Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sūtra Vāhini · If Figurative — No, Because of the Word Ātma
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
చరాచరములన్నియు
దైవసంకల్పములే.
సంకల్పము
చేతనమేకాని
అచేతనము
కాదని
ఈ
సూత్రము
స్పష్టపరచుచున్నది.
ఎవరెన్ని
వాదోపవాదములు
చేసినా
దైవ
సంకల్పము
సమస్తమునకు
మూలము.
భ్రాంతి
చేత
వారివారి
భావాలను
దృఢపరచుకొనుటకై
ప్రయత్నింతురు.
మర్త్య
శరీరం
ఆత్మకు
ఆలంబనం.
శరీరముతో
పనిలేని
ప్రాణం
పర్జన్యం
వాయువుకు
కట్టుబడినట్లుగా
శరీరానికి
కట్టుబడి
ఉంటుంది.
అందువలన
ఆ
ఆత్మతత్త్వము
బ్రహ్మతత్త్వమును
అందుకోలేకపోవుచున్నది;
అర్థము
చేసుకోలేకపోవుచున్నది.
అశరీర
తత్త్వమే
బ్రహ్మం.
అదే
ఆత్మ
కన్నులకు
చూచే
శక్తి,
చెవులకు
వినే
శక్తి
నిచ్చేదే
ఆత్మ.
అట్టి
ఆత్మను
కన్నులు
ఏరీతిగా
చూడగలవు?
చెవులు
ఏరీతిగా
వినగలవు?
కన్నులు,
చెవులు
అధేయములు.
సర్వ
చైతన్యమైన
బ్రహ్మనే
వీటికి
ఆధారము.
అదే
ఆత్మ
అదే
తత్త్వం.
అదే
నీవు.
అంతా
చైతన్యమే,
సంకల్పమే.
ఈ
ప్రపంచంలో
పంచభూతములు
ప్రజ్ఞానంవలననే
సంచరించుచున్నాయి.
దేవతలు
ప్రజ్ఞాన
బలముతోనే
రాజించుచున్నారు.
సమస్త
ప్రాణికోటికీ
ప్రజ్ఞనే
ఆధారము.
స్థావర
జంగమమంతా
ప్రజ్ఞానంతోనే
ప్రతిష్ఠితమైయున్నది.
ప్రజ్ఞానమే
ఆత్మ
ప్రజ్ఞానమే
బ్రహ్మ
ప్రజ్ఞానమే
లోకం.
ప్రపంచమంతా
ప్రజ్ఞయొక్క
చైతన్యమే.
సత్
అను
శబ్దముచేత
వేదములు
జగత్తుకు
కారణము
బ్రహ్మనే
అని
చెప్పుచున్నవి.
అచేతనమైన
పదార్థమునుగురించి
వేదము
ఎక్కడా
చెప్పుట
లేదు.
గౌణశ్చేన్నాత్మ
శబ్దాత్
'ఆత్మ
శబ్దాత్'
-
ఆత్మ
అను
శబ్దమును
వినియోగించుటవలన
'అగ్ని
ఈక్షించెను'
అని
కొన్నింటియందు
శ్రుతులు
'ఈక్షతి'
శబ్దమును
గౌణముగా
తెలియబరచెను.
నిజముగా
అచ్చట
ఆత్మ
శబ్దమే
ప్రయోగింపబడినది.
ఈక్షించునది,
సంకల్పించునది
ఆత్మనే
కాని
మరొకటి
కాదు.
ఈ
దృశ్య
గోచరమైన
జగత్తు
అంతయు
సద్
వస్తువే
అయి
ఉండెను
-
అని
ఆరంభించి
క్రమముగా
ఈ
సమస్తము
సద్
వస్తువే,
అదియే
ఆత్మ
అని
వేదములు
తెలుపుచున్నవి.
ఈ
వస్తువు
జడ
వస్తువు
కాదు.
ఒక్కొక్కపరి
ప్రధానమునకు
కూడా
ఆత్మశబ్దము
2
▾
Meaning
Keep
ఉపయోగించబడుతుంది.
ఎందుకన,
అది
చేతన;
పురుషునియొక్క
కార్యములన్నింటినీ
చూచుకొంటుంది.
ప్రకృతి
చేయు
కార్యములకు
పరమాత్మ
కారణముగా
నున్నందున
ప్రకృతికికూడా
చేతనత్వము
ఆపాదింపబడుతుంది.
జీవుడంటే
రాగద్వేషాలకు,
కష్ట
సుఖాలకు
ప్రపంచముయొక్క
ఆకర్షణకు
లొంగినవాడు.
అట్టివానినే
బద్ధుడని
అందురు.
కావున
ప్రతి
జీవికి
మోక్షము
అవసరము.
ఈ
మోక్షము
కావాలంటే
ప్రకృతినే
ఆశ్రయించరాదు.
అది
గ్రుడ్డివాడు
గ్రుడ్డివానిని
ఆశ్రయించునట్లుండును;
లేక
దరిద్రుడు
మరొక
దరిద్రుని
ఆశ్రయించినట్లుగును.
అట్టి
ఆశ్రయమువలన
వాని
దరిద్రముగాని
లేక
బాధగాని
విముక్తి
కాజాలదు.
దరిద్రము
పోవాలంటే
ధనవంతుని
ఆశ్రయించాలి.
సరియైన
దారిన
నడువవలెనన్న
దృష్టి
కలవానిని
అనుసరించాలి.
అట్టి
జ్ఞాన
దృష్టి,
అఖండ
ఐశ్వర్యము
కలవానిని,
దయాళువును
ఆశ్రయించవలసి
ఉంటుంది.
అతడే
ఆత్మస్వరూపుడు.
అట్టి
పరమాత్మను
ఆశ్రయిస్తేనే
దుఃఖమనే
దరిద్రమును
తొలగించుకొనవచ్చును.
ఆనందమనే
ఐశ్వర్యమును
పొందవచ్చును,
గమ్యమును
చేరవచ్చును.
కనుక,
ఈవిధమైన
స్థితిని
పొందుటకు
బ్రహ్మ
అనుగ్రహం,
ఆత్మప్రాప్తి
లభించవలెను.
ఈ
ఆత్మ
ఎక్కడున్నది?
దానిని
తెలుసుకొను
విధానమేమి?
అని
చింతించిన,
అచేతన
వస్తువునందు
భక్తి
కలిగియుండినపుడే
అట్టి
నిష్ఠ
మోక్షకారణము
కాగలదు.
సగుణ
బ్రహ్మపై
ఆధారపడినవానికే
ఆత్మతత్త్వము
అర్థము
కాగలదు.
అట్టి
ఆత్మ
సగుణ
సాకారమునందుకూడను
కలదను
దృష్టాంతములెన్నియో
ఉన్నవి.
ఆత్మపదార్థమే
బ్రహ్మపదార్థమని
అనుభవ
పూర్వకంగా
తెలిసికొనుటయే
బ్రహ్మవిద్య.
ప్రపంచములో
ప్రతి
మానవుడు
నాలుగు
దశలను
ప్రతి
దినము
అనుభవిస్తాడు.
మొదటిది
జాగ్రదవస్థ;
రెండవది
స్వప్నావస్థ;
మూడవది
సుషుప్త్యవస్థ;
తదుపరి
తురీయావస్థ.
ఈ
నాలుగు
అవస్థలనే
నాలుగు
పాదములుగా
వర్ణించింది
వేదము.
జాగ్రదవస్థ
-
ఇందులో
వ్యక్తి
మేల్కొని
ఉంటాడు.
ఆత్మ
బహిర్ముఖంగా
ఉంటుంది.
ప్రపంచములోని
వస్తువులన్నియూ
3
▾
Meaning
Keep
కంటికి
కనిపిస్తాయి,
శబ్దాలు
వినిపిస్తాయి;
రుచులు,
వాసనలు,
స్పర్శలు
అనుభవంగా
ఇంద్రియాలకు
గోచరిస్తాయి.
సమాజములో
సమష్టి
జీవితాన్ని
గడుపుతాడు.
కర్మేంద్రియాలు
ఐదు,
జ్ఞానేంద్రియాలు
ఐదు,
పంచ
ప్రాణములు
ఐదు;
మనస్సు,
బుద్ధి,
చిత్తము,
అహంకారము
అనే
నాలుగు
అంతఃకరణములు
-
మొత్తము
పందొమ్మిది
-
ముఖములతో
జాగ్రదవస్థలో
సుఖదుఃఖాదులను,
లాభ
నష్టములను,
విజయ
అపజయాలను
స్థూలంగా
అనుభవిస్తాడు.
శరీరము
స్థూలంగా
ఉండుటచేత
అనుభవములుకూడా
స్థూలంగానే
ఉంటాయి.
అయితే
స్వప్నలోకం
దీనికి
భిన్నంగా
ఉంటుంది.
స్వప్నావస్థలో
ఆత్మ
అంతర్ముఖంగా
ఉంటుంది.
తన
అనుభూతి
తనవరకే
పరిమితమై
ఉంటుంది.
పదిమంది
గదిలో
పరుండి
ఉండినా
ఎవరి
కల
వారికే,
ఎవరి
అనుభూతి
వారిదే
కానీ
ప్రక్కనున్నవారికి
సంబంధముండదు.
ఎవరి
స్వప్నములు
వారినే
బాధించును,
ఆనందింపజేయును.
బాహ్య
సంబంధము
ఏమాత్రము
ఉండదు.
అసలు
బాహ్య
జగత్తే
కానరాదు.
స్వప్నావస్థలో
మరొక
ఊహా
ప్రపంచమును
సృష్టించుకొని
అందులనే
అనుభవిస్తాడు.
అయితే
వస్తువు
కల్పితమైనా
ఆనందానుభూతిలో
భేదముండదు.
జాగ్రదవస్థలో
ఉన్న
పందొమ్మిది
ముఖములు
స్వప్నావస్థలో
కూడా
ఉంటాయి.
ఇవి
భౌతికంగా
కనిపించవు.
మానసికంగా
మాత్రము
పనిచేస్తాయి.
అందులో
కూడా
ఒక
వెలుగు
ఉంటుంది.
దానిని
తైజసుడు
అని
అంటారు.
ఈ
తేజోమయ
ప్రపంచములో
వ్యక్తి
తనకు
తోచిన
రూపాలను,
శబ్దాలను,
రుచులను
సృష్టించుకొంటాడు.
ఈ
స్వప్న
లోకము
ఆత్మకు
రెండవ
పాదం
లేక
దశ.
ఇక
గాఢ
నిద్ర.
దీనినే
సుషుప్తి
అని
అంటారు.
ఇందులో
కలలు
కనిపించవు.
మంచి
నిద్రయందుంటాడు.
సుషుప్తిలో
మనిషికి
అవయవాలుకానీ,
శబ్ద
స్పర్శ
రూప
రస
గంధాదులుకానీ
ఏవియు
ఉండవు.
అన్ని
అవయవాలు,
వాటి
గుణములు
మనసులో
లీనమై
ఉంటాయి.
అనుభూతి
ప్రజ్ఞానరూపంగా
ఉంటుంది.
ఇక్కడ
వ్యష్టిగాకానీ,
సమష్టిగాకానీ
ఉండదు.
ఆత్మతోపాటు
పరమానందమును
అనుభవిస్తాడు.
Previous
←
Because of Seeing, Not by the Word Alone
Next
Because of What Is Declared to Be Cast Off
→