Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Upaniṣad Vāhini · Kena Upaniṣad
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
8.
కేనోపనిషత్
సామవేదీయ
తలవకారాంతర్భాగమునకు
సంబంధించి
యుండుట
వలన
దీనికే
తలవాకారోపనిషత్తు
అని
కూడ
పేరు
గలదు.
ఈ
ఉపనిషత్తు
మొదటి
ఖండమున
మొదటి
శ్లోకము
“కేన”
అను
పదముతో
ఆరంభమగుట
వలన
కేనోపనిషత్తని
కూడా
పిలువబడుచున్నది.
2
▾
Meaning
Keep
శ్లో
॥
కేనేషితం
పతతి
ప్రేషితం
మనః
కేన
ప్రాణఃప్రథమః
ప్రైతియుక్తః
।
కేనేషితాం
వాచమిమాం
వదంతి
చక్షుః
శ్రోతం
క
ఉ
దేవోయునక్తి
॥
3
▾
Meaning
Keep
ఇంద్రియాధిష్ఠాన
చోదన
కర్త
శ్రోత్ర,
త్వక్చక్షుర్జిహ్వా,
ఘ్రాణములను
పంచేంద్రియములకు
శబ్ద,
స్పర్శ,
రూప,
రస,
గంధము
లనునవి
వరుసగా
విషయములగుచున్నవి.
ప్రపంచమునందు
జ్ఞేయములగు
విషయములన్నియు,
ఈ
ఐదింటిలో
అవాంతర
భేదమునందుచున్నవి.
విషయములను
తెలిసికొనగల
అంతఃకరణ
శక్తి
మనస్సని
పిలువబడుచున్నది.
అట్టి
మనస్సు
జ్ఞానేంద్రియముల
ద్వారా
బహిర్గతమై
ఆ
విషయములతో
సంబంధించినపుడు
ఆ
ఆకారమును
పొందును.
వివిధ
విషయాకారములను
పొందిన
మానసిక
స్థితి
వృత్తి
అనబడును.
మనస్సు
అచేతనము
కనుక
దాని
వికారము
కూడ
అచేతనమై
యున్నది.
చెక్క
బొమ్మ
చెక్క
ధర్మమును,
చక్కెర
బొమ్మ
చక్కెర
ధర్మమునే
పొందియుండును
కదా!
కానీ,
అచేతనమగు
అంతఃకరణము
వలన
మనకు
బాహ్య
వస్తు
జ్ఞానము
కలుగుచున్నట్లు
అనుభవ
సిద్ధము.
అచేతనమునకు
చేతన
సాధ్యమగు
జ్ఞాన
క్రియ
చేతకాదు.
రథముల
నధిష్ఠించి
నడిపించు
సారథివలె,
కర్మ
జ్ఞానేంద్రియముల
నధిష్ఠించి
నడిపించు
చేతన
పదార్థము
ఒకటి
ఉండియే
తీరవలెను
కదా?
4
▾
Meaning
Keep
అంతఃకరణము,
కర్మేంద్రియ,
జ్ఞానేంద్రియ,
ప్రాణపంచకములు
ఏదో
యొక
శక్తి
చోదితములయి
వ్యాపారవంతములగుచున్నవి.
ఆ
శక్తియే
దైవము.
అట్టి
చోదనకర్త
ఇంద్రియముల
కంటే
భిన్నుడని
కూడా
ప్రశ్నయందు
అనుమానింప
బడుచున్నది.
దీనికి
సర్వేంద్రియ
అధిష్ఠాత
ఎవరు?
అతడు
మనసుకంటే
భిన్నుడయి
ఉండవలెను
కదా?
కర్మ
కార్యము
అనిత్యమని
తెలిసికొని
విరక్తుడయి
నిత్య
వస్తు
స్వరూపమును
ఎఱుగగోరు
వాడు
దానిని
గూర్చి
తెలిసికొన
ప్రయత్నింపడు.
నిత్య
వస్తువును
తెలిసికొనుటకే
ప్రయత్నించును.
అట్టి
నిత్య
వస్తువు
నిష్కళమగుటంజేసి
స్వీయమగు
ఇచ్ఛాక్రియాదులు
అద్దానికి
లేవు.
కావున
ఆ
వస్తువు
స్వీయమగు
ఇచ్ఛాక్రియాదులచే
మనస్సు
మొదలగు
ఇంద్రియముల
ఆజ్ఞాపింపజాలదు.
5
▾
Meaning
Keep
కనుక
మనస్సు,
ప్రాణము,
వాక్కు,
చక్షుస్సు,
శ్రోత్రము
మొదలగు
ఇంద్రియములు
కార్య
కారణ
సంఘాతముచే
చోదితములై
స్వస్వ
వ్యాపారములను
నిర్వహించుచున్నవా?
లేక
చేతన
వస్తువు
యొక్క
ఇచ్ఛవలన
ప్రవృత్తము
లగుచున్నవా?
అని
సందియము.
శబ్దమును
గ్రహించు
శక్తి
శ్రోత్రములకు,
రూపమును
గ్రహించు
శక్తి
చక్షువులకు
కలదు.
అటులనే
ఇతర
జ్ఞానేంద్రియములకు
కూడనూ
తమ
తమ
విషయములను
గ్రహించు
శక్తి
కలదు.
మనసు
జ్ఞానేంద్రియములతో
నన్యతమముద్వారా
విషయ
సంయోగమును
కోరినపుడు
మనకు
విషయజ్ఞానము
కలుగును.
అందుచే
ఇంద్రియ
పంచకము
మనస్సు
కూడా
జ్ఞాన
కారణములగుచున్నది.
అవి
అచేతనములు;
చేతన
వస్తు
సాధ్యమగు
జ్ఞానోత్పాదన
కార్యనిర్వహణము
నొనర్చుచున్నవి.
నిత్యము,
అసంహతము,
సర్వాంతరమునగు
ఆత్మ
సాన్నిధ్యము
చేతనే
వీనికట్టి
సామర్థ్యము
కలుగుచున్నది.
ఆత్మ
జ్యోతిస్సనునది
లేనిచో
వీనికట్టి
సామర్థ్యము
కలుగదు.
6
▾
Meaning
Keep
జగత్తంతా
ఆత్మ
తేజస్సుతో
నిండియుండును
సూర్యుడు
లోకమును
తపింప
జేయుచున్నాడు
అను
మొదలగు
శ్రుతి
వాక్యములా
బ్రహ్మస్తంబమగు
జగత్తంతయు
ఆత్మ
తేజస్సు
చేతనే
వ్యాపింపబడినట్లు
ఈ
ఉపనిషత్తు
బోధించుచున్నది.
సర్వేంద్రియములు
ఈ
ఆత్మతేజస్సులోనే
వాటి
వాటి
వ్యాపారములను
అవి
చేయుచున్నవి.
7
▾
Meaning
Keep
ఒక
ఉపమానము:
కరెంటు
అనగా
విద్యుచ్ఛక్తి
యంత్ర
ముఖమున
ఛేదన
ముద్రణాది
క్రియలు
చేయుచున్నను,
రెండింటికి
నభేదము
కల్పించి
యంత్రమే
ఛేదనాదికము
చేయుచున్నట్లు
చెప్పుదురు
కదా?
కానీ
విద్యుచ్ఛక్తి
ప్రసారము
వలన
ఛేదన
యంత్రమునకు
ఛేదకత్వము
సంప్రాప్తమగుచున్నది.
అటులనే
ఆత్మజ్యోతిస్సు
శ్రోత్రమునకు
శ్రోత్రమగుచున్నది.
ఆత్మజ్యోతి
ప్రసారము
వలననే
మనస్సు
మొదలగు
సకలేంద్రియములు
స్వస్వవ్యాపార
నిర్వహణ
సమర్థములగుచున్నవి.
ఆ
ఆత్మ
తేజస్సే
సకలేంద్రియములకు
ఆయా
రూప
నామములకు
ఆయా
రూప
నామములగుచున్నవి.
8
▾
Meaning
Keep
ఆ
ఆత్మ
తేజస్సు
నిష్క్రియము.
నిర్విశేషము.
నిష్క్రియమగుటచే
మనస్సు
మొదలగు
ఇంద్రియములచే
నేపనిని
చేయింపదు.
కానీ
అద్దాని
సాన్నిధ్యముచేత
వివిధేంద్రియములు
స్వస్వవ్యాపారక్షమము
లగుచున్నవి.
నిష్క్రియమగు
సూర్యకాంతి
ప్రసారముచేతనే
సమస్త
వస్తుజాతము
ప్రసన్నమగుచున్నది.
నిర్విశేషమగు
ఆత్మతేజస్సు
శ్రోత్రాది
ఇంద్రియముల
ద్వారా
ఆయా
శక్తి
రూపమున
అభివ్యక్తమగుచున్నది.
ఈ
పరమ
రహస్యమునే
వరుణునిచేత
తన
కుమారుడగు
భృగువునకు
ఉపదేశింపబడినది.
ఆత్మజ్యోతిస్సుచే
ఉద్దీపితమై
చక్షుస్సు
స్వవిషయమగు
రూపమును
గ్రహించును
గానీ
తనను
తాను
ప్రకాశింపజేయు
ఆత్మతేజస్సును
ప్రకాశింపజేయజాలదు.
దీపముచే
ప్రకాశింపబడు
ఇతర
వస్తువులు
దీపమును
ప్రకాశింప
జేయవు.
9
▾
Meaning
Keep
వాక్కు,
నామ
రూపములు,
గుణము,
క్రియ
మొదలగు
విశేషములతో
నుండు
పదార్థములను
మాత్రము
వర్ణింపగలదు
గాని
నామ
రూప
రహితము,
నిర్గుణము,
నిష్క్రియము,
నిర్విశేషమగు
పరమాత్మను
వర్ణింప
లేదు.
మాధుర్యాది
రసములను
వాక్కుచే
వర్ణింపలేము.
ఆత్మ
వాగ్విషయము
కాదు.
అచేతనమగు
మనస్సు
చేతనమగు
విజ్ఞాత
కానేరదు.
కనుక,
ఆత్మతేజస్సును
మనస్సు
తెలిసికొనలేదు.
సర్వమును
తెలిసికొను
జ్ఞాతను
తెలుసుకొను
జ్ఞాత
మరియొకడు
లేకుండుటచే
అతడు
తెలియబడిన
దానికంటే
అన్యమగుచున్నాడు.
10
▾
Meaning
Keep
ఉపాధి
ద్వారా
అభివ్యక్తమైన
చైతన్యమే
బ్రహ్మ
బ్రహ్మము
విజ్ఞాన
స్వరూపమే
కనుక,
అద్దానిని
తెలిసికొన
ప్రయత్నము
సాధ్యము
కాదు.
విజ్ఞానముచే
అన్యము
తెలిసికొనబడును
కాన
విజ్ఞానము
విజ్ఞానమును
తెలిసికొనుట
సంభవము
కాదు.
దీపము
స్వస్వరూపాభివ్యక్తి
కొఱకు
స్వప్రకాశమును
గానీ,
మరియొక
ప్రకాశమును
గాని
కోరదు.
దీపకాంతి
ఇతరములను
ప్రకాశింపజేయును.
తనను
తాను
ప్రకాశింప
జేసికొనలేదు.
నీవే
ఆత్మవు.
ఆత్మను
తెలిసికొనవలెనని
శ్రుతులు
చెప్పుచున్నవి.
ఆత్మ
సర్వాత్మ
స్వరూపము.
ద్వితీయ
మెద్దియూ
లేకుండుటచే
ఆత్మకు
హేయోపాదేయత్వము
లుండనేరవు.
ఇట్టి
ఆత్మ
స్వరూపము
శాస్త్రముచే
తెలియబడును.
11
▾
Meaning
Keep
ఏది
వాగింద్రియములచేత
ప్రకాశింపబడదో
దేనిచేత
వాగాది
ఇంద్రియములు
ప్రకాశింపబడుచున్నవో
దానినే
బ్రహ్మమని
అందురు.
బ్రహ్మము
హేయముగాని,
ఉపాదేయముగాని
కాదని
ప్రథమ
ఖండము
తెలిపినది.
అందువలన
నేను
బ్రహ్మమును
చూచితినని,
తెలిసికొంటినని
తలంచువానికి
బ్రహ్మస్వరూపము
మీమాంసయే
అగును.
బ్రహ్మమును
నే
తెలిసికొంటినను
జ్ఞానము
యథార్థ
జ్ఞానము
కాదు.
తెలిసికొనువాని
ఆత్మయే
బ్రహ్మము
అని
సర్వ
వేదాంతముల
యొక్క
సునిశ్చితార్థముకదా!
అగ్ని
తనను
తాను
దహింపలేనట్లే
జ్ఞాత
తనను
తాను
తెలిసికొనుటెట్లు?
కాన
బ్రహ్మమును
తెలిసికొంటినను
వాదన
మిథ్యా
జ్ఞానము;
సత్య
జ్ఞానము
కాదు.
బ్రహ్మమునకు
మహాంతములు,
ఆర్చకములునగు
రూపములనేకము
లుండుటచే
ఇట్లు
చెప్పుచుందురు.
బ్రహ్మమునకు
స్వరూపము
లేకపోయినను,
నామరూప
ఉపాధికృతములగు
రూపము
లనేకములు
గలవు.
స్వయముగా
ఆ
పరమార్థ
వస్తువు
శబ్దము
లేనిది,
స్పర్శము
లేనిది,
రూపము
లేనిది,
మార్పు
లేనిది,
రసము
లేనిది,
నిత్యమైనది.
ఏ
ధర్మముచే
ఏది
నిరూపింపబడుచున్నదో
అదియే
దాని
స్వరూపము.
బ్రహ్మమును
ఏ
విషయము
చేత,
శాస్త్రము
నిరూపించుచున్నదో
అదియే
దాని
స్వరూపము.
ఉపాధి
ద్వారమున
అభివ్యక్తమగుచున్న
ఈ
చైతన్యమే
బ్రహ్మమని
చెప్పబడుచున్నది.
12
▾
Meaning
Keep
ఈ
చైతన్యము
స్వయముగా
నసంగమైనను,
దేహాద్యుపాధి
సంబంధమైనట్లు
కాన్పించుచున్నది.
జలముతోపాటు
దానియందలి
సూర్య
ప్రతిబింబము
కూడా
చలించునటులగుపడుచున్నంత
మాత్రముచే
విప్రకృష్టములై
కడుదూరమున
నున్న
సూర్యజలముల
కేవిధమైన
సంబంధము
ఆరోపింప
సాధ్యముకాదు.
అదే
విధమున
దేహాదులకు
వృద్ధి
సంకోచచ్ఛేద
నాశములు
సంప్రాప్తమగుచుండగా
ఆ
ధర్మములు
ఆత్మతో
సంబంధింపబడుచున్నవి.
స్వయముగా
బ్రహ్మము
బుద్ధిచేత
ప్రయత్నించి
తెలిసికొనువారికి
తెలియరాదు.
బుద్ధిచే
తెలిసికొన
ప్రయత్నింపని
వారికి
అది
తెలియనగును.
అది
బుద్ధికి
అతీతమైన
స్వరూపము.
అనుభవమునకే
అది
సాధ్యము.
13
▾
Meaning
Keep
బ్రహ్మజ్ఞానానికి
ఆత్మ
సాక్షాత్కారమే
ఫలం
బ్రహ్మజ్ఞానమునకు
జిజ్ఞాసా
నివృత్తియే
పర్యవసానము;
సాక్షాత్కారమే
దాని
ఫలము.
ఈ
సర్వోత్కృష్ట
స్థానము
సమాధి
లభ్యము.
సాక్షాత్కారమున
కనివార్యముగా
పూర్వాంగములగు
శ్రవణ
మనన
నిధి
ధ్యాసములు
బుద్ధి
విషయములే
అగుచున్నవి.
ఈ
జన్మమునందే
ఆత్మ
స్వరూపమును
తెలిసికొనిన
యెడల
దాని
ఫలముగ
సత్య
స్వరూపము
సిద్ధించును.
అట్లు
తెలిసికొనలేక
పోయిన
యెడల
గొప్ప
వినాశము
కలుగును.
జ్ఞానులగువారు
ప్రతి
భూతమునందును
అద్వితీయమగు
ఆత్మతత్త్వమును
గ్రహించి
ఈ
లోకమునుండి
పోయిన
తరువాత
జననమరణములు
లేని
వారగుచున్నారు.
14
▾
Meaning
Keep
బ్రహ్మజ్ఞానికి
ధర్మాధర్మములు,
పుణ్య
పాపములు
నశించును
బ్రహ్మజ్ఞానమునకు
అధికారి
మనుజుడు.
అతడు
సమర్థుడై
పూర్వోక్త
లక్షణ
లక్షితమగు
పరమాత్మ
స్వరూపమును
పూర్వోక్త
ప్రకారమున
తెలిసికొనినచో
వాని
జన్మము
సఫలమగును.
అట్లు
కానిచో
వృథా
యగును.
సుప్రసిద్ధమైన
పరబ్రహ్మము
మెరుపు
తీగవలె
ప్రకాశించును.
కనురెప్పపాటువలె
అత్యంత
శీఘ్రముగా
ప్రకాశ
తిరోధానములు
గలది.
ఇది
బ్రహ్మయొక్క
దైవిక
స్వరూపము.
బ్రహ్మయొక్క
స్వరూపము
దుర్విజ్ఞేయము.
మనస్సు
బ్రహ్మమునకు
ఉపాధియగుటంజేసి,
అది
అత్యంత
సమీపమున
నున్నటుల
కాన్పించుచున్నది.
అందువలన
మనస్సు
బ్రహ్మమును
పొందుచున్నట్లున్నది.
నిజముగా
అది
అద్దానిని
పొందుటలేదు.
అత్యంత
సామీప్యముచే
నేను
బ్రహ్మమునైతినని
ప్రతిక్షణము
సాధకుడు
స్మరించుచున్నాడు.
అందువలన
బ్రహ్మ
సాక్షాత్కారాభిలాష
అతనికి
పలుమారు
కలుగుచున్నది.
అట్టి
స్మరణ
సంకల్పాది
చిహ్నములచేత
బ్రహ్మ
ముపాస్యమగుచున్నదని
భావము.
15
▾
Meaning
Keep
బ్రహ్మజ్ఞానికి
ధర్మాధర్మములు,
పుణ్యపాపములు
నశించును.
ధర్మాచరణచే
ఉత్తమ
లోకము,
అధర్మాచరణచే
అధోలోకమును
సంప్రాప్తమగును.
రెండునూ
బంధ
కారణములే.
సమస్త
హృదయ
గ్రంథులను
శిథిలము
చేసి,
అవిద్య
నంతమొందించి,
సాధకుని
అత్యంతము
బ్రహ్మ
సామీప్యమును
పొందించునది
కాన
ఉపనిషత్తను
పేరు
వచ్చినది.
బ్రహ్మ
జ్ఞానమునకు
తపస్సు,
దమము,
అగ్ని
హోత్రాది
కర్మలు
ప్రతిష్ఠాభూతములు.
వేదములు
దాని
అంగములుగా
ఉన్నవి.
సత్యమే
అద్దానికి
నివాసము.
బ్రహ్మ
జ్ఞానోపదేశమంతయు
ఈ
ఉపనిషత్తున
చెప్పబడినది.
ఈ
ఉపనిషత్తున
ఉపదేశింపబడినదంతయును
సత్య
జ్ఞానానంత
లక్షితమగు
బ్రహ్మ
విషయమై
యున్నది.
Previous
←
Praśna Upaniṣad
Next
Chāndogya Upaniṣad
→