Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Upaniṣad Vāhini · Kaṭha Upaniṣad
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
3.
కఠోపనిషత్
ఈ
ఉపనిషత్తున
యమునిచే
బ్రహ్మతత్త్వోపదేశమునొంది
కృతార్థతను
గాంచిన
నచికేతుని
చరిత్రము
పేర్కొనబడినది.
ఇంతియేకాక,
ఈ
యాఖ్యాయిక
తైత్తిరీయ
బ్రాహ్మణమునను,
మహాభారతము
అనుశాసన
పర్వము
నూట
ఆరవ
అధ్యాయమున
కూడ
తెలుపబడినది.
ఇది
విషయ
విమర్శనమునకు,
భావకల్పనా
గాంభీర్యములకును
ప్రసిద్ధికెక్కినది.
దీనియందలివి
అనేక
మంత్రముల
రూపమననే
భగవద్గీతయందు
కనిపించుచున్నవి.
కృష్ణయజుర్వేదీయ
చరకశాఖాంతర్గతమగు
కఠశాఖా
బ్రాహ్మణమునకు
చెందియుండుటచేత
ఈ
ఉపనిషత్తునకు
కఠోపనిషత్
అని
కూడను
పేరు
వచ్చినది.
2
▾
Meaning
Keep
ఆత్మ
జ్ఞానోపదేశానికి
అర్హత
సంపాదించాలి
వాజస్రవనుడను
నామమున
బరగు
గౌతముడను
కర్మశ్రేష్ఠుడు
సర్వస్వ
దాన
ప్రయుక్తమగు
క్రతువు
నొకదానిని
ప్రారంభించెను.
అతనికి
నచికేతుడను
ఒక
సుగుణశాలియైన
కుమారుడుండెను.
ఈ
మహాక్రతువునందు
తన
తండ్రియైన
గౌతముడు
నీరు
త్రాగుటకు
కానీ,
గడ్డి
మేయుటకు
కానీ,
పాలిచ్చుటకు
కానీ
శక్తిలేని
గోవును
ఋత్విక్కులకు
దానముగా
నీయ
సంకల్పించినప్పుడు,
తండ్రికి
కలుగనున్న
నరక
దుఃఖమునకు
ప్రతీకారముగా
తనను
ఆ
ఋత్విక్కులలో
నెవరికైననూ
దానమిమ్మని
నచికేతుడు
తండ్రిని
అనేక
పర్యాయములు
నిర్బంధము
చేయుచుండగా
తండ్రి
కుపితుడై
నిన్ను
మృత్యుదేవతకు
దానమిచ్చెదనని
యనెను.
అప్పటినుండియూ
తండ్రి
మాటకు
అసత్యత్వము
రానివ్వకూడదని
నిశ్చయించుకొని,
జనన
మరణములకు
లోనై
జీవలోకమునందాడిన
మాటలు
తప్పరాదని,
పితృవాక్
పరిపాలనము
చేయవలెననియు
దీక్షనుపూని,
తండ్రిని
ఒప్పించి,
యముని
సందర్శనమునకు
పోయి,
యముడు
కనిపించువరకూ
మూడు
రాత్రులు
కాచి
నివశించెను.
తరువాత
తన
దర్శనమునకై
కాచియుండిన
నచికేతుని
వృత్తాంతము
యముడు
విచారించి,
“నీవు
నిరాహారివై
మూడు
రాత్రులు
నా
యింట
కాచితివి
కనుక,
నీవీ
మూడు
రాత్రులకునూ
మూడు
వరములు
కోరుకొమ్మని
యముడు
నచికేతునకు
తెలిపెను.
3
▾
Meaning
Keep
అపుడు
నచికేతుడు
సమ్మతించి
“నీ
యాజ్ఞను
గైకొని
నేను
స్వగృహమునకు
చేరినపుడు
నా
తండ్రికి
నా
యందు
ఆగ్రహము
పోయి
శాంతమనస్కుడై
నన్ను
గుర్తించునట్లు
చేయుమ”ని
మొదటి
కోర్కె
అడిగెను.
తరువాత
“స్వర్గమున
ఆకలి
దప్పులు
కానీ,
మృత్యుభయము
కానీ,
కష్టదుఃఖములు
కానీ
లేవు
కదా!
దానిని
గురించి
నాకు
ఉపదేశించుమ”ని
రెండవ
కోరిక
కోరెను.
అపుడు
యముడు
ఆ
రెండింటిని
ఎంతో
ప్రేమతో
నచికేతునకు
ప్రసాదించెను.
అగ్ని
చయన
విజ్ఞానమునంతయు
బోధించెను.
యముడు
ఉపదేశించిన
రీతిగా
నచికేతుడు
సంపూర్ణముగా
గ్రహించి,
తాను
తెలిసికొనిన
దానిని
సునిశ్చయము
చేసికొనుటకై
యమునికి
తిరిగి
ఒప్పగించెను.
అప్పుడు
నచికేతుని
బుద్ధిసూక్ష్మతకు
యముడు
సంతసించి
అగ్ని
చయన
మికమీదట
నచికేతన
చయనమని
అతని
పేరుతో
ప్రసిద్ధి
గాంచునట్లు
మరియొక
వరమిచ్చెను.
అంతియేగాక
చిత్రమైన
శబ్దము
నిచ్చునట్టి
రత్నమాల
నొకదానిని
యముడు
నచికేతునకు
ప్రసాదించెను.
4
▾
Meaning
Keep
తరువాత,
నచికేతుడు
మూడవ
వరము
కోరుటకై
“స్వామీ!
మనుజుడు
మరణశీలుడు.
దేహేంద్రియములకు
భిన్నమగు
ఆత్మయనునది
ఒకటి
కలదని
కొందరు
అందురు.
అట్టిదేదియూ
లేదని
మరికొందరు
చెప్పుదురు.
నీచే
శాసించబడియుండు
నేనీ
విషయమును
తెలిసికొన
సంతసించుచున్నాను.
కాన,
ఇదియే
నా
మూడవ
కోర్కె”
అని
పలికెను.
అతని
అర్హతను
నిశ్చయించకయే,
ఆత్మోపదేశము
చేయుటకు
ఇష్టములేక
నచికేతుని
యోగ్యతను
పరీక్షించుటకై
యముడు
విధవిధములైన
ఇహలోక
సంబంధములగు
వరములనిచ్చెదనని
అనేక
రీతుల
బోధించెను.
ఆత్మధర్మము
బహు
సూక్ష్మ
విషయమనియు,
ప్రాకృత
జనులకు
సువిజ్ఞేయము
కాదనియు,
వేరే
వరమేదైనను
కోరుకొమ్మనియూ,
ఈ
ఆత్మ
సంబంధమైన
వరమును
కోరక
తనను
వదలమనియు
యముడు
చెప్పెను.
5
▾
Meaning
Keep
అపుడు
నచికేతుడు
“స్వామీ!
ప్రాకృత
జనులకు
సువిజ్ఞేయము
కాదని
మీరే
చెప్పుచున్నారు.
ఇక
పండితులకు
మాత్రము
సాధ్యమగునా?
ఈ
సూక్ష్మ
విషయమును
ఉపదేశించుటకు,
మీకంటె
వేరు
సామర్థ్యులు
లేరు.
మరే
వరమూ
నాకక్కర
లేదు;
అవి
అనిత్యఫలము
నిచ్చునవే,
నాకీ
వరమును
ప్రసాదించుమని”
కోరెను.
6
▾
Meaning
Keep
జ్ఞాతృ,
జ్ఞాన,
జ్ఞేయ
భేదమును
తొలగించుటయే
లక్ష్యం
ఈ
పట్టుదలనూ,
ఈ
శ్రద్ధనూ
యముడు
గ్రహించి
ఆత్మజ్ఞానమునకు
నచికేతుడు
అర్హుడని
నిశ్చయించి,
“నాయనా!
శ్రేయస్సు
అనియు
ప్రేయస్సు
అనియు
రెండు
పురుషార్థములు.
అవి
రెండునూ
పురుషుని
బంధించునవియే.
శ్రేయోమార్గము
నవలంబించువాడు
శుభమును
పొందును.
ప్రేయోమార్గము
నవలంబించువాడు
పరమ
పురుషార్థము
నుంచి
విదూరుడగును.
ఈ
రెండును
విభిన్నములు.
రెండునూ
పురుషాధీనములే.
ఒకటి
వివేకముచే
లభించును.
మరియొకటి
అవివేకముచే
లభించును.
విరుద్ధములగుటచే,
అవి
ఒకదాని
నొకటి
త్రోసివేయును.
ఒకటి
మోక్షకారణము;
రెండవది
సంసార
హేతువు.
ప్రేయోమార్గము
అవిద్యా
కల్పితమనియు,
శ్రేయోమార్గము
విద్యా
కల్పితమనియు,
అయితే,
శ్రేయస్సును
కోరువారు
అత్యంత
అరుద”నియూ
యముడు
చెప్పెను.
7
▾
Meaning
Keep
ఆత్మ
వికల్పరహితమగు
అఖండ
రస
ఘన
స్వరూపము
కనుక,
అతను
అస్తి,
నాస్తి,
కర్త,
అకర్త
మొదలగు
వికల్పముల
కాస్పదుడు
కాడు;
అతను
జ్ఞేయవస్తువు
కాడు.
కనుక
అతనిని
గూర్చి
జ్ఞాతృ,
జ్ఞాన,
జ్ఞేయ
భేదము
లేదు.
ఇదియే
ఆత్మజ్ఞానము
యొక్క
పరాకాష్ఠ.
ఉపదేశికుడే
బ్రహ్మము,
శ్రోతయే
బ్రహ్మమని
తెలియుచున్నది.
ఈ
విధమగు
జ్ఞానము,
సర్వ
సంసార
నివారకమగుటచే
జన్మరాహిత్యము
నిశ్చితమగుచున్నది.
శ్రుతి
సమ్మతము
కాని,
కేవలము
తర్కమునకీ
పరమ
రహస్యము
అందదనియూ,
తర్కమునకు
సాధ్యము
కాదనియూ
ఈ
ఉపనిషత్తు
దెల్పుచున్నది.
8
▾
Meaning
Keep
ఓంకారోపాసన
పరా,
అపరా
బ్రహ్మ
సాధకము
ఆత్మదర్శనము
కష్ట
సాధ్యము.
అది
పురాతనము
మనస్సును
విషయములనుండి
మరల్చి,
ఆత్మయందు
సమాధానము
చేయుటచే
అది
లభించును.
ధీరుడగువాడు
ఇట్టి
ఆత్మను
తెలిసికొని
శోకమును
వదలును.
ఇంతియే
కాక,
వేదాంతములన్నియు
పరమాత్మను
పొందదగినది.
ఏ
ధ్వని
ఏ
కంఠమున
నుద్ఘోషించుచున్ననూ,
ఆ
పరమార్థ
వస్తువు
“ఓం”
అను
శబ్దముచే
చెప్పుబడునదే.
ఓంకారము
పరా,
అపరా
బ్రహ్మములు
రెంటికినీ
ప్రతీకమగుటచే
అవి
రెండూ
ఓంకార
ఉపాసనచే
లభ్యమగుచున్నవి.
హిరణ్యగర్భ
ప్రాప్తికి
కూడనూ
ఓంకారమే
సాధనమగుచున్నది.
ఇది
శుద్ధసత్వ
ప్రధానమగు
మాయచే
పరిచ్ఛిన్నమగుచున్నదనియూ,
ఓంకారము
పరాపరబ్రహ్మ
ప్రతీకమనియూ
ఈ
ఉపనిషత్తు
తెలుపుచున్నది.
ఇంతియేకాక,
ఆత్మకు
పరిణామము
లేదు.
ఆత్మ
ఉపాధి
ధర్మములచే
సంస్పృష్టము
కాదు.
ఎటులన
ఉపాధి
ధర్మములు
కలిగినవాడుగ
కన్పించుచున్నాడు.
కానీ
అది
కల్పన.
సూర్య
ప్రతిబింబము
ఉపాధి
భూతమగు
జలముయొక్క
సంచలనముచే
సంకుచితమగునటుల
కన్పించిననూ,
సూర్యబింబము
ఉపాధి
ధర్మముచే
అసంస్పృష్టమై,
వాని
యన్నిటికినీ
కడుదూరముననుండి
వానికి
సాక్షి
మాత్రముగ
ఎట్లు
భాసించుచున్నదో
అటులనే,
ఆత్మ
“సాక్షి”
మాత్రముగా
భాసించుచున్నాడు.
9
▾
Meaning
Keep
విద్య,
అవిద్యా
ఫలములకు
జీవుడే
భోక్త.
బుద్ధియే
ప్రవృత్తి
నివృత్తులకు
కారణము.
కాన,
ఆత్మదర్శనము
సర్వేంద్రియోప
సంహారముచే
లభించును.
వాగాది
ఇంద్రియములను
అనాత్మభావముచే
అసత్యములని
త్రోసివేసి,
వాటిని
మనస్సునందు
ఉపసంహరింపవలెను.
అటులనే
మనస్సును
బుద్ధియందును,
బుద్ధిని
హిరణ్యగర్భునియందును,
హిరణ్యగర్భునీ,
బుద్ధినీ
సర్వ
ప్రత్యయసాక్షియగు
ముఖ్యాత్మయందును
ఉపసంహరింపవలయును.
సమస్త
ప్రపంచమును
నిర్వికల్ప
సమాధియందు
స్వస్వరూపమగు
పరమాత్మయందు
నిలుపవలెనని
తాత్పర్యము.
10
▾
Meaning
Keep
ఆత్మ
నాశ
రహితం,
అనంతం
సర్వ
ప్రపంచము
మిథ్యాజ్ఞాన
విజృంభితము.
నామరూప
కర్మాశ్రయము.
ఎటులన,
ఎండ
మావుల
నీటి
భ్రమయు,
త్రాటియందు
సర్ప
భ్రమయు
యథార్థ
స్వరూప
జ్ఞానముచే
ఎట్లు
తొలగిపోవుచున్నవో,
అటులనే
ఆత్మ
దర్శనార్థమై
అనాదియగు
అవిద్యయందు
గాఢనిద్రజెందిన
వారిని
నిద్రలేపి,
ఆత్మజ్ఞానాభిముఖులుగా
చేయుచున్నది.
ఇందులోని
14వ
మంత్రము
“ఆత్మ”
శబ్ధ
స్పర్శ
రూప
రస
గంధ
రహితమై,
నాశరహితమై,
అనంతమై
యున్నది.
ఇంద్రియములు
బాహ్య
వృత్తములు.
ఆత్మ
సర్వ
వ్యవహార
సాధనము.
అజ్ఞాన
జన్యమగు
నానాత్వ
బుద్ధి
నశించవలెను.
ఉపాధి
భేదముచే
విభిన్నులుగా
కనిపించుచున్నవి.
కానీ
“నేను
వేరు;
బ్రహ్మము
వేరు”
అనువారు
జనన
మరణ
పరంపరకు
లోనగుదురు.
బ్రహ్మముయొక్క
అస్తిత్వమున
సందేహము
కలిగి
నచికేతుడు
యముని
కోరగా
ఇంతవరకు
తెలిపెను.
11
▾
Meaning
Keep
భిన్న
భావనల
వలన
అధః
పతనమే
అంగుష్ఠమాత్రుడగు
ఈ
పురుషుడు
ధూమముచే
కప్పబడిన
జ్యోతిస్సును
పోలియున్నాడు.
కానీ,
ఆ
పురుషుడు
కాలత్రయమునందున్నవాడు.
అతను
నిత్యుడు.
ఎటులన
ఎత్తైన
పర్వతములపై
కురిసిన
వర్షము
పల్లపు
ప్రదేశమునకు
నానాముఖమున
ప్రవహించి
ఎట్లు
విభిన్న
ప్రవాహముగా
చెదరి
నశించునో
అటులనే
వివిధ
ధర్మములను
తనకంటే
భిన్నముగా
భావించునతడు
తనయుచ్చైర్గతి
నుండి
ప్రచ్యుతి
జెంది
వివిధ
మార్గముల
నధఃపతితుడై
నశించుచున్నాడు.
ఆత్మకంటే
అధికుడు
కానీ,
సమానుడు
కానీ
మరొకరు
లేడని,
ఈ
ఉపనిషత్తు
ఘోషించినది.
వృక్షముయొక్క
వేరులు
భూమిలో
చేరి,
పైకి
కనిపించక
పోయిననూ
కార్యరూపకమగు
ఫల
పుష్పాదికముచే
అది
నిశ్చయింపబడుచున్నది.
పై
ఆవరణము
తీసిన
వెంటనే
అది
ప్రత్యక్షముగా
కన్పించును.
అటులనే
సర్వజనితమగు
సంసార
వృక్షమువలన,
దాని
మూలమగు
బ్రహ్మమును
నిర్ధారణ
చేయుటకుగాను
యముడు
ఈ
బోధ
చేసెను.
12
▾
Meaning
Keep
ఆత్మ
నెరింగినవాడు
బ్రహ్మమును
పొందును
ఈ
సంసారవృక్షము
ఇంద్రజాలము
వంటిది.
పైకి
మాత్రము
కనిపించుచున్నదే
కానీ
అది
యథార్థము
కాదు.
దర్పణమునందు
ప్రతిబింబము
స్పష్టముగా
కనిపించి
నటుల,
నిర్మల
బుద్ధి
గలవాడు
ఈ
జన్మమునందే
ఆత్మదర్శనము
పొందగలడు.
బ్రహ్మము,
జ్ఞానికి
జ్ఞేయమగుచున్నది.
ఉపాసకునికి
ఉపాస్యమగుచున్నది.
బ్రహ్మ
సాక్షాత్కారము
చేసికొని
జ్ఞాని
ముక్తుడగుచున్నాడు.
ఉపాసకుడు
మరణానంతరము
బ్రహ్మలోకమున
కేగుచున్నాడు.
అక్కడ
జ్ఞానోపలబ్ధిచే
హిరణ్యగర్భునితో
గూడా
కల్పాంతమున
ముక్తి
పొందుచున్నాడు.
ఈ
రీతిగా
యముడు
ఉపదేశించిన
ఈ
బ్రహ్మవిద్యను,
యోగవిధిని
కూడా
సంపూర్ణముగా
గ్రహించి,
నచికేతుడు
మృత్యువు
నుండి
తొలగినవాడై
బ్రహ్మమును
పొందెను.
పైరీతిగా
ఆత్మ
నెఱింగిన
ప్రతివాడునూ
బ్రహ్మమును
పొందును.
కేవలము
కనుగొనుటకైననూ
ప్రయత్నించినవాడు
ఉత్తమ
మనుజుడగును;
పాప
రహితుడగును.
13
▾
Meaning
Keep
ఈ
ఉపనిషత్తు
ఆత్మ
తత్త్వమును,
ప్రణవ
స్వరూపమును,
బ్రహ్మవిద్యను
అనేక
విధముల
బోధించినది.
అందులోని
సారాంశములను
మాత్రమే
నేను
తెలుప
సంకల్పించితిని.
సూక్ష్మబుద్ధి
గలవారలకు,
ముముక్షువులు
కాగోరు
వారలకు
ఇందులో
ఒక్క
మంత్రము
చాలు,
తరింపజేయును.
మొద్దు
బుద్ధి
గల
మనుజునికి,
సంసారాపేక్ష
గల
సహజునికి
ఎన్ని
చెప్పిననూ
ఒక్కటిగనే
యుండును.
సముద్రమువంటి
ఆత్మ
రుచిని
తెలిసికొనుటకు,
సముద్రమునంతటినీ
త్రాగనవసరము
లేదు.
అందులోని
ఒక
బిందువును
నాలుకపై
వేసికొన్న
చాలును.
అటులనే
ఈ
ఉపనిషత్తును
తెలిసికొనగోరువారు,
అన్ని
మంత్రములనూ
ఆశ్రయించనవసరము
లేదు.
ఒక్క
మంత్రమునందలి
సారమును
తెలిసికొనిన,
తప్పక
ధన్యుడు
కాగలడు.
Previous
←
Īśāvāsya Upaniṣad
Next
Muṇḍaka Upaniṣad
→