Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Upaniṣad Vāhini · Praśna Upaniṣad
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
7.
ప్రశ్నోపనిషత్
పరబ్రహ్మ
గురు
శాస్త్రైక
వేద్యము
ప్రశ్నోపనిషత్తు
అథర్వణ
వేదాంగము.
ప్రశ్న,
ప్రతి
వచన
పూర్వకముగా
విషయ
వివరణము
చేయబడుటచే
ప్రశ్నోపనిషత్తని
పేరు
వచ్చినది.
ముండకోపనిషత్తునందు
సంక్షిప్తముగా
నుదాహరింపబడిన
కొన్ని
విషయములను
విస్తరించుటచేత,
ప్రశ్నోపనిషత్తు
అద్దానికి
వ్యాఖ్యానమగుచున్నది.
విద్య
పరమనియు,
అపరమనియు
రెండు
తెఱంగులని
ముండకము
తెలిపెను.
ఆ
పరవిద్య
కర్మ,
ఉపాసనములని
రెండు
భాగములు.
ఈ
రెండింటిలో
ఉపాసనము
రెండవ
మూడవ
ప్రశ్నలయందు
విచారింపబడినది.
కర్మ
విధానమంతయూ
కర్మకాండయందు
విస్తరింపబడి
యుండుటవలన
ఇచట
ప్రస్తావింపబడలేదు.
2
▾
Meaning
Keep
కర్మోపాసనలు
రెండును
నిష్కామముగా
ఆచరించిన
వైరాగ్యహేతువు
లగుచున్నవి.
ఈ
విషయమే
మొదటి
ప్రశ్నయందు
వివరింపబడినది.
ముండమును
చదివిన
పిదప
ప్రశ్నోపనిషత్తును
చదివిన
విషయము
విశదము
కాగలదు.
అపరబ్రహ్మము
నిత్యమగు
పురుషార్థమునకు
సాధనము
కానేరదని
తెలిసికొని
నిత్యఫలదమగు
పరబ్రహ్మను
వెదుకగోరి
వీరు,
పిప్పలాదుడను
యోగ్యుడగు
గురువును
ఆశ్రయించిరి.
అపర
బ్రహ్మపరులగు
వీరు
స్వస్వరూపమే
ఆత్మయని
గుర్తెరుంగ
లేకపోయిరని
“అన్వేషమాణా”యను
పదముచే
సూచింపబడుచున్నది.
నిత్యము,
అద్వితీయమగు
పరబ్రహ్మము
గురు
శాస్త్రైక
వేద్యము.
“సమిత్పాణి”యన
గురువునకు
ప్రియమైనట్టియు,
అతని
ఆశ్రమమునకు
యోగ్యమైనట్టిదియును
అగు
కానుక
చేతబట్టుకొనిన
వాడని
అర్థము.
3
▾
Meaning
Keep
వీరలకు
పిప్పలాదుడు
చెప్పిన
ప్రతి
వచనమేమన
పరమ
రహస్యము,
గోప్యము
అగు
బ్రహ్మ
విద్య,
యోగ్యత
లేనివానికి
ఉపదేశ్యము
కాదు.
కనుక
క్రొత్తగా
వచ్చినవారి
యోగ్యతను
తెలిసికొనుటకై
పిప్పలాదుడొక
సంవత్సరము
గడువు
పెట్టెను.
సంవత్సరము
గడువు
పూర్తి
అయిన
తర్వాత
కాత్యాయనుడు
పిప్పలాదుని
“దేని
వలన
ప్రజలు
పుట్టుచున్నారు?”
అని
అడిగెను.
4
▾
Meaning
Keep
ప్రజలందు
కోరిక
కలవాడు
ప్రజాకాముడు.
తననే
ప్రజా
రూపమున
సృష్టించుకొను
కోరికయే
ప్రజాకామము.
పరమాత్మ
కంటే
భిన్నుడు
కానట్టి
హిరణ్యగర్భుడే
ప్రజాపతి.
ఈ
కల్పమునందు
హిరణ్యగర్భుడు
ప్రజాపతియై,
తరువాత
ప్రజాకాముడయ్యెను.
ఇతడు
జన్మాంతరమున
అనుష్ఠించిన
అపర
విద్యాకర్మ
సముచ్చయ
సంపన్నుడు.
తత్కృతమగు
జ్ఞానము
నుద్బుద్ధము
చేసికొని
యుత్పాదనము
చేసెను.
ఇదియే
అతడొనర్చిన
తపము.
5
▾
Meaning
Keep
వైశ్వానరోపాసన
ద్వార
సూర్య
లోక
ప్రాప్తి
సూర్యుడు
తన
కిరణములచే
దశదిశల
వ్యాపించి
అచటి
ప్రాణిజాతము
నుద్దీపింప
జేయుచున్నాడు.
ప్రజాపతియొక్క
స్వాత్మభావమగుటచే
దిగ్జాతములకు
కూడా
ప్రాజాపత్య
స్వాత్మభావము
కలుగుచున్నది.
కనుక
ప్రాణ
శబ్దముచే
ఆదిత్యుడు
చెప్పబడుతున్నాడు.
సమస్త
జీవులు
భోక్త
రూపమున
ఆదిత్య
స్వరూపులగుటచే
అతడు
వైశ్వానరుడనబడుచున్నాడు.
సకల
ప్రపంచమతని
స్వరూపమగుటచే
అతను
విశ్వరూపుడని
కూడా
వాడబడుచున్నాడు.
విశ్వమునందలి
నరులస్వరూపుడు
గనుక
వైశ్వానరుడనియు,
విశ్వమే
అతని
స్వరూపము
కనుక
విశ్వరూపుడనియు
అతనికి
ప్రసిద్ధి
గలిగినది.
6
▾
Meaning
Keep
ఇక్కడ
సంవత్సరశబ్దము
కాలమునకుపలక్షణము.
అహోరాత్రముల
సముదాయమే
కాలము.
సూర్య
సంచారముచే
అహోరాత్రములు,
చంద్ర
సంచారముచే
తిథులు
యేర్పడుచున్నవి.
చంద్ర,
సూర్య
మిథునము
ప్రజాపతి
సముద్భూతమగుటచే
సంవత్సరము,
అయనములు
మొదలగు
విభాగములగు
కాలము
కూడా
ప్రజాపతి
స్వరూపమే
అగుచున్నది.
ప్రజాపతికి
దక్షిణోత్తర
మార్గములు
రెండుకూడా
కలవు.
ప్రజాపత్యుపాసన
మిచట
జ్ఞానమని
చెప్పబడుచున్నది.
జితేంద్రియత్వము,
వేదములయందు
విశ్వాసము,
జ్ఞానము
ఇవి
గల
ప్రాణ
స్వరూపుడు
ఆత్మ
తానేయని
తెలిసికొని
ఉత్తరాయణ
మార్గమున
సూర్యలోకమునకు
పోవును.
ఈ
లోకము
సకల
ప్రాణులకు
ఆశ్రయము.
ఉపాసనా
సహితమగు
నిష్కామకర్మ
నాచరించువాడును
అచటికే
పోవును.
కాలాత్మకుడగు
సూర్యుడు
వసంతాది
ఋతుపంచకము
పాదములుగా
గలవాడనియు,
ద్వాదశ
మాసములతని
ఆకారములనియు,
ఆదిత్యుడు
సర్వలోక
కారణుడనియు
నాలుగు,
ఆరు
మంత్రములలో
చూపబడుచున్నది.
వర్షము
ఆదిత్యునిచే
కలుగుటవలన
అతడు
మూడవదియగు
ద్యులోకమున
జలము
గలవాడని
తెలియుచున్నది.
7
▾
Meaning
Keep
ఈ
శరీరం
కార్య,
కారణ
సంజాతము
శరీరారంభకములైన
ఆకాశ,
వాయు,
అగ్ని,
జల,
భూమి
అయిన
పంచ
మహా
భూతముల
అభిమాన
దేవతలును,
కార్య
స్వరూపములగు
వాగాది
కర్మేంద్రియముల
యొక్కయు
చక్షురాది
జ్ఞానేంద్రియముల
యొక్కయు
అభిమాన
దేవతలునూ,
మనో
బుద్ధులయొక్క
అభిమాన
దేవతలునూ.
వీరిలో
ప్రతి
దేవతయునూ,
కార్యకారణ
సంఘాతాత్మకమగు
ఈ
శరీరము
అను
మేడ
పడిపోకుండా
స్తంభమువలే
తామే
నిలుపుచున్నట్లు
కనబడుచున్నది.
8
▾
Meaning
Keep
పంచీకృత
భూతాత్మకమగు
పృథ్వివలన
శరీరము
ఉత్పన్నమగు
చుండుటచే
శరీరము
పంచభూత
కార్యమగుచున్నది.
జ్ఞానేంద్రియములు
జ్ఞానసాధనము
లగుటంజేసి
కరణము
లగుచున్నవి.
ఈ
శరీరము
కార్యకారణ
సంఘాతము.
బండికుండ
ఆకు
వలే
శ్రద్ధాది
నామాంతమగు
సర్వము
స్థితి
కాలమునందు
ప్రాణమునందే
ప్రతిష్ఠితమగుచున్నది.
అదే
ప్రకారము
ఋక్కులు,
యజుస్సులు,
సామములు
అను
త్రివిధములగు
మంత్రములు.
వానిచే
నిర్వర్తింపబడు
యజ్ఞము,
ప్రజా
పరిపాలనా
సమర్థమగు
క్షాత్రము,
యజ్ఞాదులందు
అధికృతుడగు
బ్రాహ్మణుడు
-
వీరందరూ
ప్రాణ
స్వరూపులే
అగుచున్నారు.
ఎప్పుడు
ప్రజాపతి
మేఘ
స్వరూపుడై
వర్షించుచున్నాడో
అపుడే
ప్రజలందరూ
జీవింతురు.
“ప్రపంచమునందు
గల
సర్వోపభోగ
జాలము
నీ
ఆధీనము.
అందువలన
తల్లివలె
నీవు
మమ్ములను
పాలింపుము.
బ్రహ్మ
క్షత్ర
సంబంధములగు
సంపదలన్నిటికిని
నీవే
కారణమగుచున్నావు.
కనుక
అట్టి
సంపదను,
ప్రజ్ఞను
కూడా
నీవు
మాకు
ప్రసాదింపుము”
ఋగ్యజుస్సామరూపములగు
మంత్రములు
బ్రాహ్మ్య
సంపదలు.
ధనాదులు
క్షత్రియ
సంపదలగుచున్నవి.
ఇట్లు
ప్రాణముయొక్క
భోక్తృత్వ
ప్రజా
పతిత్వములు
వ్యక్తీకరింపబడినవి.
9
▾
Meaning
Keep
జీవాత్మ
పరమాత్మల
మధ్య
భేదము
ఉపాధికృతమే
తదుపరి
భార్గవుని
ప్రశ్నకు
పిప్పలాదుడు
సమాధానము
చెప్పిన
తరువాత
ఆయనను
అశ్వలాయనుడగు
కౌసల్యుడు
ప్రాణమును
గూర్చి
అడిగెను.
అప్పుడు
పిప్పలాదుడు,
“నాయనా!
పురుషుని
వలన
నీడ
గల్గుచున్నట్లు
ఆత్మ
వలన
శ్రేష్ఠమగు
ప్రాణము
కలుగుచున్నది.
ఈ
ఆత్మయందు
ఛాయను
బోలు
ప్రాణము
మనస్సంకల్పాల
చేత
సమర్పితమగుచున్నది.
ఒక
రాజు
తన
యేలుబడిలో
ఉన్న
గ్రామములను
పరిపాలించుటకు
ఉద్యోగస్తులను
నియమించినట్లు,
ముఖ్య
ప్రాణము
ఇతర
ప్రాణములను
వాని
వాని
పనులయందు
ప్రత్యేక
ప్రత్యేకముగా
నియోగించుచున్నది.
ముఖ్య
ప్రాణము
ఆదిత్యాద్యధి
దేవతలను
ధరించుచున్నది.
జ్వలించుచున్న
అగ్నినుండి
మిణుగురులు
బయలు
వెడలుచున్నట్లక్షరుడగు
పరమాత్మనుండి
ప్రాణిజాతములు
పుట్టి
అందే
లయమగుచున్నవి”
అని
బోధించెను.
ఇవియే
ముండకము
2-1-1
మంత్రమునందు
ఉదాహరింపబడినవి.
10
▾
Meaning
Keep
తదుపరి
గార్గి
ప్రశ్నకు
పిప్పలాదుడు
ఇట్లు
సమాధానము
చెప్పెను.
“అస్తమించుచున్న
సూర్యునియొక్క
కిరణములు
అన్నియు
తేజోమండలమగు
సూర్యునియందు
లయించి,
ఏకత్వము
నొందుచున్నవి.
ఈ
కిరణములే
సూర్యుడుదయించు
చుండగా
తిరిగి
బాహ్యమునకు
వ్యాపించుచున్నవి.
ఇదే
విధముగా
స్వప్న
సమయములందు
విషయేంద్రియ
సంఘాతమంతయు,
చైతన్య
ప్రతిబింబముచే
ప్రకాశితమగు
మనస్సునందు
లయమై
ఏకీభావము
నొందుచున్నది.
నిద్రనుండి
లేచి
జాగ్రద్దశకు
వచ్చినపుడు
ఈ
విషయేంద్రియ
సంఘాతమంతయు
సూర్య
కిరణములవలె
బహిర్గతములై
స్వస్వ
వ్యాపారముల
నొనర్చుచున్నవి.
కనుక
స్వప్నమునందు
పురుషుడు
వినలేడు,
చూడలేడు,
స్పృశింపలేడు,
నడువలేడు,
పలుకలేడు,
ఆనందక్రియలనుభవించలేడు.
స్వప్న
కాలమునందు
ప్రకాశరూపమగు
నాత్మ
జాగ్రద్దశయందు
దేనిని
చేసినదో,
చూచినదో,
వినినదో,
అనుభవించినదో
దానినే
అనుసరించి
వాసనారూపమున
దానినే
చూచుచున్నది,
వినుచున్నది,
అనుభవించుచున్నది.
ఆత్మ
సర్వాశ్రయమని
చెప్పుటచే
దాని
నాశ్రయించు
సర్వము
అద్దానికంటే
భిన్నమని
స్ఫురించుచున్నది.
సర్వాధారుడగు
పరమాత్మకును
జీవునికిని
కనబడుచున్న
భేదము
ఉపాధికృతముకానీ
నిజము
కాదని
చెప్పబడుచున్నది.
ఓంకారముచే
ఏ
బ్రహ్మమును
ధ్యానించిన
ఆ
లోకము
లభించును.
11
▾
Meaning
Keep
పురుషుడు
సర్వ
కళా
విరహితుడు,
మృత్యు
రహితుడు
తదుపరి,
భరధ్వాజ
పుత్రుడగు
సుకేశుడు
పిప్పలాదుని
అడిగిన
ప్రశ్నకు
ఇట్లు
సమాధానము
చెప్పెను.
“నీవడిగిన
పురుషుడు
ఈ
శరీరమునందే
హృదయాకాశమున
నున్నాడు.
అతని
వలననే
నీ
షోడశ
కళలుత్పన్నములగుచున్నవి.
అతనియందే
లయమగుచున్నవి.
మైలు
రాళ్ళవలె
ప్రధానముగా
గాన్పించు
పృథివి,
ఓషధులు,
అన్నము,
పురుషుడను
నాలుగు
తత్త్వములు
వరుసన
నొకదానినుండి
మరియొకటి
యుత్పన్నమగునట్లు
తైత్తరీయ
ద్వితీయానువాకమున
పేర్కొనబడినది.
12
▾
Meaning
Keep
ఓషధాది
పురుషాంతమగు
సృష్టిప్రక్రియ
ఇచట
స్పష్టముగ
కనిపించక
పోయినను
పురుషావయవములగు
జ్ఞానేంద్రియ,
కర్మేంద్రియ
సృష్టి
చెప్పబడుటచే
తదంగమగు
పురుషుని
సృష్టికూడా
చెప్పినట్లే
అగును.
నదులన్నియు
సముద్రములోనికి
ప్రవహించి
తమ
తమ
రూప
నామములను
గోల్పోవుచున్నవి.
సముద్రమున
ప్రవేశించిన
నదులన్నియూ
సముద్రమనియే
పిలువబడుచున్నవి.
పురుషుడొక్కడు
మాత్రమే
సముద్రమువలె
మిగులుచున్నాడు.
అతడు
సర్వ
కళావిరహితుడు.
మృత్యురహితుడు
అయియున్నాడు.
వేద్యమగు
పరబ్రహ్మమును
గూర్చి
నాకింతవఱకు
తెలుసును.
ఇంతకంటే
వేరేమియూ
లేదు”
అని
పిప్పలాదుడు
కబంధి
మొదలగు
ఆర్వురు
శిష్యులను
గూర్చి
పలికెను.
పిప్పలాదునికి
ఆర్వురు
శిష్యులు
చేసిన
కృతజ్ఞతా
పూర్వకమగు
నమస్కారోక్తిచే
ఈ
ఉపనిషత్తు
ఉపసంహరింపబడుచున్నది.
కన్నతండ్రి
భౌతిక
శరీరమును
మాత్రమిచ్చును.
ఆత్మ
తత్త్వోపదేశముచే
పిప్పలాదుడు
వీరలకు
బ్రహ్మ
శరీరము
నిచ్చెను.
13
▾
Meaning
Keep
ఓంకారోపాసనచే
బ్రహ్మమును
పొందవచ్చును
అపర
బ్రహ్మనిష్ఠులగు
కబంధి,
వైదర్భి,
కౌసల్యుడు,
సౌర్యాయణి,
సత్యకాముడు,
సుకేశుడను
ఆర్వురు
మహర్షులు
పరబ్రహ్మ
జిజ్ఞాసా
ప్రేరితులయి
పిప్పలాదుని
క్రమముగా
ఆరు
ప్రశ్నలు
అడిగిరి.
ముండకోపనిషత్తు
ప్రథమ
ఖండమున
పరా
అపర
స్వరూపము,
బ్రహ్మము
యొక్క
జగత్కారణత్వము
సూచింపబడినది.
రెండవ
ఖండమునందు
అపర
బ్రహ్మ
నిమిత్తమగు
కర్మకలాపమారంభమున
స్తోత్రము
చేయబడినను
అంతిమ
భాగమున
దాని
అనిత్యత్వము
రూఢము
చేయబడెను.
పర
అపర
బ్రహ్మముల
రెంటిని
బొందుటకు
ఓంకారముపాయముగ
సర్వ
లయ
స్థానమగు
పరమ
తత్త్వము
ఆరవ
ప్రశ్నయందు
విశదము
చేయబడినది.
ఇట్లీ
ఉపనిషత్తు
నందలి
ఆరు
ప్రశ్న
లొకదాని
తరువాత
నొకటి
సహేతుకముగ
అడుగబడి
వివరింపబడుచు,
అచట
విషయమంతయు
ముండకమునకు
వ్యాఖ్యాన
రూపమును
దాల్చినది.
14
▾
Meaning
Keep
1)
పర
అపర
బ్రహ్మములకు
గల
సంబంధమేమి?
15
▾
Meaning
Keep
2)
సృష్టింపబడిన
ప్రజలు
ఎవరిచేత
సంరక్షింపబడుచున్నారు?
16
▾
Meaning
Keep
3)
పరబ్రహ్మము
వలన
హిరణ్యగర్భుడెట్లు
ఉత్పన్నమగుచున్నాడు?
17
▾
Meaning
Keep
4)
అతనివలన
సృష్టి
ఎట్లు
జరుగుచున్నది?
18
▾
Meaning
Keep
5)
చైతన్య
విశిష్టమగు
ప్రాణము,
శరీరమును
ప్రవేశించి
పంచవిధములుగ
ఎట్లు
విభక్తమగుచున్నది?
19
▾
Meaning
Keep
6)
జాగ్రత్స్వప్న
సుషుప్త్యవస్థలయందు
ఏ
యే
ఇంద్రియములు
వ్యవహరించుచున్నవి?
20
▾
Meaning
Keep
ఇవి
ఉపనిషత్తునందలి
ప్రశ్నోత్తరములు.
Previous
←
Bṛhadāraṇyaka Upaniṣad
Next
Kena Upaniṣad
→