Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Upaniṣad Vāhini · Māṇḍūkya Upaniṣad
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
5.
మాండూక్యోపనిషత్
పరోక్షముగా
కనిపించు
బ్రహ్మమే
అపరోక్షమగు
ఆత్మ
ఈ
ఉపనిషత్తు
సర్వ
వేదాంత
సారము.
అన్నింటికంటెను
గంభీరమైనది.
మోక్షప్రాప్తికి
ఈ
మాండూక్యోపనిషత్తు
ఒక్కటి
చాలునని
బ్రహ్మవిద్యను
బోధించునట్టి
వాటిలో
ఇది
ముఖ్యమైనదైయున్నది.
కాని
ఉపనిషత్తులలో
ఇంత
చిన్నది
మరే
ఉపనిషత్తు
లేదు.
ఇది
చాల
స్వల్పమైనది.
దీనిలో
పదురెండు
మంత్రములు
మాత్రము
కలిగియున్నది.
ఇందులో
ఆగమ,
వైతథ్య,
అద్వైత,
అలాతశాంతులను
నాలుగు
ప్రకరణములు
విలసిల్లినవి.
2
▾
Meaning
Keep
మొదటిదైన
ఆగమ
ప్రకరణమందు,
ఆత్మతత్త్వమునకు
ఉపాయమగు
ఓంకార
తత్త్వము
నిర్ణయింపబడినది.
రెండవదైన
వైతథ్య
ప్రకరణమున
ద్వైతోపశమనము
విలసిల్లినది.
మూడవదైన
అద్వైతమున
ఏకత్వమును
అనగా
అద్వైతత్త్వమును
విచారింపబడినది.
నాల్గవదైన
అలాతశాంతి
ప్రకరణమున
పరస్పర
విరుద్ధములు,
అవైదికములు
మతాంతరములు
వివరింపబడినవి.
3
▾
Meaning
Keep
శబ్దములన్నియు
ఓంకారముకంటె
వేరు
కావు.
కనుక
అవి
అన్నియూ
ఓంకారములగుచున్నవి.
అయితే
బ్రహ్మ
ఓంకార
శబ్ద
వాక్యమగుటవలన
ఓంకారము
బ్రహ్మము
కంటే
వేరు
కాదు.
పరోక్షముగా
కనిపించు
బ్రహ్మమే
అపరోక్షమగు
ఆత్మ.
ఆత్మకు
విశ్వ,
తైజస,
ప్రాజ్ఞాది
భేదము
ఉపాధి
కల్పితము.
నేను
అని
సర్వ
సామాన్యముగ
తెలియవచ్చు.
ఆత్మ,
రెండూ
ఒక్కటియే.
4
▾
Meaning
Keep
ఈ
అవస్థా
త్రయము
నొకదాని
తరువాత
నొకదానిలో
తనను
అనుసంధానము
చేసికొని
ఆయా
అవస్థల
అనుభవించుచున్నది.
నదీ
ప్రవాహ
మధ్యగత
మగుచు,
రెండు
కూలములను
అంటక
సంచరించు
మత్స్యము
వలె
ఉండును.
5
▾
Meaning
Keep
సుషుప్తియందు
విషయవాసనలన్నియు
ఘనీభూతములగుట
వలన,
ఉన్ననూ
ఉండినట్లు
కనిపించవు.
స్వప్నమునందు
వాసనారూపమున
దానిని
అనుభవించుచున్నారు.
విషయవాసనలన్నియూ
మానసిక
సంచలనముచే
జాగ్రత్స్వప్నములందు
మొలక
వేయుచున్నవి.
దీనినే
అనగా
మానసిక
స్పందనమునే
సృష్టి
అనబడుచున్నది.
జాగ్రదాద్యవస్థాత్రయముకంటే
(అనగా
జాగ్రత్,
స్వప్న,
సుషుప్తి
అను
మూడు
అవస్థల
కంటే)
భిన్నమయినది
ఒకటి
కలదు.
దానినే
తురీయము
అని
అందురు.
6
▾
Meaning
Keep
అమనస్కత్వమే
తురీయం
ఇది
మనోవాగతీతము.
తురీయము,
శాంతము,
శివము,
అద్వైతము
ఈ
నాలుగునూ
పాదములని
పిలువబడినవి.
ఇది
అద్వితీయము,
నిర్వికారము.
తురీయమునందు
మానసిక
వాసనలన్నియూ
నశించి
అమనస్కత్వమేర్పడును.
7
▾
Meaning
Keep
తురీయమున
అమనస్కత్వము,
సుషుప్తియందు
మనస్కత్వము,
జాగ్రత్స్వప్నములందు
మనఃస్పందనములు
కలవు.
అయితే
ఈ
మూడునూ
తత్త్వమును
గ్రహింప
లేకుండుటచే
సమానముగా
నుండును.
8
▾
Meaning
Keep
ప్రపంచమనునది
నిజముగా
నున్నయెడల
అది
తురీయమునకు
భంగకరమే
కావలెను.
కాని
అది
నిజము
కాదు;
మనఃస్పందనముచే
కల్పింపబడిన
భ్రమ
మాత్రమే!
నిజము
తెలిసిన,
త్రాటియందు
నిరూపించిన
సర్పమువలె
భ్రాంతి
నశించును.
ప్రపంచమునకు
పుట్టుక
లేములు
రెండు
అసత్యములే.
9
▾
Meaning
Keep
ప్రణవమే
పరమాత్మ
తత్త్వం
జాగ్రత్స్వప్న
సుషుప్త్యవస్థలను
ప్రాజ్ఞులు
క్రమముగా
అకార,
ఉకార,
మకారములతో
సరిపెట్టుచున్నారు.
ఈ
మూడింటి
పర్యవసానమే
ఓంకారము.
అకార
ప్రధానమగు
ఓంకారోపాసనము
వలన
సర్వ
కామ్య
ప్రాప్తియు
సిద్దించును.
ఉకార
ప్రధానముగా
చేయు
ఓంకారోపాసనము
వలన
జ్ఞానసంతతి
కలుగును.
మకార
ప్రధానముగా
చేయు
ఓంకారోపాసనము
వలన
లయమగుచున్నది.
ఇట్లు
తెలిసికొని
ఓంకారోపాసన
చేయువారు
జగత్తు
యొక్క
యథార్థమును
తెలిసికొనగలరు.
అకారాది
మాత్ర
త్రయమునందు
తాను
కూడ
ఉన్నాడను
సత్యమును
గ్రహించి,
ఓంకారోపాసనము
జేయువాడు
సర్వవంద్యుడగునని
ఓంకారోపాసనముయొక్క
ఉత్కృష్టత
తెలియబడినది.
10
▾
Meaning
Keep
అకారాది
మాత్రాత్రయము
ఓంకారమున
లయమగుటచే
అది
అమాత్ర
అగుచున్నది.
ఓంకారము
శాంతము,
శివము,
అద్వైతము.
ఇట్టి
జ్ఞానమువలన
బ్రహ్మాత్మైక్యము
వచ్చును.
ప్రణవము
సృష్టి,
స్థితి,
లయ
కారణమనియూ,
సర్వ
శోక
నాశకమనియు
24-29
కారికలలో
స్తుతింపబడుచున్నది.
ఇంతియే
కాదు,
ఓంకార
తత్త్వమును
తెలిసికొని
మననము
చేయువాడు
పరమాత్మ
తత్త్వమును
తెలిసికొనిన
వాడగుచున్నాడు.
11
▾
Meaning
Keep
అద్వైతము
పరమార్థము,
ద్వైతము
మనఃకల్పితము
ప్రథమ
ప్రకరణమున
ఆత్మయొక్క
యద్వైతమాగమము
సామాన్యముగా
సిద్ధము
చేయబడినది.
వైతథ్య
ప్రకరణమున
ద్వైతమనిత్యమని
ప్రదర్శింపబడినది.
అద్వైత
ప్రకరణమున
ఆగమ
ప్రతిపాదితమగు
ద్వైతము
యుక్తియుక్తముగ
సిద్ధాంతము
చేయబడినది.
నానా
రూపమగు
జగత్తు
పుట్టుటకు
పూర్వము
అవ్యక్తము.
“కార్యబ్రహ్మోపాసన
చేతనే
ఇప్పుడు
ఉత్పన్నమగు
బ్రహ్మను
పొందుచున్నాను”
అని
తలంచు
ఉపాసకుడు
కృపణుడు
(నీచుడు).
ఉపాసనముచే
నద్వితీయబ్రహ్మము
లభింపనేరదు.
కృపణము
కానట్టియు,
పుట్టుక
లేనట్టియు,
సర్వసామాన్యమును
పొందినట్టియు,
బ్రహ్మము
ఇచట
వివరింపబడుచున్నది.
ఆత్మ
ఆకాశమువలె
సర్వ
వ్యాపి.
ఒకే
ఆకాశము,
ఘటాకాశము,
మఠాకాశము
మొదలగు
అనేక
రూపముల
అభివ్యక్తమయినట్లు
ఆత్మ
అనేక
జీవరూపముల
అభివ్యక్తమగుచున్నది.
అట్టి
అభివ్యక్తమయిన
ఆత్మ
సత్యము
కాదు.
12
▾
Meaning
Keep
జీవునకు
ఆశ్రయమగు
శరీరము
ఘటము
వంటిది.
ఘటకృత
పరిచ్ఛిన్నత్వము
తప్ప
ఘటాకాశ,
మఠాకాశములకు
భేదము
లేనట్లే,
శరీరావృత
పరిచ్ఛేదము
దప్ప
జీవాత్మలకు
భేదము
లేదు.
ఘటము
భిన్నమయినపుడు
ఘటాకాశము
మహాకాశమున
కలసినట్లు,
శరీరము
నశించినపుడు,
జీవుడాత్మయందు
ఐక్యమును
బొందును.
ఉపాధికృత
భేదము
తప్ప,
పరమార్థమున
జీవులకు
భేదము
లేదు.
13
▾
Meaning
Keep
ఘటాకాశము
ఆకాశముయొక్క
వికారముకానీ,
యవయవముకానీ
కానట్లే
జీవుడు
ఆత్మయొక్క
వికారముకానీ,
యవయవముకానీ
కాడు.
జీవుని
జనన
మరణములు
లోకాంతర
గమనాగమములు,
సత్యములు
కావు.
అవి
అవిద్యా
కల్పితములు.
ద్వైతమునకు
అద్వైతము
విరుద్ధము
కాదు.
ద్వైత
మతములు
పరస్పర
విరుద్ధములు.
అద్వైతమందు
సర్వము
పరబ్రహ్మమే
అగుటన్జేసి
అద్దానికి
దేనితోనూ
విరోధకారణము
లేదు.
ద్వైతమతములు
రాగ
ద్వేషాది
అభిమాన
పూరితములు.
అద్వైతము
పరమార్థము.
ద్వైతము
మనఃకల్పితము.
14
▾
Meaning
Keep
ఆత్మ
ఒక్కటియే
సత్యము,
నిత్య
ప్రకాశము
మనోవ్యాపారమున్నపుడు
మాత్రము
మనస్సు
కన్పించును.
మనస్సు
నిర్వ్యాపారమగు
సుషుప్తి
సమాధులయందు
కాన్పించుటలేదు.
అవిద్యాకృతమగు
భ్రాంతిదశయందు
తోచుటచే
ద్వైత
మద్వైతమునకు
విరుద్ధము
కాదు.
సర్పభ్రాంతికి
త్రాడు
కారణమయినట్లు,
జగద్భ్రాంతికి
బ్రహ్మము
కారణమగుచున్నది.
పరమాత్మ
జగద్రూపమున
బుట్టుచున్నదను
వాదము
సహేతుకము
కాదు.
స్వభావమును
మార్చ
నెవరికిని
శక్యము
కాదు.
నానాత్వము
పరమార్థము
కాదని
అనేక
శ్రుతులు
చెప్పుచున్నవి.
అంతియే
కాక
నిందించుచున్నవి.
స్వప్నానుభవములు
అసత్యమనుచున్నాము.
స్వప్నానుభవముల
వలెనే
జాగ్రదనుభవము
కూడా
మానసిక
మాత్రమగుటచే
అదియూ
అసత్యమని
ఊహింపక
తప్పదు.
15
▾
Meaning
Keep
అన్నింటికీ
ద్రష్టయగు
ఆత్మ
చైతన్యము
సత్యము.
వివేక
వైరాగ్యాభ్యాసములచే
మనస్సును
విషయములనుండి
మరలించినపుడు
అమనోభావము
లభించును.
కనుక
ఆత్మ
ఒక్కటియే
సత్యము.
మిగిలినవన్నియు
అసత్యము.
విషయాసత్యత్వ
జ్ఞానము
లేని
మానసిక
నిరోధమునందు
కూడా
విషయ
వాసనలు
నశింపవు.
మానసిక
నిరోధము
సడలినపుడు
అవి
తిరిగి
మొలకెత్తును.
అనగా
సుషుప్తి
నిరోధమునందలి
విషయ
నివృత్తి,
మనసు
నిర్వ్యాపారమగుటచే
సంభవించుచున్నది.
అది
తొలగినపుడు
మనస్సు
తిరిగి
వ్యాపారవంతమయి
విషయాభిముఖమగునని
గ్రహించవలెను.
సర్వ
విషయజాతము
అసత్యమను
దృఢ
జ్ఞానము
కలిగినప్పుడు
మనసు
వానిపై
పోదు.
అత్యంత
ఆకలిగొన్న
వాడయిననూ
అమేధ్యమును
ఆశించునా?
ఆశించడు.
16
▾
Meaning
Keep
సాక్షాత్కారమగు
ఆత్మకు
నిద్ర,
జన్మము,
నామము
మొదలైనవి
లేవు.
అది
నిత్య
ప్రకాశ
స్వరూపము.
ఇట్టి
జ్ఞానము
నిర్వికార
హేతువు.
మిథ్యాత్మ
జ్ఞానహీనమగు
మనోనిగ్రహము
కేవలము
గడ్డిపోచతో
సముద్రమును
కాళీచేయు
ప్రయత్నమువలె
అత్యంత
కష్టసాధ్యము.
ప్రశాంతము,
అభయమునగు
స్థితి
లభించుటకు
దృఢమగు
జగన్మిథ్యాత్మ
జ్ఞానమొక్కటి
మాత్రమే
అవసరము.
17
▾
Meaning
Keep
అజ్ఞానావరణముచే
సర్వము
పుట్టుచున్నది
ఏ
వస్తువయినను
పుట్టవలెనన్న
సత్పదార్థమో,
అసత్పదార్థమో
లేక
సదసత్పదార్థము
నుండియో
పుట్టవలెను
కదా!
పుట్టుక
ఒక
వికారము.
కారణమే
కార్యరూపమున
వికారము
జెందుచున్నది.
సత్పదార్థము
వికారము
లేనిది
కనుక
జన్మకది
కారణము
కానేరదు.
అసత్పదార్థము
అనగా
శూన్యమునుండి
భావ
రూపకమగున
దేదియు
పుట్టుట
అసంభవము.
సదసద్రూపము
పరస్పర
విరుద్ధము.
కనుక
పుట్టుక
అనునది
అసంభవము.
బాహ్యములగు
వస్తువులు
పరస్పర
భిన్నమగుట
వలననే
జ్ఞాన
భేదము
కలుగుచున్నది.
వహ్నియని
తలంచినంత
మాత్రముననే
దాహ
దుఃఖము
కలుగదు.
దానిని
చేతితో
తాకినంతమాత్రమున
దాహపీడ
అనుభవించుచున్నారు.
ఇటులనే
బాహ్య
పదార్థములు,
వాని
జ్ఞానముకంటె
భిన్నములు.
కనుకనే,
వాని
వలన
వాని
దుఃఖాదులు
సంభవించుచున్నవి.
18
▾
Meaning
Keep
ఘటము
మృత్తిక
కంటె
వేరు
కాదు.
అటులనే
కారణ
పరంపర
నెంత
అన్వేషించిననూ
ఆత్యంతికమగు
కారణము
చిక్కదు.
త్రాడునందు
సర్పము
లేకనే
సర్ప
భ్రాంతి
కలుగుచున్నది.
భ్రాంతియంతయు
భావాత్మకము.
అనగా
మనఃకల్పితము.
స్వప్నమునందు
బాహ్యార్థము
లేకనే
ద్వైతమును,
దుఃఖమును
అనుభవించుచున్నాము.
మానసికమగు
జ్ఞానమునకు
ఆలంబనము
కానీ,
నిమిత్తముకానీ
లేవు.
సత్య
జ్ఞానము
లేకున్ననూ
భ్రాంతి
జ్ఞానము
కలుగవచ్చును.
అవిద్యా
దూషితమగు
చిత్తమునకు
భ్రాంతి
స్వభావము.
ఈ
ఉపనిషత్తు
సదసత్తులకు
కారణ
కార్య
భావములు
ఘటింపవని
తెలిపినది.
చిత్తమునకు
పుట్టుక
లేదు.
వెలుగుచున్న
అగరువత్తి
యందలి
వివిధాభావములు
మరియొక
చోటు
నుండి
పుట్టుట
లేదు.
అట్లే
విజ్ఞానము
చలించినపుడు
కాన్పించు
ద్రవ్యాభ్యాసములు
విజ్ఞానమునందుగానీ,
మరొక
చోటునుండి
కాని
పుట్టుట
లేదు.
ఇవి
యాభాస
మాత్రములు,
ద్రవ్యములు
కావు.
బాహ్య
ధర్మములు
చిత్తమునుండి
కానీ
చిత్తము
బాహ్యధర్మములనుండి
కానీ
యుత్పన్నమగుటలేదు.
అజ్ఞానమను
ఆవరణముచే
సర్వమును
పుట్టుచున్నవి.
19
▾
Meaning
Keep
ఆత్మ
దర్శికి
అంతా
ఆత్మే
అగుచున్నది
ఉత్పత్తి
వినాశ
లక్షణమగు
సంసారము
అజ్ఞానముయొక్క
ఫలము.
పరమాత్మయందు
సర్వమాత్మ
స్వరూపము
కనుక
జన్మము
కానీ
కార్య
కారణ
భావములు
కానీ
ఉండనేరవు.
ఆత్మ
దర్శికి
సర్వము
ఆత్మయే
అగుచున్నది.
మాయామయమగు
విత్తనముచే
మాయామయమగు
అంకురము
ఉత్పన్నమగును.
కానీ
మాయా
బీజాంకురములు
రెండును
అసత్యములగుచున్నవి.
అటులనే
జీవునియొక్క
ఉత్పత్తి
వినాశములు
రెండునూ
అసత్యములే.
ఇవి
శబ్ద
మాత్రములు.
స్వప్న
ద్రష్టయొక్క
చిత్తమతని
కంటే
వేరు
కాదు.
20
▾
Meaning
Keep
నిమిత్తము
లేకుండుటచే
చిత్తమునకు
పుట్టుక
లేదు.
ఉత్పత్తి
హేతువులగు
ధర్మాధర్మముల
నిరసనముచే
నుత్పత్తి
లేకుండును.
ఇదియే
మోక్షము.
ఉత్పత్తి
యనునది
కూడను
చిత్త
స్పందన
మాత్రము.
ఈ
విషయమును
తెలిసికొని
తురీయమగు
ఆత్మ
తత్త్వమును
విశేషముగా
గుర్తెరుగవలెను.
అందుచే
అది
విజ్ఞానమని
పిలువబడుచున్నది.అట్లు
తెలిసికొనినవానికి
నామము,
రూపము,
వస్తువు,
భావము
మొదలగునవి
అన్నియు
ఆత్మయే
యగుచున్నవి.
సర్వ
మాత్మయే.
ఆత్మ
తప్ప
మరేమియూ
లేదని
అద్వైతము
బోధించుచున్నది.
ఆత్మ
శూన్యము
కాదు.
21
▾
Meaning
Keep
ఈ
మాండూక్యము
ఉపనిషత్తులన్నిటి
కంటే
హ్రస్వతమము.
ఇందులో
చేయబడిన
విమర్శన
ఇతర
ఉపనిషత్తులకంటే
అత్యంత
విలక్షణము.
కర్మ
ప్రస్తావనము
ఇందులో
నేమాత్రము
లేదు.
కేవలము
ఆత్మ
తత్త్వము,
దాని
విచారణ
మాత్రము
ఈ
ఉపనిషత్తునందు
విషయమై
ఉన్నది.
Previous
←
Muṇḍaka Upaniṣad
Next
Bṛhadāraṇyaka Upaniṣad
→