Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sāī Vāhini · Eternal Truths
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
సమస్తశాస్త్రములకు
వేదమే
మాతృదేవి.
ఇది
పరమేశ్వరుని
ఉచ్ఛ్వాసనిశ్వాసరూపమున
వెలువడుచున్నది.
దీనిని
మహాతపోధనులైన
మహర్షులు
శబ్దరూపమున
గ్రహించుకొని
దానిని
శిష్యసాంప్రదాయాను
సారముగ
లోకమునకు
చాటిరి.
ఒకరినుండి
మరొకరు
శ్రవణేంద్రియములు
ద్వారా
పొందుటచే,
అనగా
వినుటచే
దీనికి
“శ్రుతి”
అని
పేరువచ్చెను.
ఇవి
అనంతములైనవి.
వీటికి
కర్త
ఎవ్వరనియు
వారి
నామధేయములేవియనియు
ఎవ్వరును
ఇంతవరకూ
తెలుపలేకపోవుచున్నారు.
దీనిని
ఉచ్చరించిన
వాడు
కీర్తికామిత్వరహితుడయి
ఉండవలెను.
లేకుండిన
ఈ
వేదమున
తన
పేరెక్కడనూ
సూచించలేదు.
ఇతను
కుల
గోత్రాదులు
లేని
వాడయి
ఉండవచ్చును.
లేకుండిన
ఒక
కులమునకును
ఒక
గోత్రమునకూ
సంబంధము
లేక
సమము
గావించుట
తటస్థించెను.
ఇతడు
సర్వజ్ఞుడని
ఋషులు
నిర్ణయించిరి.
సర్వజ్ఞునకే
ఈ
సమత్వము
సహజము.
అట్టి
సర్వశక్తిమయుడే
వేదమునకు
కర్తయనుట
సమంజసము.
'విద్'
అను
ధాతువునుండి
వేదమను
పదము
పుట్టినది.
'విద్'
అనగా
తెలియుట
“విదం
త్వనేనేతి
వేదః”
సర్వమూ
తెలియజెప్పునది
అనియు
దీని
అర్థము.
ఇది
బుద్ధికిగాని,
అనుభవమునకుగాని
తేల్చి
చెప్పలేనట్టిది.
మానవుల
శ్రేయస్సుకు
కావలసినట్టిదానిని
ఈ
పవిత్రవేదము
తెలుపుచున్నది.
సర్వదుఃఖములను
నివారణచేయు
ఉపాయమును
జూపుచున్నది.
శాంతమునకు
తగిన
సాధనములనుకూడనూ
తెలుపుచున్నది
వేదము.
ఈ
వేదము
యొక్క
ఆదిని,
2
▾
Meaning
Keep
అంత్యమును
ఇంతవరకూ
ఎవ్వరునూ
సరిగా
తెలుసుకొనలేకపోవుటచేత,
ఇది
అనాది
అని,
సనాతనమని
చెప్పబడును.
ఆద్యంతములు
కానరాకపోవుటచేత
వీటినే
నిత్యములని
కూడా
అనవచ్చును.
మానవుల
బుద్ధి
దోషములతోకూడినది.
అట్టి
పురుషబుద్ధి
సంబంధములు
ఎట్టివీ
లేనివగుటవలన
వేదములు
కలుషరహితములగుట
వలన
అపౌరుషేయములని
కూడా
చెప్పవచ్చునని
చెప్పబడుచున్నవి.
వేదములలో
తెలుపబడిన
ప్రతిశబ్దమునకూ
వేదమే
ప్రమాణము.
దీనిపై
విశ్వాసబుద్ధిగలిగి,
ప్రమాణబుద్ధి
కలిగినవారలకు
ఇది
స్వానుభవ
మగును.
ఇట్టి
అనుభవములనందిన
వారే
మహర్షులు.
వారే
వేదములను
ప్రమాణరూపములుగా
కొనియాడిరి.
ప్రత్యక్షానుభవములనిరి.
ఇవి
దేశకాలాదులకు
అతీతమైనవి.
ఈ
వేదములు
భారతదేశమునకేకాక
ప్రపంచమునకంతటికినీ
ప్రమాణములు;
మూలాధారములు
అని
నిశ్చయముగా
చెప్పవచ్చును.
వేదమతము
జనించినది
ఎప్పుడో!
మిగిలిన
మతములు
జన్మించినవి
నిన్న,
నేడు.
ఇదే
ఇతర
మతములకు
వేదమతమునకు
గల
వ్యత్యాసము.
కనుక
ఏదైనా
తెలుసుకోవాలంటే,
మానవునకున్న
సాధన
సామగ్రితో
తెలుసుకొనుటకు
ప్రయత్నించిన
తేలదు.
ఈ
మానవబుద్ధి
ఒక
హద్దునకు
మాత్రమే
చెందును.
బుద్ధి
గ్రాహ్యమతీంద్రియము,
బుద్ధికి
అతీతమైనది
వేదము.
మానవబుద్ధి
సంకుచితము.
అందువలన
ఈ
దృశ్యకల్పితమైన
ప్రపంచమే
ఇహపరము
అనుకొను
వారలందరికీ
ఈ
బుద్ధి
జాడ్యము
ఆవరించుచుందును.
ఇట్టి
సత్యమును
గుర్తించిన
వేదమాత
ఈ
మానవులను
ఉద్ధరించుటకై,
మానవులను
సంతృప్తిపరచుటకై,
ఒక
కాలము
నేర్పరచినది.
అవే
సంవత్సరములు,
మాసములు,
దినములు,
ఘడియలు,
విఘడియలు,
ఈ
కాలమానము
మానవులకే
కాక
దేవతలకు
కూడా
సంబంధించినది.
జీవుడు
దేశకాలములచే
బంధింపబడి
సంసారచక్రమున
చిక్కుకొని
గిరగిర
తిరుగుచు
అందుండి
బయటపడు
ఉపాయము
తెలియక
3
▾
Meaning
Keep
బాధపడు
చున్నాడు.
అట్లున్నను
అతడు
దేశకాలములకు
అతీతుడు.
ఆ
విషయాన్ని
గ్రహింపజేసి,
అతనిని
బంధవిముక్తునిచేసి,
ఉద్ధరించుటకే
వేదమాత
పూనుకొన్నది.
వేదమాత
జీవుని
సంతృప్తిపరచి
సంశయనివృత్తిని
అందించునుగానీ
అతనిలో
విప్లవమును
లేవదీయదు.
ఇది
ప్రాజ్ఞులకు
సువిదితము.
భూమికి
ఆకర్షణశక్తి
కలదు.
అది
ఎప్పటి
నుండి
కలదన్న
విషయము
అందరికీ
తెలియదు.
ఇది
భూమితోపాటే
జనించినది.
భూమి,
దీని
ఆకర్షణశక్తి,
రెండునూ
అవినాభావసంబంధము
కలవి.
భూమిలోని
ఆకర్షణశక్తి
ఏదో
కొంతమందికి
తెలియకుండినంతమాత్రమున
భూమిలోని
ఆకర్షణశక్తి
కనిపించకపోయినంతమాత్రమున
భూమిలో
ఆకర్షణశక్తి
లేదని
చెప్పుట
వెట్టితనము.
భూమితోపాటు
పుట్టిన
ఆకర్షణ
శక్తిని
ఎవరూ
తెలుసుకొనలేకపోయిరి.
వారు
తెలుసుకొనకపోయినప్పటికినీ
ఆకర్షణశక్తి
ఉండియేయున్నది.
కడకు
అనేక
ఆదర్శములతో,
పరిశోధనలతో
పాశ్చాత్య
భౌతికశాస్త్రజ్ఞుడు
న్యూటన్
అనువాడు
భూమికి
ఆకర్షణశక్తి
కలదని
చాటెను.
అతడు
చాటినప్పటినుండీ
భూమికి
ఆకర్షణశక్తికలదని
లోకము
విశ్వసించినది.
కానీ
లోకము
విశ్వసించక
పూర్వము
కూడనూ,
పరిశోధించక
పూర్వమూ
ఈ
ఆకర్షణశక్తి
ఉన్నది.
ఇది
క్రొత్తగా
అప్పటికప్పుడు
పరిశోధనలతో
ఉట్టిపడినది
కాదు.
అటులనే
నిత్యసత్యములైన
వేదములు
తమ
అనుభవములోనికి
భారతీయులు
తెచ్చుకొనకపూర్వము
కూడనూ
ఉన్నవి.
భూమికి
ఆకర్షణశక్తి
ఉన్నదని
పాశ్చాత్య
భౌతికశాస్త్రజ్ఞుడు
ఎట్లు
చెప్పెనో
అట్లే
సమస్తమునకు
వేదములు
ఆధారమని
భారతీయులు
పరిశోధనలలో
తేల్చి
ఋజువుచేసిరి.
భారతీయులు
పరిశోధనలతో
అనుభవించక
పూర్వము
కూడనూ
ఈ
వేదములున్నవి.
న్యూటన్
కనిపెట్టిన
ఆకర్షణశక్తి
ఒక
పాశ్చాత్యభూమికేకాక
యావత్
ప్రపంచమునకు
ఎట్లు
సత్యమో,
భారతీయులు
కనిపెట్టిన
వేదములు
భారతీయులకేకాక
యావత్
ప్రపంచమునంతయూ
శబ్దరూపమున
నిండియున్నవి.
వేదములకు
భారతదేశమే
జన్మస్థానమన
చెల్లదు;
భారతీయులు
4
▾
Meaning
Keep
కనిపెట్టిరి
మాత్రమే;
ఒకచోట
జరుగు
సంఘటన
వేరొక
చోట
ఎందులకు
జరుగలేదను
శంక
యపభ్రంశము.
ఏది
ఎప్పుడు
ఎక్కడ
జరుగవలెనో,
అది
కర్తయే
నిర్ణయించగలడు.
నిర్ణయప్రకారము
జరుగును.
వేదములు
పుట్టుటకును,
వర్ధిల్లుటకును
భరతఖండముయొక్క
వాతావరణము
అనుకూలముగా
నుండినది.
కర్మనిష్ఠులైన
ఋషులు,
యోగులు,
కర్మభూమియైన,
యోగభూమియైన,
త్యాగభూమియైన
భరతఖండమునందు
జననమొందుటచేత
అట్టివారల
హృదయములనే
ఆ
వేదము
ఆకర్షించెను.
ఇతర
భూములు
భోగభూములు
అగుటచే
ఐహిక
వాతావరణము
ఆ
భూములలో
అమితముగా
విజృంభించుటచే
ఇతర
ఖండములు
ఈ
వేదశబ్దమును
సులభముగా
అర్ధముచేసుకొనలేవు.
ఆముష్మికముతోపాటు
ఐహికమును
కూడా
కలిగియుండునది
భరతభూమి.
కనుక
భారతీయుల
భాగ్యమా?
అన్నట్లు
వేదమాత
భారతభూమిలో
అవతరించెను.
వ్యక్తమాయెను.
వ్యక్తముకాకపోయినంతమాత్రమున
ఇతర
దేశములలో
వేదమాత
లేదనచెల్లదు.
ఆకర్షణశక్తి
అన్ని
దేశములలోని
భూమికీ
ఉండినటుల
వేద
శబ్దము
అన్ని
ఖండములందునూ
ఉన్నది.
వేదము
సర్వవ్యాపి.
భారత
దేశమునందుగల
ఋషిపుంగవులు
తమ
తపశ్శక్తితో
ఏకాగ్రతతో
ఆ
పవిత్ర
శ్రుతిని
అందుకోగలిగిరి.
ఆ
శబ్దస్వరూపమును
చూడగలిగిరి;
అనుభవించగలిగిరి.
వారు
అనగా
మహర్షులు
స్వార్థరహితులగుటచే,
ప్రేమస్వభావులగుటచే
తాము
వినినవాటిని,
అనుభవించినవాటిని
పరులశ్రేయమునాశించి
వేదరసమును
భద్రపరచి,
తమ
తమ
చెంతచేరిన
వారలకు
అందించుచు
వచ్చిరి.
కనుక
అందించిన
మహర్షులను
మంత్రద్రష్టలని
నుడివిరి.
వారల
ద్వారా
శిష్యపరంపరగా
యుగములనుండి
ఈ
వేదవాణి
దేశమున
వ్యాపించెను.
అనంతమైన
ప్రవాహమువలె
అన్ని
దిశలా
ప్రవహించెను.
అగోచరమైన
ఈ
వేదమును,
అవ్యక్తమైన
ఈ
వేదమును
వ్యక్తపరచిరి.
కనుక
వేదమునకు
ఋషులే
ద్రష్టలు
అని
భారతీయులు
తెలుసుకొనిరి.
5
▾
Meaning
Keep
భారతీయుల
వేద
వేదాంగాలు,
ఉపనిషత్తులు,
స్మృతులు,
పురాణములు,
ఇతిహాసములు
మహావిజ్ఞాననిలయాలు.
ఇవి
గొప్ప
గొప్ప
పాలసముద్రాలు;
పవిత్రజలాలు.
సాగరములోని
నీటిని
ఎన్ని
పంపుసెట్లు
పెట్టి
తోడినను
ఈషణ్మాత్రంకూడా
తరిగిపోదు.
ఎంతో
నీరు
సూర్యుని
వేడికి
కరిగి
ఆవిరిగామారి
మేఘరూపమును
ధరించి
ప్రజలకు
వర్షరూపములో
నీటిని
తిరిగి
ఇచ్చుచున్నది.
తద్వారా
పంటలు
పండి
దేశము
సస్యశ్యామలమవుతున్నది.
ఎంతజలము
ఆవిరగుచున్నప్పటికినీ
సముద్రము
ఒక్క
అంగుళమైన
తరిగినట్లు
కనిపించదు.
అటులనే
ఎన్నియో
జీవనదులద్వారా
నీరు
సముద్రమును
చేరుచున్నప్పటికినీ
సముద్రములు
లేశమైన
పెరగడం
లేదు.
అటులనే
మన
శాస్త్రజ్ఞానముతోపాటు
అనుభవజ్ఞానమును
అందుకొన్న
మహనీయులుకూడా
సాగరములవంటి
వారు.
వారిని
ఎందరు
భూషించినా,
మరి
ఎందరు
దూషించినా,
వారి
చిత్తము
నిశ్చలంగా,
నిర్మలంగా,
ప్రశాంతముగా
ఉండును.
అట్టి
సారమునకు
నిలయమైనవే
భారతీయశాస్త్ర
గ్రంథములు.
అయితే
ఎవరి
ఓపికను
పట్టి,
సామర్థ్యమును
పట్టి
వారు
ఆ
జ్ఞానమును
ఆస్వాదించవచ్చు;
నేర్చుకొని
మరీ
ప్రపంచానికి
విజ్ఞానమును
వెదజల్లవచ్చు.
అట్టి
విజ్ఞాన,
అనుభవజ్ఞానము
ఒక్క
భారతీయశాస్త్రముల
యందు
మాత్రమే
ఉన్నది.
వాటిని
బాగా
అర్థముచేసికొనవలెనన్న
అవగాహన
గావించుకొనవలెనన్న
సంస్కృతం
తప్పనిసరిగా
నేర్చుకోవాలి.
సంస్కృతము
అనగానే
మనలో
చాలామందికి
ఒక
దురభిప్రాయమున్నది.
అది
మృతభాష
అనీ,
అది
అనాగరికులు
సనాతనులు
వాడే
ఛాందసభాష
అనీ
ఈనాటి
వారి
అభిప్రాయాలు.
ఇవి
ఏవో
అర్థముకానీ
మంత్రాలనీ,
యజ్ఞ
యాగాదులకు
పెండ్లిండ్లు,
కర్మకాండలకు
ఉపయోగించుకొనేవనీ,
ఇది
కష్టతరమైన
భాష
అనీ
సామాన్య
ఆధునికులలో
ఈ
భావము
పాతుకొనిపోయినది.
ఈ
దురభిప్రాయమును
ముందు
మన
మనస్సులనుండి
తీసివేయాలి.
సంస్కృతము
అమృతభాష
అనీ,
అమరవాణి
అనీ,
దానిలో
ఉన్నది
సమస్త
భాషలయొక్క
మూలసారమనీ,
6
▾
Meaning
Keep
అన్ని
భాషలకూ
సంస్కృతము
మాతృదేవి
అనీ
గుర్తించాలి.
నిర్లక్ష్యము
చేయరాదు.
భారతీయుల
వేదాలలోని
అమృతాన్ని
తనివితీరా
త్రాగాలంటే
సంస్కృతమును
నేర్చుకోవాలి.
వ్యాకరణం,
చందస్సు,
జ్యోతిష్యం
మొదలైనవెన్నో
అమూల్యమైన
విషయాలను
మహర్షులు
ఎన్నడో
వ్రాసియుంచిరి.
ఖగోళశాస్త్రం,
ధర్మశాస్త్రం,
నీతిశాస్త్రం,
తర్కశాస్త్రం,
సంగీతశాస్త్రం,
సాహిత్యశాస్త్రం,
శిల్పశాస్త్రం
ఇంకా
ఎన్నియో
ఉన్నాయి.
మన
శాస్త్రాలను
పాశ్చాత్య
ఖగోళ
శాస్త్రజ్ఞులు
చూచి
ఆశ్చర్యపరవశులై
అనేకరహస్యములను
వాటిద్వారా
తెలిసికొనుటకు
అనేక
పరిశోధనలు
చేయుచున్నారు.
భారతీయుల
ఖగోళశాస్త్రము
గ్రీకులకన్నా
ఎన్నోరెట్లు
మిన్న
అనికూడా
పాశ్చాత్యులు
పేర్కొన్నారు.
భారతీయుల
ప్రాచీనవేదశాస్త్రాలలో
ఆధ్యాత్మికసత్యములే
కాక
ఈనాటి
అనేక
విజ్ఞాన,
సాంకేతిక,
అణుశాస్త్రముల
రహస్యములుకూడా
ఎన్నియో
ఉన్నవి.
అధర్వణవేదములోని
అనేక
భాగములను
పాశ్చాత్యులు
పరిశోధనలు
చేసి
గుర్తించిరి.
భారతీయఋషులు
వ్రాసిన
నాడీ
గ్రంథములను
జాతకములను,
జ్యోతిష,
ఆయుర్వేద,
రసాయనిక,
విషవైద్య
గణిత,
శాస్త్రములు
గల
తాటియాకు
గ్రంథములను
టన్నుల
కొలదీ
ఏనాడో
విదేశీయులు
తరలించుకొనిపోయినారు.
మన,
అనగా,
భారతీయ
గ్రంథములైన
శాస్త్రములను
పరిశోధించే
నిమిత్తము
జర్మనులు
ప్రత్యేక
విశ్వవిద్యాలయములు
ఏర్పరచిరి.
అందులో
సంస్కృతమును
నేర్పు
చున్నారు.
అమెరికా,
రష్యా,
కాబూలలో
కూడ
సంస్కృతభాషను
విశ్వవిద్యాలయములలో
పెట్టవలెనని
ఆసక్తి
చూపుటయే
కాక
నిర్బంధముగా
నేర్చుకొనవలెనని
ఒత్తిడి
తెచ్చుచున్నారు.
భారతీయుల
గ్రంథములు,
మహాభాగ్యరత్నములుగా
విదేశీయులు
భావించుచున్నారు.
పూర్వము
భారతీయులు
యోగశాస్త్రమునకు
ప్రాముఖ్యత
నిచ్చెడివారు.
ఇప్పటికి
కూడా
ప్రపంచములోని
అనేకదేశములలో
ఈ
యోగశాస్త్రమును
అధ్యయనముచేయుచున్నారు.
యోగాసనములు
నేర్పు
విద్యాలయములు
నేడు:
అమెరికాలో,
రష్యాలో
ఎన్నియో
వెలసినవి.
కానీ,
భారతదేశములో
7
▾
Meaning
Keep
యోగాభ్యాసం,
ధ్యానయోగం,
అని
అనగానే
ఇది
యేదో
ఒక
ఆధ్యాత్మిక
మార్గమని,
వేదాంతపరమైనదనియూ
భావింతురు.
ఈ
విషయం
చెప్పగనే
సహజంగా
చాలా
మందికి
అరణ్యాలలో
పూర్వము
ఒంటరిగా
కూర్చొని,
కాషాయవస్త్రములను
ధరించి,
కాయలు,
దుంపలు,
వేర్లు
తిని
జీవించే
యోగులు
గుర్తుకు
వస్తుంటారు.
యోగసాధనమనగా
అట్టి
బైరాగులు
అభ్యసించే
సనాతన
విద్య
అని
అభిప్రాయపడుచుందురు.
ఇది
కేవలము
ఊహాగానము
కానీ,
సత్యముకాదు.
నేడు
ఈ
యోగశాస్త్రమును
భౌతికశాస్త్ర
విజ్ఞానదృష్టితో
పరిశీలించి
పరిశోధిస్తున్నారు
విదేశీయులు.
ఈనాడు
ఈ
యాంత్రికయుగములో
ప్రశాంత
జీవితమును
కొనసాగించడం
రానురాను
కష్టంగా
తయారగుచున్నది.
రకరకమైన
మానసికవ్యాధులకు
గురి
అగుచున్నారు.
అమెరికా
ఇత్యాది
నాగరిక
దేశములలోని
ప్రజలు
రాత్రి
సహజనిద్రకు
కూడా
నోచుకోలేని
వారలై
నిద్రమాత్రలతో
కృత్రిమ
నిద్రను
అనుభవిస్తున్నారు.
వాటివల్ల
అనేక
గుండెజబ్బులు,
రక్తపుపోటు
వ్యాధులు
అధికము
చేసికొని
కడకు
ఆరోగ్యమునుకూడా
పాడుచేసికొనుచున్నారు.
ఈ
ఆధునికప్రయత్నము,
యాంత్రిక
జీవితాలు,
ఇటు
మానసికంగా
అటు
శారీరకంగా
శాంతి
విశ్రాంతి
లేక
తికమకలగుచున్నారు.
ఈనాడు
ఆధునికమగు
మందులు
కోట్లకు
కోట్లు
అభివృద్ధి
అయినప్పటికినీ
ఏవియూ
ఆ
రోగములను
కుదర్చలేకపోవుటయేకాక
నూతనరోగమును
అభివృద్ధిగావించుచున్నవి.
అందుకే
మరికొంత
మంది
తెలివితేటలు
గల
వారు
యోగాభ్యాసమే
శరణ్యమని
యెంచి,
ఈనాడు
అనేకపరిశోధనలచే
గుర్తించి
యోగాభ్యాసమును
అభివృద్ధిగావించుచున్నారు.
చూచితిరా?
వేదాలు
ప్రపంచవాఙ్మయములోనే
అత్యంత
ప్రాచీనమైన
సాహిత్యం.
సాహిత్యమంటే
ఈనాడు
ప్రొద్దుపోక
వ్రాస్తున్న
అర్థములేని,
శీలరాహిత్యమైన
సత్యబద్ధముకాని
కట్టుకథలతో
చేరిన
కవిత్వముకాదు.
వ్యక్తియొక్క
చిత్తముకాదు.
భారతీయ
ఆధ్యాత్మిక
జీవితములో
వేదసాహిత్యం
ఆత్మలాంటిది;
8
▾
Meaning
Keep
ప్రాణమువంటిది.
వేదాలలో
అద్భుతమైన
దివ్యశక్తికూడా
ఉన్నది.
విజ్ఞానవంతమైన
మంత్రశక్తిసహితము
ఇమిడియున్నది.
తంత్ర
శక్తితోపాటు
పవిత్రమైన
దివ్యశక్తికూడా
ఉన్నది.
ఈ
మహాశక్తిని
ఉపయోగించి
కార్యసాధన
చేసేదే
తంత్రశక్తి:
దీనినే
తంత్రం
అంటారు.
మంత్రాన్ని
తంత్రాన్ని
ఉపయోగించి
మానవ
భౌతికవిజ్ఞానశక్తితో
నడిపించే
యంత్రాలు,
కర్మకాండ
అంతా
పవిత్రమైన
నాలుగు
వేదాలలో
పూర్వపు
భారతీయులైన
మహర్షులు
ఇమిడ్చారు.
ఈ
సత్యాలను
గ్రహించలేక
వేదాలు
అని
అనగానే
సనాతనులైన
ఛాందసులు
వల్లించు
అర్థముకాని
వ్యర్థమైన
మంత్రాలని
చాలామంది
భావించుచున్నారు.
అధునాతనులేకాదు,
అర్థమునెరిగి
వేదములను
ప్రచారముచేయు
పండితోత్తములని
పేరు
పొందిన
పెద్దలు
కూడా
వాటిని
స్వార్ధమునకు
వినియోగించుకొంటూ,
వాటి
పవిత్రతను
గుర్తించ
లేక,
అనుకూలముకొద్దీ
వాటిని
ఉపయోగించుకొంటూ
వాటిని
ఆచరణలో
పెట్టలేకపోవుచున్నారు.
అందువలననే
అధునాతనులు
వేదాలను
విశ్వసించలేకపోవుతున్నారు.
వేద
విహితులైన
పండితవర్యులే
వాటిని
ఆచరణలో
పెట్టక
పూర్తి
విశ్వాసము
లేక,
తమ
పిల్లలకు
వాటిని
గురించి
తెలుపకపోవుటయే
అవిశ్వాసమునకు
కారణమగుచున్నది.
మరికొందరు
అర్థము
అయినా
కాకపోయినా
తప్పులతో
కొంతమంది
ఛాందసంగా
బజారున
నడుస్తూ
వల్లెవేస్తున్నవారు
కూడా
ఉన్నారు.
భారతదేశములో
ముఖ్యంగా
జర్మన్దేశ
శాస్త్రజ్ఞులు
ఈ
మంత్రాలను
వల్లెవేయక
పోయినప్పటికినీ
మంత్రాలలోనున్న
మహాశక్తిని
బాగా
కనిపెట్టిరి;
గుర్తించిరి.
వేదాలలో
కొన్ని
కొన్ని
భాగాలను
తీసుకొనిపోయి,
ప్రత్యేకంగా
ఓపికతో
అనేక
విధముల
పరిశోధనలు
చేసిరి,
చూచిరి,
అద్భుత
విషయాలను
కనిపెట్టిరి.
మానవాభ్యుదయమునకు
అవసరమైన
అన్ని
కథలూ,
వేదాలలో
ఉన్నాయని
నిరూపించిరి.
వేదాలనుండే
ఉపవేదాలు
బయలుదేరెను.
ధనుర్వేదం,
ఆయుర్వేదం,
జ్యోతిర్వేదం
మొదలయినవి
ఎన్నియో
ఉన్నవి.
9
▾
Meaning
Keep
విశ్వామిత్రుడు
గాయత్రీ
మంత్రమును
కనిపెట్టెను.
ఇది
సూర్యశక్తికి
సంబంధించినది.
ఇది
మహాశక్తివంతమైనది.
మహామంత్రము.
దీనిలో
అత్యద్భుతమైనశక్తియున్నది.
ఆదిత్యహృదయం
అన్న
విద్యద్వారా
అగస్త్యుడు
రామాయణములో
రాములకు
సూర్యశక్తి
రహస్యాలను
వివరించినట్టు
రామాయణ
పాఠకులకు
విదితమే:
ఆ
మంత్రాన్ని
ఉచ్చరించి
భక్తిశ్రద్ధలతో
విశ్వసించి
అపూర్వమైన
అస్త్రాలను
సంపాదించి
మహాసంపన్నుడైనాడు
విశ్వామిత్రుడు.
విశ్వామిత్రుడు
ఈ
శక్తిద్వారా
సృష్టికి
ప్రతిసృష్టి
చేసిన
గొప్ప
వైజ్ఞానికుడు.
వైజ్ఞానికుడన్న
కేవలము
భౌతిక
యంత్రాంగములతో
అద్భుత
శక్తిని
కనిపెట్టువాడు
కాదు.
ఆధ్యాత్మికశక్తిని
ఆధారము
చేసికొని
మంత్రద్రష్టయై
సాధనలు
సలిపి
శ్రద్ధాభక్తితో
నిత్యాచరణతో
ఈ
శక్తిని
నిత్యానుభూతికి
తెప్పించుకోగలిగిన
వానినే
పూర్వము
వైజ్ఞానికుడని
పిలచెడివారు.
అయితే
ఈనాటి
వైజ్ఞానికులు
అంతో
యింతో
చదివి
తెలిసికొని
దానిని
కొండంతచేసి
ఆడంబరములతో
అత్యద్భుతశక్తిని
సంపాదించితిమని
అహంకారముతో
ఆకాశానికి
ఎగురుచున్నారు.
ఇట్టి
ఆడంబరాలు
విజ్ఞానికి
విరుద్ధ
చర్యలు.
వినయవిధేయులై
ఇంకా,
ఇంకా
ఎన్నియో
తెలిసికొనగలిగినవి
ఉన్నవనియూ,
ఇవన్నీ
కేవలము
దైవికశక్తిచే,
అనుగ్రహముచే
సాధ్యమగుననియూ
తలంచినవాడే
విశ్వామిత్రుడు.
అతనికి
మించిన
వైజ్ఞానికుడు
మరొకడు
లేడు.
కానీ
ఇట్టి
విశిష్ట
సంపన్నుడు,
విశాలహృదయుడు,
అయిన
విశ్వామిత్రుడు
భారతీయుడైనప్పటికిని
అట్టి
మహర్షిని
భారతీయులు
స్మరించక
విశ్వామిత్రుడు
కనిపెట్టిన
వాటిలో
ఏ
అణుమాత్రమో
గుర్తించిన
విదేశీయులను
విశ్వసించి
వారి
చర్యలను
వర్ణించుచుండుట
విచారకరము.
విదేశీయులే
భారతీయ
వేదగ్రంథములను
వివిధరీతుల
పరిశోధనచేసి
తెలిసికొనుచుండగా
భారతీయుల
తల్లియైన
వేదమాతను
భారతీయులే
విశ్వసించక,
పెంపుడు
తల్లిని
ప్రీతిగా
ప్రేమించుచున్నారంటే,
ఇదే
ఆంగ్ల
విద్యాభిమానముయొక్క
ఫలమని
భావించవచ్చు
10
▾
Meaning
Keep
ఇంకా
ఇంకా
భారతీయుల
మహర్షులయొక్క
విజ్ఞానభిక్షను
విధేయతతో
విచారించిన,
విమాన
నిర్మాణం
భారద్వాజ
మహర్షిచే
వ్రాయబడినది.
మానసిక
శాస్త్రాధారంగా
జరిగినవనికూడా
నిరూపించినారు
భారతీయులు.
అంతేకాదు
వైద్యశాస్త్రముకూడా
భారతదేశమునందే
అభివృద్ధి
అయినది.
మొట్టమొదట
ఈ
విద్యను
భారద్వాజ
మహర్షి
మానవజాతికి
ఉపదేశించాడు.
ఆత్రేయుడనే
ముని,
అగ్ని
వేశునికి
ఉపదేశించినట్లుగా
ఆయుర్వేదము
అంతా
ఒక
గ్రంథంగా
వ్రాయబడి
"చరక
సంహిత"
అను
పేరుతో
లభ్యమైనది.
దీనిలో
రోగలక్షణములు,
చికిత్సావిధానములు,
పిండోత్పత్తి
ఇత్యాది
అతిరహస్యమైనవెన్నియో
తెలుపబడినవి.
మూలికలతో
నయము
కానివాటికి
శస్త్రచికిత్సకూడా
చేసెడివారు.
వాటినిగురించి
సుశ్రుతము
అని
ఒక
గ్రంథమునుకూడా
లిఖించిరి.
సుశ్రుతుడను
మహర్షి
రచించెను
కనుక
'సుశ్రుతము'
అని
పేరు
పెట్టిరి.
వాటిని
ధన్వంతరి,
నాగార్జునుడు
మొదలైన
మహర్షులు,
మహానుభావులు
వెలుగులోనికి
తెచ్చిరి.
ఇట్టి
అనేక
రహస్యములను
వేదములద్వారా
మహర్షులు
కనిపెట్టి,
ఆచరించి
భారతీయులకు
అందించిన
నీతిశాస్త్ర,
ధర్మశాస్త్రపు
మహానిధులు.
మనుధర్మశాస్త్రం,
గౌతముని
న్యాయశాస్త్ర
స్మృతులవంటివి
ఎన్నియో
ఉన్నాయి.
వేదాంతము
ఏ
సాంప్రదాయమునకును,
ఏ
తెగకును,
ఏ
కోవకును,
ఏజాతికినీ,
ఏలింగమునకును,
ఏనమ్మకమునకును
చెందనిది,
"సర్వేజనాస్సుఖినోభవన్తు".
వేదాంతమనగా
జ్ఞానము,
ఏ
జ్ఞానము?
ఆత్మజ్ఞానము.
ఆత్మజ్ఞానమే
జన్మలాభము.
తన్నుతాను
తెలిసికొనుటకంటే
మానవునకు
అధికమగు
లాభము
వేరొకటి
లేకపోవుటచే,
శ్రుతి
స్మృతులయందు
విశ్వాసము
గలవారికి
ఆత్మజ్ఞానము
అత్యవసరము.
చూడబడునది
చూచువానికంటే
వేరైనదని
అందరకూ
తెలియును.
ఈ
చూచునట్టి
తానెవరు?
ఆకారాదులుగల
శరీరము
కన్నుగా
నున్న
ఒక
యింద్రియముచే
కనుగొనబడుచున్నది.
కన్ను
శరీరమునే
కాదు,
ఎదుటనున్న
11
▾
Meaning
Keep
ప్రతి
వస్తువును,
వ్యక్తిని,
క్రిమికీటకాదులనుకూడా
కనుగొనుచున్నదికదా!
ఈ
కనబడునట్టి
వస్తువులలో
శరీరముకూడా
ఒక
వస్తువు
కనుక
ఈ
శరీరము
తానెట్లగును?
అట్లయినతానెవరు?
అగ్ని
వస్తువులను
కాల్చుచూ
ప్రకాశింపజేయును.
అయితే
కాల్చబడునట్టియు
ప్రకాశింప
జేయబడినట్టియు,
వస్తువులకంటే
అగ్ని
వేరైనట్లు
చూచువారెవరు?
కాల్చబడునట్టి
వస్తువువేరు,
కాల్చునట్టి
అగ్ని
వేరు,
అని
తెలుసుకొనువారెవరు?
అదే
ఆత్మ.
అగ్ని
కట్టెనంతయూ
వ్యాపించునటుల
ఆత్మ
శరీరమునంతయూ
వ్యాపించినది.
అందువలననే
శరీరము
పనులు
చేయగలదియై,
కదలిక
గలదియై
సంచరించుచున్నది.
రాత్రి
యింటిలో
ఇదిముల్లు,
ఇదిగిన్నె,
ఇదితట్ట
అని
తెలుపు
పనిముట్టు
దీపము,
ప్రకాశము.
అటులనే
కన్ను
ఇల్లు,
ముల్లు,
పల్లు
అని
తెలుపునట్టి
పనిముట్టుమాత్రమే.
ఇది
ఆత్మకాదు.
దీపము
లేక
కన్ను,
కన్ను
లేక
దీపము,
ఇల్లును
కానీ,
ముల్లును
కానీ,
గిన్నెనుగానీ,
తట్టను
కానీ
చూడలేవు.
కన్ను
అను
పనిముట్టు
లేక
దీపము,
దీపము
(ప్రకాశము)
అను
పనిముట్టు
లేక
కన్ను
గాంచలేదు,
కాన
రెండునూ
ప్రకాశముయొక్క
పనిముట్లే,
పనిముట్లుగా
ఉన్న
తనకన్నే
తన
దేహమును
కూడా
చూచుచున్నది,
చూచేకన్నే
పనిముట్టు
అయినపుడు
చూడబడు
దేహము
మాత్రము
పనిముట్టు
కాక
మరేదమగును?
లోకమున
విని,
తిని,
చూచి,
ముట్టి
వాసనలను
అనుభవించున
వన్నియూ
ఇంద్రియములే,
చూచే
కన్ను
పనిముట్టు
అయినపుడు
మిగిలిన
నాలుగు
ఇంద్రియములుకూడా
పనిముట్లే
కానీ
ఆత్మకావు.
ఇట్టి
పనిముట్లయిన
ఇంద్రియములను
అధీనమందుంచుకొనునది
మనసు.
ఇది
ఆలోచించగల
విషయము.
ఇది
కేవలము
దీపము
వంటిది.
ఇది
మాత్రము
ఎట్లు
ఆత్మ
అగును?
అదియునూ
ఆత్మకాదు.
మనసు
అందించిన
విషయమును
విచారించి
తేల్చునట్టిది
బుద్ధి.
ఇది
నిశ్చయించు
ఉపకరణము
మాత్రమే.
అనగా
చిన్న
ఉదాహరణము:
పదునైన
కత్తియున్నది.
అది
ఎంత
పదునైన
కత్తి
అయిననూ
తనకు
తాను
స్వయముగా
ఏ
12
▾
Meaning
Keep
మా
కోయలేదు.
ఎంతటి
చిన్న
గ్రామాలైననూ
కోసులేదు.
అది
ఒకరి
చేరినప్పుడే
ఆ
పనులు
చేయగలడు.
అదే
విధముగ
ఇది
ఆత్మచేతిలోని
పనిముట్టు
మాత్రమేలని
ఆత్మతారు.
ప్రాణము:
ఇది
నిద్రలో
తానున్నట్లు
ప్రాణమునకు
తెలియదు.
నాకు
శ్వాస
ఉన్నది
లేనిది
తెలుసుకొనలేదు.
జాగ్రత్,
స్వప్న,
విభామల
యందున్న
స్థితులను
ఆయాసమయములయందు
మాత్రమే
తెలుసుకొన
గలదు
కానీ
నిద్రలో
జాగ్రతను,
జాగ్రతలో
స్వప్నమును
గుర్తించలేదు.
కనుక
ప్రాణము
ఆత్మకాదు.
నిద్రలో
ప్రాణము
జ్ఞానరహితమై
పట్టుబడు
చున్నది.
ఇంద్రియములు
నిద్రలో
పనిచేయక
ఊరకుండుటచే,
ప్రాణము
చైతన్యము
లేనటుల
కానవచ్చును.
దొర
పనిచేస్తుంటే
బంట్లు
ఊరక
కూర్చొనుదురా?
ఇక
నేను:
నేను
అను
పదములు
రెండు
కలవు.
1.
అహంకారము,
దీనినే
దేహాత్మ,
ఇది
బైటగల
నేను.
2.
అంతరాత్మ,
లేక
ప్రత్యగాత్మ.
ఇది
లోపలగల
నేను.
ఈ
రెండింటికీ
భేదము
తెలియనివాడు
అహంకారమే
అనగా
దేహాత్మనే
నేను,
అని
అనుకొనుచున్నారు
కానీ
అది
సత్యముకాదు.
అది
ఆత్మకాదు.
దేహము
పనిముట్టు
అయినందున,
పదార్థమెట్లు
దృశ్యమో,
దేహాత్మ
అయిన
అహంకారము
కూడా
దృశ్యము.
ఈ
అహంకారము
స్వప్నమున
ఉండదు,
నిద్రలో
ఉండదు.
"త్రికాలభాద్యం
సత్యం"
రెండుకాలములలో
లేనిది
సత్యమెట్లగును?
ఈ
విధముగ
విచారము
సలిపి,
ఇంద్రియములు,
మనస్సు,
బుద్ధి,
ప్రాణము
ఏదీ
తాను
కానియెడల
ఇక
ఆత్మ
ఏది?
అని,
ఆత్మ
ఎవరని,
మీలో
సందేహము
కలుగవచ్చును.
రాకపోకలు
లేని
కరచరణ
అవయవములు
కాని,
మాలిన్యము
చేరని,
అణువున
అణువుగను,
ఘనమున
ఘనముగను,
ఆకాశమువలె
అంతటా
ఉన్నను,
నేను,
నాది
అను
భావములేక,
అగ్నికి
వేడిమివలె,
సూర్యునకు
ప్రకాశమువలె,
ఎరుకయే
స్వభావముగాగలది
ఆత్మ.
శోక
కోప
పంచేంద్రియాది
సంబంధములేక
పరమానందమైనది
ఆత్మ.
సర్వజీవుల
యందు,
హృదయముగా
ప్రజ్ఞగా
ఉన్నదే
13
▾
Meaning
Keep
ఆత్మ.
దృశ్యములందు
దృక్కుగా
చూడబడే
వస్తుజాలమును
చూచువాడే
ఆత్మ.
కరణాదుల
సహాయములతో
చూచి,
విని,
తిని,
చెప్పు
వాడెవడైననూ
సరే
వాడు
కేవలము
దీపమువంటి
వాడే
కానీ
ఆత్మస్వరూపుడు
కాడు.
ఆత్మ
అల్పద్రష్టకానీ,
క్రమద్రష్టకానీ,
అద్రష్టకానీ,
అన్యథాద్రష్టకానీ
కాదు.
బుద్ధి
చంద్రుని
వంటిదయినప్పటికినీ
స్వప్రకాశము
కాదు.
దానికి
సూర్యునివంటి
ఆత్మ
అతి
సమీపముననున్నందున
అది
ఆత్మతో
కలియ
వీలున్నది.
లక్కా,
చెక్కా
చక్కగా
అంటుకొనును.
బుద్ధి,
ఆత్మ
అట్టివి
కావు.
అభ్యాసముచే
మాత్రము
కలియును.
సూర్యుడును
ఇతరవస్తు
సాన్నిధ్యమును
బట్టే
'సూర్యుడు
జగచ్ఛక్షువు'
అని
చెప్పబడుచున్నాడు.
సూర్యునకు
నేను
అని
కాని,
నాది
అనికానీ,
ఒక
కోరిక
కానీ
లేదు.
అతని
సాన్నిధ్య
మాత్రమున
చీకటి
పోయి
వెలుతురు,
వెలుగువచ్చి
సర్వము
ప్రకాశించుటవలన
అతడు
ప్రకాశకుడయినాడు.
కానీ
అతనికి
కర్తృత్వరూపమును
ప్రకాశత్వము
లేదు.
అటులనే
ఆత్మకు,
మార్పులుకానీ
కూర్పులుకానీ
లేని,
ఆత్మ
కర్త
ఎటులగునని
అడిగినచో,
సూదంటురాయికి
కర్తృత్వమెటుల
తనదాపున
చేరిన
సూదిని
కదుల్చును?
ఆత్మ
ఉన్నదాలేదా?
ఉన్నయెడల
ఏ
ప్రమాణముచే
సాధింపబడును?
ఆత్మ
ఉన్నదనుటకు
ప్రమాణముతో
పనిలేదు.
ఆత్మయే
ప్రమాణాధీనుడై
ప్రమాణములచే
సాధింపబడవలసిన
యెడల,
ఆ
ప్రమాణము
ఉపయోగించి
పరీక్షించువాడు
మరొకడుండవలెను
కదా!
అతనెవరు?
పోనీ
అతనే
ఆత్మ.
ఆత్మకలదని
చెప్పుటకు
వేదమే
ప్రమాణమని
కొందరు
చెప్పవచ్చు.
కొందరు
వేదముచేకూడా
ఆత్మ
సాధింపబడదని
చెప్పవచ్చు.
ఆత్మ
అన్నను
ఒకటే
అని
తెలుపుటలో
వేదము
ప్రమాణముకావచ్చును.
కాని
స్వయంసాక్షి
అయిన
ఆత్మకు
వేద
ప్రమాణములులేవు.
శాస్త్రప్రమాణము
ననుసరించి,
ఉత్సాహము,
సాహసము,
ధైర్యము,
సద్బుద్ధి,
శక్తి,
పరాక్రమము
అను
ఆరు
సుగుణములును
ఉండుచోట
సాక్షాత్
భగవానుడయి
వసించును.
ఇట్టి
గుణములను
ప్రబోధించుటే,
గణపతిపూజ
14
▾
Meaning
Keep
అనగా
ప్రారంభము.
పిరికిపందలకు
ఆధ్యాత్మక్షేత్రమున
చోటేలేదు.
దుర్జనులు
దృఢవిశ్వాసము
లేనివారు
సందేహస్తులు
ఏడుపు
ముఖమువారు,
వైద్యులకు
శిష్యులుగా
ఉండవలసిన
వారే
కానీ
యోగులెన్నటికీ
కానేరరు.
జ్ఞానికి
అజ్ఞానికి
ఇదే
భేదము.
"ప్రహసన్నివ"
కృష్ణుడు
అనందాతిరేకములతో
నవ్వుచూ
పలుకుట
అర్జునుడు
దుఃఖాకులుడై
వినుట,
జ్ఞానియెల్లపుడును
నవ్వుతాడు,
అజ్ఞాని
ఏడుస్తూ
ఉండును.
ఆత్మవిచారమునకు
ఆశ్రమధర్మము
లెంతయో
అవశ్యము.
ఆశ్రమ
ధర్మజ్ఞానము
స్వార్జితము.
బాల్యావస్థ
అనంతరమువరకూ
మనుజుడు
ఆశ్రమవాసి
కానేరడు.
అంతవరకూ
వానికి
ప్రాప్తించు
జ్ఞానవిశేషము
లేవియూ
లేవు.
జీవశరీరమునకు
బాల్య,
కౌమార,
యౌవ్వన
వార్ధక్యావస్థలున్నటుల
జ్ఞానమునకుకూడను
నాలుగు
అవస్థలు
కలవు.
అందు
మొదటిదగు
బాల్యావస్థయందు
జీవితము
అజ్ఞానదశయందుండి
శిష్యత్వము
నంగీకరించి,
దాస్యమునకు,
శిక్షణకునులోనై
ఎట్టి
బాధ్యతలునులేక
జ్ఞానార్జన
జేయుచుండవలెను.
రెండవదశయగు
యౌవ్వనమున
సంఘనిర్వహణా
బాధ్యతను
వహించి
ధనార్జనమందును
దాని
వినియోగమునందును
జాగరూకత
కలిగి,
తనకంటే
పిన్నలకు
తగిన
శిక్షణనొసంగు
ఆదర్శములను
అందించుచు,
పెద్దలను
అనుసరించుచూ,
జ్ఞానాభివృద్ధిని
గడించుచుండవలెను.
మూడవదశయగు
కౌమారమునందు
కేవలము
స్వీయసంఘ
కుటుంబమే
కాక
ప్రజాసౌఖ్య
నిర్వహణ
భారము
సైతము
వహించి
లోకశ్రేయమునకు
తన
సౌఖ్యము
నైనా
లక్ష్యపెట్టక,
పాటుపడుచూ
అంతర్జ్ఞానమును
సంపాదించు
చుండవలెను.
నాల్గవదియగు
వార్ధక్యమునందు
తనకు
పూర్వము
కలిగిన
అనుభవమూలమున
ఇహలోక
సుఖాదులు
నిస్సారములనియు
అనిత్యము
లనియు
గ్రహించి
విజ్ఞానవంతుడై,
దయాపరుడై,
సర్వభూతహితుడై
తనయనుభవజ్ఞానమును
లోకమునకు
చాటవలెను.
ఇట్లు
జీవుల
గుణములును,
వృత్తులును
నాలుగు
తరగతులుగా
గనుపించుచున్నవి.
15
▾
Meaning
Keep
తెలివిని
పెంచుటకు
చదువువలే
జ్ఞానమును
పెంచుకొనుటకు
ప్రవర్తన
ముఖ్యము.
బాల్యావస్థయందు
విద్యతోపాటు,
వినయము,
విధేయత,
భక్తి,
శ్రద్ధ,
పరిశ్రమము
నుండవలెను.
యౌవ్వనావస్థయందు
ధనార్జనమే
కాక,
సంఘనిర్వహణమేకాక,
సదాచారశీలసంపన్నతను,
ధార్మిక,
ఆధ్యాత్మిక
భావములను,
చిత్తమును
తీర్చిదిద్దుకోవలెను.
కౌమారమున,
కేవలము
సంఘ
కుటుంబ
పోషణతో
పాటు,
నీతి
నిజాయితీలను,
పెంపొందించుకొని
తన
బిడ్డలకు
ఆదర్శవంతమైన
జీవితాన్ని
అందించి
సమాజమున
అట్టి
సదాచారమును
నిరూపించవలెను.
సంఘమును
ధిక్కరించి
స్వకుటుంబ
పోషణనుమాత్రమే
లక్ష్యమందుంచుకోరాదు.
పుట్టువుకాని,
సంస్కారముకాని,
వేదాధ్యయనముకాని
బ్రహ్మ
తత్త్వమునకు
కారణముకాదు.
వర్తనమే
మూలకారణము.
పుట్టినవాడు
ఎప్పుడో
ఒకప్పుడు
మృతినొందక
తప్పదు.
లోకమున
ప్రతినిమిషము
ఎందరో
పుట్టుచున్నారు.
ఎందరో
గిట్టుచున్నారు.
అయితే
మృత్యువు
లేకుండ
చేసుకొనుటెట్లు?
అని
విచారించవచ్చు.
ఆత్మ
ఎన్నడును
పుట్టదు.
పుట్టని
ఆత్మకు
మృత్యువు
లేదు.
ఇక్కడ
కామముతో
జేరిన,
కూడిన
దేహమునకే
మృత్యువు.
యోగమే
మృత్యువు.
భ్రమచెందుటయే
మృత్యువు,
భ్రమలేకుండుటే
అమృతత్త్వము.
మృతి
బొందునది
దేహమేకాని
ఆత్మ
కాదు.
దేహమెప్పుడునూ
మారుచునేయుండును
మార్పుచెందునది
నశించకతప్పదు.
నాశముగల
దేహమునే
నేనని
భ్రమపడి,
జ్ఞానహీనుడై
మృతినొందుట
మానవహీనము.
జీవుడు
కర్మానుష్ఠానముచే
జ్ఞానమును
వృద్ధి
చేసుకొనినకొలదీ
శరీరములు
మారిపోయి
ఉన్నతపరిణామము
నందుకొనుచుండును.
పచ్చి
చింతకాయలోని
బెరడు,
గుజ్జు,
ఈనెలు,
గింజలు
వేరుచేయ
సులభ
సాధ్యము
కాదు.
అటులనే
విషయాసక్తులకు
దేహాభిమానులకు
జ్ఞానము
అంటదు.
పండిన
చింతకాయలోని
బెరడు
మొదలగునవన్నియునూ
లోనున్న
పండుతోనే
విడిపోవునట్లు
దేహాభిమానమాత్మను
వదలి
పోవును.
అపుడు
ఆత్మ
స్వచ్ఛముగా
కనిపించును.
16
▾
Meaning
Keep
అన్నమయ,
ప్రాణమయ
కోశములు
రెండును
స్థూలశరీరములు,
ఈ
రెండు
కోశములు
దూరముకాగానే,
దేహము
క్రిందపడును.
ఇక
సూక్ష్మ
దేహము;
సూక్ష్మమనగా
చిన్నది
అని
మామూలు
అర్థము.
ఇక్కడ
సూక్ష్మమన
వ్యాపించునది
అని
అర్ధము.
జలముకంటే
వాయువు
సూక్ష్మము,
వాయువుకంటే
ఆకాశమగు
శబ్దము
సూక్ష్మము.
మంచుగడ్డ
స్థూలమైనది.
దానిలోని
నీరు,
నీరుకంటే
ఆవిరి
సూక్ష్మమైనది.
మంచుగడ్డ,
కర్పూరము
స్థూలముగా
కనిపించిననూ
దాని
ఆవిరి
సూక్ష్మమై,
అవ్యక్తమై
యుండును.
వ్యక్తమునుండి
అవ్యక్తము
ఏర్పడుట
దాని
లోకధర్మము.
ఆధ్యాత్మిక
ధర్మమిట్టిది
కాదు.
అవ్యక్తమగు
ఆత్మనుండే
వ్యక్తమగు
పదార్ధమేర్పడినది.
కడకు
అవ్యక్తములో
లీనమగుచున్నది.
గోవులనుండి
పాలు
వచ్చునట్లు
పరమ
పురుషుడగు
ధేనువునుండి
మాయాశక్తియగు
పంచభూతాత్మకమగు
ప్రకృతియను
పాలు
బుట్టుచున్నవి.
పాలు
గాచుటచేత
మీగడ
కలిగినట్లు,
ఆ
పాలయందు
చల్లను
గలుపుటచే
మీగడ,
పాలు,
వేడిమి,
చల్ల
కలిపి
పెరుగగును:
ఆ
పెరుగును
చిలికిన,
నూతనమగు
పదార్థము
వెన్న
బయలుదేరును.
ప్రకృతియను
పాలయందు
పంచమహాభూతములొండొంటితో
కలిపి
బహువిధపరిణామములు
తుదకు
భూగోళమను
వెన్నముద్దగ
ప్రత్యక్షమగుచున్నది.
ఆ
గుణములలో
ఏ
గుణమధికమైన
ఆ
గుణ
స్వభావము
గనబడునటుల
పంచభూతములలో
ఏ
భూతమధికమైన
ఆ
భూతస్వభావమే
సహజమని
ముఖ్యముగా
గోచరించుచుండును.
చరాచర
ప్రపంచమునందంతయును
పృధ్వీతత్త్వమధికమైయుండుటచేత
ఇది
జీవితమనబడుచున్నది.
అటులనే
జలతత్త్వము,
తేజస్తత్వము
అధికమగుచున్న
భువర్లోకమని,
సువర్లోకము
అనబడుచున్నది.
అందలి
పదార్థములు
ఆయాతత్త్వములు
కలిగియుండును.
ప్రపంచమంతయు
ఈశ్వర
జీవభూతములనెడి
మూడు
తత్త్వముల
పరిణామము.
మాయ
అవిద్యతమములయందు
ప్రతిఫలించెననునపుడు
ముఖ్యముగా
గమనింపదగిన
అంశము
ఒకటి
కలదు.
అద్దమొక
ఉపాధి;
17
▾
Meaning
Keep
దీని
శక్తి
యెదుట
వస్తువులను
ప్రతిఫలింపజేసుకొనుట,
కానీ
అద్దముల
యొక్క
మలిన
వక్రమాదులతో
అందలి
ప్రతిబింబములకు
వాస్తవముగ
ఎట్టి
సంబంధమునూ
లేదు.
కానీ
అద్దమునందలి
మలిన
వక్రాదులను
మనచే
ప్రతిబింబములకు
ఆపాదింపబడుచున్నవి.
అటులనే
బ్రహ్మమునకు
మాయాసంబంధము
లేకపోయినను
అభ్యాసమున్నట్లు
భావింపబడుచున్నది.
పరమాత్మ
ప్రతిబింబముతోకూడి,
మాయయే
పాలు
పెరుగుగా
పరిణమించినట్లు;
జగద్రూపముతో
పరిణమించినది,
ఇది
మాయమే
కానీ
ప్రతిబింబము
కలది
కాదు.
మాయ
తన్నాశ్రయించినది
కాన,
మాయ
తన
స్వాధీనము
అయినందున
మాయకు
ప్రభువు
తానే.
పరమేశ్వరుడు
సర్వజ్ఞుడు,
సర్వశక్తిమంతుడు.
జీవేశ్వర
భూతములను
మూడు
తత్వములలో
జీవుని
భోగార్థమై
ఈశ్వరసృష్టి
ఏర్పడినది.
ఈశ్వరుడు
ఆప్తకాముడు.
సృష్టియందలి
సర్వభోగములూ
తననుండి
ఏర్పడినవి.
అతడు
కోరునది
యేదియునూ
ఉండదు.
"నమే
పార్థాస్తి
కర్తవ్యం
త్రిషులోకేషు
కించన"
సర్వజీవరాసుల
చైతన్యము
నిమిత్తమే
తాను
కర్మను
సృష్టించుచున్నాడు.
తాను
కర్మఫల
ప్రదాత,
కర్మలు
ఫలము
నొసంగజాలవు.
ఈ
కర్మకు
ఈ
ఫలము
అని
జడమగు
కర్మ
నియోగించుకొనజాలదు.
Previous
←
Inquiry into the Ātma
Next
Paths of Worship
→