Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sūtra Vāhini · Because Scripture Is the Source
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
శ్రుతి
తెలుపుచున్నది.
అయితే
ఆధార
ఆధేయములకు
రెండింటికీ
పరబ్రహ్మయే
కారణము.
బ్రహ్మను
జిజ్ఞాసద్వారా
అవగతము
చేసుకొన్న
జీవితము
ధన్యము.
'సత్యం
జ్ఞానమనంతం
బ్రహ్మ'.
ఈ
మూడు
లోకాల్లో
నిలువగలిగిన
అనంతమైన
జ్ఞానము
బ్రహ్మ.
బ్రహ్మమునుండి
ఆకాశము,
ఆకాశమునుండి
వాయువు,
వాయువునుండి
అగ్ని,
అగ్నినుండి
జలము,
జలమునుండి
పృథ్వి,
పృథ్వినుండి
ఓషధులు,
ఓషధులనుండి
అన్నము,
అన్నమునుండి
పురుషుడు.
ఈవిధముగా
సృష్టి
క్రమమే
కొనసాగివచ్చియున్నది.
మొదటిది
బ్రహ్మ.
చివరిది
పురుషుడు.
పురుషునకు
బ్రహ్మకు
సంబంధం
సన్నిహితమై
ఉన్నది.
శాస్త్రయోనిత్వాత్
శాస్త్రములు
మహా
పురుషుల
పరిశోధనలచే
లభించిన
సత్యసూక్తులు.
(భగవంతుని)
ఉచ్ఛ్వాస
నిశ్వాసలు.
పురుషులచేత
కల్పితముకాని
అశరీర
వాణులు.
కనుకనే,
ఇవి
అపౌరుషేయములనియు,
శాశ్వతములైనవనియు
చెప్పబడుచున్నవి.
వీటికి
కర్త
బ్రహ్మనే.
వేదమనగా
జ్ఞానము.
ఇది
అనాది,
అనంతము.
'అనంతోవై
వేదః'
ఇది
శబ్దస్వరూపమైనది.
ఇది
కేవలము
భావమును
ఆశ్రయించి
మాత్రమే
ఉండునది
కనుక
అద్భుతమైనదనికూడా
అందురు.
ఇట్టి
వేదములకు
కర్త
అయినవాడగుటచే
బ్రహ్మ
సర్వజ్ఞుడనియు,
సర్వశక్తివంతుడనియు,
సర్వవ్యాపకుడనియు
తెలుపబడెను.
'శాస్త్రయోనిత్వాత్'
అను
సూత్రము
బ్రహ్మను
తెలుసుకొనుటకు
వేదము
కారణమనియు,
వేదముద్వారానే
బ్రహ్మమును
తెలుసుకొనగలమనియు,
సర్వవేదములచేత
బ్రహ్మ
వేద్యమవుతాడనియు
అర్థమును
వివరించుచున్నది.
ఇంతేకాక,
దేనికి
శాస్త్రము
ప్రమాణమో
అదే
బ్రహ్మ
అనియు,
బ్రహ్మమే
వేదమునకు,
ప్రమాణమునకు
కారణమనియు
అర్థములున్నవి.
సర్వజ్ఞుడు
తప్ప
ఇతరులెవ్వరూ
వేదమునకు
కారణము
కాజాలరనియు
తెలుపుచున్నది.
బ్రహ్మ
జ్ఞానమునకు
శాస్త్రమే
కారణమని
కూడా
అర్థమును
తెలుపుచున్నది.
మానవుని
జీవితాన్ని
నియమబద్ధమొనరించి,
కాపాడునది
లేక
పాలించునదిగా
2
▾
Meaning
Keep
తెలుపుచున్నది.
వేదములు
ఆప్త
వచనములు,
బ్రహ్మ
ప్రాప్తి
పొందిన
మహనీయులు
సూక్తులు.
బ్రహ్మము
ఎట్టి
ప్రమాణములకూ
చిక్కనివాడు
కనుక
అతనిని
అప్రమేయుడని
కూడా
పిలుతురు.
ప్రమాణము
అనగా
ముందు
కొలత.
అతనిని
దేనిచేతనూ
నిర్ణయించుటకు
వీలుకాదు.
కొలబద్దలకు
చిక్కనివాడు.
అట్టి
బ్రహ్మకు
శాస్త్రమే
ప్రమాణము.
ప్రత్యక్ష
అనుమాన
ప్రమాణములు
బ్రహ్మను
నిరూపించజాలవు.
శాస్త్రము
అంటే
విస్మరణమైనదానిని
స్మరణకు
తెచ్చునది
అని
అర్థము.
బ్రహ్మ
ప్రతి
మానవుని
స్వరూపమై
యున్నాడు.
ప్రతి
మానవుని
శాస్త్రము
శాసించుచున్నది.
అయితే,
మానవుడు
మాయకు
లొంగి
మమత్వములో
పడి
తమస్సున
తన్మయత్వమును
పొందియున్నాడు.
అయినా
శాస్త్రము
తల్లివంటిది
కనుక,
అతనిని
విడువక,
వెంటపడి,
అతనిని
ఉద్ధరించవలెనని
తలంచి
లక్ష్యమును
స్ఫురింపజేయుచున్నది.
అగమ్యగోచరమైన,
అప్రమాణమైన,
అనిర్వచనీయమైన
పరబ్రహ్మను
తెలుపుటకు
శాస్త్రము
కారణమైనదగుటచే
'శాస్త్రయోనిత్వాత్'
అని
నిరూపించుచున్నది
సూత్రము.
ఈ
శాస్త్రము
అనంతము.
తెలుసుకొనుటకు
ఆయువు
తక్కువ.
విజ్ఞానము
అనంతము.
సందేహములు
సంఖ్యాతీతం,
శ్రద్ధ
అల్పం.
కనుక,
అన్నింటినీ
తెలుసుకొన
నెవరి
తరమూ
కాదు.
సముద్రమును
పూర్తిగా
గ్రోలి
రుచి
చెప్పలేము.
అందులోని
ఒక
బిందువు
రుచి
చూచి
సముద్రముయొక్క
రుచిని
నిరూపించినట్లు,
శాస్త్రమును
పూర్తిగా
తెలుసుకొనుట
అసాధ్యము
కనుక,
అందులోని
ప్రధాన
సారమును
అర్థము
చేసుకొని
గ్రహించి
ఆచరించుటకు
ప్రయత్నించిన
చాలును.
అదే
దైవచింతన.
ప్రహ్లాదుడు
తండ్రియైన
హిరణ్యకశిపునకు
తెలిపినాడు.
ఏమని?
"నాయనా
ప్రహ్లాదా!
నీవు
చదివినది
నాకు
వినిపించి
నన్నానందపరచుమ"ని
హిరణ్య
కశిపుడు
ముద్దిడి
కోరగా
-
"చదువులలో
మర్మమెల్ల
చదివితి
తండ్రీ"
అన్నాడు.
ఆ
చదువు
మర్మమేమిటో
తెలుపమని
మరీ
కోరగా,
"తండ్రీ!
సర్వమును
వెలిగింపజేయువాడు,
సర్వమును
సృష్టించువాడు,
పోషించువాడు,
కడకు
తనలోనే
3
▾
Meaning
Keep
చేర్చుకొనువాడు
ఒకడే.
అట్టి
నారాయణుని
చింతించి
అనుభవించుటే
నిజమైన
సార్థకత"
అని
నారాయణ
నామాన్ని
ఉచ్చరించినాడు.
అంతటితో
విడువక,
"తండ్రీ!
లోకాలన్నీ
జయించినావు.
కాని,
నీ
ఇంద్రియాలను
స్వాధీనమునందుంచుకోలేదు.
అట్టి
నీకు
నారాయణుని
అనుగ్రహమెట్లు
చిక్కును?
ఈ
లౌకిక
విద్యలన్నియు
మాయా
విద్యలు.
బ్రహ్మవిద్యనే
నిజవిద్య"
అని
తెలిపినాడు.
పురుషుడు
అన్నసారమే.
ఏతావాతా
మానవ
శరీరము
అన్నమయం
కాదు.
అన్నము
స్థూలమయిన
స్థానము.
దానికంటే
సూక్ష్మమైనది
ఒకటున్నది.
అదే
ప్రాణము.
దానికంటే
సూక్ష్మమైనది
మనస్సు.
మనసుకంటే
సూక్ష్మమైనది
జ్ఞానము.
జ్ఞానముకంటే
మరింత
సూక్ష్మమైనది
ఆనందం.
మానవుని
శరీరమునందే
పై
అయిదు
కోశములు
ఇమిడియున్నవి.
కాని,
చివరిదైన
ఆనంద
స్థాయికి
మానవస్థాయి
చేరినప్పుడే
బ్రహ్మతత్త్వమును,
బ్రహ్మస్వరూపమును
చేరగలడు,
చెందగలడు.
దీనికి
చక్కని
అనుభవము
కలదు.
తైత్తిరియోపనిషత్తునందు
బ్రహ్మానందవల్లి
తరువాత
భృగువల్లి
ఆరంభమున,
వరుణుడు
తన
కుమారుడైన
భృగువునకు
బ్రహ్మ
పదార్థాన్ని
గురించి
చెప్పవలసి
వచ్చినప్పుడు,
"నాయనా
భృగూ!
బ్రహ్మ
పదార్థమును
కన్నులతో
చూడలేరు,
చెవులతో
వినలేరు.
దేని
ఆధారముతో
కన్నులు
చూడగలుగుచున్నవో,
దేని
ఆధారముతో
చెవులు
వినగలుగుచున్నవో
అదే
బ్రహ్మము.
దీనిని
తపస్సు
చేసి
తెలిసికొనవలసినదేకాని,
అన్య
పరిశోధనలకు
వీలుకాద"ని
అన్నాడు.
అంతటితో
విడువక,
"నాయనా!
భృగూ!
ప్రపంచములోని
సమస్త
పదార్థములు,
సమస్త
జీవులు
దేనివలన
పుట్టుచున్నవో,
దేనివలన
అభివృద్ధి
చెందుచున్నవో
కడకు
దేనిలో
లయమగునో
అది
బ్రహ్మ.
అది
ఏదో
దానిని
తపస్సుద్వారా
కనుగొనుమని
కొన్ని
ఆధారములు
మాత్రము
తెలిపి
మిగిలినది
అనుభూతిలోనే
అర్థము
చేసుకొనవలెనుకాని,
అన్యసాధనలచే
తెలియబడద"ని
చెప్పెను.
తండ్రి
అయిన
వరుణుని
మాటలను
ఆధారము
చేసికొని
భృగువు
తపస్సున
నిష్ఠుడాయెను.
4
▾
Meaning
Keep
ఆవిధంగా
తీవ్ర
తపస్సు
చేసి
,
విచారణ
సలిపి
,
తన
అప్పటి
స్థాయికి
తగినట్లు
అన్నమే
బ్రహ్మ
అని
నిర్ణయించుకొని
తండ్రి
దగ్గర
చేరగా
అది
సరియైనదికాదని
,
మరికొన్ని
దినములు
నిశ్చలుడవై
తపస్సాచరించమని
పంపుతాడు
వరుణుడు
.
భృగువు
తిరిగి
తపస్సు
చేసి
ప్రాణము
బ్రహ్మ
,
ప్రాణమే
లేకున్న
అన్నము
ఉండియు
ప్రయోజనమేమి
?
పుట్టుకకు
,
అభివృద్ధికి
,
నశించుటకు
ప్రాణమే
కారణము
.
కనుక
,
ప్రాణమే
బ్రహ్మ
అని
నిర్ణయము
చేసికొని
తండ్రి
దగ్గరకు
చేరినాడు
.
తండ్రి
అదియును
సరికాదని
తెలిపి
తిరిగి
తపస్సుకు
పంపెను
.
ఈవిధముగా
మూడవ
పర్యాయము
మనస్సనియు
,
నాలుగవ
పర్యాయము
విజ్ఞానమనియు
,
ఐదవ
పర్యాయము
ఆనందము
బ్రహ్మమనియు
తెలుసుకొన్నాడు
.
ఆనందమే
బ్రహ్మ
అని
తెలుసుకొన్న
తరువాత
భృగువు
తండ్రి
దగ్గరకు
రాలేదు
.
ఆనందములో
తన్మయుడై
ప్రపంచమునే
మరచియున్న
భృగువును
తండ్రియే
వెళ్లి
చూసి
,
"
నాయనా
!
ఇప్పుడు
నీవు
బ్రహ్మను
కనుగొంటివి
,
బ్రహ్మను
చేరితివి
,
ధన్యుడవు
"
అని
కుమారుని
వర్ణిస్తాడు
.
మానవుడు
ముందు
అన్నజీవి
అయినా
కడకు
ఆనందజీవిగా
మారతాడు
.
ఒక్క
మానవులకే
కాదు
,
సమస్త
ప్రాణికోటికీ
ఆనందము
అత్యవసరము
.
ఎవరు
ప్రయత్నించినా
,
ఏ
పనిచేసినా
ఆనందమును
ఆశించుచున్నారు
.
ఆనందమునందే
పుట్టుచున్నారు
,
ఆనందంకోసం
జీవించుచున్నారు
,
ఆనందం
కోసం
మరణించుచున్నారు
.
పుట్టి
పెరిగి
గిట్టుటకు
ఆనందమే
ఆధారమని
తైత్తిరీయోపనిషత్తు
వివరించుచున్నది
.
అయితే
ఆనందం
బ్రహ్మ
ఎట్లు
కాగలదు
?
"
ఓమిత్యేకాక్షరం
బ్రహ్మ
"
అను
వాక్యము
ననుసరించి
ఓంకారమే
బ్రహ్మ
.
ఈ
చరాచర
ప్రపంచమంతయూ
ప్రణవముతో
నిండియుండుటచేత
,
ప్రపంచమంతయూ
బ్రహ్మమయము
.
ప్రణవమయమయిన
జగత్తు
బ్రహ్మమయమని
చెప్పవచ్చు
.
తరువాత
"
అయమాత్మా
బ్రహ్మ
"
అని
.
ఆత్మతత్త్వము
బ్రహ్మ
పదార్థమే
అయివున్నది
.
ఆత్మకూ
బ్రహ్మకూ
ప్రణవానికీ
అభేదం
.
ఇవి
అవినాభావ
సంబంధమైనవి
.
ఆత్మతత్త్వమే
బ్రహ్మ
పదార్థము
అని
అనుభవములో
తెలుసుకోవటమే
బ్రహ్మవిద్య
.
బాహ్య
ప్రపంచానికి
,
అంతర్జగత్తుకు
అవినాభావ
సంబంధం
ఉందనే
విషయాన్ని
సూత్రము
తెలుపుతుంది
.
Previous
←
That from Which This World Is Born
Next
But That, on Account of Coordination
→