Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Vidyā Vāhini · Vidyā must bring control of the senses
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
4.
విద్య,
ఇంద్రియ
నిగ్రహమును
చేకూర్చాలి
భౌతిక
శక్తి,
ఆధ్యాత్మిక
శక్తిని
ఏనాటికీ
జయించలేదు
హిందూదేశము
ఆధ్యాత్మిక
తత్త్వ
ప్రభావముతో
తరతరాల
నుండి
అన్ని
దేశములకు
స్థిర
శాంతి,
సౌఖ్యములను
చేకూర్చుతూ
వచ్చుచున్నది.
కనుకనే
నాటికి,
నేటికి
కూడ
“లోకాః
సమస్తా
సుఖినోభవంతు”
అన్నదే
హైందవ
జాతికి
పరమ
ధ్యేయము.
ఈ
ధ్యేయపాలనకై
ఆనాటి
ప్రభువులు,
మహనీయులైన
ఋషులు,
మతకర్తలు,
పండితులు,
విద్యావంతులు,
సతీమతల్లులు,
సర్వ
విధములా
త్యాగము
చేసి,
గౌరవమర్యాదలను
లెక్కచేయక
చాటుతూ
వచ్చిరి,
ఆచరించుచూ
వచ్చిరి.
అపురూపమైన
వస్తువు
పైకి
ఎంత
అందమైనదైనా,
ఆధ్యాత్మిక
భావదృష్టిలో
అది
సారహీనమైనదే.
భౌతిక
శక్తి,
ఆధ్యాత్మిక
శక్తిని
ఏనాటికీ
జయించలేదు.
2
▾
Meaning
Keep
అహంకారము
రజోగుణ
లక్షణము.
ఆ
రజోగుణము
అణగిన
గానీ
సాత్విక
గుణము
కలుగదు.
సాత్వికముచే
కానీ
శివ
వశీకరణ
సాధ్యము
కాదు.
పార్వతి
సౌందర్యరాశి.
సౌందర్యమను
అహమును
తపస్సుచే
అణగద్రొక్కినప్పుడే
సత్వగుణము
ఉద్రేకించెను.
అపుడు
ఆమెలోని
ఆధ్యాత్మిక
సౌందర్యము
వెలువడెను.
అదియే,
‘ఈశ్వరుడు
యౌవన
అహంకారమను
మన్మథుని
భస్మము
చేయుట’.
అనగా,
అహంకారముండినంత
వరకూ
‘విద్య’
మనకు
లభించదు;
విద్య
లభించెనా,
అహంకారముండదు.
3
▾
Meaning
Keep
విద్యయందు
వినయ,
విధేయతలు
తాండవించాలి
ఈనాడు
విద్యకు
అహంకారము
సౌందర్యముగా
భావించుచున్నారు.
ఆ
భౌతిక
విద్యా
సౌందర్యమును
అణగద్రొక్కిన
తరువాత,
సహజత్వమైన
ఈశ్వరత్వము
మనకు
సాక్షాత్కరించును.
అపుడే
వ్యక్తిత్వమనే
ఆత్మతత్త్వమును,
ఈశ్వరత్వము
స్వీకరించును.
మనలోని
అహంకారమే
మన్మథునిగా
భావించి
భస్మము
చేయవలెను.
ఈ
‘ఈశ్వరుడు
కేవలము
భౌతిక
సౌందర్యమునకు
కానీ,
అధికారాలకు
కానీ,
భుజబల,
బుద్ధిబల,
ధనబలములకు
కానీ
వశుడు
కాడు’
అని
మన్మథ
భస్మము
యొక్క
చరిత్ర
అంతరార్థమును
నిరూపించుచున్నది.
4
▾
Meaning
Keep
పార్వతి
తపస్సుగావించి
ఎండ,
వాన,
చలిగాడ్పులకు
తన
దేహమును,
అనగా
బాహ్య
సౌందర్యమును
తపింపజేసి,
అనగా
‘అహంకారమును’
రూపుమాపుటచే,
ఈశ్వరుడు
అర్థాంగిగా
స్వీకరించినాడు.
దానినే
“సాయుజ్యము”
అని
చెప్పుతూ
వచ్చిరి.
దీనినే
“మోక్షము,
ముక్తి”
అని
కూడా
అందురు.
విద్య
యందు
వినయ
విధేయతలు
తాండవించాలి.
అహంకార,
అసూయాది
దుర్గుణములు
అణగి
పోవాలి.
అట్టి
స్థితిని
‘ఆత్మవిద్య’
అని
చెప్పవచ్చును.
5
▾
Meaning
Keep
వదలవలసినది
బయట
త్యాగము
కాదు,
లోపలి
త్యాగము
మోక్షమంటే
విడుదల.
ఉపాధిని
ధరించిన
జీవులంతా
యేదో
ఒక
అవస్థ
నుండి
విడుదల
కోరుతూనే
యుందురు.
కనుక,
ప్రతి
జీవుడు
ముముక్షుడే.
ప్రతి
మానవుడూ
‘త్యాగి’
అయ్యే
తీరాలి.
ఇది
చివరి
సత్యం.
దేహమును
విడచిపోయేవాడు
ఎవ్వడూ
పిడికెడు
మట్టి
కూడా
పట్టుకెళ్ళడు.
బుద్ధిపూర్వకంగా
త్యాగము
చేయని
వానికి
ప్రకృతి
నిర్బంధంగా
త్యాగమును
నేర్పును.
అట్లు
కాక
మునుపే
త్యాగమును
నేర్చుకొనుట
మంచిది.
అట్టివాడే
ధన్యుడు.
విద్యకు
త్యాగము
రెండవ
సద్గుణము.
ఒక
చెంబులోని
నీటిని
కుమ్మరిస్తే
చెంబులో
అవకాశమైన
ఆకాశము
అదృశ్యమౌతుంది.
స్వయం
ఆకాశం
స్పష్టమౌతుంది.
అటులనే
‘అనాత్మ
వస్తువు
తాదాత్మ్యాన్ని’
వదలివేస్తే,
ఆత్మస్వరూపంగా
ముక్తి
స్వరూపమై
నిలుస్తుంది.
అయితే,
ఆ
వదలవలసినది
బయట
త్యాగము
కాదు,
లోపలి
త్యాగము.
అనేకమంది
త్యాగమనగా
ధనమును,
భూమిని
దానము
చేయటము
లేదా
యజ్ఞయాగాది
క్రతువులు
చేయించడం,
ఇల్లూ
వాకిలి,
భార్యా
బిడ్డలను
వదలి
అరణ్యమునకు
పోవటం-ఇత్యాది
కార్యములను
‘త్యాగ’మని
భావింతురు.
త్యాగమనగా
ఇట్టి
బలహీనపు
పనులు
కావు.
ఇవి
వదలుట
అంత
కష్టము
కూడా
కాదు.
మనసు
పెడితే,
పై
పనులు
సులభంగా
చేయవచ్చును,
వదలవచ్చును.
6
▾
Meaning
Keep
ముఖ్యంగా
వాంఛలను
త్యాగము
చేయుట;
ఇది
పురుషార్థముపై
ఆధారపడియున్నది.
ఇక్కడ
వాంఛలు
అనగా
కామ,
క్రోధ,
లోభాదులు
త్యాగము
గావించాలి.
‘కామము’
ప్రధాన
త్యాగము.
క్రోధలోభాదులు,
కామము
యొక్క
ఉపలక్షణాదులు.
ఎట్లనగా,
‘రాముడు
కోదండపాణి’
అంటే
కోదండమే
కాదు
బాణాదులు
ధరించినాడని
ఊహించాలి.
కామ,
క్రోధాదులు
మానవునకు
నరక
ద్వారాలు.
వాటికి
అసూయ
ఒక
ఫాటకువంటిది.
అహంకారము
తాళము.
ఈ
తాళము
తీసి,
ఫాటకును
ఎత్తివేసి,
తలుపులు
నెట్టిన,
లోపల
ప్రవేశించవచ్చును.
7
▾
Meaning
Keep
బైట
దృష్టిగలది
పశువు,
లోదృష్టి
గలవాడు
పశుపతి
క్రోధము
మానవునకున్న
జ్ఞానమును
నాశనము
చేయును.
కామము
కర్మనాశనము,
లోభము
భక్తి
వినాశమును
గావించును.
కామ,
క్రోధ,
లోభములు
వరుసగా,
కర్మ,
జ్ఞాన,
భక్తిహీనుని
గావించును.
అనగా
మూర్ఖుని
గావించును.
క్రోధమునకు
కామమే
కారణము.
కామము
అజ్ఞానము
వలన
కలుగును.
కాన,
త్యాగమనగా
అజ్ఞానమును
త్యాగము
చేయుట(వదలుట)
–
“మోక్షము”.
8
▾
Meaning
Keep
అజ్ఞానము
పశులక్షణము.
“పశ్యతీతి
పశుః”.
బైట
దృష్టి
గలది
పశువు.
లోదృష్టి
కలవాడు
పశుపతి.
ఇంద్రియములను
అరికట్టనివాడు
పశువు.
పశువుకు
పుట్టుకతో
ఏర్పడినవి
దుష్టగుణములు.
వాటిని
ఎన్ని
విధముల
ప్రయత్నము
చేసిననూ,
అవి
అంత
త్వరగా
మారునవి
కావు,
విడుచునవి
కావు,
చెప్పినా
అర్థము
చేసుకొను
తాహతు
వాటికి
లేదు.
ఉదాహరణము:
పులిని
చిన్నప్పటినుండీ
ఎంతో
ప్రేమతో
పెంచి,
చక్కగా
సద్గుణములను
తర్ఫీదుచేసి
పోషించిననూ,
ఆకలి
అయినపుడు
గొడ్డు
మాంసమునే
ఆశించును
కానీ,
పూరీ-పొటేటో
ఆరగించదు.
కనుకనే
“జంతూనాం
నరజన్మ
దుర్లభం”
అని,
జన్మించిన
జీవులలో
నరుడు
పవిత్రుడు,
నరజన్మము
దుర్లభము.
ఎందువలన?
పుట్టుకతో
వచ్చిన
చెడ్డ
సంస్కారమును
ప్రయత్నముతో
మార్చుకోగలడు
మానవుడు.
పశువుగా
జన్మించిన
మానవుడు
పశుపతి
కాగలడు.
జంతువు
క్రూరంగా
జన్మించినది,
క్రూరంగా
మరణిస్తుంది.
9
▾
Meaning
Keep
ఇంద్రియ
నిగ్రహములేని
జీవితము,
జీవితమే
కాదు.
అన్ని
హంగులతో
కూడిన
మానవుడు
ఆ
మాత్రము
ఇంద్రియములను
అరికట్టుకోలేకున్న
జన్మమే
నిరర్థకము.
ఇట్టి
“ఇంద్రియ
నిగ్రహము”ను
నిర్భయముగా
చేకూర్చునట్టిదే
నిజమైన
విద్య.
విద్య
యొసగును
వినయంబు,
వినయమున
కలుగు
పాత్రత,
పాత్రత
వలన
ధనము,
ధనము
వలన
ధర్మంబు,
దాని
వలన
ఐహిక,
ఆముష్మికంబుల
నందు
నరుడు.
Previous
←
When the vision is filled with Jñāna, creation is filled with Brahman
Next
Vidyā is what determines the principle of Paramātma
→