Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Upaniṣad Vāhini · Bṛhadāraṇyaka Upaniṣad
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
6.
బృహదారణ్యకోపనిషత్
మహత్తరమైన
బ్రహ్మతత్త్వవివరణ
బృహదారణ్యకోపనిషత్తు
శుక్ల
యజుశ్శాఖాంతర్గతము;
దీనియందు
ఆరు
అధ్యాయములు
కలవు.
అందులో
మూడు
నాలుగు
అధ్యాయములు
తప్ప,
తక్కిన
నాలుగు
అధ్యాయములు
కర్మసముచ్చయమగు
ఉపాసనమును
వివరించినవి.
మూడు
నాలుగు
అధ్యాయములందు
యాజ్ఞవల్క్యుడు
జనకునకు
ఆధ్యాత్మికతత్త్వమును
ఉపదేశించెను.
యాజ్ఞవల్క్యుని
ఆధ్యాత్మిక
జ్ఞాన
వైభవము
ఇందులో
పూర్తిగా
ప్రదర్శింపబడినది.
ఇది
ముముక్షువులకు
ఉత్తమమగు
తారకమగుచున్నందున
ఈ
రెండు
అధ్యాయములూ
యాజ్ఞవల్క్యకాండమని
ప్రఖ్యాతి
గాంచినవి.
ఈ
ఉపనిషత్తు
దశోపనిషత్తులలో
కడపటిది.
ఇది
అర్థమునందును,
పరిమాణమునందును
మహత్తర
మగుటచే
బృహత్తనియు,
అరణ్యమునందు
పఠించుటవలన
ఆరణ్యకమనియు,
బ్రహ్మజ్ఞానోపదేశమగుటచే
ఉపనిషత్తనియూ
అలరారుచున్నది.
2
▾
Meaning
Keep
మొదటి
రెండధ్యాయములు
మధుర
కాండమనియు,
తరువాత
రెండధ్యాయములు
మునికాండమనియు,
చివరి
రెండధ్యాయములు
ఖిలకాండ
మనియు
పండితలోకమున
చెప్పబడుచున్నవి.
ఖిలశబ్దమునకు
అనుబంధమని
అర్థము.
మొదటి
కాండమందు
తత్త్వము
యథారూపముగ
ఉపదేశింపబడినది.
అయ్యదియే
రెండవ
కాండమందు
అనుభవముచే
సమర్థింపబడినది.
మూడవదానియందు
దాని
ఉపాసనా
విధానము
ప్రదర్శించబడినది.
మొదటి
కాండము
జ్ఞానోపదేశము,
అది
కర్మోపాసనా
సముచ్చయ
రూపమున
ఉపదేశింపబడినది.
జిజ్ఞాసువులకు
బ్రహ్మజ్ఞాపకములగు
సాధనములు
పదము,
బీజము,
సంఖ్య,
రేఖ
అను
నాలుగు
విధముల
పిలువబడుచున్నవి.
వానిలో
పదమనగా
వేదము;
దాని
అర్థ
బోధకమగు
శ్రుతియు.
బీజమనగా
గురుముఖైక
వేద్యమగు
మంత్ర
సముదాయము.
సంఖ్య
వైదికము,
లౌకికము
అని
రెండు
విధములు.
వైదికమగు
సంఖ్య
మంత్ర
సంకేతముగ
అలరారుచు,
తత్త్వమునకు
సన్నిహిత
సాధన
మగుచున్నది.
లౌకిక
సంఖ్య,
సర్వ
ప్రపంచ
వ్యవహార
సర్వజనానుభవ
సిద్ధమగుచున్నది.
రేఖకూడ
సంఖ్య
వలెనే
రెండు
విధములు.
వైదికమగు
రేఖ
ఉపాసనాంగము.
లౌకికమగు
రేఖ
గణితశాస్త్రప్రసిద్ధము.
మధురకాండము
బ్రహ్మతత్త్వము.
శాస్త్ర
ప్రమాణమును
ముఖ్యమైన
ఆధారముగా
చేసికొని
విషయ
వివరణము
అచట
చేయబడినది.
3
▾
Meaning
Keep
ఈజగత్తు
నామరూపాత్మకము;
బ్రహ్మమే
అమృతము
అశ్వమేధయాగమునందలి
అశ్వము,
యాగాధి
దేవతయగు
ప్రజాపతి
స్వరూపమున
వర్ణించబడినది.
ఎట్లనగా,
ప్రజాపతి
గుణములను
దానియందు
అధ్యారోపము
చేసి
ఉపాసించినచో
అశ్వమేధయాగ
ఫలము
లభించును.
దీనినే
అశ్వబ్రాహ్మణమందురు.
అశ్వమేధయాగీయమగు
అగ్ని,
ప్రజాపతిని
ఉపాసించు
రూపమనికూడ
వర్ణింపబడినది.
ప్రజాపతియే
ప్రథమ
పురుషుడు.
అతని
వలన
నామ
రూపాత్మకముగ
జగత్తు
అభివ్యక్తమగుచున్నది.
దీనిని
అగ్నిబ్రాహ్మణమని
కూడ
పిలిచెదరు.
4
▾
Meaning
Keep
అవిద్యచే
వ్యాకృతమైన
ఈ
జగత్తు
నామరూపాత్మకము,
అనాత్మ
భూతము
కనుక
వైరాగ్యకారణ
మగుచున్నది.
సంసారమునందు
ఆసక్తమగు
చిత్తము
బ్రహ్మచింతనము
చేయదు.
శబ్దములన్నియూ
నామాత్మకములు.
వీనికి
వాక్కు
కారణము.
రూపములన్నిటికిని
చక్షుస్సు
కారణము.
కర్మలన్నింటికీ
శరీరము
కారణము.
శరీరము
వాగాదిరూపమున
నున్నది.
ఇట్టి
సంసారవిముఖత
చెందినపుడే
ఆత్మచింతనము
సాధ్యమగును.
ప్రాణము,
దాని
ఆధారమగు
శరీరము,
వివిధ
జ్ఞానములకు
సాధనములకు
స్థానమగు
శిరస్సు,
ఆహారమువలన
కలుగు
బలము,
ఇట్టి
జ్ఞానముచే
కలుగు
లాభము
ఇందులో
వివరించబడినవి.
అనేక
పుష్పరసముల
సమాహార
కార్యము
మధువైనట్లు
సర్వభూత
నిర్మాణమగునది,
ఈ
పృథివ్యాది
పంచభూతాత్మకమగు
జగత్తు.
అదేవిధముగ
ధర్మము,
సత్యము,
మనుజులు
ఆదిగాగల
ప్రాణికోటి,
విరాట్పురుషుడు,
ఇవి
అన్నియు
బ్రహ్మకార్యము
లగుచున్నవి.
బ్రహ్మమే
అమృతము.
ఇట్టి
బ్రహ్మజ్ఞానము
సర్వాత్మభావ
హేతువగుచున్నది.
5
▾
Meaning
Keep
యజ్ఞయాగోపాసనముల
వివరణ
విదేహరాజగు
జనకుడు
బహుదక్షిణాకమగు
ఒక
యాగమును
చేసెను.
కురుపాంచాల
దేశములనుండి
యాగమునకు
అనేక
బ్రాహ్మణులు
విచ్చేసిరి.
వారలలో
తనకు
బ్రహ్మజ్ఞాన
ముపదేశింపగల
వారెవరైన
నున్నచో
అట్టివానికి
కొమ్ములకు
పాదములకు
సువర్ణములతో
అలంకరింపబడిన
వేయి
గోవుల
నిత్తునని
జనకుడు
ప్రకటించెను.
అయితే,
అక్కడ
చేరిన
వారలొక్కొక్క
విద్యయందగ్రగణ్యులైనను
వారికెవరికి
ఆ
గోవులను
తీసికొనిపోవుటకు
ధైర్యములేకుండెను.
యాజ్ఞవల్క్యుడు
ఆ
గోవులను
తన
ఇంటికి
తోలుకొనిపొమ్మని
తన
శిష్యునకు
ఆనతిచ్చెను.
ఇందులకు
అక్కడనున్న
బ్రాహ్మణులు
కుపితులై
యాజ్ఞవల్క్యుని
పరీక్షింపదొడంగిరి.
వారిలో
మొదటివాడయిన
అశ్వలుడను
జనకుని
పురోహితుడు
ప్రశ్నించిన
కర్మోపాసనా
సముచ్చయమగు
ప్రాణాత్మ
ప్రాప్తివిధానము,
ఆయన
ప్రశ్నలకు
యాజ్ఞవల్క్యుడు
చెప్పిన
సమాధానములచే
విస్తరింపబడెను.
యజ్ఞసాధనములకు
ఋత్విక్కుల
వాక్కు
అగ్ని
స్వరూపముగను,
వాయురూపమగు
కాలమును
సూత్రాత్మయగు
వాయురూపమునను,
యజమాని
మనస్సును
చంద్రునిగాను
భావించి
ఆ
మృత్యువుబారి
నుండి
తప్పించుకొన
శక్యము.
ఈ
విధముగా
యజ్ఞయాగోపాసనములు
వివరింపబడినవి,
అని
యాజ్ఞవల్క్యుడు
విశదీకరించెను.
6
▾
Meaning
Keep
సంపూర్ణనివృత్తి
ద్వారానే
ఆత్మసాక్షాత్కారము
తదుపరి
“పుణ్యపాప
బోధితములగు
ఇంద్రియములకు
వశవర్తియై
సంసారమున
చరించు
పురుషుడు
ఒకడు
కలడా?
లేడా?
ఉన్నచో
అతని
లక్షణములు
ఏమి”?
అని
అడిగిన
భుజ్యువునకు
యాజ్ఞవల్క్యుడు
ఇట్లు
జవాబు
చెప్పెను:
“నీ
ఆత్మయే
నీవడిగిన
ప్రశ్నకు
సమాధానము”
అని
హస్తవిన్యాసముచే
చూపెను.
చేతనాధిష్ఠితముకాక
కేవల
దారుయంత్రము
తిరిగినట్లే
శరీర
యంత్రమొక
విజ్ఞానమయునిచే
నధిష్టింపబడక
ప్రాణాది
క్రియా
చరణసమర్థము
గానేరదని
యూహింపవలసియున్నది.
శరీరము
చేయు
దృష్టిక్రియకు
అతడు
ద్రష్ట,
శ్రవణక్రియకు
అతడు
శ్రోత;
మానసక్రియకు
అతడు
మననకర్త,
శరీరము
చేయు
దర్శన,
శ్రవణ,
మననాది
క్రియలు
నశ్వరములు.
వీనికి
కారణము
ద్రష్ట.
శ్రోత
అకారణము,
చేతనాత్మకము.
అది
మనస్సంయోగముచే
ఇంద్రియముల
ద్వారా
తద్విషయములను
గ్రహించినపుడు
ఆయా
పనులు
చేసినట్లు
వ్యవహరించబడును.
చేతనమే
ద్రష్ట;
అది
దృష్టికూడా
అగుచున్నది.
ఆ
చేతనమే
ఆత్మ,
ఇది
ఇంద్రియములకు
గోచరము
కాదు.
ఇది
స్థూలసూక్ష్మ
శరీరములకంటే
భిన్నము.
ఆత్మయను
వాడొకడున్నాడనియు
అట్టి
ఆత్మయే
మన
అందరి
ఆత్మయనియు
నిశ్చయింపబడినది.
సర్వ
సన్యాసముచే
అట్టి
ఆత్మను
పొందతగును.
7
▾
Meaning
Keep
పుత్ర
విత్తదారలయందలి
ఏషణలను
ముందుగా
పరిత్యజించవలెను.
కామమును
ఆధారము
చేసికొని
ఏషణలన్నియూ
కలుగుచున్నవి.
ఏషణాత్రయము
ఒకజాతికే
చేరుచున్నది.
కర్మములు
స్వయముగా
గానీ,
ఉపాసనా
సముచ్చయము
లయినపుడు
కానీ,
కామ
నిమిత్తములే
అగుచున్నవి.
కర్మసాధనేచ్ఛ
ఆవశ్యకముగా
ఫలేచ్ఛయే
అగుచున్నది.
ఇవి
అన్నియు
సన్యాసమునకు
విరుద్ధములు
కనుక,
వానిని
వదలనిదే
సన్యాసము
అబ్బదు.
ఆత్మజ్ఞానమావశ్యకము.
చీకటి
వెలుగుల
వలె
అత్యంత
విరుద్ధములగు
కర్మాచరణాత్మజ్ఞానము
లొక్కచోట
ఒకమారు
ఉండలేవు.
సర్వక్రియా
పరిత్యాగము
సన్యాసము.
భిక్షాటనము
కూడా
కర్మయే
యగును.
8
▾
Meaning
Keep
పూర్వపు
బ్రాహ్మణులు
ఇట్టి
పరమార్థమును
తెలిసికొని
యేషణా
త్రయముల
పరిత్యజించి
సంపూర్ణమగు
నివృత్తిమార్గమున
ఆత్మసాక్షాత్కారమును
గాంచిరి.
ఆత్మను
తెలిసికొని
సాక్షాత్కారమును
చేసికొనుటయే
పాండిత్యము.
ఇదియే
బలము.
అనాత్మజ్ఞాన
విషయమగు
సర్వస్వమును
పరిత్యజించువాడే
బ్రాహ్మణుడు.
తక్కినదంతయూ
గౌణము.
9
▾
Meaning
Keep
బ్రహ్మలోక
విషయం
శాస్త్రం
ద్వారా
తెలుసుకోవాలి
ఇక
గార్గి
ప్రశ్నము:
బ్రాహ్మణములలో
వివరింపబడిన
సర్వాంతర
తత్త్వము
దీనిలో
వివరింపబడినది.
పృథ్వీ
సంబంధమగు
ధాతుజాత
మంతయు
ఉదకముచే
పిండీభావము
నొంది
నివాస
యోగ్యమగుచున్నది.
లేనిచో
పొడి
బియ్యపు
ముద్దవలె
ఎక్కడకక్కడ
విచ్చిపోవును.
ఇది
అనుభవసిద్ధము.
ఇది
కార్యస్వరూపము.
సూక్ష్మతరమగు
జలకారణముచే
వ్యాప్తమగుచున్నదని
యూహించి
పృథ్వి
దేనియందు
పడుగుపేకవలె
అంటబడియున్నదని
యాజ్ఞవల్క్యుని,
గార్గి
అడిగెను.
10
▾
Meaning
Keep
దీనినిబట్టి
చూడ
పృథ్వి,
జలము,
ఆకాశము,
సూర్య,
చంద్ర,
నక్షత్ర,
దేవ,
ఇంద్ర,
ప్రజాపతి,
బ్రహ్మలోకములు
క్రమముగా,
పూర్వపూర్వ
భూతములు
ఉత్తరోత్తర
భూతములచే,
వస్త్రమునందు
నూలుపోగులవలె,
పడుగుపేకవలె
వ్యాపించియున్నవని
ప్రశ్నవలన
తెలియక
తప్పదు.
ఇవి
ఊహచే
తెలియునవి.
బ్రహ్మలోక
విషయము
ఊహచే
తెలియదగినది
కాదు.
ఇది
శాస్త్రముచేతనే
తెలిసికొనవలెను.
11
▾
Meaning
Keep
అవ్యాకృత
ఆకాశమున
అక్షర
పరబ్రహ్మవ్యాపించియున్నాడు
గురూపదేశముచే
తెలిసికొనవలసిన
బ్రహ్మలోకమును
గూర్చి
బుద్ధి
యూహచే
ప్రశ్నించిన
గార్గి,
యాజ్ఞవల్క్యునిచే
నిషేధింపబడెను.
వాయువుచే
పృథ్వ్యాదులు
వ్యాపింపబడి,
సంరక్షింపబడుచున్నవి.
కర్మేంద్రియములు
ఐదు,
జ్ఞానేంద్రియములు
ఐదు,
ప్రాణములు
ఐదు,
మనస్సు,
బుద్ధి
ఈ
పదునేడింటితో
ప్రాణి
కూడుకొనియున్నది.
12
▾
Meaning
Keep
పూర్వకర్మ
వాసనా
సంవాపితము,
సమష్టి
వ్యష్టిస్వరూపము;
పృథివీ
వికారమునకు
లింగ
శరీరము
వాయువుచే
వ్యాప్తమయినది.
వాయువుయొక్క
బాహ్యరూపములు
నలువది
తొమ్మిది
మరుద్గణములు.
హారమునందలి
ముత్యములను
సూత్రమొక్కటిగ
కూర్చినట్లు,
వాయువు
వీటన్నిటినీ
ఒక్కటిగా
కూర్చినది.
వాయువు
శరీరమునుండి
లేచిపోవునపుడు
అంగములన్నియు
విడిపోవుచున్నవి.
అప్పుడు
శరీరము
ప్రేతమని
పిలువబడుచున్నది.
ఆధ్యాత్మికమగు
సర్వప్రపంచమునందు
ఎవడు
ఉండి,
వానికి
అంతరుడగుచున్నాడో,
ఎవనిని
అవి
తెలిసికొనలేకున్నవో,
ఎవనికి
అవి
శరీరమగుచున్నవో,
ఎవడు
లోపలనుండి
వానిని
నియమము
చేయుచున్నాడో,
అతడంతర్యామి;
అతడు
మరణ
రహితుడు;
అతడే
ఆత్మ.
13
▾
Meaning
Keep
సభ్యుల
అనుమతి
లేక
ఇచ్చవచ్చినటుల
వదరుట,
శాస్త్రార్థము
చేయుట
నియమములకు
వ్యతిరిక్తము.
కనుక
సభ్యుల
యనుజ్ఞను
బడసి
గార్గి
రెండవ
ప్రశ్న
అడిగెను.
అది
ఏమనగా!
“ద్వైతమగు
ఈ
జగత్తు
అంతయు
త్రికాలములయందు
వ్యాపించియున్న
సూత్రాత్మ
దేనియందు
వ్యాపించి
యున్నది?”
“అవ్యాకృతమగు
ఆకాశముచే
వ్యాప్తమగుచున్నద”ని
యాజ్ఞవల్క్యుడు
జవాబిచ్చెను.
14
▾
Meaning
Keep
“ఆకాశము
దేనిచే
వ్యాప్తమగుచున్నద”ని
మరల
గార్గి
ప్రశ్నించెను.
అది
అనిర్వచనీయమనియు,
అది
కాలత్రయాతీతమనియూ
దానిని
వివరించుటకు
యాజ్ఞవల్క్యుడు
చాలడు,
ఒకవేళ
వివరించినా
అది
అనిర్వచనీయము,
ఏ
విధముగనయిననూ
యాజ్ఞవల్క్యుడు
ఓడిపోవునుగదా!
అని
తలంచి,
గార్గి
ఈ
రెండవ
ప్రశ్న
అడిగెను.
ఇందుచే
గార్గికూడ
బ్రహ్మజ్ఞపదవిని
కాంక్షించుచున్నట్లు
కాన్పించుచున్నది.
దీనివలన
బ్రహ్మజ్ఞానమును
గూర్చి
స్త్రీ
పురుష
భేదమున్నట్లు
కాన్పింపదు.
“అవ్యాకృతమగు
ఆకాశమున
అక్షరమగు
పరబ్రహ్మము
వ్యాపించియున్నదని
బ్రహ్మవిదులు
పల్కుచున్నారు”,
అని
జవాబు
చెప్పి
గార్గి
పన్నిన
విషమ
పరిస్థితులను
రెండింటిని
యాజ్ఞవల్క్యుడు
తప్పించుకొనెను.
15
▾
Meaning
Keep
తరువాత
అక్షరుని
స్వరూపమును
ఇట్లు
వివరించెను.
“స్థూల,
సూక్ష్మ
పరిమాణము
వర్ణము.
గంధము
మొదలగు
ద్రవ్య
ధర్మములు
అతనికి
లేవు.
కాన,
అతడు
ద్రవ్యముకంటే
భిన్నుడు.
అతనిని
తెలియజేయు
ప్రమాణము
లెవ్వియును
లేవు.
కాలమంతయూ
అతని
ఆజ్ఞచే
ప్రవర్తింపబడుచున్నది.
వేయేల?
సూర్యచంద్రాది
పంచభూతములు
అతని
ఆజ్ఞానుసారము
నడచుచున్నవి”,
అని
యాజ్ఞవల్క్యుడు
ఉపన్యాసము
గావించెను.
గార్గి
విని
ఆయనకు
నమస్కరించుడని
ఇతర
బ్రహ్మవిదులకు
ఉపదేశించి
తాను
విరమించుకొనెను.
16
▾
Meaning
Keep
ఆత్మజ్ఞానికి
శరీరంతో
పనిలేదు
సూర్యకాంతివలె
ఆత్మ
ప్రకాశము
సహజము.
ఇది
చూచుచున్నట్లు
కాన్పించుచున్నను
నిజముగా
అది
చూచుటలేదు.
ఆత్మ
అద్వితీయము.
కనుక
దానిచే
చూడదగిన
వస్తువేదియు
లేదు.
ఆత్మ
జ్యోతిస్సొకటియే
దర్శనాది
విభిన్ననామములచే
వ్యవహరింపబడుచున్నది.
దర్శనాది
రూపములన్నియు
మిథ్యామాత్రములు,
ఆత్మ
అవ్యవహితము.
కనుక
దర్శనాదులు
అద్దానికి
కల్పింపశక్యముకాదు.
17
▾
Meaning
Keep
బ్రహ్మానందము,
పరమానందము
ఇత్యాది
ఇతరానందములు
విషయేంద్రియ
సంజాతము
లగుటవలన
అనిత్యములు.
ఇతరానందములన్నియు
బ్రహ్మానందము
అంశములు.
మనుష్య
ఆనందము
మొదలు,
బ్రహ్మానందమువరకూగల
ఆనందములన్నియు
ఒకదానికంటే
ఒకటి
అధికమైనవై
యున్నవి.
ఇవి
అన్నియు
పరమానందము
కంటే
నవరములు.
పరమానందమును
కొలుచు
మానమెద్దియునూ
లేదు.
తనకు
తెలిసినదంతయు
శ్రద్ధాళువై
జనకుడు
తెలిసికొన
నుత్సాహపడుచున్నందుకు
యాజ్ఞవల్క్యుడు
సంతసించెను.
శరీరము
ప్రారంభానుభవానంతరము
వృక్షంనుండి
పండిన
ఫలమువలె
రాలిపోవును.
మరియొక
శరీరము
ప్రారంభమగును.
శరీరము
నుండి
బయలుదేరే
పురుషుని
వాగాది
సర్వేంద్రియములు
అతని
వెంట
బయలుదేరును.
శ్వాసము
ఊర్ధ్వగతిని
పొందును.
మరణ
కాలమున
వాగాదింద్రియము
లన్నియు
ఉపసంహృతములు
అగును.
ఆత్మ
ఉపసంహృతము
కాదు.
18
▾
Meaning
Keep
పుణ్యకర్మలచే
పుణ్యము,
పాపకర్మలచే
పాపము
సంభవించును.
పూర్వ
వాసనలన్నియు
నూతన
శరీర
ఆరంభకములగుచున్నవి.
విజ్ఞానమయమగు
ఈ
ఆత్మ
జలగవలే
నూతన
శరీరము
చూచుకొని,
పూర్వపు
శరీరమును
వదలును.
ఆత్మ
జ్ఞానికి
శరీర
కారణమగు
కామములు
లేకుండుటచే
శరీరముతో
అతనికి
పనిలేదు.
అతడశరీరుడగును.
జ్ఞానమార్గమే
బ్రహ్మవాది
మార్గము.
కర్మలాచరించువారు
తపస్సులో
ప్రవేశించుచున్నారు.
ఆత్మజ్ఞానికి
కామములు
లేకుండుటచే
మానసికమగు
సంతానము
లేదు.
అట్టివాడే
విశ్వకర్త.
బ్రహ్మ
సాక్షాత్కారమును
పొందినవారికి
రక్షించుకొనదగిన
దేదియు
ఉండదు.
19
▾
Meaning
Keep
జగత్తు
బుద్ధి
మాత్రమై
బ్రహ్మలో
లయమగుచున్నది
శాస్త్ర
తర్కములచే
విస్తరింపబడిన
ఆత్మజ్ఞానము,
తత్సాధన
సన్యాసముకూడ
అనుభవరూపముగ
యాజ్ఞవల్క్యుడు
తన
భార్యయగు
మైత్రేయికి
చేసిన
జ్ఞానోపదేశముఖమున
తెలియుచున్నది.
సర్వప్రాపంచిక
వస్తుజాలములను
ఇంద్రియాది
పదార్థములను
మనుజుడు
స్వప్నప్రాయముగా
భావించవలెను.
వానిని
కోరి
ప్రయోజనము
లేదు.
ఆత్మ
యొక్కటియే
పరమ
ప్రేమాస్పదము.
ఆత్మకొరకు
ఇతరములన్నియు
ప్రేమాస్పదములగుచున్నవి.
ఆత్మను
తెలిసికొనువాడు
సమస్తమును
తెలిసికొనుచున్నాడు.
కార్యము
లన్నియు
కారణములందు
లయమగుచున్నవి.
జలము
లన్నిటికి
సముద్రము
గమ్యస్థానము,
అటులనే
రసము
లన్నిటికీ
రసనేంద్రియము,
రూపములకు,
చక్షువులకు,
శ్రోత్రములకు,
శబ్దములకు,
సంకల్పములకు
మనస్సు
గమ్యస్థానము.
అనగా
జగత్తంతయు
బుద్ధి
మాత్రమై
బ్రహ్మమునందు
లయమగుచున్నది.
20
▾
Meaning
Keep
యాజ్ఞవల్క్యుడు
భుజ్యు
ప్రశ్న
సమాధానమునందు,
తన
బ్రహ్మాండ
నిర్మాణ
పరిజ్ఞానమును
ప్రకటించినాడు.
గార్గి
ప్రశ్నద్వయమునకు
సమాధాన
ముఖమున
సాక్షాదపరోక్షమగు
బ్రహ్మస్వరూపమును
ఉపదేశించెను.
21
▾
Meaning
Keep
స్త్రీలకు
ఆత్మోపదేశమునకు
అర్హత
కలదు
సాకల్య
బ్రాహ్మణములందు
ఆయన
తన
విద్యావైభవము
విజృంభించ
శ్రోతల
మనసుల
నాశ్చర్య
భయానక
రసములలో
ముంచి
వైచెను.
పృచ్ఛకుల
విషమప్రశ్నల
ధాటికి
తట్టుకొని
జనకసభయందు
విజయ
పతాకమును
నిలువబెట్టెను.
జనకుని
పునీతుని
చేసెను.
డొంక
దోవల
నేగిన
భుజ్యుని
విషమప్రశ్నలను,
గార్గియొక్క
ఇరుకు
ప్రశ్నలను
తన
బుద్ధి
సూక్ష్మతచే
గ్రహించి,
తగు
సమాధానము
చెప్పెను.
జనకుని
జ్ఞానమును
సునిశ్చితము
చేసెను.
జనక
సభావతంసయగు
గార్గివలన
అపూర్వమైన
యోగ్యతాపత్రమును
వడసిన
యాజ్ఞవల్క్యుడు
పండితకులమునకు
తలమానికమైనచో
ఇతరుల
యోగ్యతలను
కనిపెట్టలేని
వాడుకాడు.
జనకునకు
ఇంతకు
పూర్వము
ఉపదేశ
విశేషముల
నెరుంగజెప్పిన
వివిధాచార్యుల
యోగ్యతలను
యధార్థముగ
గుర్తెరింగి
ప్రశంసించెను.
ఇంక
తాను
చేయు
కార్యమెద్దియును
లేదు
అని
సన్యసింప
నిశ్చయించుకొని
(తన
భార్యయగు
మైత్రేయి
బ్రహ్మ
చింతాసక్తయని
అతనికి
బాగుగా
తెలియును)
ఆమెకు
కూడ
బ్రహ్మజ్ఞానోపదేశము
చేసెను.
దీనినిబట్టి
చూడ
స్త్రీలకు
ఆత్మోపదేశమునకు
అర్హత
కలదని
తెలియుచున్నది.
Previous
←
Māṇḍūkya Upaniṣad
Next
Praśna Upaniṣad
→