Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sūtra Vāhini · Because of Seeing, Not by the Word Alone
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
వేదము
బ్రహ్మమే
జగత్కారణమని
చెప్పుచున్నది
కాని,
అచేతనమునుగురించి
చెప్పుట
లేదు.
అది
యెట్లనిన,
సద్
వస్తువు
జగత్కారణమగు
సంకల్పము
చేసెనని
ఆ
వేదము
చెప్పుచున్నది.
సంకల్పములు
చేయుట
చేతనముల
పనికానీ,
అచేతనముల
పనికాదు.
కావున,
జ్ఞాన
స్వరూపుడైన
బ్రహ్మమే
జగత్కారణము
కాని,
అచేతనము
కాదు.
వేదము
అప్రధానము
గురించి
చెప్పుట
లేదని
ఈ
సూత్రము
స్పష్టపరచుచున్నది.
దేనియందు
నామ
రూప
వినిర్ముక్తమగు
జగత్తుందునో
దానినే
కొందరు
మాయ
అనియు,
మరికొందరు
అణువు
అనియు,
ఇంకా
కొందరు
ప్రకృతి
అనియు
వ్యవహరించిరి.
మరికొందరు
నీచేత
సమస్తము
సమ్మోహితమగుచున్నది.
నీవే
పరమాత్మవు
అని
స్తుతించిరి.
మరికొందరు
సత్త్వ
రజస్తమో
గుణములే
జగత్కారణమని
వాదించిరి.
ఇవి
శ్రుతి
ప్రమాణములు
కావు.
సంకల్పము
సృష్టికి
కారణమని
శ్రుతులు
తెలిపెను.
కనుక,
సంకల్పమే
సృష్టికి
పూర్వకము.
ఈ
సంకల్పము
ప్రధాన
గుణమగు
సత్త్వముయొక్క
ధర్మము
అని
సాంఖ్యము
తెలుపుచున్నది.
గుణములు
సామ్య
స్థితియందున్నపుడు
సత్త్వ
ధర్మమనియు,
దీనికి
జ్ఞానము
సంభవము
కాదనియు
తలంచిరి.
సాక్షియగు
చేతనతత్త్వము
లేకున్న
జ్ఞానము
ఉండజాలదు.
కనుక,
సాక్షియైన
ఈశ్వరునివలననే
ప్రధానము
జ్ఞాన
గుణమును
పొందుచున్నది.
ఏతావాతా
బ్రహ్మమే
జగత్తుకు
ముఖ్య
కారణమని
తలంచుట
సరియైనది.
పరమ
సత్యము
నిర్గుణ
బ్రహ్మమే
కాదు;
సగుణ
బ్రహ్మమూ
అగుచున్నాడు.
చేతనాచేతనాత్మకమగు
ఈ
విశ్వము
భగవంతుని
శరీరముగా
ఉన్నది.
చైతన్యమైన
వ్యక్తియే
తాను
చేయవలసిన
కార్యములలో
అనేక
సంకల్పములు
చేయును.
నేడేమి
చేయాలి?
రేపేమి
చేయాలి?
వచ్చే
సంవత్సరము
ఏమి
పంట
పెట్టాలి?
ఇత్యాది
సంకల్పములు
చేతనా
శక్తికి
మాత్రమే
2
▾
Meaning
Keep
సాధ్యముకాని,
అచేతనమైన
రాయి,
రప్పా,
చెట్టు,
గుట్ట
ఇత్యాది
వస్తువులకు
కాదు
కదా!
కనుక,
సంకల్పించుట
చేతన
లక్షణమని,
జడముల
లక్షణములు
కాదని
తేలినది.
సంకల్ప
కారణముచేత
జగత్తు
సృష్టింపబడుటకు
ఈశ్వరుడే
కారణము.
ఈశ్వర
సంకల్పమే
ఈ
జగత్తు.
స్థూల
దృష్టితో
చూచిన
రెండునూ
వేరువేరుగా
కనిపించిననూ
సూక్ష్మంగా
పరిశీలించిన,
పదార్థానికి,
పరమార్థానికి,
ప్రాణికి,
ప్రాణానికి
తాత్వికంగా
భేదం
లేదు.
ప్రాణమే
ప్రాణిగా
మారుతుంది.
ప్రాణిలోనుండి
ప్రాణం
ఉదయిస్తుంది.
బ్రహ్మ
పదార్థాన్ని
పరిచయం
చేసే
వేద
వాఙ్మయం
ముఖ్యంగా
జ్ఞాన
విజ్ఞాన
సంపదతో
కూడియుండును.
కానీ,
కాలక్రమంలో
వేదమంత్రాలకు
కర్మకాండపరంగా
అర్థాలు,
వ్యాఖ్యానాలు
చేయుచు
కామితార్థములు
నెరవేర్చుకొనుటకు
వీటిని
ఉపయోగించుతూ
వచ్చారు.
ప్రపంచములో
బ్రహ్మకాని
పదార్థము
లేదు.
ఈ
ప్రపంచమంతా
బ్రహ్మతత్త్వంనుండే
ఉదయించింది.
అందులోనే
లయమొందుతుంది.
అందులోనే
సంచరించుతుంది
అని
'తజ్జలాత్'
అన్న
సూత్రం
వర్ణిస్తుంది.
తత్
-
దానినుండి;
జ
-
జన్మించి;
ల
-
లయించి;
ఆత్
-
వృద్ధిపొందుట.
ఈ
నాలుగు
పాదాలతో
కూర్చబడి
చేర్చబడినది
ఈ
సూత్రము.
అసలు
పురుషుడే
ఒక
యజ్ఞ
స్వరూపుడు.
మానవ
జీవితమే
ఒక
యజ్ఞము.
ప్రపంచమంతా
పరమాత్మ
తత్త్వంలోనుండి
ఆవిర్భవిస్తుంది.
పరమేశ్వరుడు
లేనిచోటు
ఈ
ప్రపంచములో
ఎక్కడా
లేదు.
కదిలేది
జగత్తు,
కదిలించేవాడు
జగదీశ్వరుడు.
ప్రాపంచికమైన
అనురాగాలు
నిజమైన
అనురాగాలు
కావని,
ఇతరులమీద
అనురాగాలకు
మూలము
ఆత్మానురాగమేనని
యాజ్ఞవల్క్యుడు
మైత్రేయికి
బోధించుట
ఉపనిషత్
తెలుపుచున్నది.
ఒకరిమీద
ఒకరికి
ప్రేమ
ఉండి
ప్రేమించుట
లేదు.
ఎవరి
ఆనందమును
వారు
ఆశించి
ప్రేమవల్ల
కలిగే
ఆనందాన్ని
పురస్కరించుకొని
నడచుచున్నారు.
అనురాగము
ఆత్మోన్ముఖంగా
ఉంటుంది
కాబట్టి
ఆత్మతత్త్వాన్ని
అవగాహన
చేసుకొని
పరిశీలించితే
సమస్తం
బ్రహ్మ
చైతన్యమునుండే
జరుగుతున్నదని
స్పష్టమవుతుంది.
Previous
←
But That, on Account of Coordination
Next
If Figurative — No, Because of the Word Ātma
→