Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sūtra Vāhini · Because of Being Declared in the Śruti
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
అంతఃకరణములకు
మూలకారణమైన
పరమాత్మను
సమీపముగా
చూచి
ఆనందించుటకు,
జీవునికి
అప్రయత్నముగా
లభించే
సదవకాశము.
స్వప్నలోకము
-
అనుభూతి
క్షణికము
కాని
ఆత్మజ్ఞానికి
ఇది
చిరస్థాయిగా
ఉండును.
అక్షర
పరబ్రహ్మను
అక్షయ
లోకములో
అనవరతము
సాక్షాత్కరించుకోగలవాడే
సర్వజ్ఞుడు.
అంతా
తానని
తెలుసుకొన్నవానికే
సర్వం
బ్రహ్మం.
ఈ
నిద్రలో
తన
స్వరూపము
తెలియని
అజ్ఞానము
తమోగుణ
రూపమున
ఉండును.
జ్ఞానులైనవారికి
ఈ
స్వప్నములోకూడా
జాగ్రదవస్థలో
ఉండినట్లు
ఆనందానుభూతి
ఉండును.
ఎరుక
కలిగినవాడు
దేహేంద్రియ
బుద్ధులతోడి
తన
సంబంధమును
విరమించుకొని
స్వస్వరూపానుభవముచే
అట్టి
ఆనందము
సహజముగా
జాగ్రతలో
అనుభవించును.
జీవుడు
చేతన
స్వరూపుడనీ,
అట్టి
చేతన
స్వరూపుడు
చేతన
స్వరూపుడైన
పరమాత్మయందే
లయమగును
కాని,
అచేతనమునందు
లయము
కాజాలదు
కనుక,
'సత్'
శబ్దము
పరమాత్మకే
అన్వయము
కాని
ప్రకృతికి
కాదని
ఈ
సూత్రము
హెచ్చరించుచున్నది.
శ్రుతత్వాచ్చ
సర్వజ్ఞుడగు
బ్రహ్మమే
జగత్కారణమని
శ్రుతియందు
చెప్పబడియుండుట
వలనకూడా
ఈ
దివ్యరూప
వర్ణన
చేయబడినది.
బ్రహ్మము
సంకల్పాది
గుణములను
వాచ్యార్థముననే
కలిగియున్నది.
బ్రహ్మము
నిర్విశేషమని
వర్ణించు
శ్రుతి
వాక్యములును
సమస్త
కళ్యాణ
గుణాత్మకముగా
వర్ణించుచున్నవి.
శ్రుతి
వాక్యము
విశ్వమునుండి
చూచినచో
బ్రహ్మము
నిర్విశేషము.
ఉపనిషత్తులు
బ్రహ్మమునకుకాని,
ఈశ్వరునకుకాని
ఎట్టి
వ్యత్యాసమును
తెలుపుట
లేదు.
వేదాంత
వాక్యములన్నిటిచేత
జగత్కారణము
చేతన
వస్తువే
యని
తెలిసికొనవలెను.
జగత్తు
జడమైనదే
అయివుండిన
ఆకర్షణీయమై
ఉండుటకు
కారణమేమి
అని
కొందరు
శంకింతురు.
జడమైనది,
ప్రకాశ
రహితమైనది
అయి
2
▾
Meaning
Keep
ఉండిన
అట్లే
పడియుండవలెను
కదా!
అట్లు
కాదు.
పరమాత్మ
ఉపాదాన
నిమిత్త
కారణాలతో
అంతర్బాహ్యములందు
ఉన్నాడు
కనుక,
దీనికి
ఇంత
ప్రకాశము,
ఆకర్షణ.
'పిష్టాదిర్గుడ
సంపర్కాత్'
-
పిష్ట
అనగా
పిండి.
అది
బియ్యపు
పిండి
కావచ్చు,
గోధుమ
పిండి
కావచ్చు,
లేక
బేదల
పిండి
కావచ్చు.
ఆ
పిండికి
ఎట్టి
రుచియు
లేకపోయినప్పటికిని,
గుడ
సంపర్కాత్
-
'గుడ'
అంటే
బెల్లము
-
ఆ
బెల్లము
సంపర్కముచేత
రుచి
రహితమైన
ఆ
పిండికి
కూడా
రుచి
ఏర్పడుతున్నది.
అదేవిధముగా,
ఈ
ప్రపంచమున
ఎక్కడెక్కడ
ఆకర్షణ,
సౌందర్యము
ఉండునో
అది
అంతయు
పరమాత్మ
స్వరూపము
కానీ,
వేరు
కాదు
అని
స్పష్టమగుచున్నది.
శ్రుతి
వాక్య
ప్రకారము,
ఈ
జగత్తును
ఆయనే
సృష్టించి,
ఆయనే
పోషించి,
ఆయనే
లాలించి,
ఆయనే
పాలించి,
కడకు
ఆయన
యందే
లయం
చేసికొనుచున్నాడు.
జగత్తునకు
కర్త,
భోక్త,
భర్త
ఆ
పరమాత్మయే
అని
శ్రుతి
చాటుచున్నది.
బ్రహ్మము
ఆనంద
రూపమని
కూడా
శ్రుతి
నిరూపించుచున్నది.
ఆత్మ
స్వరూపమునుగురించి,
మొదటిది
అన్నమయుడనియు,
ప్రాణమయుడనియు,
మనోమయుడనియు,
విజ్ఞానమయుడనియు
నిర్వచనము
చేసి,
అనంతరం
ఆనందమయుడని,
ఇవన్నియు
బ్రహ్మమునందే
ప్రయుక్తమగుటవలన
ఆనందమయాత్మ
బ్రహ్మమేయని
తలంచవచ్చును.
అన్నమయ,
ప్రాణమయ,
మనోమయ,
విజ్ఞానమయములన్నియు
ఒకదానికంటే
ఒకటి
సూక్ష్మ
రూపమును
ధరించి
ఆనందమయరూపుడైన
బ్రహ్మకు
ఉపాధులుగా
ఏర్పడినవనియును
తలంచవచ్చును.
అన్నమయం
-
కోటు
-
అది
స్థూలమైనది.
దానికంటే
సూక్ష్మమై
దానిని
కాపాడుచున్నది
ప్రాణమయం.
దానిని
విచారణాత్మకముగా
భావించిన
ప్రాణము
కంటే
సూక్ష్మమయినది
మనోమయము.
దేహేంద్రియాలను,
వాటిని
ఆచరణ
యోగ్యంగా
నడిపించు
ప్రాణశక్తిని
స్తంభింపజేయుచున్నది
మనోమయము.
కనుక,
అది
ప్రాణముకంటే
బలవత్తరమైనది.
దానికంటే
సూక్ష్మమైనది
విజ్ఞాన
మయం.
నిత్యానిత్య
విషయ
పరిశీలనలో
నిమగ్నమై
ఆనందమయమునకు
అతి
సమీపమున
నుండుటచేత
ఆనందమే
బ్రహ్మానుభూతిని
నిరూపించుచుండును.
3
▾
Meaning
Keep
మనము
దేహరక్షణకై
అనేక
విధములైన
దుస్తులు
ధరింతుము.
ముందు
బనియన్,
తరువాత
షర్టు,
ఆ
తరువాత
కోటు,
దానిపై
శాలువా.
అయితే,
మనము
మన
హృదయాన్ని
చూడవలెనన్న
మొదలు
స్థూలమైన
శాలువ
తీసివేయవలెను.
ఆ
తరువాత
కోటు
విడిచివేయవలెను.
ఆ
తరువాత
షర్టు
విప్పివేయవలెను.
ఆపై
బనియన్
తీసివేసినప్పుడే
మన
హృదయాన్ని
మనము
చూడగలము.
అటులనే
అన్నమయ,
ప్రాణమయ,
మనోమయ,
విజ్ఞాన
మయములను
ఉపాధులను
విసర్జించినప్పుడే
ఆనందమయమైన
ఆత్మ
బ్రహ్మ
స్వరూపముగా
కనిపించును.
అన్నమయమునుండి
ఆనందమయునివరకు
చేయు
ప్రయాణమే
జీవిత
ప్రయాణము.
ఇదే
మన
గమ్యము.
ఇదే
జీవిత
లక్ష్యము
అని
ఈ
సూత్రము
నిరూపించుచున్నది.
దీనినే
మరి
కొందరు
ఆనందాత్మ
పరమాత్మకాగా,
విజ్ఞానమయాత్మ
జీవాత్మ
యని
వాదించుచూ
వచ్చిరి.
అయితే,
బ్రహ్మకు
బాహ్యాధారములేవియు
అక్కరలేదు.
బ్రహ్మము
స్వప్రకాశము,
స్వప్రతిష్ఠము.
మరికొందరు
పరాశక్తియే
ఆనందమయాత్మ
అనియు,
దానినే
పరాకాశమనియు
పేర్కొనిరి.
ఇవన్నియూ
వారివారి
భావ
సూచనలే.
బ్రహ్మకు
బ్రహ్మనే
ఆధారము.
బ్రహ్మమునకు
మూలభేదము
లేనందున,
ఆనందమయాత్మగా
బ్రహ్మనే
నిర్దేశించవచ్చు.
ధర్మము
కంటే
ధర్మస్వభావము
వేరుకాదు
కదా!
ఆత్మకంటే
బ్రహ్మ
వేరుకాదు.
ఆనందాత్మ
పరమాత్మయేకాని,
జీవాత్మ
కాదు.
ఇందులో
జీవ
పరమాత్మల
అభేద
ప్రసక్తే
లేదనియు,
ఆనందము
అప్రమేయము,
ఆనందమయమనగా
ఆనందమే
అనియు
అర్థము.
ఈ
ఆనందము
లౌకికంగా
కూడా
ప్రతి
జీవియొక్క
స్వభావము
కనుకనే,
ఆనందమును
ప్రతి
మానవుడూ
కోరుచున్నాడు.
ఇట్టి
ఆనంద
నిమిత్తమై
జీవులు
ఎన్నింటినో
త్యాగము
చేయుచున్నారు.
అయితే
ఆనందమును
బాహ్య
వస్తువులయందు
వెదకుట
ఒక
అజ్ఞానము.
"సర్వం
పరవశం
దుఃఖం,
సర్వం
ఆత్మవశం
సుఖం"
అను
సూక్తి
ననుసరించి
బాహ్య
వస్తువులపై
తన
సుఖము
ఆధారపడియున్నదని
భావించినపుడు
ఆ
జీవుడు
పరవశమై
ఉండును.
తన
సుఖమునకు
దృశ్య
వస్తువులు
ప్రధానమని
తలంచి,
తాను
వస్తువులకు
వశుడై,
4
▾
Meaning
Keep
లేని
దుఃఖమును
అనుభవిస్తాడు.
అనేక
అశాంతులకు
గురి
అవుతాడు.
కనుక,
ఆనంద
ప్రాప్తికై
బాహ్య
వస్తువులను,
బాహ్య
క్రియలను
ఆశ్రయించుట
సరియైన
మార్గము
కాదు.
ఇది
దుఃఖమునకు
దారి.
నిజమైన
ఆనందమును
కోరువాడు
తన
వాంఛలను
ఆత్మవశం
చేయాలి.
కావాలి.
బాహ్యవస్తువులచే
ఆనందమును
వెదకుట
యెండమావులను
ఆశ్రయించి,
కడకు
దాహము
తీరక,
ప్రాణమును
కోల్పోవుట
జరుగును.
ఇక్కడ
ఒక
విషయం.
రాముడు
భీముని
ధనవంతునిగా
చేసెనని
కానీ,
రాముడు
భీముని
జ్ఞానవంతునిగా
చేసెననికానీ
అన్నప్పుడు,
రాముడు
ముందు
తాను
ధనవంతునిగాను,
జ్ఞానవంతునిగాను
ఉండాలి
కదా!
రాముడే
దరిద్రుడుగా,
అజ్ఞానిగా
ఉండిన
భీముని
ధనవంతునిగాను,
జ్ఞానిగాను
ఏవిధంగా
చేయగలడు?
కనుక,
భగవంతుడైన
బ్రహ్మ
ఆనందమయుడుగా
ఉండుటచేతనే
ఇతరులకు
ఆనందము
నిచ్చుచున్నాడు.
తాను
సకల
జ్ఞాన
సంపన్నుడు
కావటం
చేతనే
సర్వులకు
జ్ఞానోదయము
కలిగించుచున్నాడు.
భగవంతుడు
ఆనంద
ప్రచురుడు
అని
మరొక
శాఖ.
'ఆనందమయాధికరణమ్'.
'ఆనందమయోభ్యాసాత్'
అని
సూత్రము
హెచ్చరించినది.
మాంత్రవర్ణిక
మేవ
చ
'సత్యం
జ్ఞాన
మనంతం
బ్రహ్మ'
అను
మంత్రములో
చెప్పబడిన
బ్రహ్మ
ఈ
ఆనందస్వరూపుడు.
ఆనందం
బ్రహ్మ.
బ్రహ్మ
సత్యస్వరూపుడు.
బ్రహ్మ
జ్ఞాన
స్వరూపుడు.
బ్రహ్మ
అనంతస్వరూపుడు.
కనుక,
సర్వమును
ఆనందమునకు
నిర్వచనములే
కాని,
అన్యము
కాదు.
పరిచ్ఛేద
మనబడు
అల్పత్వము
లేనిది
ఆనందము.
దేశ,
కాల,
పాత్రములకు
లొంగునది
కాదు
ఆనందము.
ఆనందమునందు
దేశము,
కాలము,
పాత్రము
పరిపూర్ణమైయుండును.
ఆనందమునకు
లోబడినవే
దేశ
కాల
పాత్రములుకానీ,
ఆనందము
దేశ
కాల
పాత్రములకు
లొంగినది
కాదు,
కట్టుబడినది
కాదు.
కనుక,
మంత్రములచేత
వర్ధింపబడిన
భగవంతుడు
మంత్రములకు
కట్టుబడునేకాని,
తాను
మంత్రములను
కట్టివేయడు.
రెండింటినీ
కట్టివేయునదే
ఆనందము.
Previous
←
Because of Merging [in Sleep]
Next
Because of the Naming of Light and Feet
→