Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Upaniṣad Vāhini · Aitareya Upaniṣad
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
10.
ఐతరేయోపనిషత్
బ్రహ్మ
లక్షణాలు:
సర్వ
వ్యాపకత్వం,
సర్వ
భోగం,
సతత
గమనం
ఈ
ఉపనిషత్తు
ఋగ్వేదాంతర్గతమైనది.
ఆత్మతత్త్వ
ప్రతిపాదితమగు
కాండషట్కముతో
అలరారుచున్నందున
ఆత్మ
షట్కమని
ప్రసిద్ధి
గాంచినది.
అవిద్యా
నాశన
పూర్వకమగు
ఆత్మ
దర్శనము
సంప్రాప్తమయి
ఆత్మ
జ్ఞానము
కలుగునటుల
శిష్యునిచే
చేయబడినది.
“ఆత్మ”
“వ్యవహార
విశిష్టము”
అని
కేవలము
రెండు
విధములు.
వ్యవహార
విశిష్టుడైనపుడు
అతడు
జీవుడని
పిలువబడుచున్నాడు.
2
▾
Meaning
Keep
ప్రతి
మనుజునియందూ
ఆత్మ
జ్ఞానేంద్రియముల
ద్వారా
బాహ్యమునకు
స్ఫురించుచున్నాడు.
ఆత్మ
శబ్దము
“ఆత్”
అను
ధాతువునుండి
ఉత్పన్నమగుచున్నది.
ఆ
ధాతువుకు
వ్యాపకత్వము,
భక్షణము,
గమనమని
మూడర్థములు
కలవు.
సర్వ
వ్యాపకత్వము,
సర్వ
భోగము,
సతత
గమనము
లక్షణములుగా
గలది
ఆత్మ.
ఇవియే
బ్రహ్మ
లక్షణములు.
3
▾
Meaning
Keep
జాగ్రత్
అవస్థయందు
సర్వ
భోగములు
అనుభవించుచున్నాడు.
కనుక
ఆత్మ
శబ్దమునకు
భోగపరుడనియు,
స్వప్నమందు
సర్వేంద్రియములు
స్వస్వవ్యాపారములు
మాని
పరమావస్థను
జెందినపుడు
జాగ్రదనుభవ
వాసనలను
స్వీయకాంతిచే
జగద్రూపమున
సృజియింప
స్వీకరించువాడనియు,
సుషుప్తియందు
సర్వేంద్రియములు
మనస్సు
గూడా
పరమావస్థను
పొందినపుడు,
సర్వవ్యాపియై
ఏమియూ
తెలియని
కేవలము
సుఖస్వరూపమును
పొందువాడనియు,
ఇట్లు
జాగ్రత్స్వప్న
సుషుప్త్యాది
అవస్థా
త్రయములనుబట్టి
ఆత్మ
శబ్దార్థము
నిర్వచించబడినది.
ఉపాధి
విశేషముచే
ఆత్మ
పరిచ్ఛిన్నముగా
గాన్పించిననూ,
పరమార్థముచే
అతడు
నిరుపాధికుడు.
దేశ,
కాల,
వస్తు
పరిచ్ఛిన్నములు
లేనివాడు.
అనగా
అనంతుడు.
ఇదియు
ఆత్మ
శబ్దమునకు
అర్థము.
ఇట్టి
ఆత్మ
సర్వజ్ఞుడు,
సర్వ
శక్తిమయుడు,
సర్వ
ధర్మవర్జితుడు,
నిత్య
శుద్ధ
బుద్ద
ముక్త
స్వభావుడు,
అద్వయుడు.
ఆత్మకు
అవయవ
భేదములు
లేవనియు
తెలియుచున్నది.
4
▾
Meaning
Keep
ప్రత్యక్షాది
ప్రమాణములచే
ఈ
జగత్తంతయు
అనుభవ
గోచరమగుచున్నది.
కనుకనే
మూల
మంత్రమునందు
అది
“ఇదం”
“ఇది”
అని
హస్త
విన్యాసముల
చేతనే
అనునట్లు
నిర్దేశింపబడుచున్నది.
ఇది
వివిధ
నామ
రూప
సంకులమై
సృష్టియని
ప్రసిద్ధిగ
జెప్పబడుచున్నది.
సృష్టి
శబ్దము
ఒక
కార్యమును
తెలుపుచున్నది.
సృష్టి
కార్యమునకు
పూర్వము
ఈ
జగత్తు
ఏ
రూపమున
నున్నది?
“
ఇదం
అగ్రే
ఆత్మా
ఏవ
ఆసీత్”
అనగా
మన
ఎదుట
కాన్పించుచున్న
ఈ
జగత్తు
సృష్టికి
పూర్వము
ఆత్మగానే
యుండెను.
శ్రుతి
కూడా
ఈ
విషయమును
తెలిపియే
యున్నది.
సృష్టికి
పూర్వమున
నున్న
జగత్తు,
తరువాత
నున్న
జగత్తు
రెండూ
ఒక్కటే!
సృష్టికి
పూర్వము
అవ్యాకృతమై
కేవలమాత్మ
రూపమున
నుండెను.
5
▾
Meaning
Keep
సృష్టి
అంతా
మాయా
కల్పితము
సృష్టి
తరువాత
అనేక
నామ
రూపములతో
వ్యాకృతమై
అదియే
కాన్పించుచున్నది.
ఇంద్రియ
గోచరత్వము
వ్యాకృతి
లక్షణము.
ఇంద్రియ
అగోచరత్వము
అవ్యాకృత
లక్షణము.
నామము
శబ్దాత్మకము.
వాక్కుచే
అభివ్యక్తమగుచున్నది.
ఇతడు
రంగడు
అనే
వాక్యమున
రంగడు
అను
నామము
వాక్కుచే
ఉచ్చరింపబడినపుడు
వినబడుచున్నది.
శ్రుతి
విషయమగు
శబ్దము
దాని
కర్థమగు
రంగడను
చక్షు
విషయమగు
రూపము
కూడ
బుద్ధికి
గోచరములగుచున్నది.
ఇట్టి
శబ్దార్థములు
రెండునూ
సృష్టికి
పూర్వము
లేవు.
అందువలన
అపుడు
ఆత్మయను
అవ్యాకృత
రూపముననున్న
జగత్తు
వాగ్బుద్ధుల
కగోచరమగుచున్నది.
సృష్టి
అనంతరము
నామ
రూపాత్మకమగుటచే
వాగ్బుద్ధులకు
గోచరమగుచున్నది.
పూర్వమద్వితీయముగా
ఉన్న
స్థితిని
ఆత్మయనియు,
నామ
రూపములచే
అనేకాకారముల
భాసించు
స్థితిని
జగత్తనియు
ఒకే
వస్తువు
వ్యవహరింపబడుచున్నది.
6
▾
Meaning
Keep
అదే
విధముగా
సముద్ర
జలము
కూడ
ఫేన,
బుద్బుద,
తరంగములను
అనేక
నామ
రూపముల
అభివ్యక్తమగుచున్నది.
ఇదియే
సృష్టికి
పూర్వోత్తరములన్న
భేదము.
సృష్టి
మాయాకల్పితమగుటచే
ఆత్మకంటే
భిన్నముగా
మాయయను
యొక
వస్తువు
ఉన్నటుల
శంకింప
నవసరము
లేదు.
మాయయనునది
ఆత్మయొక్క
శక్తియే!
అది
ఆత్మకంటే
భిన్నము
కాదు.
శక్తి,
శక్తిమంతునికంటే
భిన్నము
కాలేదు
కదా!
ఆత్మ
సజాతీయ,
విజాతీయ,
స్వగత
భేద
రహితమని,
“ఏకః
ఏవ”
అను
రెండు
పదములచే
తెలుపబడినది.
అంత
మాత్రముచే
ఆత్మ
యొక్క
అద్వితీయత్వము
నిస్సందేహముగా
స్థిరపడుటలేదు.
త్రాడే
సర్పరూపమున
భాసించినట్లు,
ఎండమావులే
నీటివలె
భాసించునట్లు,
ఆత్మయే
జగదాకారమున
మాయాశక్తిచే
భాసించుచున్నదని
దీని
భావము.
7
▾
Meaning
Keep
సృష్టి
యైంద్రజాలమును
బోలు
నొక
కార్యము.
దానికి
కారణముండవలెను;
పరబ్రహ్మయే
దానికి
కారణము.
త్రాటియందు
గల్గు
సర్పభ్రాంతికి
త్రాడే
కారణము.
ఆత్మ
అద్వితీయుడు,
అశరీరుడు,
ఇంద్రియాది
సాధనరహితుడని
తెలియుచున్నది
గదా!
అటులయిన
అతడాలోచించి,
లోకమును
సృజించెనని
శ్రుతి
తెలుపుచున్నదే
అని
యోచించుటకు
చోటు
లేకపోలేదు.
అయితే
సృష్టి
యంతయు
ఇంద్రజాలికుని
విద్య
వలె
మాయాకల్పితమగుచున్నది.
8
▾
Meaning
Keep
లోకపాలకులు,
ఇంద్రియాధిష్ఠాన
దేవతల
సృష్టి
మాయ
ఆత్మ
శక్తియే
కదా!
శక్తియొక్క
విజృంభణము
కదా!
ఈషణాది
క్రియా
రూపమగు
అభివ్యక్త
క్రియాచరణ.
మనయందలి
శక్తి
అవసరమైనపుడు
క్రియారూపమున
విజృంభించుచున్నది.
అపుడు
ఆ
క్రియను
మనము
చేసితిమను
చెప్పుచున్నాము.
కాని
మనయందలి
శక్తి
చేసినది
అంటున్నామా?
అటులనే
ఆత్మ
శక్తియగు
మాయచే
చేయబడిన
ఈషణాది
క్రియ
ఆత్మయందు
ఆరోపింపబడుచున్నది.
ఇట్లు
సృజింపబడిన
లోకములన్నియు
అచేతనములగుటంజేసి
వాని
సంరక్షణ
కర్త
యొక్క
సృష్టి
అనంతర
మంత్రమున
నుదాహరింపబడుచున్నది.
పరమాత్మ
లోకమును
సృజించిన
తరువాత
ఆలోచించెను.
లోకమును
సృజించి
లోకపాలకుడు
లేక
లోకమెట్లు
నడుచునని?
యంత్రమును
సృజించి,
యంత్రమును
నడుపువాడు
లేకున్న
యంత్రమెట్లు
నడుచును?
అటులనే
సృష్టికి
లోకపాలకుడు
కావలెనని
పరమాత్మ
సంకల్పించెను.
9
▾
Meaning
Keep
జల
ప్రధానములగు
పంచ
భూతములనుండి
విరాట్పురుషుని
సృజించి
అతనిని
శిరః
ప్రాణాద్యవయవ
సంయోగముచే
చేసెను.
కుమ్మరి
చెరువునందలి
మట్టిని
తీసి
ముద్ద
పాకముగా
చేయును.
అదే
విధముగా
బ్రహ్మాండ
లోకపాలకుడు,
సమిష్టి
రూపుడును
అగు
విరాట్పురుషుని
పిండాకృతిని
పంచభూతములనుండి
ఆయతము
చేసెను.
ఆపై
ఆ
పురుషుని
అవయవములనుండి
లోకపాలుర
ఉత్పత్తి
చేసెను.
అటు
తరువాత
పరమాత్మ
తిరిగి
ఆలోచించి
ఆ
పిండమునకు
అవశ్యమగు
ఇంద్రియ
గోళములను,
ఇంద్రియములను,
అధి
దేవతలను
కూడా
సృజించెను.
ఆ
పిండమునకు
ముఖ
గోళము
వాగింద్రియము.
వాని
కధిష్ఠాన
దేవత
అగ్ని;
నాసికా
గోళములు
ఘ్రాణేంద్రియములు;
శ్రోత్రేంద్రియములు
తదదిష్ఠాన
దేవతలగు
దిక్కులు,
ఈ
రీతిగా
ఆయా
ఇంద్రియ
అధిష్ఠాన
దేవతలను
సృజించెను.
అధిష్ఠాన
దేవతలు
ఆయా
ఇంద్రియముల
ననుగ్రహించుటే
వాని
పాలన.
కన్నులు,
చెవుల
ఆకారములు
బాగున్ననూ
ఇంద్రియములు
లేకుండుటచే
గ్రుడ్డితనము,
చెవుడు
సంభవించుచున్నవి.
అధిష్ఠాన
దేవతల
అనుగ్రహముచే
ఇంద్రియములు
వ్యాపారవంతములగుచున్నవి.
వీటన్నిటిని
ఒకదానినుండి
మరియొకటి
సృజించెను.
10
▾
Meaning
Keep
మనుష్య
శరీర
మొక్కటి
మాత్రమే
మోక్షసాధకము
పరమేశ్వరుడు
పూర్వము
వలెనే
ఉదకములోనుండి
గోవును,
తరువాత
అశ్వమును
సృజించి,
దేవతలు
సంతృప్తులు
కానందున,
దేవతల
ప్రార్థనతో
విరాట్పురుష
దేహమును
బోలు
పురుష
శరీరమును
సృజించెను.
ఆ
పురుష
శరీరము
వివేక
సంపన్నమగుటంజేసి
అందులకు
దేవతలు
సంతసించిరి.
మనుష్యేతర
శరీరములు
అన్నియూ
కేవలము
ఫలభోగ
భూములు
మాత్రమగుచున్నవి.
మనుష్య
శరీరమొక్కటి
మాత్రము
మోక్షసాధనమగు
వివేకముతో
కూడుకొని
యుండుటతో
ఇతర
శరీరములకంటే
విలక్షణమై
సుకృత
మనిపించుకొనుచున్నది.
11
▾
Meaning
Keep
ఈ
నూతనాయాతనముతో
దేవతలు
తృప్తి
నొందినందున
పరమేశ్వరుడు
వారిని
వారి
వారి
యథోచితములగు
ఇంద్రియాయతనముల
ప్రవేశించుట
కాజ్ఞాపించెను.
తదనుసారముగా
వారి
వారి
సాధనములందు
దేవతల
ప్రవేశము
చూపబడినది.
వివిధ
దేవతలు
తమ
తమ
స్థానములగు
పురుష
శరీరమునందలి
వివిధేంద్రియముల
ప్రవేశము
ఈ
రీతిగా
నున్నది.
వాగ్రూపమున
అగ్ని
ముఖమును,
ప్రాణవాయు
రూపమున
వాయువు
నాసాపుటములను,
తేజో
రూపమున
సూర్యుడు
నేత్రములను,
శ్రోత్రేంద్రియ
రూపమున
దిక్కులు
కర్ణపుటములను,
రోమ
రూపమున
ఓషధీ
వనస్పతులు
చర్మమును,
మనో
రూపమున
హృదయమున
చంద్రుడును,
మృత్యువు
అవసాన
రూపమున
నాభిని,
జలములు
తేజోరూపమున
శిశ్నమును
ప్రవేశించెను.
12
▾
Meaning
Keep
తరువాత
పంచ
సూక్ష్మమహాభూతములనుండి
ఘనీభూతమగు
నొక
ముద్ద
నాతడాయత్తము
చేసెను.
ఈ
మూర్తియే
అన్నము,
జల
సహితమగు
భూమినుండి
మనుష్యుల
కుపయోగించు
లేహ్యములు
కలుగుగాక
అని
సంకల్పించెను.
పరమేశ్వరుడు
శరీరమును
ప్రవేశించు
మార్గమును
విచారించి,
శిరోగ్ర
భాగమును
జేర్చి,
ఆ
భాగమున
జీవ
భావముతో
దేహేంద్రియ
సంఘాతమును
ప్రవేశించెను.
ఈ
ద్వారమే
“విధృతి”
అని
పిలువబడుచున్నది.
వాందనమని
కూడా
పిలువబడుచున్నది.
ఇట్లు
జీవ
రూపమున
ప్రవేశించిన
పరమేశ్వరునకు
మూడు
నివాస
స్థానములు
కలవు.
ఈ
మూడునూ
స్వప్న
స్థానములే
అగును.
క్రియా
రూపమగు
ప్రాణ
రూపమున,
పాదముల
ద్వారా,
జ్ఞాన
రూపమున,
శిరో
ద్వారముల
ద్వారా
జీవుడు
ప్రవేశించును.
అందువలననే
జ్ఞానేంద్రియములన్నియు
శిరస్సున
కధోభాగమున
నున్నవి.
జీవుని
ప్రవేశమునకు
ప్రత్యేకముగా
జేయబడుటచే
ఈ
ద్వారము
చీల్చబడినది.
శిరస్సున
తైలధారణ
చేయబడినపుడు
ఈ
ద్వారమున
నీరసము
తెలియబడుచున్నది.
ఈ
ద్వారమే
సుషుమ్నానాడి
కంతిమ
భాగమై
యోగులు
కన్ను
ముఖమున
ప్రాణోత్క్రమణము
చేసి
ముక్తులగుచున్నారు.
ఇయ్యది
బ్రహ్మమును
చేరు
మార్గమగుటచే
దీనిని
బ్రహ్మరంధ్రమని
కూడా
అందురు.
13
▾
Meaning
Keep
జీవరూపం
ద్వారా
పరమాత్మ
స్వప్రకాశుడగుచున్నాడు
ఇట్లు
శరీరపురిని
ప్రవేశించిన
పరమాత్మ
జీవరూపమున
దేహేంద్రియ
సంఘాతమున
కంతకూ
అధిపతి
అయి
దానికి
ఏలిక
అగుచున్నాడు.
వేషధారియగు
నటునివలె
నా
సంఘాతముఖమున
బాహ్యమునకు
స్ఫురించుచూ
ప్రారబ్ధము
ననుభవించుచున్నాడు.
ప్రభువగు
అతని
సాన్నిధ్యమున
బుద్ధి
యను
నర్తకి,
ఇంద్రియములు
వేయు
తాళమునకు
మేళవించుచు
నొక
విషయమునుండి
మరొక
విషయమునకు
నాట్యము
చేయును.
ఇట్లు
జీవి
రూపమున
పరమాత్మ
స్వప్రకాశుడగుచున్నాడు.
14
▾
Meaning
Keep
ఇట్టి
జీవాత్మకు
నేత్ర,
కంఠ,
హృదయములు
మూడును
క్రీడాస్థానములు.
జాగ్రత్కాలమున
నేత్రమందును,
స్వప్న
కాలమున
కంఠమందును,
సుషుప్తి
కాలమున
హృదయమందును
జీవుడు
క్రీడించుచుండును.
నేత్రము
లందుట్టిపడు
బ్రహ్మ
తేజస్సుచే
ముఖము
ఒక
నూతన
వికాసము
నొందుట
అనుభవ
సిద్ధము.
అట్టి
జీవికి
స్వస్వరూప
జ్ఞానము
కలిగిన
తరువాత
ఎచట
చూచిననూ
ఆత్మకంటే
వ్యతిరిక్తమగు
వస్తువు
వున్నదని
నిర్వచింపలేకపోయినను,
కారణముచే
బ్రహ్మమే
ఈ
పురుషాకారమున
వ్యాప్తమైనట్లును
తెలిసికొనును.
ఇట్టి
జీవబ్రహ్మ
తత్త్వము
విచారణ
చేయు
మనుజుడు
కృతకృత్యుడగుట
ఆశ్చర్యము
కాదు.
15
▾
Meaning
Keep
జాగ్రదాద్యవస్థలు
ఆత్మకు
సంబంధించవు
జాగ్రదాద్యవస్థలు
ఆత్మకు
సంబంధించినవి
కావు.
అవి
కేవలము
దేహేంద్రియాది
కార్యకారణ
సంఘాతమునకు
చేరినవే.
మనుజునకునూ
స్వీయమగు
దేహమొకటి,
పుత్రాత్మకమగు
దేహమొకటి.
ఇట్లు
దేహద్వయము
కలదు.
మరణమాసన్నము
అగుచుండగా
తాను
చేయవలసిన
స్వాధ్యాయాధ్యయనము,
యజ్ఞము
మొదలగు
పుణ్య
కర్మల
నాచరించుటకు
కుమారుని
తన
ప్రతినిధిగా
నేర్పఱచి,
తండ్రి
తాను
చేసిన
పుణ్యకర్మ
ఫలమగు
భావి
శరీరమును
వాసనా
రూపముగా
గ్రహించి
ఈ
శరీరమును
వదలి
మరియొక
శరీరమున
బుట్టును.
ఇదియే
తండ్రియొక్క
తృతీయ
జన్మము.
మొదటి
మూడవ
మంత్రమునందు
చెప్పిన
రెండు
జన్మములు
కుమారునివి.
ఇచట
చెప్పబడుచున్న
తృతీయ
జన్మము
తండ్రిది.
16
▾
Meaning
Keep
వామదేవర్షి
ఆత్మస్వరూపమును
ఈ
ప్రకారముగా
తెలిసికొనిన
వాడై
ప్రారబ్ధమగు
దేహమును
మంత్రగర్భ
నివాస
మంత్రానుభవము
వలననే
నశింపజేసి,
సర్వ
సంసార
బంధ
విముక్తుడై
పరమాత్మ
భావమును
పొంది
ఆ
రూపమును
సర్వ
కాలముల
అనుభవించెను
మరియు
మరణ
రహితుడయ్యెను.
Previous
←
Chāndogya Upaniṣad
Next
Taittirīya Upaniṣad
→