Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sāī Vāhini · Inquiry into the Ātma
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
"అస్తం
గతయా
క్షీణయా
మస్యాం
జ్ఞానేన
రాఘవ"
ఈ
అవిద్య
క్షయించి
నాశనమొందిన
నదెట్లుగలిగెనో;
ఎట్లు
వృద్ధినొందెనో,
ఎట్లు
నశించెనో,
అను
అంశమును
తెలిసికొనగలవని
వశిష్ఠులవారు
రాఘవునకు
తెలిపిరి.
ఈ
ఉపదేశమునందు
ఒక
రహస్యమున్నది.
ఈ
ప్రపంచమెచట
నుండి,
ఎటుల
వచ్చినదని,
యుగముగములు
విచారించిననూ
తేలదు!
ఏ
విద్యవలన
ఇది
ఎచ్చటనుండియైనను
వచ్చియుండినచో,
విచారణా
ఫలితము
ఉండును
కానీ,
జగత్తు
అట్టి
విషయము
కాదు.
జగత్తు
ఎటులకలిగెనను
ప్రశ్న
రజ్జు
సర్ప
భ్రాంతి
యందలి
సర్పమెట్లు
ఉద్భవించినదను
ప్రశ్న
తుల్యము.
అచటనున్నది
త్రాడు.
కాని,
అద్దాని
నుండి
సర్పము
ఉద్భవించెను.
ఈ
సర్పోద్భవకారణము
చూచునట్టివాని
బుద్ధి
యందుగల
దోషము,
అనగా
భ్రమ
లేక
అజ్ఞానము.
కావున
సర్ప
అవిర్భావ
కారణము
అజ్ఞానమువలన
పుట్టెనను
జవాబు
యుక్తి
సిద్ధము.
అటులనే
తాడు
స్థానముననున్నది
బ్రహ్మము.
పాము
స్థానముననున్నది
జగత్తు.
అనగా
బ్రహ్మమునే
మనము
భ్రాంతివలన
జగత్తుగా
తలంచి
వ్యవహరించుచున్నాము.
ఇచ్చటకూడా
చూచునట్టివాని
బుద్ధిదోషమనక
తీరదు.
అనగా
ఒక
వస్తువును
మరొక
వస్తువుగా
చూచుట
బుద్ధి
దోషమని
తేలుచున్నది.
కావున,
ఈ
జగత్తు
బుద్ధిదోషమువలన
ప్రభవించిన
విషయమని
నిశ్చయింపనగును.
ఇట్టి
బుద్ధిదోషమువలన,
భ్రాంతివలన
జనించిన
విషయమెన్నటికిని
సత్యముకాదు.
భ్రాంతినశించి
నపుడు
తజ్జనిత
విషయముకూడా
నశించును;
యథార్థము
గోచరమగును.
ఇది
వేదాంతసారము.
2
▾
Meaning
Keep
"అహం
అజ్ఞః"
నేను
అజ్ఞానిని
అని
ఎవరికి
వారు
ఒప్పుకొనక
తప్పదు.
అనగా
శాస్త్ర
సిద్ధాంతముననుసరించి
చూడ,
బ్రహ్మయైయుండి
యట్లు
అట్లు
తెలియక
జీవుడనని
అనుకొనుచున్న
"నేనే"
అజ్ఞానినని
తెలియవచ్చినది.
అయితే,
తన్ను
తాను
మఱచి
అన్యముగా
తలంచు
కొనుటయను
విషయము
సంభవమా?
అను
సంకోచ
నివారణార్థము?
అనేక
విషయములు
తెలుసుకొంటిమి.
ఎవడు
మిథ్యా
దృష్టితో
కూడియుండునో
వాడు
అజ్ఞాని
అగుట
సమంజసము.
ఈ
భ్రాంతి
పురుషనిచిత్తము
నాశ్రయించియున్నది.
దాని
వలన
తన
నిజస్వరూపమును
విస్మరించి,
అనగా
ఆనందస్వరూపమును
మరచి,
జీవునిగా
భ్రమించి,
సుఖము
అన్యమున
కలదని
సంసారమున
బడి,
పరిభ్రమించుచున్నవానిని
గూర్చి
"ఆత్మను
వెదకి
తెలిసికొని
ధన్యుడవు
కమ్మ"ని
శ్రుతి
బోధించుచున్నది.
అద్వైత
ప్రబోధము,
నిజముగా
అజ్ఞానమను
ఒక
వస్తువు
కలదని
ఋజువు
చేసి
నిరాకరించుటకు
ప్రవర్తిల్లుట
లేదు.
"నాకు
సుఖము
లేదు,"
"ఇది
కావలయును".
"దానిని
నేను
సాధింపవలయును
అనుభవింపవలయును"
అనునట్టి
బుద్ధియే
జీవత్వము.
ఇట్టి
బుద్ధినే
అజ్ఞానమని
అందురు.
కావున
జీవత్వము
నశించవలెనన్న,
ఇట్టి
బుద్ధి
"నేను
సుఖ
స్వరూపుడను,
ఆప్తకాముడను"
అను
తెలివిగ
పరిణమించవలెను.
పై
భావమునకు
అజ్ఞానమనియు,
రెండవ
భావమునకు
జ్ఞానమనియు,
అనగా
జీవత్వ
బుద్ధి
అజ్ఞానము,
సుఖస్వరూపుడనను
బుద్ధి
జ్ఞానము.
లేని
చిక్కులు
నెత్తిపై
వేసుకొని
గిలగిల
తన్నుకొనుచు,
చచ్చుచు.
పుట్టుచు
బంధములోనుంటినని
తన్నుకొనుచూ
ఉన్న
జీవుని
అట్టి
అజ్ఞానమునుండి
తొలగించుటకు
"నీవట్లు
అనుకొనుటయే
అజ్ఞానము
సుమా!"
అని
నిర్వచించి
నిజజ్ఞానమును
కలుగజేయుటకే
అద్వైత
శ్రుతులు
ఉద్భవించినవి,
"బందీకృతుల"
మని
అనుకొనుచున్నప్పుడు
మనమే
అజ్ఞానులము.
యథార్థమున
మనము
దేని
వలన
సృజింపబడలేదు.
కించిజ్ఞునిగా
చేయబడలేదు.
ఈ
జగత్తు
ఒకటి
కలదని
ఇందుగల
భోగ్యజాతములలో
3
▾
Meaning
Keep
నేనొకడనని,
నేను
జననమరణాదులు,
సుఖదుఃఖాదులు
కలవాడనని
అనుకొనుటే
అజ్ఞానము.
ఎట్లు
తలంచుకొనిన
అట్లగుదుము.
ఈ
విధముగనే
మానవుడు
తనకు
తానే
అజ్ఞానమును
నిర్మించుకొనుచున్నాడు.
ఇట్లు
పొందుటకు
ఆధ్యాత్మికదృష్టి,
శ్రద్ధాభక్తి,
ఈశ్వరానుగ్రహములుండుటయే
కారణము.
ఇందు
ఏది
లోపించినను
పరమార్థానుభవము
అసంభవము.
అట్లు
బాహ్యముగా
విచారించగా
ప్రపంచమని
లేనిదానిని
ప్రపంచము,
కాని
దానిని
మనము
మన
అజ్ఞానమువలన
ఉన్నదని
అనుకొనుట
వలన
జనించినదియేయని
తేలుసు.
అనగా
సర్వము
అజ్ఞాన
జనితమని
తేలును.
కావున
ఇంతటి
బ్రహ్మాండము
చివరకు
"నేననుకొనుట-అనుకొనకపోవుట"లో
ఆధారపడి
యున్నదనినమాట
చాలా
చిత్రముగానున్నది.
సృష్టి
మనము
కలదనుకొనుటవలన
కలిగి
లేదనుకొనుటవలన
నశించగలదని,
నిర్వచించ
గలిగినందున,
నీవు
అనుకొనుట
అను
విషయమును
లోతుగ
తరచి
చూడవలసియున్నది.
ఇట్లు
కలదనుటతో
ఒక
వస్తువు
యొక్క
ఉనికి
కలిగి
లేదని
అనుకొనుటతో
అట్టి
వస్తువు
పోవుట,
మన
అనుభవములో
ఎచ్చటనైనను
కలదా?
లేక
ఊహా
ప్రపంచముయొక్క
విహారమా?
అని
విచారించిన
ఒక్కచోట
అసత్యము
ఋజువగుచున్నది.
త్రాటిని
చీకటిలో
చూచి
పొరపాటున,
అజ్ఞానమువలన
పామని
అనుకొనుట
తటస్థించినయెడల
త్రాటి
స్థానమున
పాము
సృజింపబడి
విలసిల్లుచున్నది.
కారణాంతరమున
యథార్థము
గోచరించినపుడు
ఇది
పాము
కాదు,
త్రాడు
అని
అనుకొనుటతో,
ఇదివరకు
పామని
అని
అనుకొనుట
వలన
పాముగను,
కాదని
అనుకొనుట
వలన
త్రాడుగను
సృజింపబడినది.
ప్రత్యక్షానుభవమగు
పాము
మిథ్యయనియు
తేలినది.
కావున
అనుకొనుటలో
సృజింపులు,
వినాశములు
జరుగవచ్చునను
సిద్ధాంతము
పై
ఉదాహరణ
మూలమున
కొంత
సుబోధకము
కాగలదు.
కావున
అనుకొనుట
అనినను
తలంచుట
అనినను
ఒక్కటే!
ఇవి
మనోవికార
జాతములే
అగుటవలన
స్థూలముగ
4
▾
Meaning
Keep
తలంపులుగ
పరిగణింపవచ్చును.
ఎన్ని
అవాంతర
భేదములున్నను
సూక్ష్మముగ
చూచిన
అన్నియు
తలంపులే
కదా!
ఇట్టి
తలంపులు
ఎచ్చటనుండి
బయలుదేరుచున్నవి.
ఇట్టి
తలంపులు
స్వతంత్రముగ
పుట్టుచున్నవా!
అన్న
ప్రశ్నకు
"బుద్ధిః
కర్మానుసారిణీ"
మన
కర్మల
అనురాగములచేత,
కర్మ
ఫలప్రేమచేత
ఆచరించిన
పనులను
అనుసరించి
తలంపులు
పుట్టును.
తాను
సుఖశాంతులు
పొందవలెనను
తలంపు
మొదటిది.
ఇది
జగత్తు
సత్యమను
భావముచేత,
అజ్ఞానముచేత
కలుగును.
విజ్ఞానము
లేని
విద్య,
వివేకము
లేని
విజ్ఞానము.
లౌకికము
లేని
మనిషి.
విచక్షణ
లేని
పని,
విజ్ఞత
లేని
పాండిత్యము,
అర్హత
లేని
అధికారము,
సత్యము
లేని
వాక్కు,
మాధుర్యము
లేని
సంగీతం,
భక్తిలేని
పూజ
శీలం
లేని
మనిషి.
వినయము
లేని
విద్యార్థి,
సభ్యులను
మెప్పించని
ఉపన్యాసం
రాణించదు.
శ్రమతప్ప
ఫలితం
శూన్యం.
శాస్త్రజన్య
జ్ఞానముతోబాటు
ప్రతి
ఒక్కరూ
అనుభవజ్ఞానమును
కూడా
సంపాదించి
తీరాలి.
అనుభవంలోకి
రాని
విద్యావిజ్ఞానాదులవల్ల
ప్రయోజనమేమియూ
ఉండదు.
మనలో
నిలకడగా
నిల్వఉన్న
జ్ఞానం
వృథా.
అది
వట్టి
పాండిత్యంగా
మాత్రమే
నిలచిపోతుంది.
దానిని
అనుభవంలోనికి
తీసుకొని
రావటంలోనే
ఉన్నది
గొప్పతనము.
ధనమును
సంపాదించి
దాచిపెట్టి
నందువల్ల
ప్రయోజనం
లేదు.
దానిని
అనుభవించునపుడు,
లోక
కల్యాణమునకు
సద్వినియోగము
చేసినప్పుడే
దాని
సార్థకత.
అట్లే
వివిధ
పుస్తకములలోని
జ్ఞానమును
సంపాదించినంత
మాత్రమున
ప్రయోజనములేదు,
దానిని
అనుభవములోనికి
తెచ్చుకొని
లోక
కల్యాణమునకు
వినియోగించినపుడే
దానికి
కూడా
సార్థకత
ఉంటుంది.
అయితే
ఇట్టి
అనుభవమును
పొందుటెట్లు?
దీనిని
పొందుటకు
మూడు
దశలను
దాటవలసి
ఉంటుంది.
మొదటిది
తెలిసికొనుట,
రెండవది
చూచుట,
మూడవది
ప్రవేశించుట.
వీటినే
'జ్ఞాతుం',
'ద్రష్టుం',
'ప్రవేష్టుం',
అని
అందురు.
5
▾
Meaning
Keep
మొట్టమొదట
శాస్త్రములోనున్న
అమూల్యమైన
విషయాలను
గురించి
అనుభవజ్ఞులద్వారా
తెలుసుకొనవలెను.
తెలుసుకొనుటవలన
వాటియందు
సహజముగా
ఆసక్తి
జనిస్తుంది.
అపుడు
వాటిని
ఎట్లయినా
సరే
చూచి
తీరాలి
అనే
కోరిక
పుడుతుంది.
దీనినే
'జ్ఞాతుం'
అని
అంటారు.
రెండవదశలో
అటువంటి
శాస్త్రములు,
విశేషములు
ఎక్కడెక్కడ
ఉన్నాయో
పరిశీలనచేసి,
చూచి,
సేకరిస్తాము.
ప్రత్యక్షంగా
చూస్తాము,
చదువుతాము.
ఎంతో
పట్టుదలతో
విచారిస్తాము.
అవగాహన
చేసుకొంటాం;
ఆనందిస్తాము.
అంతటితో
కొంతవరకు
తృప్తి
కలుగుతుంది.
కొన్ని
అమూల్యమైన
విషయాలను
తెలుసుకొన్నామనే
సంతృప్తి
కలుగుతుంది.
శాస్త్రజ్ఞానం
లభిస్తుంది.
ఇట్టి
దశను
'ద్రష్టుం'
అంటారు.
పై
రెండు
దశలతో
సంతృప్తి
చెందితే
ప్రయోజనము
లేదు;
ఉండదు.
దానిలో
ప్రవేశించి,
లీనమై,
తాదాత్మ్యం
పొందవలెను.
దానిలో
అనగా
తెలుసుకొన్నదానిలో,
చూచినదానిలో
లీనమై
అనుభవించాలి.
అన్నం
తిని
సోమరిలా
ఏ
పనీ
చేయకుండా
ఊరకనే
పండుకుంటే
ఉపయోగం
లేక
పోగా
అజీర్ణం
చేస్తుంది.
ప్రతిరోజు
సరిపోయే
ఆహారము
తీసుకొని
శారీరక
శ్రమచేసినప్పుడే
తిన్న
తిండి
జీర్ణమై,
రక్తరూపమై
మానవునికి
శక్తినిచ్చును.
అదేవిధంగా
తెలుసుకొని
చూచిన
విషయాలను
జీర్ణము
చేసుకొని
అనుభవములోనికి
అనగా
ఆచరణలోనికి
తెచ్చుకొని
మానవకల్యాణానికి
దేశపురోభివృద్ధికి
ఉపయోగించినప్పుడే
తెలుసుకొని
చూచినందువల్ల
ప్రయోజనము
ఉంటుంది.
పుస్తకములోనున్న
విషయములను
కంఠస్థము
చేసి
ఉపన్యాసధోరణిలో
చెప్పడం
కొంత
తేలికే.
సాధారణంగా
పుస్తకపఠనం
ద్వారా
కలిగెడుజ్ఞానం
పుస్తకజన్యజ్ఞానము
అందురు.
ఇది
సర్వసామాన్యమైనది.
కనుక
విన్నవి,
కన్నవి,
తిన్నవి
కొంతవరకైనా
ఆచరణరూపం
చెందాలి.
అనుభవములోనికి
తీసుకొనిరావాలి,
దీనినే
'ప్రవేష్టుం'
అని
అందురు.
6
▾
Meaning
Keep
మన
ప్రాచీన
శాస్త్రములలో
అనేక
అమూల్య
విషయాలున్నవి.
విలువైన
రత్నములు
దాగి
ఉన్నవి.
సాంకేతిక
అణుసిద్ధాంత
రహస్యములు
కూడా
ఎన్నో
ఉన్నవి.
అన్వేషణ
ప్రారంభించాలి.
మానవ
వికాసానికి
ఉపయోగపడేటట్లు
చేయాలి.
ప్రతి
విద్యార్థిలో
నూతన
విషయాలను
కనిపెట్టాలనే
తాపత్రయం,
పట్టుదల
తప్పనిసరిగా
ఉండాలి.
మహోపన్యాసములివ్వడంతో,
చర్చావేదికల
నలంకరించడంతో
సంతృప్తిని
చెందరాదు.
'విచారణ
జరిపి
నూతన
విషయాలను
కనిపెట్టాలి',
అనే
కుతూహలం
ఉండాలి.
అటువంటి
వారు
మాత్రమే
విజ్ఞానమును
లోకానికి
అందించగలుగుతారు.
పైపై
జ్ఞానమువలన
ప్రయోజనముండదు.
అనుభవ
జ్ఞానమునకు
మించిన
జ్ఞానము
మరొకటి
ఉండదు.
కనుక
అటువంటి
అనుభవ
జ్ఞానమును
స్వశక్తితో,
స్వప్రేరణతో,
స్వయంకృషితో,
పట్టుదల
శ్రద్ధలతో
సాధించి
సాంకేతిక
పురోభివృద్ధికి
తోడ్పడి,
అధికోత్పత్తినిచేసి,
దేశపురోభివృద్ధికి
ఉపయోగపడాలి.
అనుభవజ్ఞానమును
సంపాదించటం
ఎంత
అవసరమో
దానిని
మంచికి,
దేశకల్యాణమునకు
ఉపయోగించే
వివేకజ్ఞానము
కూడా
అంత
అవసరము.
వివేకము
లేని
విద్యవల్ల,
విచక్షణ
చూపించలేని
జ్ఞానమువల్ల
ఉపయోగమేమాత్రమూ
ఉండదు.
వివేకము
వేరు;
విద్య
వేరు.
మంచికి
చెడుకు
మధ్య
వ్యత్యాసం
తెలుసుకొనుటే
వివేక
లక్షణము.
అట్టి
వ్యత్యాసమును
తెలుసుకొనిన
పిదప
దీనికి
ఎంత,
ఎప్పుడు,
ఎటువంటి
ప్రాముఖ్యము
నివ్వాలో
నిర్ణయించగల
శక్తి
సామర్థ్యములనే
'విచక్షణాజ్ఞానం'
అని
అంటారు.
విచక్షణాజ్ఞానం
వివేకజ్ఞానములోని
అంతర్భాగం,
వివేకములేని
వానికి
సన్మార్గం
పట్టుబడదు.
మనము
చేయు
ప్రతిపనిలోను
వివేకాన్ని
ప్రదర్శించటం
విజ్ఞతలక్షణం.
అణుపరిశోధనలను
జరిపి
ఒక్క
క్షణంలో
ప్రపంచాన్ని
భస్మీపటలం
చేయగల
మారణాయుధాలను
తయారుచేయ
వచ్చును.
అదే
అణుశక్తిద్వారా
కొన్ని
కోట్ల
కిలోవాట్ల
శక్తిగల
విద్యుచ్ఛక్తిని
తయారుచేయవచ్చును.
దానిని
పరిశ్రమలకు,
వ్యవసాయములకు
అనుకూలపరచి
దేశమును
7
▾
Meaning
Keep
సస్యశ్యామలంగాకూడా
చేయవచ్చును.
విద్యావంతుడు
ఇటువంటి
విషయములలోనే
తన
వివేకబుద్ధిని
ప్రదర్శించాలి,
విచక్షనాజ్ఞానాన్ని
చూపించాలి.
తాను
కనిపెట్టిన
గొప్పవిషయాన్ని
చెడుకు,
సంక్షోభానికి,
సర్వనాశనానికి
కాక,
మంచికి,
మానవ
కల్యాణానికి,
అధికోత్పత్తికి
ఉపయోగపడే
విధముగా
చేయడమే
"వివేకజ్ఞానం"
అని
అంటారు.
ఇట్టి
వివేకవిచక్షణాజ్ఞానం
కలవాడు
ఒకవేళ
ధనహీనుడైననూ
అధికారం
లేనివాడైననూ
అందరిచేతనూ
గౌరవింపబడుతాడు;
పూజింపబడుతాడు.
వివేకవిచక్షణాజ్ఞానము
లేనివాడు,
విద్యావేత్త
అయిననూ,
మిక్కిలి
ధనవంతుడైననూ
ప్రముఖశాస్త్రవేత్త
అయిననూ,
ఏమాత్రమూ
ప్రకాశించడు.
వివేకవిచక్షణాజ్ఞానరహితుడు
ధర్మమేదో,
అధర్మమేదోకూడా
కనుగొనలేదు.
అందువలన
ఒక
శాస్త్రజ్ఞానంతోనే
సంతృప్తిచెందక
వివేకవిచక్షణాజ్ఞానములను
మరియు
అనుభవజ్ఞానమును
ప్రతి
విద్యార్థి
సంపాదించితీరవలెను.
వివేకముతో
కూడిన
దూరదృష్టిని
అభివృద్ధి
పరచుకొనవలెను.
దానిని
సమాజాభివృద్ధికి
వినియోగించవలెను.
అనుభవజ్ఞాన
వివేకజ్ఞానములతోనే
సంతృప్తి
చెందరాదు.
ప్రతివానికి
లౌకికజ్ఞానము
కూడా
కావాలి.
దీనినే
ప్రపంచజ్ఞానం
అంటారు.
ఈ
జ్ఞానం
కేవలము
పుస్తకాలద్వారా
లభ్యముకాదు.
దీనిని
సంపాదించు
కొనవలెనన్న
లేక
పొందవలెనను
ఆసక్తియున్న
విస్తృతంగా
దేశాటనము
చేయవలెను.
దానికే
పూర్వీకులు
మహనీయుల
దర్శన,
స్పర్శన
సంభాషణలను
పొందగోరి,
పవిత్ర
తీర్థయాత్రలు,
క్షేత్రదర్శనములు
చేయుచూ
వచ్చిరి.
అంతేకాదు,
ప్రపంచములో
దైవసృష్టిలోని
వింతలు,
వినోదములు
దర్శించి
వాటివలన
అనేక
విధములైన
జ్ఞానమును
సంపాదించుకొనెడివారు.
ప్రకృతిలో
పలువిధములైన
జ్ఞానమును
ప్రబోధించే
అమూల్యమైన
విషయాలెన్నియో
యున్నవి.
ప్రతివాటి
పుట్టు
పూర్వోత్తరాలను
తెలుసుకొనవలెను.
చరిత్రను,
నాగరికతను,
సంస్కృతిని
అవగాహన
చేసుకొని
ప్రచారములోనికి
తీసుకొని
రావలెను.
ఈ
విధమైన
8
▾
Meaning
Keep
ప్రచారానికి
పూనుకొనగోరు
వ్యక్తి
మొట్టమొదట
ఆత్మజ్ఞానతత్త్వమును
అర్థము
చేసుకొనవలెను.
లోకములో
భౌతికజ్ఞానం,
సంగీతజ్ఞానం,
సాహిత్యజ్ఞానం,
శిల్ప
గణిత
శాస్త్రజ్ఞానము
ఇత్యాది
జ్ఞానములెన్నో
ఉన్నవి.
అన్నింటియందు
ఆత్మజ్ఞానం
రాజువంటిది.
అది
తెలియక
శాంతిలేదు.
ప్రపంచదృష్టిలో
కీర్తిప్రతిష్ఠలు
సంపాదించినప్పటికీ
ఆత్మజ్ఞానము
సంపాదించనివానికి
సుఖముండదు.
అన్ని
విధములైన
జ్ఞానములలోకెల్లా
ఆత్మజ్ఞానము
శ్రేష్ఠమయినది.
ఆత్మజ్ఞానమన్నా,
పరమాత్మజ్ఞానమన్నా,
ఆధ్యాత్మికజ్ఞానమన్నా
అంతా
ఒక్కటే.
ఆత్మను,
పరమాత్మను
చక్కగా
తెలుసుకొనుటకు
దోహదంచేసే
జ్ఞానం
అది.
దేనిని
తెలుసుకొనినచో
సమస్తము
తెలుసుకొనబడినదగునో
అట్టి
పరమాత్మను
ఎరిగినవాడగును.
అదియే
ఆత్మజ్ఞానము.
అతడే
ప్రపంచములో
సర్వజ్ఞునిగా
పేరు
ప్రఖ్యాతులను
పొందుతాడు.
లౌకికవిద్యలు
పరిపూర్ణశాంతిని
కలుగజేయ
జాలవు.
ఆత్మ
జ్ఞాని
ఒక్కడు
మాత్రమే
శోకమును
దాటగలడు.
కనుక
ప్రతి
ఒక్కరు
ఆత్మజ్ఞానవిషయమును
తెలుసుకొనుటకు
ప్రయత్నించవలసి
యుండును.
ఆత్మజ్ఞానము
చిత్తశుద్ధివలననే
కలుగును.
అట్టి
చిత్తశుద్ధి
పవిత్రకార్యములు,
పుణ్యకార్యములు,
అనగా
దానం,
పరోపకారం,
భూత
దయ,
దైవభక్తి
నిష్కామబుద్ధితో
ఎట్టి
ఫలాపేక్ష
లేకుండా,
ఈశ్వరార్పణ
బుద్ధితో
కర్మల
నాచరించడమువలన
జరుగుతుంది.
అట్టి
నిర్మల
హృదయమున
జ్ఞానభాస్కరుడు
ఉదయిస్తాడు.
అట్టి
జ్ఞానోదయమువలన
నరుడు
నారాయణుడు
అవుతాడు.
పరమోత్కృష్టమైన
స్థాయికి
చేరుకొనవలెననిన
మొదటిది
పురుష
ప్రయత్నము,
రెండవది
దైవసహాయము
అత్యవసరము.
ఆత్మజ్ఞానమును
ఎవరైనను
ప్రయత్నించి
సాధించవచ్చును.
స్త్రీలుకాని,
పురుషులు
కాని,
కూటిపేదకాని,
ధనవంతుడుకానీ
ఎవరైననూ
సరే
ఈ
జ్ఞానజ్యోతిని
వెలిగించుకొనుటకు
అర్హులే.
జాతి
మత,
కుల,
వర్ణవ్యవస్థలతో
దీనికి
ఎలాంటిసంబంధమూ
లేదు.
లౌకికవిద్యలను
అభ్యసించకపోయినప్పటికీ,
9
▾
Meaning
Keep
భౌతికశాస్త్రపరిజ్ఞానం
లేకపోయినప్పటికీ
పర్వాలేదు.
ప్రాపంచికమైన
చదువులు,
సంధ్యలు
లేవని
విచారించనక్కరలేదు.
ప్రస్తుత
యుగంలో
అట్టి
ఆత్మజ్ఞానము
సంపాదించటం
అంత
తేలిక
కాదు.
అట్లని
భావించి
నిరాశ,
నిస్పృహలతో
ప్రయత్నం
మాత్రం
విడువరాదు.
ఒక్కొక్కపుడు
పరమాత్మను
తెలుసుకోవాలనే
తాపత్రయంలోపడి
లౌకికవిద్యలను
విడనాడటం
జరుగుతుంది.
అది
మంచిది
కాదు.
అటు
పరమాత్మను
తెలుసుకొనలేక,
ఇటు
భౌతికవిద్యల
నభ్యసించక
రెంటికి
చెడిన
రేవడివలె
ఉభయభ్రష్టులవుతుంటారు,
కొందరు.
అది
ఏ
మాత్రమూ
మంచిదికాదు.
భౌతిక
విద్యలనుకూడా
ఏమాత్రమూ
నిర్లక్ష్యము
చేయరాదు.
ఒక
చెంప
భౌతిక
శాస్త్రవిజ్ఞానము
సంపాదించుతూ
ఆధ్యాత్మిక
దృష్టికూడా
కలిగియుండుట
మంచిది.
ప్రతిదినము
కొంతసమయము
భగవత్
ధ్యానమునకు
తప్పనిసరిగా
విద్యార్థులు
కేటాయించాలి.
కర్మోన్ముఖులై
నవభారతనిర్మాణానికి,
శక్తి
వంచన
లేకుండా
కృషి
చేయాలి.
అధికారవ్యామోహము,
బంధుపక్షపాతం
విడనాడాలి.
అవినీతిని
పారద్రోలి
కష్టించి
పనిచేయాలనే
భావం
ప్రతివిద్యార్థిలో
జనించాలి.
భారతదేశభవిష్యత్తు
మనమీద
ఆధారపడియున్నది.
భారతమాత
మనకోసం
ఎదురుచూస్తూ
ఉన్నది.
తల్లిని
సంతృప్తిపరచటం,
సేవించటం,
కుమారుల
కర్తవ్యం
అని
నిరంతరం
మదిలో
చింతించాలి.
దేశమాత
సౌభాగ్యమును
విద్యార్థులు
కళ్ళారా
చూడాలి.
ఈ
పవిత్ర
ఆశయంకోసం
మనం
జీవించాలి.
ఇదే
మనధర్మము.
దీనినే
'జాతీయ
శీలం'
అని
అందురు.
కనుక
ప్రతి
యువకుడు
సచ్చీలతతోపాటు
జాతీయసచ్ఛీలత
కూడా
కలిగియుండాలి.
శీలరాహిత్యం
అత్యంత
ప్రమాదకరమైనది.
సచ్ఛీలము
లేనివ్యక్తి
తనను
తాను
ఉద్దరించుకోలేదు.
అట్టివాడు
దేశానికి
ఏమాత్రమూ
ఉపయోగపడ
లేడు.
తనను
తాను
త్యాగము
చేసుకొని
దేశసౌభాగ్యము
కోరువారే
నిజమైన
జాతీయసచ్చీలురు,
త్యాగముకూడనూ
ఒక
విధమైన
శీలమే!
యువకులు
అలవరచుకొనవలసిన
10
▾
Meaning
Keep
సద్గుణములలో
ఇదికూడా
ఒకటి.
త్యాగమనగా,
దానము
చేయటం,
ధర్మము
చేయటం
అని
భావిస్తుంటారు.
త్యాగానికీ,
దానానికి
ఎంతో
తేడా
ఉంది.
దానము
అనగా
తనకున్న
సంపదలో
అంతో
ఇంతో
ఇతరులకు
ఇవ్వటం.
గోదానం,
భూదానం,
అన్నదానం,
శ్రమదానం,
విద్యాదానం,
జ్ఞానదానం
మొదలగునవి
దానం
క్రిందకు
వస్తాయి.
దానము
చేయుటవలన
ఏమానవుడూ,
ఎప్పుడూ
తన
సర్వస్వాన్ని
కోల్పోడు.
దానము
చేయకపోవుటచేత
జీవుడు
దరిద్రుడై
జన్మించడు.
ఇంకా
ఒక
మెట్టు
పైకిపోయి
న్యాయమైన,
అవసరమైనంత
మాత్రమే
ఉంచుకొని
మిగతాదంతా
దానం
చేయటం
మరింత
ఉత్తమోత్తమ
కీర్తిని,
సమాజములో
సంపాదించవచ్చును.
"దేయం
దీనజనాయచ
విత్తం".
దీనులకు,
దరిద్రులకు
తనకున్న
దానిలో
కొంతయిచ్చి,
అనగా
సాయపడవలెనని
మన
శాస్త్రములు
చెప్పుచున్నవి.
అటులచేయక
స్వార్థంతో,
కర్కశంగా,
అన్యాయంగా,
అక్రమంగా
లక్షలు
గడించి
కోట్లను
పెంచుకొని,
దురాశపరులై
పిసినిగొట్టు
కారాదు.
అట్టిలోభికి
ఎప్పుడో
ఒకప్పుడు
అధోగతి
దాపురిస్తుంది.
అది
తప్పునది
కాదు.
అన్యాయార్జిత
అన్నము
ప్రజల
రక్తపుటన్నము
కాన
అట్టి
అన్యాయార్జితజీవితానికి
యువకులు
బానిసలు
కారాదు.
ఇట్టి
స్వార్థపు
జీవితాన్ని
భగవంతుడు
కూడా
క్షమించడు.
ఇతరులకు
ఇవ్వక,
తానుతినక
యావత్సంపదను
కూడబెట్టి
మరణించువాడు
దుర్గతి
పొందుతాడు.
అట్టివాని
సంతతికూడా
మున్ముందు
అధోగతిని
అనుభవించును.
అట్టి
డబ్బుకు
నలుగురు
వారసులు
కలరు.
మొదటివాడు
ధర్మము,
రెండవవాడు
రాజు,
అనగా
ప్రభుత్వము.
మూడవవాడు
అగ్ని,
నాలుగవవాడు
దొంగ.
ఇందులో
పెద్దవారసుడు
ధర్మము.
పెద్దవారసునికే
పెద్దవాటా
రావలసియుండును.
దీనిని
గుర్తించిన
వ్యక్తి
కావాలి
విద్యార్థి.
ఈ
నలుగురు
వారసులపై
అత్యున్నతమైన
మెట్టు
త్యాగం.
ఇది
సర్వోత్కృష్టమైన,
అమిత
ప్రియమైన
వస్తువులను
సహితం
నవ్వుతూ,
నవ్వుతూ
11
▾
Meaning
Keep
మనసున
ఎట్టి
సంకోచముకూడా
లేక
ఇతరులకు
ఇవ్వగలిగిన
వాడు
నిజమైన
త్యాగి.
కర్మఫలమును
ఈశ్వరార్పణగా
వదలుటయే
త్యాగం.
భౌతికశరీరమును
సహితము
తృణప్రాయముగానెంచి
త్యజించ
టానికి
సిద్ధమౌతాడు
త్యాగి.
త్యాగమన
భౌతికధనకనక
వస్తువాహనాదులు
వదలుటయేకాక,
మనలో
జన్మజన్మలుగా
కరడుగట్టుకొని
నిలిచిపోయిన
దుర్గుణములు
అనగా
ద్వేష,
అసూయ,
క్రోధ,
క్రూరత్వ
స్వార్థములను
విసర్జించవలెను.
దుర్గుణవిసర్జనే
నిజమైనత్యాగము.
లోకకల్యాణమునకు,
సమాజాభివృద్ధికి
సర్వభూతముల
సుక్షేమమునకు
తనదేహమునైననూ
త్యజించుటకు,
మృత్యువునకుకూడా
భయపడక
జీవిత
సర్వస్వాన్ని
సమర్పించుటయే
నిజమైన
త్యాగం.
త్యాగమునకు
మించిన
సుఖము
మరొక్కటి
లేదు.
అట్టి
వాడే
అమృతపుత్రుడు.
అతడే
చిరంజీవి.
మన
ప్రాచీన
పురాణ,
ఇతిహాసములను
పరిశీలిస్తే
అట్టి
త్యాగ
శీలురు
కోకొల్లలుగా
కనిపిస్తారు.
శిబిచక్రవర్తి,
దధీచి,
కర్ణుడు
మొదలైన
త్యాగశీలురు
ఎందరో
ఉన్నారు.
అట్టి
త్యాగశీలురు
ఏ
కొందరైననూ
నేటి
విద్యార్థులలో,
రాజకీయనాయకులలో
ఈనాడు
లోకానికి
అత్య
వసరము.
స్వార్థాన్ని
విస్మరించి,
అహంకారాన్ని
అణగద్రొక్కి,
పదవీ
వ్యామోహములను
పారద్రోలి,
సంకుచితభావాలను
సమయజేసి,
సమాజ
క్షేమమునకు,
ధర్మస్థాపనకు,
న్యాయపాలనకు
కంకణము
కట్టుకోవాలి.
దురదృష్టవశాత్తు
రాను
రాను
శబ్దాలకు
అర్థాలు
మారిపోతున్నాయి.
త్యాగం,
న్యాయం,
ధర్మం,
సేవ
ఒక
వ్యాపారంగా
మారిపోతున్నాయి.
స్వార్థం
విద్యార్థులలోను,
రాజకీయనాయకులలోను,
విద్యాధికారులలోను
విలయతాండవం
చేస్తున్నది.
అధికారవ్యామోహం,
పదవీకాంక్ష
పెచ్చు
పెరిగిపోయినవి.
ఒకప్పుడు
త్యాగభూమిగా,
కర్మభూమిగా,
తపోభూమిగా
పేరుపొందిన
భారతభూమి
భోగభూమిగా
మారిపోవుచున్నది.
అందువలననే
దేశమున
ఇన్ని
రోగములు
బయలుదేరినవి.
ఈ
విధానం
మారాలి.
చరిత్ర
పునరావృతం
కావాలి,
త్యాగ
శీలురు
మీలో
వేలకువేలు
ఆవిర్భవించాలి,
ప్రతి
భారతీయ
యువకుడు
తిరిగి
త్యాగమూర్తిగా
12
▾
Meaning
Keep
మారాలి.
భోగములకంటే
త్యాగమే
ఎక్కువ
మధురమైనది.
త్యాగమే
జీవిత
పరమావధి
కావాలి.
'త్యాగాత్
శాంతిః'
త్యాగము
వలననే
శాంతి
చేకూరగలదు.
మనస్సుకు
శాంతి
లేకపోతే
దుఃఖాలు
మనలను
వదలవు;
శాశ్వతంగా
మనలోనే
కాపురం
చేస్తాయి.
ఆత్మశాంతి
లేనివానికి
ఎంతసంపద
ఉన్ననూ
ప్రయోజనం
శూన్యమే.
కర్మఫలమును
నిష్కామబుద్ధితో
త్యజించటమే
త్యాగము.
అట్టి
త్యాగమే
చిత్తశుద్ధి.
చిత్తశుద్ధియే
శాంతిని
చేకూర్చును.
అందువలననే
"త్యాగేనైకే
అమృతత్వమానశుః"
అని
ఉపనిషత్తులు
ఎలుగెత్తి
చాటినవి.
త్యాగమే
శిష్టుల
ప్రధాన
లక్షణము.
కనుక
ప్రతి
విద్యార్థి
తన
జీవితాన్ని
త్యాగమయ
జీవితంగా
మార్చుకోవాలి.
భోగమనే
రోగానికి
గురికారాదు.
దురదృష్ట
వశాత్తు
ఈనాడు
విద్య
ఉద్యోగమునకుగానీ
జ్ఞానాభివృద్ధికి
కాదన్న
వాదము
స్వేచ్ఛగా
సంచరించుచున్నది.
ఇది
చాలా
విచారకరం.
జ్ఞాన
మనగా
ప్రకాశం,
క్రాంతి,
వెలుగు
అని
అర్థము.
దానిని
ప్రసాదించునదే
విద్య.
అట్టి
జ్ఞానమే
మానవునకు
నిజమైన
శక్తి.
ఒక్కొక్క
వస్తువుయొక్క
పూర్వాపరములను
తెలుసుకొనుటయే
జ్ఞానము.
వ్యక్తిసంబంధమును
గుర్తించుటయే
జ్ఞానము.
అసలు
మనిషిలో
క్రాంతి,
ప్రకాశం,
వెలుగు
ఎలా
వస్తుంది?
వేద,
వేదాంగములు,
ఉపనిషత్తులు,
ఖురాన్,
బైబుల్,
గ్రంథరాజు
ఇత్యాది
ఉద్గ్రంథములు,
మహనీయుల
చరిత్రలు,
భౌతికవిజ్ఞాన
సాంకేతికశాస్త్రములు,
మానసిక
శాస్త్రములు
మొదలగు
ఎన్నియో
ముఖ్యమైన
గ్రంథములు
వినుటవలన,
పఠించుటవలన
ఈ
జ్ఞానం
మనిషిలో
కలుగుతుంది.
వివేకముతో
విచక్షణాయుతంగ
ఆలోచించే
శక్తి
కొంతవరకు
ఉద్భవించును.
కేవలము
శాస్త్రజ్ఞానమునే
ఆధారము
చేసుకోరాదు.
అనుభవజ్ఞానమును
మూలాధారం
చేసుకోవాలి.
విద్యావిధానపు
రూపురేఖలు
మారాలి.
స్టాక్
హోం
విశ్వ
విద్యాలయంలో
ప్రొఫెసర్గా
పనిచేయుచుండిన
ప్రొఫెసర్
గున్నార్
మిర్థాల్
ఒక
పర్యాయము
అనగా
1972లో
ఢిల్లీ
వచ్చినపుడు
చెప్పినది
ఒకతూరి
భారతీయ
విద్యార్థులు
13
▾
Meaning
Keep
సింహావలోకనము
చేయవలెను.
"భారతదేశ
విద్యావిధానము
అభివృద్ధికి
వ్యతిరేకమైనది.
నీవు
నీ
చేతులు
మట్టి
చేసుకోవద్దు
అనే
మనస్తత్వాన్ని
అది
పెంచుచున్నది"
అని
అన్నారు.
అనగా
ఈనాడు
విద్యార్థులు
శ్రమలేక,
చెమటార్చక,
ధరించిన
ఇస్త్రీ
వస్త్రం
మడతలు
కదలక
కరెంటు
పంకాలక్రింద
కాళ్ళు
చాపుకొని
లేదా
ఎయిర్
కండిషన్లో
పండుకొని
పనులు
చేయాలని
ఆశిస్తున్నారు.
ఇది
విద్యయొక్క
విధేయతకాదు.
వినయము
అంతకంటే
కాదు.
విద్యార్థులు
శ్రమించాలి.
తాము
నేర్చిన
పవిత్రభావాలను,
విషయాలను
సమాజానికి
చాటాలి.
సేవలు
చేయాలి.
పల్లెలలో
పులిపిల్లలవలె
దుమికి
అన్ని
విధములైన
మాలిన్యములను
పరిశుద్ధము
గావించాలి.
నిరక్షరాస్యులైన
పల్లెజనులకు
జ్ఞానబోధ
చేయాలి.
వారితోపాటు
శ్రమించి
పనిచేసి
వారిని
ముందుకు
తీసుకురావాలి.
Previous
←
The Main Purpose
Next
Eternal Truths
→