Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sūtra Vāhini · Because of the Naming of Light and Feet
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ఇది
భౌతిక
జ్యోతిని
నిర్దేశించుటలేదు.
జ్యోతికి
భౌతికమగు
హద్దు
చెప్పబడిన
సర్వాత్మకము
కాదు
కదా!
కాన
అది
ఉపాసనా
విషయము
కాజాలదు.
ఈ
జ్యోతి
శరీరమందున్న
ప్రాకృత
లక్షణమగు
జ్యోతియే
అన్న
బ్రహ్మ
ప్రత్యభిమానము
సాధ్యము
కాదు.
"పాదోస్య
విశ్వ
భూతాని"
అని
పురుష
సూక్తములో
చెప్పబడుట
చేత
దీనికి
ఒక
ప్రమాణము,
కొలత
అంటూ
లేవు.
కావున,
ఇక్కడ
పరబ్రహ్మము
కాదు.
ఇది
స్వర్గ
లోకముకంటే
పరమై,
దీప్తమవుతుంది.
ఏదైతే
సర్వ
ప్రాణుల
సృష్టి
భాగములకంటే
పూర్వమున
వెలుగుచున్నదో,
దేనికంటే
మించిన
లోకము
లేదో
అట్టి
ఉత్తమోత్తమ
లోకములో
ప్రకాశించు
జ్యోతి
ఇది.
ఈ
జ్యోతి
సర్వ
ప్రాణులయందూ,
సర్వత్రా,
సర్వదా
ప్రకాశించుచున్నది.
అస్తి,
భాతి,
ప్రియ,
రూపమైనది
ఈ
జ్యోతి.
ప్రపంచములో
కనుపించు
ప్రతిదానికి,
ప్రతి
పదార్థానికి
కనిపించని
ఆధారమై
యుండును.
ప్రతి
చరమునకు
ఆధారము
ఒక
అచరము
ఉన్నది.
అటులనే,
కనిపించు
సమస్త
ప్రాణికోటికి,
ప్రపంచమునకూ
కనుపించని
పరబ్రహ్మము
ఆధారమైయున్నది.
ఈ
పరబ్రహ్మమే
ప్రపంచమును
ప్రకాశింప
జేయుచున్నాడు.
జ్యోతి
శబ్దములో
చెప్పబడిన
పరమాత్మ
ఇట్టిదికాని,
లౌకిక
జ్యోతులు
కావు.
ఇదే
పరంజ్యోతి,
అద్వైత
జ్యోతి.
అదే
పరబ్రహ్మము.
అతని
వలననే
ఈ
సమస్తమును
ప్రకటితమగుచున్నది.
అయితే
ఈ
జ్యోతి
పరబ్రహ్మమును
గురించి
చెప్పినదికాదని
వాదించుట
తగనిది,
సరికానిది.
ఉపనిషత్తులు
బ్రహ్మమునకు
నాలుగు
పాదములున్నవని
చెప్పుచున్నవి.
జ్యోతి
శబ్దము
బ్రహ్మమునకు
అన్వయించుననికూడా
చెప్పబడినది.
అందులో
ఒక
పాదము
సర్వభూతముల
అంతర్గతమొనరించుకొనుచున్నది.
మిగిలిన
మూడు
పాదములు
దివియందు
అమృతము.
ఈ
అమృతము
సాధారణ
జ్యోతి
కాజాలదు.
మరొక
పక్షమువారు
ఉపనిషత్తునందు
గల
'జ్యోతిః',
'దీప్యతే'
అను
పదములు
బ్రహ్మమునకు
అన్వయింపక
ప్రాకృత
జ్యోతికి
మాత్రము
అన్వయించుననని
వాదించుచున్నారు.
ఇది
అర్థము
లేనిది.
దేదీప్యమానమగు
తన
Previous
←
Because of Being Declared in the Śruti
Next
Because Prāṇa Follows in the Same Way
→