Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Upaniṣad Vāhini · Muṇḍaka Upaniṣad
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
4.
ముండకోపనిషత్
నేత్రశ్రోత్రములచే
నెల్లప్పుడు
మంగళప్రదమగు
కార్యములు
చూచునట్లునూ,
మంగళనాదము
వినునట్లును,
సర్వేశుని
అనవరతము
చింతన
చేయుచు
ఆయుష్కాలమును
గడుపునట్లును,
శాంతిపఠనముతో
ఈ
ఉపనిషత్తు
చెప్పబడినది.
ఇందులో
ఉపదేశించిన
విద్య,
కార్యబ్రహ్మయగు
హిరణ్యగర్భునిచే
మొదట
చెప్పబడుటచేగాని,
బ్రహ్మమును
గురించి
చెప్పుబడుటచేగాని,
బ్రహ్మవిద్య
అనుచు
పిలువబడుచున్నది.
పూర్తి
క్షురకర్మ
చేయబడిన
శిరస్సునందు
అగ్నిని
ధరించుటయే
ముఖ్య
లక్షణముగాగల
శిరోవ్రతము
నాశ్రయించినవారు
మాత్రము
ఇచట
బ్రహ్మవిద్య
కర్హులగుటచే
ఈ
ఉపనిషత్తుకు
ముండకమని
పేరు
కలిగినది.
గుణసంపత్తిచే
ఈ
ఉపనిషత్తు
సర్వోపనిషత్తులకూ
భూషణముగా
నుండుటచే
కూడను
దీనికి
ముండకమని
పేరు
సమన్వయింపబడినది.
ఇది
అధర్వణ
వేదములోనిది.
2
▾
Meaning
Keep
సర్వ
జీవులకూ
జన్మ
స్థానం
బ్రహ్మమే
సాంప్రదాయ
సిద్ధమై
పరంపరగా
వచ్చిన
ఈ
బ్రహ్మవిద్య,
నిర్గుణ
బ్రహ్మమును
బోధించు
పరవిద్యయనియు,
ధర్మాధర్మ
ఫలసాధనమగు
సగుణ
బ్రహ్మమును
బోధించు
అపరవిద్యయనియు,
ఇందులో
రెండు
భాగములున్నవి.
ఇవి
రెండును
శౌనకుడు
అంగిరసున
కుపదేశించెను.
వేదములతోనూ,
వేదాంగములతోనూ
కలిసిన
దానిని
అపరవిద్య
అందురు.
ఉపనిషత్తు
మొదలగు
శబ్దరాశియంతయూ
అపరవిద్యయందురు.
కానీ
అవి
అపరవిద్యలయినప్పటికినీ,
దాని
బోధనచే
బ్రహ్మను
బోధింపచేయు
విజ్ఞానము,
పరవిద్యయగుచున్నది.
సాలెపురుగునుండి
వచ్చు
దారమునకు
సాలెపురుగు
ఎట్లు
ఉపాదాన
కారణమగుచున్నదో
అటులనే
జగత్తుకు
బ్రహ్మము
హేతువగుచున్నాడు.
3
▾
Meaning
Keep
అపరవిద్యయయిన
సంసారమునకు
క్రియ-కర్త,
సాధనము,
జ్ఞానము
కలుగకుండునంతవరకు
అవి
యుండును.
అపరవిద్యయగు
కర్మ
నాచరించినవారు
స్వర్గమును
పొందుదురు.
మరికొందరు,
కర్మచే
లభించు
స్వర్గాదులు
అనిత్యమని
గుర్తెరిగి,
దానిపై
వైరాగ్యమును
బొంది,
బ్రహ్మనిష్ఠులగు
పెద్దలచెంతచేరి
ముక్తిహేతువగు
బ్రహ్మవిద్యను
తెలుసుకొందురు.
సర్వ
జీవులూ
బ్రహ్మముకంటె
వేరు
కాదు.
సర్వజీవులకూ
జన్మ
స్థానము
బ్రహ్మనే,
ఎటులన
ప్రజ్వలించుచున్న
మంటనుండి
అనేక
కణములు
(నిప్పు
రవ్వలు)
ఎట్లు
పుట్టుచున్నవో,
శరీరమునుండి
రోమము
ఎట్లు
పుట్టి
దానికంటె
విలక్షణముగా
ఎట్లు
తెలియుచున్నవో,
అటులనే
బ్రహ్మమునందే
జీవులు
పుట్టుచూ
దానికి
విలక్షణముగా
తెలియుచున్నవి.
కానీ,
బ్రహ్మముకంటే
వేరు
కావు.
పరబ్రహ్మ
ఆజ్ఞ
ప్రకారమే
సూర్యచంద్రాదులు,
పంచభూతములు
సర్వవ్యాపారములు
నిర్వహించుచున్నారు.
అదియే
సర్వకర్మ
ఫలప్రదాత.
4
▾
Meaning
Keep
వశీకృత
చిత్తునకు
ఆత్మ
జ్ఞానం
సాధ్యం
జీవేశ్వరులను
రెండు
పక్షులును,
శరీరమను
ఒక
వృక్షమునే
ఆశ్రయించి
యున్నవి.
జీవుడు
కర్మఫలమును
అనుభవించును.
ఈశ్వరుడు
దూరమునుండి
చూచుచూ
సాక్షీభూతుడగును.
జీవుడు
శరీర
ధర్మముతో
నైక్యమై
దుఃఖము
ననుభవించుచున్నాడు.
ఏనాడు
తానే
ఈశ్వరుడనని
తెలిసికొనునో
అప్పుడు
శోక
విముక్తి
పొందుచున్నాడు.
ఈశ్వర
జ్ఞానేచ్ఛచే,
వశీకృతచిత్తుడైన
వానికి
విషయేచ్ఛ
నశించి
ఆత్మ
జ్ఞానము
కుదురును.
అట్టి
పవిత్ర
బ్రహ్మవిద్య
ఉపదేశమే
ఈ
ముండకోపనిషత్తుయొక్క
ఉద్దేశమని
చివరి
మంత్రము
తెలిపినది.
ముండమన
శిరస్సు;
ఉపనిషత్శిరోభూషణమగుటం
జేసి,
ఇద్దానికీ
నామము
కలిగినట్లు
తెలిసికొనవచ్చును.
అగ్నిని
శిరస్సునందు
ధరించుటయే
ముఖ్య
లక్షణముగా
యథావిధిగా
నాచరించిన
వారికే
బ్రహ్మవిద్య
బోధ(అర్థము)
కాగలదని
దీని
భావము.
5
▾
Meaning
Keep
ఈ
ఉపనిషత్తులో
మంత్ర
విచారణము
కొరకు
బ్రహ్మసూత్రముల
రెండధికరణములు
వినియోగింపబడినవి.
ఈ
ఉపనిషత్తులో
రెండేసి
ఖండములుగా
మూడు
అధ్యాయములు
ఇందు
గలవు.
ప్రథమ
ఖండమున
పరాపర
విద్యలును;
రెండవ
ఖండమున
పరబ్రహ్మ
ప్రాప్తి
హేతువగు
కర్మను
కర్మ
ప్రతిపాదకమగు
శబ్దము
సామాన్యముగ
మంత్రములలో
చెప్పబడినవి.
ఇవియే
కర్మ
కాండము
నందెక్కువ
వినబడుచున్నవి.
ఉపనిషత్తు
మంత్రములన్నియు
బ్రహ్మవిద్యా
ప్రతిపాదకము
లగుట
జేసి
పవిత్ర
సూచకము
లగుచున్నవి.
6
▾
Meaning
Keep
సృష్టికి
పరమాత్మయే
ఉపాదాన,
నిమిత్త
కారణం
పై
చెప్పినట్లు
సాలెపురుగు
ఇతర
వస్తువుల
సహాయం
లేకనే
తనలో
నుండే
దారమును
పుట్టించుకొనుచున్నది.
తిరిగి
దాని
నుపసంహరించుకొనుచున్నది.
ఇటులనే
పరమాత్మనుండి
ఇతర
వస్తువుల
సహాయము
లేకనే
ప్రపంచము
సృజింపబడుచున్నది.
ఏ
వస్తుతత్త్వమునుండి
మరియొక
తత్త్వము
కలుగుచున్నదో
అది
దాని
ఉపాదాన
కారణమగుచున్నది.
అంటే,
దారమునుండి
గుడ్డ,
మట్టినుండి
కుండ,
బంగారమునుండి
నగ
యెట్లు
ఏర్పడుచున్నవో
అటుల,
మట్టి,
బంగారు,
దారము
కుండకు,
నగకు,
గుడ్డకు
ఉపాదాన
కారణమగుచున్నవి.
అటులనే
బ్రహ్మ
పదార్థమునుండి
ప్రకృతి
పుట్టినది.
బ్రహ్మము
జగత్తునకు
నిమిత్త
కారణము
కూడా
అగుచున్నది.
అమేయమగు
ఈ
జగత్తును
సృష్టించినవాడు
సర్వజ్ఞుడు
కావలెను.
అట్టి
సర్వజ్ఞత్వము
ఒక
పరమాత్మకు
తప్ప
మరియొకరికి
సాధ్యము
కాదు.
7
▾
Meaning
Keep
బ్రహ్మ
జ్ఞానము
పరవిద్యయొక్క
ముఖ్య
లక్షణము.
స్వర్గమే
దాని
ఫలము.
స్వర్గము
కోరువారికి
కర్మాచరణే
ముఖ్య
మార్గము.
సమస్త
కర్మలకు
అగ్నిహోత్రము
ముఖ్యము.
కర్మాచరణలవలన
చిత్తశుద్ధి
కలుగుచున్నది.
ఇది
పరవిద్య
కత్యంత
ఆవశ్యకమగు
పూర్వాంగము.
ప్రకాశించుచున్న
ఆహుతులు
ఆ
యజమానిని
పిలుచుచున్నట్లుండును.
అగ్నిహోత్ర
కర్మలను
జ్ఞాన
సమేతముగా
చేయువాని
ఆహుతులు
సూర్య
కిరణములు
గ్రహించుచున్నవి.
ఇంద్రుడు
నివసించు
స్వర్గమునకు
అతనిని
తీసుకొని
పోవుచున్నవి.
8
▾
Meaning
Keep
అగ్నిహోత్రము,
సత్యము,
తపస్సు,
వేదాధ్యయనము,
అతిథి
పూజనము
మొదలగు
శ్రౌత
కర్మలు
ఇష్టములనబడును.
దేవాలయ
సత్రములు,
చావిడులు,
తటాకములు,
దారి
ప్రక్కన
వృక్షములు
నాటుట
స్మార్త
కర్మలు
పూర్తమనబడును.ఇవి
కర్మ
ఫలములని
చూపబడినవి.
సంసారమంతయు
కర్మ
నిబద్ధమగుటచే
సహజము
కాదు.
అది
కృతకము.
దాని
ఫలము
కూడా
కర్మ
జన్యమగుటచే
కృతకము.
అనిత్యమగుచున్నది.
9
▾
Meaning
Keep
ఓంకారం
ధనుస్సు,
జీవుడు
బాణం,
బ్రహ్మ
లక్ష్యం
సృష్టియంతయు
నామ
రూపాత్మకము.
అనృతము,
వాక్కులచే
వర్ణింపబడుచున్న
వికార
స్వరూపము.
పరమ
పురుషుడే
సర్వ
సృష్టి
కారకుడు.
అతడే
నిత్య,
సత్య,
నిర్మల
స్వరూపుడు.
సర్వ
కర్మలు,
ఫలములు
కూడను
విరాట్
పురుషుని
వలననే
కలిగినవి.
కలుగుచున్నవి.
అయితే
అతడు
అదృశ్యుడు.
అగ్రాహ్యుడు.
“నేను”
అనునది
బ్రహ్మమే
అని
శ్రుతి
చెప్పుచున్నది.
రథ
చక్ర
నాభియందలి
ఆకులవలె
అద్దానియందు
సమస్త
ప్రపంచము
నిబద్ధమై
యున్నది.
ఆ
పరమార్థ
వస్తువుకంటే
వ్యతిరిక్తమయిన
వస్తువేదియును
లేదు.
ఇట్టి
పదార్థమును
పొందుటకు
మనసు
ముఖ్యమని
కూడ
తెలిసినది.
10
▾
Meaning
Keep
బ్రహ్మమను
లక్ష్యమును,
మనస్సను
బాణముచే
కొట్టవలెను.
ఉపాసనా
లభ్యమగు
చిత్తైకాగ్రముచే
పదును
పెట్టబడిన
అంతఃకరణ
బాణము
ఉపనిషద్ధనుస్సునందు
ఎక్కుపెట్టి,
అక్షర
స్వరూపమగు
పరబ్రహ్మమగు
లక్ష్యమునందు
గురిపెట్టి
లాగి
వదలవలెను.
అనగా
ఓంకారము
ధనుస్సు.
జీవుడు
బాణము.
బ్రహ్మము
లక్ష్యము.
పరబ్రహ్మము
అంతఃకరణమునందు
ప్రతిబింబమై
దానిని
ఉద్దీపింపజేయుచున్నది.
అట్టి
అంతఃకరణమును
బాహ్యములగు
స్వవిషయములనుండి
మరల్చి,
వైరాగ్యముచే
చిత్త
కాలుష్యమును
పోగొట్టుకొనవలెను.
11
▾
Meaning
Keep
ఇట్టి
నిర్మలమగు
చిత్తమునందు
ఓంకారోపాసనచే
ఏకాగ్రతను
సమకూర్చవలెను.
బండిచక్రపు
కుండనుండి
బండి
ఆకులవలె,
హృదయమునుండి
అనేక
నాడులు
బయలుదేరి
దేహమంతయూ
వ్యాపించియున్నవి.
హృదయాంతర్భాగమునందు
జీవుడనేక
ప్రకారముల
మారుచున్న
వానివలె
కనిపించును.
జీవుని
కంటె
వేరుగాని
ఆత్మను,
ఓంకారమును
ఆలంబనముగా
గ్రహించి
ధ్యానము
చేయవలెను.
అపుడు
అజ్ఞానపు
గట్టు
కనిపించును.
12
▾
Meaning
Keep
అవిద్యా
నాశనమే
మోక్షం
ప్రపంచమంతయూ
పరమేశ్వరుని
మహిమా
సూచకములు.
హృదయాకాశము
పరమేశ్వరోపలబ్ది
స్థానము.
పరబ్రహ్మము
ప్రాణములకు
ప్రాణము.
అట్టి
పరమాత్మ
రూపము
లేనిదగుటచే,
నేత్రములచే
చూడ
శక్యము
కాదు.
నామము
లేనిదగుటచే
వాక్కుతో
చెప్పనలవి
కాదు.
ఇక
ఇతర
ఇంద్రియములకు
గ్రహణయోగ్యము
కాదు.
తపస్సు
చేతగాని,
వైదికమగు
అగ్నిహోత్రాది
కర్మలచేకాని
అది
లభ్యము
కాదు.
13
▾
Meaning
Keep
రాగాది
దోషములు
తొలగి
బుద్ధి
నిర్మలము,
ప్రసన్నము
అయినపుడు
బ్రహ్మజ్ఞానము
లభించును.
జ్ఞానము
చేతనే
సాక్షాత్కారము
ప్రాప్తించును.
ధ్యానముచే
చిత్తైకాగ్రత,
అందుచే
జ్ఞానము.
చిత్తము
నిర్మలమయినపుడు
శరీరమునందే
ఆత్మ
తెలియబడగలదు.
14
▾
Meaning
Keep
ఏ
శరీరమునందు
పంచప్రాణములు
రూపమున
ప్రవేశించినవో,
అట్టి
శరీరమునందే
విశుద్ధ
జ్ఞాన
సంపన్నమగు
చిత్తముచేత
సూక్ష్మతమమగు
ఆత్మ
తెలియుచున్నది.
క్షీరమునందు
వెన్న,
కట్టెలయందు
అగ్ని
వలె
ఇంద్రియములతో
కూడి
ఆత్మ
యున్నది.
ఈ
చిత్తము
క్లేశాది
కలుషితమై
యున్నది.
అది
విశుద్ధమయినపుడు
హృదయమున
పరమాత్మ
ప్రత్యగాత్మగా
ప్రకాశించును.
ఇట్టి
ఆత్మజ్ఞానము
తెలిసికొన్నవాడే
పూజ్యుడు.
బ్రహ్మజ్ఞాని
బ్రహ్మమే.
అవిద్యా
వినాశమే
మోక్షము.
Previous
←
Kaṭha Upaniṣad
Next
Māṇḍūkya Upaniṣad
→