.
అసత్యమగు
కల
క్రమము,
నియతి
లేక
ఎట్లు
భాసిల్లునో
అటులనే
అసత్యమైన
జగత్తుకూడా
క్రమరహితముగానే
భాసిల్లుచున్నది.
ఇదే
అసలు
అద్వైత
సిద్ధాంతము.
కనిపించు
జగత్తు
అంతయు
కలవంటిదే
అను
సిద్ధాంతమే
అద్వైత
సిద్ధాంతము.
దీనినే
అభేద
వాదమని
అందురు.
11
▾
Meaning
Keep
సృష్టి
యెట్లు
కలిగెను?
అను
ప్రశ్నవలె
సర్వసామాన్యముగ
వీకు
అజ్ఞానము
ఎట్లు
కలిగెను?
అను
ఒక
ప్రశ్న
కలదు.
ఈ
ప్రశ్నకు
సమాధానముగా
పూర్వమునందే
వశిష్ఠమహర్షి
రామచంద్రునకిట్లు
చెప్పెను.
రామా!
ఈ
అవిద్య
ఎట్లు
కలిగినదని
విచారము
పొందక
"నేను
దీనినెట్లు
పోగొట్టుకొనగలుగుదును
అను
విచారమే
కలుగుగాక".
ఈ
ఉపదేశము
రామునికొక్కనికే
కాదు.
జగత్తులో
జన్మించిన
మానవకోటి
యావత్తునకు
తెలుపుచున్న
విషయము.
మానవులకు
కలుగుచున్న
సంశయములు,
ప్రశ్నలు
విషయ
యథార్థజ్ఞానములేని
కారణమున
కలుగుచున్నవని
నిశ్చయము.
అనగా
అజ్ఞానమువలన
కలుగుచున్నవి.
అట్టి
అజ్ఞానము
జీవుల
నావరించియున్నది.
ఇది
ప్రతివానికినీ
స్వానుభవము.
మనకు
తెలియలేదని
అనుటయే
అజ్ఞానము.
ఇక
ప్రశ్నయేల?
మనకు
అజ్ఞానమున్నదని
గ్రహించి
తద్వారా
సంక్రమించినట్టి
సంసారములను
వాని
నాశ్రయించియుండు
జనన
మరణ
సుఖ
దుఃఖాద్యనుభవము
ఎటుల
వదలునో
అను
తాపత్రయమును
వీడి
అజ్ఞానమెటుల
వచ్చెను?
ఇది
బ్రహ్మమునకు
కలదా?
లేక
జీవునకా?
అని
బాధపడుట
మరింత
అజ్ఞానము.
ఈ
విచారము
మాని
అజ్ఞానమును
పోగొట్టుకొనుటకు
ఉపాయమేమని
వెదకుట
ఉత్తమము
కదా!
అజ్ఞానమను
విషయము,
విచారణకు
నిలువదు.
విచారణ
జ్ఞానజ్యోతి,
అజ్ఞానము
అంధకారము.
జ్యోతి
లేనంతవరకే
అజ్ఞాన
ప్రభావముండును.
Previous
←
Prayer
Next
Inquiry into the Ātma
→