Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Upaniṣad Vāhini · Chāndogya Upaniṣad
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
9.
ఛాందోగ్యోపనిషత్
కర్మోపాసనలు
బ్రహ్మ
జ్ఞానానికి
కారణములగును
ఈ
ఉపనిషత్తు
సామవేదాంతర్భాగమైనది.
ఇది
ఎనిమిది
అధ్యాయములు
కలిగియున్నది.
మొదటివైన
అయిదు
అధ్యాయములు
వివిధోపాసనములకును,
కడపటి
మూడధ్యాయములు
జ్ఞానోపదేశమునకును
వినియోగమైనవి.
ఉపాసనకు
చిత్తశుద్ధియూ
బ్రహ్మజ్ఞానమునకు
చిత్తైకాగ్య్రము
నియతములగు
పూర్వాంగములు.
కర్మచే
చిత్తశుద్ధియూ
ఉపాసనచే
చిత్తైకాగ్య్రము
లభించును.
ఇట్లు
కర్మోపాసనలు
బ్రహ్మజ్ఞానమునకు
కారణము
లగుచున్నవి.
కనుకనే
ముందు
కర్మలు,
తరువాత
ఉపాసనలు
పిమ్మట
జ్ఞానము
ఒకదాని
తరువాత
ఒకటి
శాస్త్రములందు
వివరింపబడినవి.
ఛాందోగ్యము
ప్రథమాధ్యాయమున
సామమున
కవయవమగు
ఉపాసనలు
చెప్పబడినవి.
ద్వితీయాధ్యాయమున
సమస్త
సామము
యొక్క
ఉపాసనము
వివరించబడినది.
తృతీయాధ్యాయమున
మధువిద్య
అని
ప్రసిద్ధి
గాంచిన
సూర్యోపాసనలు,
గాయత్రి
ఉపాసనము,
శాండిల్య
విద్యయు
ప్రస్తావించబడినది.
చతుర్థాధ్యాయమందు
సంవర్గ
విద్యయు,
షోడశ
కళా
బ్రహ్మ
విద్యయు
ఉపదేశించబడినవి.
పంచమాధ్యాయమున
ప్రాణ
విద్య,
పంచాగ్ని
విద్య,
వైశ్వానర
విద్యలు
తెలుపబడినవి.
2
▾
Meaning
Keep
సృష్టి
అంతా
తేజో,
జల,
వాయు,
రూప
సంమిశ్రణము
ఏ
సద్వస్తు
జ్ఞానముచే
సర్వ
వస్తు
జ్ఞానమలవడునో
అట్టి
ఏక
జ్ఞానమును
ఉద్దాలకుడు
తన
కుమారుడైన
శ్వేతకేతునకు
ఉపదేశించెను.
మట్టియును
సువర్ణమును
తెలుసుకొనినపుడు
వీనిచే
తయారయిన
ఘట,
కటక
కుండ
లాదులు
తెలియబడుచున్నవి.
మట్టియు
సువర్ణము
యదార్థములు.
వాని
వలన
ఉత్పన్నములగు
వస్తు
జాలమంతయు
వికారములు,
నశ్వరములు,
నామ
రూపాదులు.
ఘటకుండలాదుల
వలె
జగత్తు
కూడనూ
కార్యమగుట
వలన
దానికొక
కారణముండవలెను.
ఆ
కారణము
సత్
అని
చెప్పబడుచున్నది.
సత్
అనగా
ఉండుట
అని
అర్థము.
ప్రపంచమున
కాన్పించు
పదార్థము
లన్నియు
ఉన్నవి
గనుక
ఉండుట
అనునది
వీటి
కన్నింటికి
సమానము.
ఘటము
ఉన్నది,
కుండలాదులున్నవి.
ఉండుట
అనునది
ఘటము
కుండలాదులు
మొదలగు
వస్తువులచే
జోడింపబడి
వాని
ద్వారా
అభివ్యక్తమగుచున్నది.
అట్టి
వస్తువులతో
జోడింపబడక
పోయినను
ఆ
ధర్మముండి
యున్నది.
స్థూల
బుద్ధులకు
అది
అభివ్యక్తము
కాకపోవచ్చును.
గులాబి
పుష్పమునందు
అభివ్యక్తమగుచున్న
రోజా
వర్ణము
గులాబి
పుష్పము
లేకున్ననూ
ఉండియే
యున్నది.
గులాబి
పుష్పమును
ఆధారము
చేసికొనినపుడు
అది
కాన్పించుచున్నది.
ఆ
పుష్పము
లేనపుడది
కాన్పించుట
లేదు.
అటులనే
సమస్త
వస్తువులకును
సమానముగా
ఉండుటయను
ధర్మము
వస్తు
సంబంధము
లేకున్ననూ
ఎల్లప్పుడూ
ఉండియే
ఉన్నది.
3
▾
Meaning
Keep
సృష్టికి
పూర్వము
ఈ
సత్
పదార్థము
సద్
వస్తు
మాత్రముగా
నుండెను.
అక్కాలమున
అది
శూన్య
రూపముగా
నుండెనని
కొందరు
తలంతురు;
కాని
ఇది
సత్యము
కాదు.
సద్
వస్తువు
సజాతీయ
భేదము
లేని
ఏక
వస్తువు.
సత్
పదార్థము
శుద్ధ
సత్వ
ప్రధానమగు
మాయయందు
ప్రతి
ఫలించి
ఈశ్వర
స్వరూపమున
సృష్టి
క్రియ
నొనర్చి
తానే
జగద్రూపమున
అభివ్యక్తమయ్యెదనని
సంకల్పించి
తేజో
జల
వాయు
రూపములో
కాన్పించెను.
సృష్టి
యంతయూ
ఈ
మూడింటి
సమ్మిశ్రణము
వలననే
కలుగుచున్నది.
4
▾
Meaning
Keep
ఆత్మ
తత్త్వ
మెఱుగని
శాస్త్ర
పాండిత్యం
నిష్ఫలం
వేదాధ్యయనము
వంశపరంపరగా
ఉద్దాలకుని
వంశమునందు
వుండుటచే
అది
సత్
కులమని
ప్రసిద్ది
గాంచినది.
అట్టి
వంశములందు
పుట్టిన
వారందరూ
కులీనులని
పిలువబడుచున్నారు.
సద్
వంశమున
పుట్టిన
శ్వేత
కేతు
ఉపనయనమైన
తరువాత
గురుకులమున
వేదాధ్యయనము
చేయక
కాలహరణము
చేయుట
తండ్రికి
విచార
కారణమయ్యెను.
బ్రాహ్మణ
వంశమునందు
పుట్టి
వేదాధ్యయనము
చేయనివాడు,
స్వయముగా
బ్రాహ్మణుడు
కాడు.
బ్రాహ్మణులు
తనకు
బంధువులని
మాత్రము
చెప్పుకొనగలడు.
5
▾
Meaning
Keep
కుమారుడు
గురుకులవాసము
చేసి
విద్య
నభ్యసించుటకు
తగినవాడని
కనిపెట్టి
ప్రేమతో
అతనిని
మందలించెను.
శ్వేతకేతు
ద్వాదశ
వర్షములు
గురుకులవాసము
చేసి,
ఇరువదినాల్గు
సంవత్సరముల
అతని
వయసు
వచ్చునప్పటికి
అర్థ
సహితముగా
నాలుగు
వేదములను
గ్రహించిన
చతురమతి
యయ్యెను.
ఆ
విద్యాగర్వముచే
అతడుద్ధతుడై
తనతో
సరిపోలువారు
లేరనియు,
తానే
సంప్రదాయశీలుడనని
తలంచుచు
వినయము
లేనివాడై
స్వగృహము
చేరెను.
అట్టి
శ్వేతకేతువును
చూచి
తండ్రి
యిట్లడిగెను.
6
▾
Meaning
Keep
“నాయనా!
నీకు
సరిపోలువారు
లేరనియు
నీవే
సాంప్రదాయకుడవనియు
తలంచుచూ
అవినీతుడవగుచున్నావు.
కేవల
శాస్త్రాచార్యైక
లభ్యమగు
నట్టియు
పరబ్రహ్మమును
గూర్చి
చెప్పునట్టియు
ఆదేశము
నుపదేశింపుమని
నీ
గురువును
నీవడిగితివా?
ఆ
ఆదేశమెద్దియన
దేనిని
వినుట
చేత
వినబడనిదంతయూ
వినబడినదగుచున్నదో,
దేనిని
ఊహించుట
చేత
ఊహింపబడనిదంతయూ
ఊహింపబడినదే
అగుచున్నదో
అట్టిది
ఆ
ఆదేశము.”
కుమారుని
గర్వము
పోగొట్టుటకై
తండ్రి
ఈ
ప్రశ్న
నడిగెను.
సమస్త
శాస్త్ర
పారాయణుడైనను
ఆత్మతత్త్వ
మెఱుంగనివాడు
కృతకృత్యుడు
కాడని
దీని
భావము.
7
▾
Meaning
Keep
పరమార్థమగు
నా
సత్పదార్థమే
శ్వేతకేతునివంటి
జీవుడగుచున్నాడు.
చేతన
వంతములగు
సత్పదార్థము
ఉపాధి
భేదముచే
వ్యక్తి
భేదము
నొంది
అనేక
జీవ
రూపముల
భాసించుచున్నది.
సుషుప్తి
సమయము
నందీ
భేదము
నశించి
జీవులందరు
స్వస్వరూపమున
ఆనందమనుభవించుచున్నారు.
జాగ్రదవస్థయందు
అనుభూతములగు
నేను
రంగడు,
నేను
గంగడు,
నేను
తండ్రి,
నేను
పుత్రుడు
అను
మొదలగు
జ్ఞానము
లన్నియు
సుషుప్తియందు
నశించుచున్నవి.
మధుకరములచే
వివిధ
పుష్పములనుండి
చేర్చబడిన
మధురసము
సర్వ
భేద
శూన్యమై
ఏక
రసము
నొందుచున్నది.
8
▾
Meaning
Keep
గంగ,
కృష్ణ,
సింధు
మొదలగు
విభిన్న
నామముల
బరగుచున్న
నదులన్నియు
సముద్రమును
చేరి
స్వస్వరూప
నామముల
బోగొట్టుకొని
సముద్ర
భావమును
పొందుచున్నవి.
జీవుడు
నిత్యుడు.
మరణ
రహితుడు.
కర్మ
ఫలముగ
అనేక
జన్మల
నొందుచు
ప్రతి
జన్మమునందు
పూర్వ
వాసనా
ప్రేరితుడై
వ్యవహరించుచున్నాడు.
9
▾
Meaning
Keep
మరణము
శరీరానికే
గాని
జీవునికి
కాదు.
మఱ్ఱి
విత్తనము
చితకగొట్టినను
అంకురించుచునే
యుండును.
జలములో
కలసిపోయిన
లవణము
చేతికి
చిక్కకపోయిన
జలమునందంతట
నున్నట్లు
రుచిచే
తెలియబడుచున్నది.
అజ్ఞానముచే
జీవుడు
స్వస్వరూపమును
గుర్తెరుగ
జాలకున్నను,
విచారణచే
యథార్థ
జ్ఞానమును
పొందినపుడు
చోరులచే
నడి
అడవులలో
వదలిపెట్టబడిన
ధనికుని
వలె
జీవుడు
కూడ
స్వస్థానమునకు
చేరగలడు.
ఇట్లు
స్వస్థానమును
పొందిన
జీవుడు
సర్వ
సంసార
వినిర్ముక్తుడగును.
అట్లు
కానివాడు
పూర్వ
వాసనా
బలముచే
సౌషుప్తిక
సుఖమునుండి
యుత్థితుడగు
నరునివలె
తిరిగి
మృత్యుస్వరూపమగు
సంసారములో
జిక్కుకొనును.
10
▾
Meaning
Keep
ప్రపంచం
బ్రహ్మమునందు
పుట్టి,
ప్రతిష్ఠితమగుచున్నది
బ్రహ్మ
ఏకమేవాద్వితీయ
మనియు,
పరిదృశ్యమానమగు
జగత్తంతయు
తత్స్వరూపమేయనియు
నిరూపింపబడినది.
ఇట్టి
పరబ్రహ్మమును
తెలిసికొను
స్థానము,
అద్దాని
సత్యకామాది
సగుణ
స్వరూపము,
అద్దాని
పొందు
సాధనము
బ్రహ్మోపాసకులు
పోవు
సుషుమ్నా
మార్గము
అని
పేర్కొనబడుచున్నది.
సర్వ
వ్యాపియయిన
బ్రహ్మము
హృదయాకాశమున
సులభముగా
దొరకును.
రాజు
నగరమునువలె
బ్రహ్మము
హార్దాకాశము
నధిష్ఠించి
యుండుటచే
అది
బ్రహ్మవేశ్మమని
పిలువబడుచున్నది.
బ్రహ్మము
హృదయ
కుహరముచే
పరిచ్ఛిన్న
మగుట
లేదు.
విషయ
విముఖులగు
యోగులు
నిర్మలమగు
హృదయాకాశమున
విజ్ఞాన
జ్యోతిస్స్వరూపమగు
పరబ్రహ్మమును
పొందగలరు.
ప్రపంచమంతయు
బ్రహ్మమునందు
పుట్టుచు,
రథ
చక్ర
నాభియందుండు
ఆకులవలె
అద్దానియందు
బ్రతిష్ఠితమగుచున్నది.
11
▾
Meaning
Keep
శరీరముయొక్క
జరామరణాది
వికారములా
వస్తువునంటవు.
బ్రహ్మముయొక్క
కామములు,
సంకల్పములు
కూడ
అమోఘమగుటజేసి
అతడు
సత్యకాముడనియూ,
సత్యసంకల్పుడనియూ
జెప్పబడుచున్నాడు.
ఇదికాదు,
అదికాదు
అని
త్రోసివేసిన
తరువాత
మిగిలియున్నది
పరబ్రహ్మమగుచున్నది.
ఇదియే
ముముక్షువులు
కోరు
పరమార్థము.
బ్రహ్మమును
ఇట్లు
తెలిసికొను
వారలు
సార్వభౌమ
పదవిని
చేరి
కామచారులగుచున్నారు.
సమస్త
కామములు
విశుద్ధ
సత్య
సంపన్నుడగు
జ్ఞానియొక్క
హృదయాకాశమున
సత్యములయి
కాన్పించుచున్నవి.
12
▾
Meaning
Keep
బ్రహ్మచర్యం
ఆత్మోపలబ్ధికి
ముఖ్యం
ఆత్మయే
సమస్త
లోకములను
ధరించు
సేతువగుచున్నది.
అతడు
అశరీరుడు.
అతనికి
పాప
సంపర్కముండనేరదు.
అతని
పొందిన
వాడంధుడైనా
సనంధుడే
అగుచున్నాడు.
బ్రహ్మచర్యమాత్మోపలబ్ధికి
ముఖ్య
స్థానము.
యజ్ఞము,
సత్రాయణము,
ఉపవాసము
మొదలగు
వాని
ఫలము
బ్రహ్మచర్యము
వలననే
గలుగును.
13
▾
Meaning
Keep
శరీరమునందలి
అసంఖ్యేయములగు
నాడులందు
సూర్యతేజస్సు
ప్రవేశించును.
ప్రాణోత్క్రమణ
సమయమునందు
ఇంద్రియములన్నియు
మనస్సును
చేరును.
మానసికోపాధికుడగు
జీవుడు
నాడీద్వారమున
హృదయాకాశమును
జేరును.
జ్ఞానియగు
జీవుడు
అవసాన
సమయమున
సుషుమ్నా
ద్వారమున
సూర్యకిరణముల
ద్వార
సూర్య
లోకము
చేరి
అచటినుండి
బ్రహ్మ
లోకము
చేరును.
అజ్ఞాని
ప్రాణములు
చక్షురాదీతర
మార్గమున
కర్మానురూపములగు
అనిత్యములగు
ఇతర
లోకములను
చేరును.
ఇటులనే
సుషుప్తియందుకూడా
సర్వేంద్రియ
వివరణముచే
అజ్ఞాన
పూరితమగు
సుఖానుభవము
గల్గుచున్నది.
14
▾
Meaning
Keep
స్మరణతో
సర్వము
అనుభూయమానము
సంకల్పాలన్నింటికి
చిత్తమే
స్థానము.
అవి
అన్నియు
చిత్త
స్వరూపములు.
చిత్తమునుండి
పుట్టినవి.
చిత్తమునందు
ప్రతిష్ఠితములైనవి.
చిత్తము
సంకల్పాలకు
మూలమగుటచే
అనేక
శాస్త్రముల
నభ్యసించిన
విద్వాంసునికి
చేతనత్వము
పోయినపుడు
అతడు
లేనివానితో
సమానమని
లోకులు
చెప్పుదురు.
బ్రహ్మ
బుద్ధితో
చిత్తము
నుపాసించువాడు
సౌష్ఠవము
గలవాడగును.
చిత్తము
సంకల్పముల
కంటే
గొప్పదగుచున్నది.
మనస్సు
మొదలగునవి
సంకల్పమునందున్నవి.
సంకల్పమే
వాని
స్వరూపము.
సంకల్పము
మానసిక
వృత్తి.
చిత్తము
సంకల్ప
కారణము.
సంకల్ప
మిచ్ఛా
కారణము.
కర్తవ్యాకర్తవ్యములను
విషయ
విభాగముచే
సమర్థించుట
సంకల్పమనబడును.
తరువాత
దానిని
వాక్కుతో
చెప్పును.
ఇచ్చగించిన
దానిని
నామముతో
చెప్ప
గోరును.
శబ్ద
విశేషములగు
మంత్రములు
నామ
మంత్రములై
వాని
యంతర్భావము
లగుచున్నవి.
మంత్రములందు
కర్మ
లేకమగుచున్నవి.
అమంత్రమగు
కర్మ
యుండనేరదు.
15
▾
Meaning
Keep
ధ్యానము
చిత్తమునకంటే
అధికమైనది.
ధ్యాన
విషయమగు
దేవతా
బుద్ధిచే
శాస్త్ర
విహితమగు
సాలగ్రామాది
కనిష్ఠ
వస్తువులందితర
చిత్త
వృత్తులచే
చెదరని
బుద్ధి
వృత్తిని
నిలుపుట
ధ్యానమందురు.
దీనినే
చిత్తైకాగ్య్రమనియు
వాడుదురు.
ధ్యాన
నిష్ఠుడగువాడు
నిశ్చలుడగుచున్నాడు.
అదే
విధముగా
పృథివి
నిశ్చలముగా
నున్నది.
ఆ
తీరుననే
అంతరిక్షము,
ద్యులోకము,
జలములు,
పర్వతములు,
దేవతలు,
మనుష్యులు
శమాది
గుణ
సంపత్తిచే
దేవతా
సమానులగు
మనుష్యులు
కూడ
ధ్యానము
చేయుచున్నటుల
నచంచలముగా
నున్నారు.
16
▾
Meaning
Keep
విజ్ఞానము
ధ్యానము
కంటే
ఉత్తమమైనది.
శాస్త్రార్థము
తెలిసికొను
జ్ఞానము
విజ్ఞానమందురు.
అది
ధ్యానముచే
లభ్యమగుట
వలన
ధ్యానముకంటే
ఉత్తమమని
తెలుపబడినది.
బలము
విజ్ఞానముకంటే
నతిశయమగును.
అన్నము
భుజించుటచే
కలిగిన
జ్ఞేయములగు
విషయములందు
మనస్సు
ప్రతిభను
పొందు
సామర్థ్యము
బలము.
జ్ఞేయ
విషయములందు
ప్రసరించు
వానిని
సులభముగా
గ్రహించు
బుద్ధి
సామర్థ్యము
ప్రతిభ,
ఇది
అన్నముచే
పోషింపబడుచున్నది.
అన్నము
బలము
కంటే
అధికము.
పది
దినములు
అన్నము
తినకుండినచో
అట్టివాడు
మరణించును.
మరణించక
జీవించియుండినచో,
గురువు
వలన
విషయములు
గ్రహించి
శ్రవణము
చేయలేడు.
మననము
చేయలేడు.
17
▾
Meaning
Keep
దీనికంటే
తేజస్సు
అధికమైనది.
తేజస్సునుండి
జలము,
జలమునుండి
అన్నము
పుట్టును.
కాన
తేజస్సు
రెండింటికీ
అధికమైనది.
తేజస్సు
వాయువును
బంధించి
వెచ్చగా
చేయును.
అపుడాకాశమంతయూ
వేడిగా
నుండును.
తేజస్సు
ముందుగా
వాయుతత్త్వమై
తరువాత
జలమునుత్పత్తి
చేయుచున్నది.
తేజస్సే
ఉరుము
రూపమున
వర్ష
హేతువగును.
18
▾
Meaning
Keep
ఆకాశము
తేజస్సుకంటే
గొప్పది.
శబ్దమాకాశ
మూలమున
వినబడుచున్నది.
ఆకాశమునందే
ప్రియ
వస్తు
సంయోగము
వలన
అన్యోన్య
క్రీడ
జరుగుచున్నది.
ఆకాశమునందే
బీజమంకురించు
చున్నది.
19
▾
Meaning
Keep
స్మరణ
మాకాశమున
కంటే
గొప్పది.
పూర్వమను
భూతమైన
దానిని
జ్ఞాపకమునకు
తెచ్చుకొను
అంతఃకరణ
ధర్మము
స్మృతి
అనబడును.
స్మరణ
ఉన్నప్పుడే
సర్వము
అనుభూయ
మానమగుచున్నది.
అది
లేనపుడు
ఆకాశాది
వస్తువులను
గూడా
స్మరించుట
శక్యము
కాదు.
అందువలన
స్మరణ
ఆకాశమునకు
కారణమగుచున్నది.
20
▾
Meaning
Keep
సశరీరునకు
సంసారము,
అశరీరునకు
స్వస్వరూపము
ఈ
విధముగా
అవిద్యచే
దేహ
తాదాత్మ్యము
నొందిన
జీవుడు
ప్రతిబుద్దుడైన
తరువాత
సంప్రసాద
స్థితి
జేరి
ఈ
శరీరమును
వదలి
దేహాదుల
కంటే
విలక్షణమగు
స్వస్వరూపమును
పొందును.
అతడుత్తమ
పురుషుడు.
స్వస్వరూపమును
పొందినవాడై
సంకల్ప
మాత్రమున
ఇందరి
రూపమును
బోలి,
యొకప్పుడు
నవ్వుచు,
ఒకప్పుడు
క్రీడించుచు,
జ్ఞాతులతో
రమించుచు,
శరీరమును
స్మరింపడు.
సశరీరునకు
సంసారము,
అశరీరునకు
స్వస్వరూపము
సంప్రాప్తి
యగునను
విషయము,
దృష్టాంతముచే
వివరింపబడుచున్నది.
ప్రసిద్ధములగు
వాయువు,
మేఘములు,
ఉరుములు,
మెరుపులు,
అనువానికి
శిరఃప్రాణాద్యాకృతి
లక్షణమగు
శరీరము
లేదు.
వర్ష
సమయమున
ఇవియాకాశ
తాదాత్మ్యమును
పొంది
దానియందు
లయమగుచున్నవి.
21
▾
Meaning
Keep
ఓంకారోపాసనాది
సాధనా
సహితముగా
ఆత్మ
జ్ఞాన
అష్టాధ్యాయియగు
ఈ
ఉపనిషన్ముఖమున
పరమేశ్వరుని
వలన
హిరణ్యగర్భునకు,
ఆయన
వలన
కశ్యప
ప్రజాపతికి,
మనువునకును,
మనుష్యులకును
క్రమాగతము
లగుటచే
ఈ
విద్య
సంప్రదాయ
సిద్ధమగుచున్నది.
Previous
←
Kena Upaniṣad
Next
Aitareya Upaniṣad
→