Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sūtra Vāhini · That from Which This World Is Born
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
జీవునకు
నైజగతమైన
స్వచ్ఛము,
శాంతము,
సంతోషము,
గుణము
గలవానియందు
తొణకుచుండును.
ఆకాశమున
ఎగురు
పక్షికి
రెండు
రెక్కలు
ఎట్లు
అవసరమో,
భూమిపై
సంచరించే
వ్యక్తికి
రెండు
కాళ్ళు
ఎట్లు
అవసరమో,
మోక్ష
సౌధము
చేరువానికి
విషయ
వైరాగ్యము,
ఆత్మజ్ఞానము
అట్లు
అవసరము.
పక్షికి
ఒక
రెక్క
లోపించిన,
ఆ
పక్షి
ఆకాశమున
ఎగురలేదు
కదా!
అటులనే
జ్ఞాన
వైరాగ్యములలో
ఏ
ఒక్కటి
లోపించినూ
బ్రహ్మను
పొందలేదు.
మమకారము
మహాపాశము.
ఎంతోకాలము
ఈ
మమత్వముతో
నాది,
నాది
అనుకొన్న
సర్వస్వమునూ
ఏదో
ఒకనాడు
వీడిపోవలసి
వచ్చును.
ఇది
సత్యము.
ఇది
తప్పదు.
ఇట్టి
కల్పిత
సంబంధ
బాంధవ్యములను
విచారణద్వారా
త్యజించి
సత్యమును
గుర్తించి
సాధ్యమైనంత
త్వరలో
మమత్వమును
వీడుట
మంచిది
-
అని
వైరాగ్యము,
వివేకము
బోధించుచున్నది.
సంగత్వము
భయమునకు,
స్వార్థమునకు
సూచకము.
అజ్ఞానులు
ఈ
లౌకికమునకు
లోబడుదురు.
జ్ఞానులైనవారు
ఇట్టి
మోహమునకు
బద్ధులుకారు.
సర్వం
క్షణికం
క్షణికం
-
అని,
సర్వం
అనిత్యం
అనిత్యం
-
అని
సత్యమును
గుర్తించి
ఆత్మ
గుణములైన
అమర
భావములను
అనుసరించువాడే
గుణశీలుడు.
అట్టివాడే
బ్రహ్మప్రాప్తికి
అధికారి.
జన్మాద్యస్య
యతః
జన్మాద్యస్య
యతః
-
ఉత్పత్తి,
స్థితి,
ప్రళయములు,
అనగా
దృశ్య
కల్పితమైన
ఈ
జగత్తంతయూ
ఎక్కడ
పుట్టుచున్నదో,
యెవరివలన
కలుగుచున్నదో,
ఎవరి
వలన
రక్షింపబడుచున్నదో,
కడకు
ఎవరియందు
చేరుచున్నదో
అనగా
లయమగుచున్నదో
అదే
బ్రహ్మమని
తెలియవలెను.
ఈ
జగత్తును
ఒకవిధమైన
క్రమపద్ధతిలో
నియమించువారు
ఒకరుండవలెను
కదా!
ఈ
మూడింటికి
నియతి,
జ్ఞానము,
ఆవృతి
(అనగా
అజ్ఞానము)
అవసరము.
అస్య
-
ఈ
కనిపించుచున్న
ప్రపంచమునకు;
జన్మాది
-
ఉత్పత్తి,
స్థితి,
ప్రళయములు;
యతః
-
ఎవరివలన
కలుగుచున్నదో
అది
బ్రహ్మము.
2
▾
Meaning
Keep
జగత్స్వభావమునుగూర్చి
మనము
అధికముగా
తెలుసుకొనవచ్చును.
అయితే
చూచినది
మానవ
నేత్రమే
కదా!
భౌతిక
శాస్త్రము
సాధించినవన్నియూ
మానవుని
మనస్సుయొక్క
ఫలితములే
కదా!
భౌతిక
శాస్త్రము
ఉన్న
విషయములను
వర్ణించి
వివరించును.
అయితే
ఈ
వివరములు
ఎంతకాలము
నిలిచియుండును?
ఇవి
మాటిమాటికినీ
మారుచునే
యుండును.
ఎన్ని
మారినా
మారని
తత్త్వము
ఒకటి
యున్నది.
దానిని
ఆధారముగా
చేసుకొనే
ఈ
మారు
వస్తువులు
ఆధేయముగా
ఉన్నవి.
ఆ
ఆధారమైన,
అచరమైన,
సత్యమైన
పరతత్త్వమే
బ్రహ్మము.
ప్రపంచమునకు
ఒక
ఉత్తమ
ఆదర్శము
కలదు.
అదే
బ్రహ్మము.
అయితే,
మనకట్టి
బ్రహ్మము
గోచరము
అగుటలేదే!
కేవలము
మార్పు
చెందుతున్న
రూపనామములే
గోచరించుచున్నవే
అని
సంశయము
కలుగవచ్చును.
దీనికి
ఒక
ఉదాహరణము:
చీకటిలో
ఒక
ఎండిన
చెట్టుమొద్దును
చూచి,
దూరమునుండి
అది
యేదో
భూతమో,
లేక
వికారపు
మానవ
రూపమో
యని
భయమునకు
గురి
అగుదుము.
అయితే
అక్కడ
భూతమో,
లేక
భయంకర
మానవుడో
ఉన్నాడా?
లేక
కాలిన
చెట్టుమొద్దు
ఉన్నదా?
అది
చెట్టే
అయిననూ
మనిషివలె
భయంకరముగా
కనిపించుచున్నది.
కారణము?
చీకటిచేత
ఉన్న
ఒక
వస్తువు,
లేనిదానివలె
కనిపించుచున్నది.
అటులనే
ఈ
ప్రపంచమునకు
ఆది
కారణమైన
బ్రహ్మమే
ఉన్నను
మాయచేత,
భ్రమచేత
బ్రహ్మము
గోచరముకాక
ప్రపంచము
గోచరించుచున్నది.
ఇట్టి
భ్రమ
దృష్టి
జ్ఞానముచే
ప్రమాద
దృష్టిగా
మారుచున్నది.
పరిదృశ్యమానమైన
ఈ
ప్రపంచ
ఉత్పత్తికి
బ్రహ్మమే
కారణము.
మరికొందరు
ఈ
ప్రపంచోత్పత్తికి
స్వభావము,
నియతి,
ఆకస్మికము,
కాలము,
కారణమని
భావిస్తారు.
వీటియొక్క
సంయోగములు
జగత్కారణములు
కాజాలవు.
కారణమేమన
ఇవన్నియూ
జడములు.
జీవుడుకూడా
సుఖ
దుఃఖములకూ,
వృద్ధి
క్షీణములకూ,
జనన
మరణములకూ
లొంగియుండును.
కనుక
జీవుడు
పరతంత్రుడే.
కావున
జగత్
ఉత్పత్తికి
కారణము
కాదు.
సూత్రము
మనలను
ప్రామాణిక
ఆధారములచెంతకు
తీసుకొనిపోవుచున్నది.
3
▾
Meaning
Keep
జగదస్తిత్వమునకు,
స్వభావమునకు,
క్రమతకు,
పరిపూర్ణతకు
కారణభూతమైన
ఒక
మహత్తరమైన
ప్రమాణమువలన
నిరూపించుచున్నది.
వస్తువులు
ఎట్లు
కలుగునో
భౌతిక
శాస్త్రము
వివరించవచ్చును.
అయితే
అవి
ఎందుకు
అట్లు
కలుగుచున్నవో
భౌతిక
శాస్త్రము
తెలుపలేదు.
అయితే,
ప్రతి
కార్యమునకు
కారణము
కలదు.
అణువుగాని,
అభావముగాని,
జీవుడుగాని,
ప్రపంచమునకు
కారణము
కాదు.
సత్తు
విషయావిషయ
భేదముల
నతిక్రమించి
ఉన్నది.
అయితే
బ్రహ్మమును
గురించి
చెప్పినప్పుడు
మనము
వ్యావహారిక
శబ్దములను
ఉపయోగించవలసియుందును.
సృష్టికర్తగా,
లోక
పాలకునిగా
భావించినప్పుడు
బ్రహ్మమును
దైవము
అని
చెప్పుచున్నాము.
విశ్వమువైపునుండీ
మనము
కార్య
కారణ
విచారణ
చేయునపుడు,
కారణ
వస్తువు
దైవము
అని
భావించుచున్నాము.
కార్య
వస్తువు
జగత్తని
నిరూపించుచున్నాము.
విషయావిషయ
భేదములను
అతిక్రమించినపుడు
శుద్ధ
చైతన్యమనే
బ్రహ్మమునే
స్వరూప
లక్షణముగను,
తటస్థ
లక్షణముగాను
ద్వివిధ
లక్షణములుగాను
భావించుచున్నాము.
ఏలయన,
మాయా
సంబంధము
వలననే
బ్రహ్మము
జగత్తుయొక్క
ఉత్పత్తి,
స్థితి,
ప్రళయాదులకు
కారణమని
చెప్పుబడుచున్నది.
మరికొందరు
మాయ,
బ్రహ్మము
ఇరువురూ
కలసి
జగత్కారణమని
అందురు.
మరికొందరు
మాయ
ఒక్కటే
జగత్కారణమని
యందురు.
ఇంకా
కొందరు
జగత్తు
విష్ణువునుండి
యుద్భవించినది,
అతనియందే
ఉన్నది;
జగత్తుయొక్క
ఉత్పత్తి,
స్థితి,
లయములకు
విష్ణువే
కర్త
అని
అందురు.
ప్రపంచములో
ఏ
వస్తువుకానీ
కర్త
లేకుండా
నిర్మాణము
కాదు.
అయితే
ఆ
సృష్టికర్త
ఎట్టివాడై
యుండవలెను?
అనంతశక్తిమంతుడై,
మహిమాన్వితుడై,
సర్వజ్ఞుడై
ఉండవలెను.
అట్టి
పరమేశ్వరుని
కనుగొనుట
ప్రతివారికీ
సాధ్యము
కాదు.
అయితే
ప్రతివానికిది
కర్తవ్యము.
దీనికే
తటస్థ
లక్షణము,
స్వరూప
లక్షణములని
రెండు
కలవు.
తటస్థము
తాత్కాలిక
చిహ్నము.
ఇది
సరియైనది
4
▾
Meaning
Keep
కాదు.
అప్పటికప్పుడు
గుర్తింపజేయునది
మాత్రమే.
పోతే
స్వరూప
లక్షణము.
ఇది
సత్యస్వరూపము,
జ్ఞానస్వరూపము,
అనంతమైన
స్వరూపమును
తెలుపును.
లోకమున
ప్రతి
వస్తువునందును
అయిదు
లక్షణములు
కలవు.
అవి
అస్తి,
భాతి,
ప్రియం,
రూపము,
నామము.
ఒక
వస్తువు
'ఉన్నది'
అనునది
అస్తి
అనే
శబ్ద
లక్షణము.
ఆ
వస్తువు
ఉన్నట్లు
మనకు
కన్పింపజేయునది
ప్రకాశము.
కనుక,
ఆ
ప్రకాశింపజేయు
శక్తి
'భాతి'
అను
శబ్ద
లక్షణము.
ప్రతి
పదార్థమును,
మనయొక్క
వినియోగమును
బట్టి,
మనము
ఆ
వస్తువును
ప్రియముగా
చూతుము.
అట్టి
ప్రియమే
మూడవ
లక్షణమైన
ప్రీతిగా
చెప్పబడుచున్నది.
మిగిలిన
రూప
నామములున్నవి.
అవి
మార్పుచెందే
మాయా
రూపములు.
ఉండినట్లుండి
మార్పు
చెందును.
మార్పు
చెందినట్లు
తోచి
తిరిగి
స్వరూపమును
ధరించును.
దీనినే
మాయ
అని
యందురు.
ఇవి
కేవలము
ఆధేయములు
మాత్రమే.
నామ
రూపములు
అనేకము.
వాటిలో
అస్తి
భాతి
ప్రియ
నామ
రూపములతో
గోచరించు
భగవంతుడే
ఏకము.
అదే
సర్వ
వస్తువులకూ
ఆధారము.
మణులలో
దారము
చేరినట్లు.
మణులు
అనేకము,
దారము
ఏకము.
ఇదేరీతిగా
సమస్త
జీవకోటికి
ఆధారము,
శాశ్వతము
అయినది
పరబ్రహ్మమే.
భగవంతుని
స్వరూపము
నామ
రూపమునకంటే
భిన్నమైనది
కాదనియు,
అదియే
బ్రహ్మమనియు,
సోఽహం
అని
భావించుటలో,
పరమాత్ముని
స్వరూప
లక్షణము
ద్వారా
తెలుసుకొనుటయే
'బ్రహ్మవిద్
బ్రహ్మైవ
భవతి'
అని
శ్రుతి.
ఇదియే
స్వరూప
లక్షణము.
ప్రపంచ
ఉత్పత్తికి
బ్రహ్మయే
కారణము.
నీటిలో
పుట్టిన
నీటి
బుడగ
నీటియందే
ఉండి
నీటియందే
లయమగుచున్నది.
ఈ
దృశ్య
గోచరమగు
సమస్తము
నీటిబుడగలవంటివి.
అయితే
నీరు
బ్రహ్మము.
బ్రహ్మమను
నీరునుండే
నీటి
బుడగలు
పుట్టుచున్నవి
కదా!
నీటియందే
నిలిచియున్నవి
కదా!
తిరిగి
నీటిలోనే
చేరిపోవుచున్నవి.
ఉత్పత్తి,
స్థితి,
లయములకు
నీరే
ఆధారము.
నీరు
ఏకము,
బుడగలు
అనేకము.
నీరు
సత్యము,
బుడగలు
మిధ్యము.
నీరు
ఆధారము,
బుడగలు
ఆధేయము.
నీరు
సత్యము,
బుడగలు
మిధ్యము.
నీరు
ఆధారము,
బుడగలు
ఆధేయము.
5
▾
Meaning
Keep
ఈవిధమైన
అద్భుత
నిర్మాణమునకు
మనము
ఆశ్చర్యపడుదుము.
దేశ
కాలములయొక్క
కొంత
పురాతన
దశయందు,
అచేతన
ప్రకృతినుండే
జీవ
దృశ్య
ముద్భవించి
దైవిక
మానవులుగా
పరిణమించుట
మనము
నిత్య
జీవితములో
చూచుచునే
యున్నాము.
అధమమైనది
ఉత్కృష్టమైనదానికి
కారణము
వివరింపజాలదు,
అధమమైనదానికి
మాత్రము
కారణము
వివరింపగలదు.
అచేతన
పదార్థమునకు
మనస్సు
కారణమును
వివరించునుకాని
అచేతన
ప్రకృతి
మనస్సుకు
కారణము
వివరింపలేదు.
కాన
పరమాత్మ
తత్త్వమే
సర్వసృష్టికి
కారణమును
తెలుపును.
జగమున
సంభవించు
సంఘటనలను
పాలించుచున్న
నియతి,
ధర్మముల
ఉనికిని
గురించిన
వాదము.
అయితే
అట్టి
ఉనికి
స్వయం
ప్రమాణము
కాదు.
కాని
అవి
ఉన్నవని
భౌతిక
శాస్త్రము
మనకు
చెప్పుచున్నది.
మొదటి
సూత్రము
బ్రహ్మమును
నిర్దేశించుచున్నది.
రెండవ
సూత్రము
ఆ
బ్రహ్మమునే
మరొక
రూపమున
నిర్దేశించుచున్నది.
మొదటిది
సత్యము,
జ్ఞానము,
స్వాతంత్ర్యము.
రెండవది
బ్రహ్మయొక్క
సృష్టి
ముఖము.
సృజనాత్మకుడగు
భగవంతుని
ఏకాభివ్యక్తమగు
జగత్తునకే
దృష్టిని
పరిమితము
చేయరాదు.
ప్రతి
విషయమునకును
ధర్మము
ఒకటి
యున్నది.
విశ్వమున
తృణము
మొదలు
నక్షత్రముల
పర్యంతము
ప్రతి
విషయమునకును
ఈ
ధర్మము
అన్వయించును.
ప్రపంచము
నిరంతరావృత్తి
కాదు.
అది
పరిపూర్ణతాభిముఖముగ
కొనసాగిపోవుచున్నది.
ఇది
మారగలదు.
మానవులు
వివేకవంతులయినచో
ప్రస్తుత
స్థితికంటే
శుభ
స్థితి,
ఉన్నతస్థితికది
మారును.
జగత్తుయొక్క
శక్తులు
మనకు
ఆధారమై
నిలుచును.
జగత్తునకు
హేతుబద్ధమగు
ప్రతిక్రియ
లేదు.
సర్వస్తువునుగురించిన
హేతువాదము
లేదు.
అనుసరించుటకు
నైతిక
ధర్మము
లేదు.
సర్వగతమగు
భ్రాంతితో
జీవించుచున్నాము.
జన్మాద్యస్య
యతః
:
దృశ్య
కల్పితమైన
చరాచర
ప్రపంచమంతయు,
అదృశ్య
కల్పితమైన
చరాచర
ప్రపంచమంతయు
ఎవరివలన
ఉదయించుచున్నదో,
6
▾
Meaning
Keep
దేని
ఆధారమువలన
అభ్యుదయము
పొందుచున్నదో
అనగా
రక్షింపబడుచున్నదో,
చివరకు
దేనిలో
లయమగుచున్నదో
అదే
బ్రహ్మయని
తెలుసుకొనవలెను.
దీనినే
తైత్తిరీయోపనిషత్తులో
'యతో
వా
ఇమాని
భూతాని
జాయంతే,
యేన
జాతాని
జీవంతి,
యత్ప్రయంత్యభిసంవిశంతి
తద్విజిజ్ఞాసస్వ,
తద్బ్రహ్మేతి'
అన్నారు.
అనగా
దేనినుండి
సమస్త
భూతములు
పుట్టుచున్నవో,
వృద్ధి
చెందుచున్నవో
చివరకు
దేనియందు
లయమందుచున్నవో
అది
బ్రహ్మము
అని.
అద్వైతులలో
బ్రహ్మమునుగురించి,
బ్రహ్మముయొక్క
కారణత్వమును
గురించి
తీవ్రమైన
వాదోపవాదములు,
భేదములు
ఉదయించినవి.
కొందరు
బ్రహ్మమే
కారణమనియు,
మరికొందరు
మాయయే
కారణమనియు,
మరికొందరు
మాయా
బ్రహ్మములిరువురూ
కారణమనియు,
మరికొందరు
జగము
విష్ణువు
నుండి
ఉద్భవించినదనియు,
అతనియందే
లయమొందుచున్నదనియు,
అతని
చేతనే
రక్షింపబడుచున్నదనియు
తెలిపిరి.
ఇంకా
కొందరు
బ్రహ్మ
లక్షణము
తటస్థ
లక్షణముగా
నిరూపించిరి.
బ్రహ్మకు
అనంత
గుణములు
కలవనియు,
అందులో
తటస్థ
లక్షణము
ఒకటనియు.
ఇంకా
కొందరు
పదార్థ
ప్రపంచమునకు
మనసే
కారణమనియు,
అచేతన
ప్రకృతి
మనస్సునకు
కారణము
వివరింపజాలదనియు,
పరతత్త్వమే
సర్వసృష్టికి
కారణమనియు
తెలిపిరి.
ఇవన్నియూ
వారివారి
ఊహాగానములే.
ఇవి
కేవలము
మేధాశక్తి
సామర్థ్యములతో
ఊహింపబడినవి
మాత్రమే.
విజ్ఞాన
శాస్త్రజ్ఞులు
తమ
పరిశోధనలచే
అనేక
విధములై
ఫలితములను
గుర్తించి
అందులో
కాలము
జగత్తు
ఉత్పత్తికి
కారణమని,
స్థితి
లయములన్నియు
కాలాధీనములని
తలంచిరి.
కొందరు
స్వభావమే
కారణమని
కూడా
అందురు.
అనగా
వస్తువులో
ఎట్టి
స్వభావమున్న
శక్తి
ఉంటుందో
దానిని
అనుసరించి
ఉత్పత్తి
కలుగునని.
ఉదాహరణకు,
మామిడి
విత్తనము
నాటిన
మామిడి
చెట్టే
మొలుచును.
పులి
గర్భమున
పులి
పిల్లే
పుట్టును
కాని
మేకపిల్ల
పుట్టదు.
ఈవిధముగా
ప్రపంచోత్పత్తికి
భిన్నభిన్నములైన
కారణములు
కలవని
7
▾
Meaning
Keep
మరికొందరు.
సృష్టి
ఉత్పత్తినిగురించి
ఈవిధముగా
అనాది
కాలమునుండి
వాదోపవాదములు
జరుగుచునే
వచ్చుచున్నవి.
నేటికికూడా
సృష్టికి
కారణము
ఇట్టిదని
ఎవ్వరూ
నిర్ణయించలేకపోతున్నారు.
ఈ
చిత్ర
విచిత్రమైన
అద్భుత
జగత్తును
చూచిన
ఎట్టివానికైనను
ఆశ్చర్యము
కలుగకమానదు.
ప్రపంచములో
ఏ
వస్తువునుకానీ
నిర్మింపవలెనన్న
కర్త
ఉండియే
తీరవలెను.
కర్తలేని
నిర్మాణము
కలుగబోదు.
అయితే,
మనకు
కనిపించే
అనంత
నిర్మాణములో
సూర్యచంద్రాదులు,
నక్షత్ర
మండలాలు,
వాటి
కాంతులు,
కాలగతులు
ఇవన్నియు
కర్త
లేకుండా
ఎట్లు
వ్యవహరించుచున్నవి?
ఇవి
సామాన్య
శక్తులకు
సాధ్యమగునవా?
సృష్టింపబడిన
సృష్టికే
మానవాతీతమైన
అద్భుత
శక్తులుండగా
ఇక
సృష్టించిన
కర్త
ఇంకెంతటి
శక్తిమయుడో
విజ్ఞులైనవారు
విచారించవచ్చును.
సృష్టియొక్క
చిత్రము
అతి
విచిత్రమైనది.
ఒకదానికి
మరొకదానికి
పోలిక
లేదు.
ఒకరికి
మరొకరికి
పోలిక
లేదు.
ఇది
ఒక
అనంత
మహిమాన్వితుడైన
భగవంతుని
లీల
తప్ప
అన్యము
కాదని
ఎట్టివానికైనా
తెలియకపోదు.
సృష్టిని
బట్టి
సృష్టికర్త
ఎంతటివాడో
సులభంగా
ఊహించవచ్చును.
సృష్టిని
అర్థం
చేసికొనలేనివారు
సృష్టికర్తను
అర్థం
చేసికొనలేరు.
సృష్టియనగా
బ్రహ్మేచ్ఛకు
ప్రకటనే.
అంతా
ఈశ్వర
సంకల్పమే.
పై
వాదోపవాదములు
కాలమును
వ్యర్థము
చేయు
క్రియలని
చెప్పవచ్చు;
లేక
మేధావుల
ప్రదర్శనలని
విశ్వసించవచ్చు;
పండితుల
ప్రజ్ఞాన
ప్రదర్శనలకు
గుర్తులని
భావించవచ్చు.
విజ్ఞుల
కసరత్తులు,
చిత్తశుద్ధి
కలవారికి
ఇవి
తృప్తి
నందించవు.
దైవేచ్ఛనే
సమస్తమునకు
కారణమని
ఆస్తికుల
నిజ
విశ్వాసము.
వారివారి
స్థాయినిబట్టి
వారివారి
నిర్ణయాలు
సూత్రమున
ప్రకటించటం
జరిగినది.
ఆకాశమున
ఎగురు
పక్షులు
తమతమ
శక్తిని
బట్టి
ఒక్కొక్క
అంతస్తును
చేరుచుందును.
అటులనే
వారివారి
విశ్వాసమును,
తెలివితేటలను
ఆధారము
చేసుకొని
సృష్టి,
స్థితి,
లయములకు
ఆధారములను
నిర్ణయించుచూ
వచ్చిరి.
తటస్థ
లక్షణమును
కొంతవరకు
మాత్రమే
ఆధారము
చేసుకొనవచ్చును.
స్వరూప
లక్షణము
సత్య
లక్షణము.
అదే
సత్యం
జ్ఞాన
మనంతం
బ్రహ్మ.
బ్రహ్మ
8
▾
Meaning
Keep
స్వరూపము
సత్యమైనది,
జ్ఞానస్వరూపమైనది,
అనంతమైనది.
ప్రపంచములోని
ప్రతి
వస్తువునందును
ఈ
లక్షణములు
ఇమిడియున్నవి.
తటస్థ
లక్షణమనగా
తాత్కాలికముగా
ఉన్న
గుర్తును
ఆధారము
చేసుకొని
-
అనగా
ఇతర
వస్తువులకు
లేక
ఇతర
వ్యక్తులకు
ప్రత్యేకముగా
తాత్కాలిక
గుర్తులను
చూపి
నిరూపించునట్టి
దానిని
తటస్థ
లక్షణమందురు.
ఉదాహరణకు,
అందని
చందమామను
వ్రేలితో
చూపినట్లు.
అదిగో,
ఆ
చెట్టుకొస
కొమ్మపైనున్న
నక్షత్రము
ఫలానా
నక్షత్రము
అని
అందుము.
చెట్టు
ఎక్కడ,
నక్షత్రమెక్కడ?!
అది
తాత్కాలికముగా
ఆ
కొమ్మ
దగ్గర
ఉన్నట్లుగా
కనిపించును.
తదుపరి
అది
మార్పుచెందును.
మనము
చూచునప్పుడు
అప్పటికప్పుడు
ప్రమాణమును
నిరూపించును
కాని
అది
శాశ్వత
ప్రమాణము
కాదు.
అట్టిదానిని
తటస్థ
లక్షణమని
అందురు.
స్వరూప
లక్షణము
అట్టిది
కాదు.
ప్రతిదానియందు
శాశ్వతమైనదై
ఉండును.
రూపనామములు
మారినను,
దేశ
కాలములు
మారినను,
స్వరూప
లక్షణములు
మారవు.
వాటినే
అస్తి,
భాతి,
ప్రియమని
కూడా
వేదాంత
పరిభాషలో
ప్రయోగింతురు.
వస్తువు
ఉన్నది.
ఎట్లు
ఉన్నది
అని
కాదు.
ఏమి
ఉన్నది
అని
కాదు.
ఒక
వస్తువు
ఉన్నది
అనునది
'అస్తి.'
అయితే
ఆ
వస్తువు
ఉన్నట్లు
మనకు
తెలుపవలెను.
అది
ప్రకాశముద్వారా
నిరూపించును.
ప్రకాశమే
లేకున్న
ఆ
వస్తువు
ఉన్నట్లు
మనకు
తెలియదు.
కాన
తెలుపునట్టి
ప్రకాశమే
'భాతి'
అని.
అట్టి
వస్తువును
మన
ప్రయోజన
నిమిత్తము
ప్రీతింతుము,
ఇష్టపడుదుము.
ఆ
ఇష్టమునే
ప్రియమని
అందుము.
పై
తెలిపిన
"అస్తి,
భాతి,
ప్రియము"
-
ఈ
మూడు
భగవంతుని
లక్షణములు.
వీటిని
ఆధారము
చేసుకొని
రూపములు
ఏర్పడును.
రూపమును
ఆధారము
చేసుకొని
నామము.
ఈ
రూప
నామములు
మారునవి.
కనుక,
వీటిని
మాయా
తత్త్వములని
పిలుతురు.
అన్నింటికి
ఆధారము
పరమాత్మయే.
మిగిలినవన్నియు
ఆధేయములు.
ఆధేయములు
మార్పు
చెందు
రూప
నామములు.
ఇవి
తటస్థ
లక్షణములు.
మారని
పరమాత్మ
స్వరూప
లక్షణము.
స్వరూప
లక్షణములద్వారానే
తెలిసికొనవలెను.
దీనినే
'బ్రహ్మవిద్
బ్రహ్మైవ
భవతి'
అని
Previous
←
Now, Therefore, the Inquiry into Brahman
Next
Because Scripture Is the Source
→