Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Vidyā Vāhini · Vidyā is what determines the principle of Paramātma
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
5.
పరమాత్మ
తత్త్వమును
నిర్ణయించునదే
విద్య
ఆధ్యాత్మిక
గుణమును,
స్వభావమును
లేక
పరమాత్మ
యొక్క
తత్త్వమును
నిర్ణయించునది
విద్యాతత్త్వము.
నీతి
సూత్రాల
శాస్త్రము:
ఇది
ప్రత్యక్ష
ప్రమాణముగల
విద్య.
మతము
యొక్క
సమ్మతమే
విద్యాతత్త్వము
జనప్రియముగా
జేసి
ఆ
ప్రకారముగా
జీవించుటే
తత్త్వము.
దీనినే
ఫిలాసఫీ
అన్నాము.
“ఫిలాసఫీ
అంటే
జ్ఞానముపై
వలపు”
అని.
జ్ఞానము
మితిలేని
విలువగల
నిధి.
జ్ఞానముపై
ప్రేమ
కలిగి
జ్ఞాన
సంపాదనకై
కష్టపడి
పాటుపడుటే
“విద్య”.
రూపము
చాటునున్న
వాస్తవమునకు
సంజాయిషీ
ఇచ్చుటకు
“విద్య”
ప్రయత్నించాలి,
ప్రయత్నిస్తుంది.
ఏదైతే
వాస్తవముగా
ఉందో
దాని
జ్ఞానమును
పొందుట,
దానిని
సాక్షాత్కరించుట,
దీనినే
“విద్య”
అని
అంటారు.
విద్య,
సంపూర్ణ
జీవితము
యొక్క
కళ.
పాశ్చాత్యుల
తత్త్వము
భావములతో
నిండి
యుంటుంది.
ప్రాచ్యుల
తత్త్వము
వాస్తవములతో
నిండియుంటుంది.
2
▾
Meaning
Keep
మానవుని
యథార్థస్వభావమును
ఎరిగించునది
విద్య
ఇంద్రియ
సంబంధమైన
దృశ్యములకు
అతీతమైయుంటుంది
తత్త్వము.
మానవుడు
దేహము,
మనస్సు,
ఆత్మల
యొక్క
త్రయము.
మానవుడు
మూడు
స్వభావములను
కలిగియున్నాడు
1)
నీచమైన
జంతు
స్వభావము
2)
ప్రపంచ
జ్ఞానముకల
మానవ
స్వభావము
3)
వాని
యథార్థమైన
మానవ
స్వభావము.
అనగా
మిక్కిలి
ముఖ్యమైన
దివ్యమైన
స్వభావము.
ఈ
దివ్యమైన
స్వభావమే,
మానవుని
నిజమైన
ఆత్మ.
మానవుని
యథార్థ
స్వభావమునే
‘విద్య’
అని
అందురు.
3
▾
Meaning
Keep
ఈ
దేహము
పాంచభౌతికముల
యొక్క
యంత్రము.
దేహములో
ఆగోచరమగు
దేవుడు
ఆటలాడుతున్నాడు.
ఈ
దేహము
ఒక
చెట్టు,
ఆత్మాభిమానము
వేరు,
కోరికలు
దాని
కొమ్మలు,
స్వభావసిద్ధమైన
గుణములు
దాని
పువ్వులు.
సుఖదుఃఖములు
ఆ
చెట్టునందలి
ఫలములు.
4
▾
Meaning
Keep
మానవుని
దేహము
ఒక
చిన్న
ప్రపంచము.
ఈ
దేహమంతటా
రక్తము
ఏ
విధముగా
వ్యాపించియున్నదో,
అలాగే
దేహమంతటా
దేవుడు
వ్యాపించియున్నాడు.
5
▾
Meaning
Keep
ఈ
లోకములో
ఒక్కటే
శాసనమున్నది.
అదే
ప్రేమ
శాసనము.
ఆయా
దేహము
చేసిన
కర్మలను
బట్టి
సుఖదుఃఖములు
సంభవించును.
కీడు
అనునది
కూడా
ఒక
విధమైన
వ్యతిరేకమైన
మంచి.
కీడు
ఒక
పురుగు
వంటిది.
అది
అట్టే
కాలము
ఉండదు.
దాని
ఆయుర్దాయము
ఎల్లప్పుడూ
అల్పమే.
మంచి
కానీ,
లేక
కీడు
కానీ,
ఇవి
సంపూర్ణ
విలువలు
కావు.
మంచి
చెడ్డలు
రెండూ
వ్యక్తుల
లోపముల
యొక్క
ప్రతిఘాతములని
విద్య
వివరిస్తుంది.
6
▾
Meaning
Keep
విచక్షణ
లేని
మానవుడు
గ్రుడ్డివాడు
ఒక
మంచి
వస్తువునకు,
దానిని
మించి
శ్రేష్ఠమైన
వస్తువునకు
గల
తారతమ్యమును
గుర్తించాలి.
అట్టి
తారతమ్యము
తెలియక
గ్రుడ్డివారై
ఆ
మంచి
వస్తువునే
పట్టుకొని
కూర్చుంటే,
అంత
మాత్రము
చేత
దానికంటే
శ్రేష్ఠమైన
వస్తువు
విరోధము
కాదు.
ఎలాగయితే
‘అధర్మము’లేనిదే
‘ధర్మము’
యొక్క
సరియైన
అనుభవము
కృషిచేయబడదో,
అలాగే
‘బాధ’లేనిదే
‘దయ’కు
కృషిచేయబడదు.
బాధ,
దయ
యొక్క
అనివార్యమైన
బీజము.
బాధ,
అధర్మము
ఈ
రెండు
లేకుండిన
మానవుడు
ఉత్త
కనికరములేని
మరుగుజ్జుగా
ఉండిపోయేవాడు.
విచక్షణలేని
మానవుడు
గ్రుడ్డివాడు.
‘ఎవడు
మంచిని
చెడు
అనియు,
చెడును
మంచి
అనియు
అనుకొంటాడో
అట్టివాడు
విచక్షణలేని
వ్యక్తి’
అని
విద్య
చాటుతుంది.
7
▾
Meaning
Keep
పుట్టుకకు,
చావుకు
మూలకారణము
కోరిక.
కోరిక
లేనివారికి
పుట్టు
చావులే
ఉండవు.
విత్తనమే
లేకుండిన
మొక్కనే
లేదు,
చెట్టే
ఉండదు.
పునర్జన్మ
యొక్క
నైజము
ఈ
జన్మములో
తీరని
కోరికల
వల్ల
నిర్ణయించబడుతుంది.
వస్తువులపై
ఎట్టి
కోరికా
లేని
వారికి
‘ఆత్మజ్ఞానము’
సాధ్యమవుతుంది.
దైవజ్ఞానమును,
దైవప్రేమను
పొందాలనే
కోరిక,
కోరిక
కాదు.
అది
‘పరావిద్య’
యొక్క
పవిత్ర
సంకల్పము.
ఇదే
బ్రహ్మవిద్య.
దైవజ్ఞానమను
మంటలో
సర్వలౌకిక
కోరికలూ
భస్మమై
పోతాయి.
కోరికలు
ముగించి
పోగానే
జీవాత్మ,
పరమాత్మ
వైపునకు
కదులుతుంది.
ఆత్మలో
పరమశాంతిని
అనుభవిస్తుంది
జీవాత్మ.
అనాత్మతో
బంధనాలు
త్రెంచుకొన్నట్లయితేనే
జీవాత్మ
చిరంజీవత్వమును
పొందుతుంది.
8
▾
Meaning
Keep
జ్ఞానమనగా
కోరికలను
పోగొట్టే
ఒక
ఉద్యమము
నీ
ఆలోచనలు
జీవితములో
ముఖ్యమైన
పాత్ర
వహిస్తాయి.
అందుకై
ఆలోచనలు
మంచివై
ఉండాలి.
మానవుడనగా
భావాల
పంట.
ఇట్టి
మంచి
భావాలను
భద్రపరచునదే
విద్య.
ఇదే
ఆత్మ
విద్య.
ఉదాహరణమునకు
ఒక
కుర్చీ
పేరు,
రూపము
నీ
మనసులోనే
కాని,
కఱ్ఱలో
లేవు.
నీ
స్వప్రయోజనమును
బట్టే
అన్ని
సంబంధములూ,
ప్రాముఖ్యతలూ
కలుగుతాయి.
సంబంధము
కోరికను
హెచ్చించే
ఏర్పాటు
కాదు,
కోరికను
పరిగెత్తించే
విధానము.
జ్ఞానము
అనగా
కోరికలను
పోగొట్టే
ఒక
ఉద్యమము.
9
▾
Meaning
Keep
వాస్తవానికి
ఎవ్వరూ
ఏ
వస్తువునైనా
దాని
నిమిత్తమై
ప్రేమించరు.
వారు
దానిని
ఎంతసేపూ
తన
స్వార్థ
నిమిత్తము
ప్రేమిస్తారు.
ఏదో
ఒక
ఉద్దేశము
లేనిదే
ఏ
మానవుడూ
కదలడు.
‘ప్రతి
ఒక్క
ఉద్దేశమునకు
ఆ
వ్యక్తి
సంపూర్ణ
కర్త
కాదు’
అని
విద్య
తెలుపుతుంది.
ప్రస్తుతము
ఒక
స్థితిలోనున్న
వానిని
మరొక
స్థితిలోనికి
మార్చునదే
కర్మ.
చావు
అనగా
జీవితమును
పొడిగించే
కొన్ని
మార్పులుగల
పద్ధతి.
చావు
అంటే
ఆత్మకు
చావులేదు,
నాశనము
కాదు.
కాన,
మృత్యువునకు
భయపడరాదు.
చావులేని
బ్రతుకు
సాధ్యము
కాదు.
చావు
అనేది
జీవితము
యొక్క
మరొక
అవస్థ.
మానవునికి
ఎంత
దీర్ఘవ్యాధి
సంభవించినా,
వాడు
ఎంత
దారుణమైన
ప్రమాదములో
నుండినా,
యుక్తమైన
వేళరానిదే
చావు
సంభవించదు.
10
▾
Meaning
Keep
జీవితము,
ప్రాణము
యొక్క
మెరుపులొలుకు
తళుకు.
చావు
అనేది
ప్రాణము
యొక్క
గర్జన
తప్ప
మరొకటి
కాదు.
జీవితము
మీది
మోహము
తీరిపోగానే
ఇక
మరొక
జన్మముండదు.
11
▾
Meaning
Keep
ఆత్మవిద్యాభ్యాసము
చేత
బ్రహ్మ
విద్య
బోధపడుతుంది
ఒకే
శక్తి
అన్ని
చేతులతో
పని
చేస్తూ
ఉన్నది.
అన్ని
కళ్ళతోనూ
చూస్తూ
ఉన్నది.
అన్ని
చెవులతోనూ
వింటూ
ఉన్నది.
యావత్తు
మానవజాతి
ఒకే
పదార్థముతో
చేయబడినది.
అమెరికావాని
శరీరము,
చైనావాని
శరీరము,
ఆఫ్రికావాని
శరీరము,
భారతీయుని
శరీరము,
ఒకే
ఒక
విధమైన
మాంసము,
రక్తము,
ఎముకలతో
కూడియున్నది.
12
▾
Meaning
Keep
పుట్టుకతో
కూడిన
సహజ
జన్మము,
తీవ్రమైన
కోరికలు,
సకలజీవులకు
సామాన్యముగా
ఉన్నాయి.
వైజ్ఞానిక
మార్గమున
విచారించిననూ
లేక
పరిశోధన
సలిపిననూ,
రాతిలో,
కఱ్ఱలో,
లోహములో
జీవమున్నదని,
సత్య
ప్రకటన
చేయవచ్చును.
ఆత్మ
దైవికమైన
సత్తువ.
దేవుడు
ఒక్కడే.
దేవుని
మీద
అకళంకమైన
నమ్మకము
మీద
ఆధారపడియున్నది.
ఏ
దేశీయులైనా,
ఏ
మతమైనా,
ఆత్మ
విద్యాభ్యాసమును
అనుసరించిన,
బ్రహ్మవిద్య
బోధపడుతుంది.
“దేవుడు
ఒక్కడే”
అను
భావము
ఇరుసు.
చుట్టూ
మిగతా
సిద్ధాంతాలు
తిరుగుతూ
ఉంటాయి.
Previous
←
Vidyā must bring control of the senses
Next
Vidyā must teach saṃskāra, refinement
→