Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sūtra Vāhini · But That, on Account of Coordination
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
సర్వవేదాంత
వాక్యముల
తాత్పర్యము
బ్రహ్మయే
యని
ప్రకటితమగుచున్నది
.
శ్రుతి
వాక్యముల
సమన్వయమువలన
బ్రహ్మము
తెలియబడుచున్నది
.
అంతేకాదు
.
శాస్త్రము
కర్మ
ప్రతిపాదకమా
?
జ్ఞానప్రతిపాదకమా
?
అనునదే
ప్రధానమైన
ప్రశ్న
.
బ్రహ్మ
రహస్యము
ఇతరులకు
అందజేయుటకు
సాధ్యము
కానిదైననూ
,
ఏదో
ఒక
విధమైన
జ్ఞాన
విధానము
లేకున్న
అది
నిగూఢము
కాగలదు
.
వేదములు
కర్మార్థకములనియు
,
వేదాంతములు
కర్మార్థకములు
కావనియు
పూర్వపక్ష
వాదము
.
కర్మచే
మానవుడు
అనేక
విధములైన
పుణ్యములు
చేసుకొని
చిత్తశుద్ధి
గావించుకొంటాడు
;
తనను
శుద్ధి
చేసినది
కర్మ
కావున
శాస్త్రము
కర్మ
ప్రతిపాదకమే
అని
మరికొందరి
వాదము
.
కాని
,
ఇక్కడ
మనము
గమనించవలసినది
మరొకటున్నది
.
మానవుల
కోరికలు
,
వాంఛలు
,
సంకల్పాలు
,
అభీష్టాలు
కర్మ
ప్రేరితములు
.
ఇవి
అన్నియూ
అజ్ఞానమువలన
కలుగుచున్నవి
.
అట్టితరి
అజ్ఞానము
జ్ఞానము
నేరీతిగా
చేకూర్చును
?
చీకటి
చీకటిని
దూరము
చేయలేదు
కదా
!
అటులనే
అజ్ఞానము
అజ్ఞానమును
యేరీతిగా
పోగొట్టగలదు
?
ఇది
అసాధ్యము
.
అందువలన
ఆత్మబోధతో
అనగా
జ్ఞానముచేతనే
అజ్ఞానమును
పోగొట్టుకొనవచ్చును
-
అని
శంకరులవారి
వాదము
.
సమన్వయము
ప్రపంచమున
యెంత
అవసరమో
జ్ఞానమునకు
సహితము
అంత
అవసరం
.
బ్రహ్మ
విషయము
ఇతరులకు
అందజేయటమంటే
అంత
సులభము
కాదు
.
బ్రహ్మవిద్యా
ఫలమునకు
,
కర్మఫలమునకును
మధ్య
భేదము
కలదని
చెప్పబడినది
.
పుణ్య
,
అపుణ్యములకు
సుఖ
దుఃఖములు
ఫలితములు
.
మనుష్య
లోకమునుండి
బ్రహ్మలోకమువరకు
సుఖ
తారతమ్యములున్నవి
.
అటులనే
మనుష్య
లోకమునకు
క్రిందుగా
నరకలోకమనియు
,
అది
దుఃఖములతో
కూడినదనియు
అనే
తారతమ్యములున్నవి
.
అయితే
అవన్నియు
ఉత్పత్తి
వినాశములచే
కూడినవే
.
అట్లయిన
ఆత్మజ్ఞానము
స్వభావ
సిద్ధముగా
నిత్యము
,
సత్యము
.
ఇది
ఉపాసన
విషయమగు
విధి
ఫలము
కాదు
.
మోక్షావస్థ
2
▾
Meaning
Keep
శరీరమునకు
అతీతమైనది
.
అశరీరత్వము
మోక్ష
స్వభావమయినచో
,
ఇది
సాధించవలసినది
కాదు
.
జ్ఞానముదయించిన
తక్షణమే
అజ్ఞానమంతరించును
.
దీపము
వెలిగించిన
తక్షణమే
చీకటి
ఉండదు
కదా
!
బ్రహ్మజ్ఞానము
పురుష
ప్రయత్నమున
లభించునది
కాదనుట
అంత
సమంజసము
కాదు
అని
కొందరి
వాదము
.
అయితే
దీనిని
శంకరులవారు
సమన్వయపరిచిరి
.
ఇది
,
అనగా
జ్ఞానము
,
స్వభావసిద్ధముగా
అందరికీ
అంతర్లీనమై
ఉన్నది
.
అయితే
కర్మకాండవలనగానీ
,
లేదా
విచారణవలనగానీ
అది
అధిగతమగునది
కాదు
అని
నిర్ణయించిరి
.
కర్మ
అవిద్యతో
విరోధము
లేనిది
.
కావున
కర్మ
అవిద్యను
దూరము
చేయజాలదు
.
అయితే
జ్ఞానము
అవిద్యను
దూరము
చేయగలదు
.
కేవలము
కర్మచేత
మానవునకు
ముక్తి
లభించదనియు
,
కర్మచేత
చిత్తశుద్ధి
కలుగదనియూ
ప్రమాణమును
తెలుపుచున్నది
.
కర్మచేత
జీవుడు
బంధమునకు
గురికాగలడు
.
విద్యచేత
విముక్తుడు
కాగలడు
.
అందువలన
కర్మయందు
ఆసక్తులు
కారాదని
తెలియవచ్చును
.
అయితే
,
శాస్త్రము
ఒక్కొక్క
దగ్గర
కర్మనుకూడా
బోధించుచున్నది
.
శాస్త్రము
తల్లి
వంటిది
.
బిడ్డల
యోగ్యతలనుబట్టి
తగినరీతిగా
,
సమయ
సందర్భములలో
వారికి
బోధించును
.
ఇద్దరు
బిడ్డలున్న
తల్లి
,
ఒకనికి
పూర్ణ
ఆరోగ్యమునూ
,
మరొకనికి
అజీర్ణ
రోగమునూ
సంభవించినపుడు
తల్లి
ఆరోగ్యవంతున
కడిగినవన్నీ
అందిస్తుంది
.
అయితే
అజీర్ణ
రోగముగల
బిడ్డకు
పథ్యము
పెట్టి
అధికంగా
తిననివ్వకుండా
చూచుకొంటుంది
.
అట్లు
చేయుటచే
తల్లికి
ఒక
బిడ్డపై
ప్రేమ
,
మరొక
బిడ్డపై
ద్వేషమా
?
కాదు
.
అదేవిధముగా
శాస్త్రముకూడా
కర్మ
రహస్యము
తెలుసుకొన్నవారికి
కర్మ
విధానమును
తెలుపుతుంది
.
కారణము
?
జీవితాన్ని
బాగుపరచుకొనుటలో
కర్మ
చాలా
ఉపయోగపడుతుంది
.
కర్మను
సత్
కర్మగా
మార్చుకొనే
తెలివితేటలు
అందరికీ
ప్రధానము
.
అయితే
అదే
సర్వస్వము
కాదు
.
మానవ
జీవితం
క్షణ
భంగురము
;
నీటి
బుడగవంటిది
.
ఆశా
సౌధమును
ఆ
నీటి
బుడగవంటి
జీవితముపై
నిర్మించుకోరాదు
.
ఏ
నిమిషము
కూలునో
,
క్రింద
రాలునో
అని
హెచ్చరిస్తుంది
జ్ఞానము
.
అశరీరము
అయిన
పరమాత్మ
3
▾
Meaning
Keep
శరీరమునందు
కూడా
ఉన్నాడు
.
స్థూలంగా
దేహం
అన్నమయం
;
దానిలోనే
ప్రాణమయం
,
మనోమయం
,
విజ్ఞానమయం
,
ఆనందమయములను
సూక్ష్మ
దేహములున్నవి
.
ఇది
ఒకదానికంటే
ఒకటి
సూక్ష్మమయి
ఉన్నవి
.
అయితే
అన్నమయ
దేహాన్ని
ఆధారము
చేసుకొని
ఆనందమయ
స్వరూపమునకు
ప్రయాణము
చేయించునదే
విచారణ
అని
ఈ
సూత్రము
తెలుపుచున్నది
.
అయితే
ఒకటి
స్థూలము
,
రెండవది
మూలము
.
ఒకటి
ఆధేయము
,
మరొకటి
ఆధారము
.
మానవజాతియొక్క
జీవన్మతమునకు
నేడు
సమన్వయమెక్కడా
కనిపించుట
లేదు
.
సామరస్య
సిద్ధాంతములు
విస్తరింపజేయవలెను
.
మతములు
వేరు
వేరు
పేర్లతో
ఉన్నను
,
సిద్ధాంతములు
వేరువేరయిననూ
వాటిని
పాటించక
మానవుడిగా
విచారించిన
అందరూ
మానవులేనన్న
విషయాన్ని
సూత్రము
సమన్వయింప
ప్రయత్నించెను
.
దురదృష్టవశమున
మతమునందలి
పరస్పర
విరోధములు
మానవ
మైత్రి
,
అంతర్జాతీయ
సోదరత్వమునకు
అవరోధము
కలిగించుచున్నవి
.
జగత్తుయొక్క
అంతరార్థమునుగురించి
తమ
జ్ఞానము
ప్రకటించిన
మహాద్రష్టలయొక్క
అనుభవములను
,
భావములనూ
,
ఈనాటివారు
అంగీకరించుటలేదు
.
అంగీకరించినచో
,
కొన్ని
మత
సిద్ధాంతములు
తప్ప
మిగిలినవన్నియు
సమన్వయత్వమును
స్పష్టీకరించుచున్నవి
.
వివిధ
మతములందు
,
వివిధ
నియమములందు
ఒకే
భగవంతుడు
వ్యవహరింప
బడుతున్నాడు
.
వివిధ
యుగములలో
వివిధ
జాతులకొరకు
వివిధ
ప్రవక్తలను
భగవంతుడే
పంపినట్లు
సమన్వయపరచుచున్నవి
అనేక
మతములు
.
నేడు
మత
పరిస్థితులు
ప్రపంచ
వ్యాప్తములగుటవలన
జీవన్మతముల
మైత్రీ
భావము
ప్రామాణికతనూ
సామరస్యము
లేక
సమన్వయము
కలుగవలసియున్నది
.
మహానీయులందరూ
పరమాత్మ
ప్రతిరూపములు
.
పరమాత్మయందు
వారందరూ
ఒక్కటే
జాతి
,
ఒక్కటే
దేశము
.
ఆచారములు
,
విశ్వాసములు
మొదలైనవానిద్వారా
,
ఎవరి
మత
ధర్మములు
వారు
ఇతరులకు
తెలియజేయవలసియున్నను
,
అప్పుడే
పరమాత్మ
సాన్నిధ్యమును
,
చిత్తశుద్ధితో
,
నిండు
హృదయముతో
సమన్వయ
పరచవచ్చును
.
సర్వధర్మ
హృదయమే
ఈ
సమన్వయ
తత్త్వము
.
Previous
←
Because Scripture Is the Source
Next
Because of Seeing, Not by the Word Alone
→