Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sūtra Vāhini · Because of What Is Declared to Be Cast Off
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ఇక
తురీయావస్థ
-
ఇది
పూర్తి
ఆత్మమయముగా
ఉంటుంది.
సకల
జీవ
జగత్తుకూ
మూలాధారమైన
సర్వాత్మ
కల్పించుకొన్న
సామ్రాజ్యము
ఇది.
ఈ
స్థానమును
అందుకొన్న
ఆత్మ
జీవిని
గురించి
ఏమీ
చింతించదు.
ఇందులో
తెలివితేటలు
ఉన్నాయనికాని,
లేవనికాని
చెప్పేందుకు
అసలే
వీలుండదు.
తురీయావస్థలో
పరమానందాన్ని
అనుభవిస్తూ
ఉంటాడు.
ఆత్మ
కంటికి
కనిపించదు;
పట్టుకొనుటకు
వీలుకాదు.
ఆత్మసారమనేది
ఒకటి
ఉన్నదనేది
మాత్రము
తెలుస్తుంది.
అందులో
మంచి
తప్ప
మరొకటి
ఉండదు.
ప్రాపంచిక
వాసనలన్నియు
ఉపశమించిన
తరువాతనే
ఈ
ఆత్మ
ప్రత్యయం
ఏర్పడుతుంది.
ఆత్మలోని
నాలుగు
పాదములు
ఓంకారములోని
నాలుగు
మాత్రలను
పోలి
ఉంటాయి.
ఆత్మ
అనుభవించే
జాగ్రత్,
స్వప్న,
సుషుప్తి,
తురీయావస్థలే
ఓంకారంలోని
అ,
ఉ,
మ,
అధిగత
మాత్రలు.
ప్రణవ
మాత్రలే
పరమాత్మకు
పాదాలు.
జాగ్రతలో
నేత్రమునందు,
స్వప్నములో
మనస్సునందు,
సుషుప్తిలో
హృదయమునందు,
తురీయావస్థలో
అంతా
తానై
ఉంటుంది
ఆత్మ.
ఏతావాతా
ఆత్మ
అన్ని
అవస్థలయందు,
అన్ని
స్థానములందు,
అన్ని
క్రియలయందు
ఉన్నది.
అంతా
ఆత్మే,
ఆత్మే
అంతా
అని
సమన్వయింపజేస్తుంది
సూత్రము.
సమన్వయమే
లేకుండిన
సంతసమే
లేదు.
సంతోషమే
లేకున్న
సర్వం
శూన్యం.
అయితే,
జగత్తంతా
పూర్ణమేకానీ,
శూన్యముకాదు.
హేయత్వావచనాచ్చ
కారణమొక్కదానిని
తెలుసుకొనిన
కార్యములన్నింటిని
తెలుసుకొన
వచ్చును.
ప్రపంచమంతయూ
భగవత్
సంకల్పముచేత
ఏర్పడినది.
ఇది
కార్యము.
ఏ
వస్తువు
నిర్మాణము
కావలెనన్ననూ
కారణము
అవసరము.
కారణము
లేని
కార్యము
జగత్తున
జరుగనేరదు.
అయితే,
కారణములు
రెండు
విధముల
నుండును.
అవియే
ఉపాదాన
కారణము,
నిమిత్త
కారణము.
ఉపాదాన
కారణము
-
ఇది
వస్తువునకు
పూర్వమే
పూర్ణమైన
ఆధారముగ
నుండును.
ఒక
వెండి
గిన్నె
ఉన్నదనుకొనుడు.
దీనిలోనున్న
వెండి,
గిన్నెకు
పూర్వమే
2
▾
Meaning
Keep
ఉన్నది.
అదే
ఉపాదాన
కారణము.
అనగా,
గిన్నె
చేయుటకు
ఆధారమైన
వెండియే
లేకున్న
గిన్నె
చేయలేరు.
వెండిని
వదలి
ఆ
గిన్నె
ఉండలేదు.
వెండిని,
గిన్నెను
వేరుచేయుటకు
వీలుకాదు.
అంటే,
ఒక
రూపమునకు
పూర్వమే
ఆ
రూపమునందున్న
పదార్థము
ఆధారముగా
నున్నది.
రూపము
కల్పితము;
వెండి
పూర్వసిద్ధము.
అయితే,
గిన్నెకు
నిమిత్తమాత్రము
ఒక
కంసాలి.
గిన్నె
తయారైన
తరువాత
నిమిత్త
కారణమైన
కంసాలిని
వదలి
ఆ
గిన్నె
వేరై
ఉండవచ్చు.
కానీ
వెండిని
వదలి
వేరుగా
నుండుటకు
వీలుకాదు
కదా!
అటులనే
ఈ
ప్రపంచమను
పెద్ద
పదార్థమును
ఒక
రూపముగ
తయారు
చేయుటకు,
దీనికి
ఆధారము
భగవంతుడే.
అతడే
ఉపాదాన
కారణము.
దీనికి
నిమిత్త
కారణముకూడా
భగవంతుడే.
వెండి
గిన్నెలో
వెండి
వ్యాపించి
యున్నట్లుగా,
ప్రపంచమను
ఈ
భాండములో
ఉపాదాన
కారణమైన
భగవంతుడు
వ్యాపించియున్నాడు.
దీనికి
నిమిత్త
కారకుడు
కూడా
భగవంతుడే.
సమస్త
పదార్థములయందు
పరార్థము
అంతర్లీనమైయుండును.
పరార్థము
లేని
పదార్థము
ప్రపంచమున
ఉండుటకు
వీలులేదు.
ప్రతి
పదార్థమునకు
ఒక
పరార్థము
ఉండియే
తీరవలెను.
ఈ
విచిత్రము
మనుష్య
మాత్రులు
తెలుసుకొనలేరు.
ఇది
అంత
సులభము
కాదు.
కేవలము
నామ
రూపములను
చూచి
మోహించుట,
భ్రమించుట,
విచారించుట,
దుఃఖించుట
ఇది
కుదర్శనము.
ఇవి
నానా
రూపములతో
కనిపించు
జడములు.
ఈ
రూప
నామములలో
అనగా
అనేకత్వములో
ఏకత్వమును
నిరూపించుట,
చూచుట,
ఆనందించుట,
అనుభవించుట
-
దీనిని
సుదర్శనమని
యందురు.
కాన
అనేకత్వములోని
ఏకత్వమే
పరతత్త్వము.
దానిని
ఆశ్రయించుటే
మోక్షము.
అదే
బ్రహ్మనిష్ఠ
అని
యనవచ్చును.
ప్రతి
జీవియు
ఈ
స్థితిని
అనగా
మోక్షము
లేక
బ్రహ్మప్రాప్తి
పొందియే
తీరవలెను.
అహంకార
మమకారములకు
చిక్కి
ఖేద
మోదముల
ననుసరించు
బద్ధుడైన
మానవునకు
ఈ
బద్ధత్వమునుండి
విముక్తి
కావాలనే
వాంఛ
ఏనాటికైనా
ఉదయించక
తప్పదు.
అట్టి
బంధమునుండి
విముక్తి
కోరుటే
ముక్తి.
చావని
త్రోవనే
మోక్షము.
దానిని
వెదకుటయే
బుద్ధిమంతుల
లక్షణము.
3
▾
Meaning
Keep
అయితే,
మానవుడు
ప్రకృతే
ప్రధానమని
దానిని
ఆశ్రయిస్తే
ప్రయోజనము
లేదు.
ప్రకృతి
పదార్థ
స్వరూపము.
స్వరూప
నిర్మాతను
ఆశ్రయించాలి.
దరిద్రుడు
మరొక
దరిద్రుని
ఆశ్రయించి
ప్రయోజనము
లేదు.
బంధనయందున్నవాడు
బంధనయందున్న
మరొకనిని
ఆశ్రయించిన
తన
బంధన
వదలదు.
ధనవంతుని
దరిద్రుడు,
బంధరహితుడైనవానిని
బంధనలోనున్నవాడు,
ఆశ్రయించిన
బంధన
నుండి
బయటపడవచ్చును,
తప్పించుకొనవచ్చును.
దుఃఖమునందున్నవాడు
ఆనందము
గలవానిని
ఆశ్రయించవలెను.
బంధన
నిరంతరము
దుఃఖముతో
కూడియుండును.
నిరంతర
ఆనందస్వరూపుడు
భగవంతుడు.
కనుక,
అట్టి
ఆనందమయుడైన
భగవంతుని
ఆశ్రయించుటే
దుఃఖ
విముక్తి,
దుఃఖ
నివృత్తి,
ఆనందప్రాప్తి,
మోక్షమని
గుర్తించవలెను.
అఖండ
రసైక
స్వరూపుడు,
ఆనంద
నిలయుడు
ఒక
పరమాత్మనే.
అతనిని
ఆశ్రయించినవారికే
అనంతత్వము
ప్రాప్తించును.
శబ్ద,
స్పర్శ,
రూప,
రస,
గంధాలు
ప్రవేశములేని
ఈ
పరమ
పదం
ఆద్యంతరహితమైనది.
క్రమంగా
దానికోసం
ప్రయత్నించాలి.
స్థూలమునుండి
సూక్ష్మములో,
సూక్ష్మమునుండి
కారణములో,
కారణమునుండి
మహాకారణమునందు
లయము
కావాలి.
ఇదే
సక్రమమైన
మార్గము.
అయితే,
సామాన్య
మానవులు
భౌతిక
భోగ
భాగ్యములకోసం
ప్రాకులాడుచున్నారు.
కానీ,
అంతరంగమున
ఉన్న
ఆత్మానందమును
చూడలేక
పోవుచున్నారు,
అనుభవించలేకపోవుచున్నారు.
దానికై
తగిన
ప్రయత్నము
కూడను
చేయలేకపోవుచున్నారు.
వారి
దృష్టి
ఎంతసేపూ
బయటి
ప్రపంచము
నందు
ప్రసరించునేకాని,
అంతరంగమునకు
ప్రసరించదు.
'పశ్యతి
ఇతి
పశుః'
-
బయటి
దృష్టి
కలిగి
ఉండుట
పశు
లక్షణము;
మానవ
లక్షణము
కాదు.
చిన్న
ఉదాహరణము:
మన
దేహములో
ఉన్న
ప్రధాన
అంగములు
కన్ను,
ముక్కు,
నోరు,
ఇత్యాది
అన్ని
అంగములూ
బయటికే
తెరుచుకొని
యున్నవి.
అందువలననే
దేహదృష్టి
పూర్తి
పశుదృష్టి
అని
చెప్పక
తప్పదు.
బాహ్యా
విషయాలు
అందుబాటులో
ఉన్నట్లు,
అంతర్లోకం
అంతుపట్టదు.
ఎవరో
నూటికొక్కరు
ఈ
అంతర్
దృష్టిని,
అంతరాత్మను
సాక్షాత్కరింప
Previous
←
If Figurative — No, Because of the Word Ātma
Next
Because of Merging [in Sleep]
→