Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Vidyā Vāhini · When the vision is filled with Jñāna, creation is filled with Brahman
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
3.
దృష్టి
జ్ఞానమయమైతే
సృష్టి
బ్రహ్మమయమవుతుంది
పిల్లల
దేహ,
మనో
ఆరోగ్యములను
కాపాడుట
అధ్యాపకుల
బాధ్యత
నేటి
విద్యావిధానము,
అతి
వ్యయముతో
నైతిక
శిక్షణ
విస్మరించియున్నది.
ప్రాచీన
గురుకులములో
నైతిక
శిక్షణతో
పాటు
ఆధ్యాత్మిక,
ధార్మిక
శిక్షణ
నేర్పెడివారు.
విద్యార్థులకు
వినయము,
ఇంద్రియ
నిగ్రహము,
సచ్ఛీలము,
మర్యాద,
ఆనాటి
తర్ఫీదు.
నేడా
సద్గుణములు
కాన్పించవు.
ఇంద్రియ
నిగ్రహమంటే
ఏమో
తెలియదు.
బాల్యము
నుండీ
స్వేచ్ఛా
విహారము,
ఇంద్రియ
లోలత్వము,
భౌతిక
వాదము.
అందువలననే
కళాశాలలు
చూస్తే
భయమేస్తుంది.
కలకత్తా
ఆరోగ్యశాఖాధికారి
కలకత్తా
విశ్వవిద్యాలయములో
నూటికి
ఎనుబది
భాగములు,
అనగా
80
శాతము
పిల్లల
ఆరోగ్యము
దిగజారిపోవుచున్నదని
నిర్ణయించెను.
బొంబాయి
ప్రాంతాలలో
విద్యార్థుల
ఆరోగ్యము
నూటికి
తొంబైవంతులు
అనగా
90
శాతము
క్షీణించుచున్నదని
తెలిపిరి.
వీటికి
కారణమేమి?
ఇంద్రియలోలురు
కావటమే.
మితిమీరిన
స్వేచ్ఛా
సంచారము,
దుర్గుణముల
సారమే.
ఇవి
విద్య
యొక్క
ఫలితములా?
అవిద్య
యొక్క
ఆస్తిపాస్తులా?
పాఠకులే
నిర్ణయించవచ్చును.
2
▾
Meaning
Keep
అధ్యాపకులు
తమ
తమ
పాత్రను,
బాధ్యతలను
గుర్తించాలి.
అమాయకులైన
పిల్లల
మనో,
దేహ
ఆరోగ్యములు
కాపాడుటలో
అధ్యాపకులకు
బాధ్యత
యెంతైనా
కలదు.
3
▾
Meaning
Keep
ఎవరిలోకము
వారిదే
ప్రతి
ప్రాణీ
చూచుచున్నాడు.
కానీ,
ఒక్కొక్కడు
ఒక్కొక్క
విధముగా
చూచుచున్నాడు.
ఒకే
వస్తువును
పదిమంది
పది
భావాలతో
చూచుచున్నారు.
ఒక
వ్యక్తిని
కొమారుడు
చూచి
తండ్రి
అని
భావించుచున్నాడు.
భార్య
చూచి
తన
భర్తగా
భావించుచున్నది.
తన
తండ్రి
చూచి
కొడుకు
అని
భావిస్తాడు.
మిత్రులు
చూచి
తమ
ప్రియ
స్నేహితుడని
తలుస్తారు.
ఒకే
వ్యక్తి
కదా,
అందరికీ
ఒకే
విధముగ
యెందుకు
గోచరించడు?
వారి
దృష్టి
వేరు,
భావము
వేరు.
4
▾
Meaning
Keep
బ్రహ్మంగారి
మఠములో
గురువుగారు
తాంబూలము
వేసుకొంటూ
“ఒరే
శిష్యా!
లోకమెట్లుందిరా?”
అని
ప్రశ్నించినారు.
శిష్యుడు
“గురూజీ
గారు!
ఎవరి
లోకం
వారిదే”
అన్నాడు.
ఒకే
ప్రపంచములో
ఉండియూ
ఒక్కొక్కడు
ఒక్కొక్క
లోకములో
ఉన్నాడు.
ఇది
వారి
మనో
భావము
కాదా?
అందుకే
శంకరుల
వారు
“దృష్టి
జ్ఞానమయం
చేసుకొంటే,
సృష్టి
బ్రహ్మమయం
అవుతుంది”
అని
అన్నారు.
5
▾
Meaning
Keep
ఈనాటి
విద్యావిధానములో
ధనమే
ధర్మము,
కర్మము,
శ్రేష్ఠము
ఈనాటి
విద్యావిధానములో
ధనమే
ధర్మము,
ధనమే
కర్మము,
ధనమే
శ్రేష్ఠ
పదము.
ఒక
చిన్న
కథ.
శ్రీమన్నారాయణుడు
16
కళలు
కలవాడు
అయిననూ,
అతడు
పరోక్ష
సత్తాత్మకుడు
కానీ
ప్రత్యక్ష
నారాయణుడు
‘16
అణాలు’
(16
అణాలు
=
ఒక
రూపాయి)
అనే
ప్రత్యక్ష
కళలు
కలవాడు.
ఈ
రూపాయి
అను
భగవానునకు
పదహారు
అణాలు,
పదహారు
కళలు.
రూపాయి
ప్రత్యక్ష
నారాయణుడు.
జనులు
ద్రవ్యనారాయణుని
ఉపాసించుటకు
అలవాటుపడినప్పటి
నుండీ
నిజమగు
నారాయణుడు
దూరమాయెను.
అతని
విలువ
తెలుసుకొనుటకు
ఎవరునూ
ప్రయత్నించుట
లేదు.
6
▾
Meaning
Keep
ఒకనాడు
సంభాషణ
సందర్భమున
లక్ష్మి
నారాయణునితో
“నాథా!
జగమంతా
నన్నే
భజించుచున్నారు.
కానీ
నిన్ను
ఏ
నూటికొక్కరు,
కోటికొక్కరైనను
భజించుట
లేదు”
అని
వేళాకోళము
లాడెను.
అంత
నారాయణుడు,
“లక్ష్మీ!
నన్ను
కూడా
భజించుచున్నారు.
నీవు
గుర్తించుట
లేదు”
అని
తను
కూడా
వేళాకోళములాడెను.
అంత
లక్ష్మి
“నాథా!
యథార్థము
తెలుసుకొనిన
మంచిది.
రండి,
ఇరువురమూ
లోకములో
ప్రవేశించి
నిర్ణయించు
కొందామ”ని
తెలిపెను.
నారాయణుడు
కూడా
అందుకు
అంగీకరించెను.
7
▾
Meaning
Keep
నారాయణుడు
పెద్ద
పండిత
వేషమును
దాల్చి
చేతికి
కంకణాలు,
మెడను
రుద్రాక్షలు,
నొసటను
విభూతి
పట్టెలు
పెట్టి
గొప్ప
విద్యావంతునివలె
జగత్తులో
ప్రవేశించెను.
గ్రామ
గ్రామములో
నూతన
అద్భుత
ప్రసంగాలు
ప్రారంభించెను.
అతని
తేజోపుంజములు
ప్రజలను
ఉన్మత్తులుగా
చేసి,
అతని
పాండిత్యము
శ్రవణానందముగా
గ్రోలి,
వేలకు
వేలు
ప్రజలు
చేరుచూ
వచ్చిరి.
బ్రాహ్మణులు
తమ
తమ
అగ్రహారములకు
ఆహ్వానించి,
అనేక
విధముల
అతనిని
గౌరవించి,
విందులు
జరుపుతూ
వచ్చిరి.
ఇది
యిట్లు
జరుగుచుండగా
‘లక్ష్మి’
మహాయోగిని
వేషమును
ధరించి
ఆమె
కూడనూ,
అనేక
విధములైన
ఆత్మ
ప్రబోధలు
చేయుచూ
గ్రామములలో
సంచారము
జరుపుతూ
పోయెను.
ఆమె
అద్భుత
ప్రసంగాలను
విన్న
స్త్రీలు
తండోపతండాలుగ
చేరుతూ
వచ్చిరి.
ఆమెను
ప్రతి
స్త్రీ
తమ
గృహమునకు
విందుకు
దయ
చేయమని
అనేక
విధములుగ
ప్రార్థించుచూ
వచ్చిరి.
8
▾
Meaning
Keep
అయితే
ఆ
యోగిని
‘తాను
ఇతరులు
ఉపయోగించిన
పాత్రలలో
భుజింపననియూ,
తనకు
అదొక
నీమమున్నదనియూ
ప్రతి
ఆహ్వానము
చేసిన
ఇంటికి
నేను
భుజించు
పాత్రలు
నా
వెంటనే
తెచ్చుకొందుననియు’
తెలుపుతూ
వచ్చెను.
సరి.
ఏదో
విధంగా
‘గురు
దేవత’
మా
యింటికి
దయ
చేసిన
చాలునని
ప్రతి
స్త్రీ
ఆహ్వానించుచూ
వచ్చిరి.
ఆ
విధముగా
ఒక్కొక్కరి
యింటికి
భోజనానికి
వెళ్ళటం,
తన
సంచిలో
నుండి
ఒక
బంగారం
తట్ట,
బంగారు
లోటా,
గిన్నెలు
తీసి
పెట్టుకోవడం,
అందులో
భుజించడం,
తిరిగి
అ
తట్టా,
లోటా
ఆ
యింటి
వారికే
విడిచిపోవటం;
ఈ
విధంగా
చేయగా,
ఇది
చూచి
ప్రతి
యింటి
వారూ
‘అమ్మవారిని’
ఆహ్వానించుట
ప్రారంభించిరి.
ఈ
వార్త
అక్కడా
ఇక్కడా
ప్రాకి,
‘పండితుడు’
ఉన్న
అగ్రహారమునకు
కూడా
తెలిసి,
ఆ
అగ్రహారము
వారు
కూడా
ఈ
‘యోగిని’ని
భోజనానికి
ఆహ్వానించిరి.
అంత
ఆ
యోగిని
“అయ్యలారా!
నేను
మీ
అగ్రహారానికి
రావాలంటే,
మీ
అగ్రహారంలో
దీనికి
పూర్వమే
యున్న
ఆ
పండితుని
మీ
అగ్రహారము
నుండి
తరిమివేసిన
నేవత్తును.
లేకున్న
నేను
మీ
అగ్రహారమున
అడుగుపెట్టను”
అని
నిర్దాక్షిణ్యంగా
తెలిపెను.
కడకు
బంగారంపై
గల
భ్రాంతితో,
ఎంతో
గౌరవించి,
పూజించుచున్న
ఆ
పండితుని
బలవంతముగా
అగ్రహారము
నుండి
పంపివేసిరి.
9
▾
Meaning
Keep
అపుడు
యోగిని
ఆ
అగ్రహారము
ప్రవేశించి,
ఉపన్యసించి,
విందులు
భుజించి,
బంగారు
పాత్రలు
ఆయా
గృహముల
వారికే
ఇచ్చుచూ,
ఈ
విధముగా
పండితుడు
పోయిన
అగ్రహారమునకు
యోగిని
కూడా
వెళ్ళటం,
పండితుని
తరుమ
గొట్టించటం,
తను
విందులు
భుజించటం
జరుగుతూ
వచ్చెను.
ఇక
ఈ
అవమానములు
భరించలేక
పండితుడు,
తన
వేషమును
విసర్జించి
‘నారాయణుడై’
అంతర్ధానమాయెను.
అది
గుర్తించి
‘యోగిని’
కూడా
తన
రూపము
త్యజించి
స్వస్వరూపమును
ధరించి
నారాయణుని
చేరెను.
మాటల
సందర్భమున,
“ఏమండీ!
లోకములో
ఎవరిని
అధికంగా
ఆరాధిస్తున్నారు?
గౌరవిస్తున్నారు?
మీరు
గుర్తించితిరా?”
అని
ప్రశ్నించెను.
అంత
నారాయణుడు
చిరునవ్వు
నవ్వి,
“నీ
మాటే
సత్యమ”ని
తెలిపెను.
అటులనే
ఈనాడు
‘విద్య’ను
కూడా
ధనమునకు
అమ్ము
కొంటూ,
ధనమునకై
విద్యావంతులు
స్వదేశమును
విడచి
పరదేశముల
వెంట
భిక్షమెత్తుతున్నారంటే
ఇది
సరియైన
విద్యయా?
Previous
←
True Vidyā is what brings purity of citta
Next
Vidyā must bring control of the senses
→