Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Vidyā Vāhini · Vidyā must teach saṃskāra, refinement
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
6.
విద్య,
సంస్కారమును
నేర్పాలి
మన
అదృష్ట,
దురదృష్టములకు
మనమే
కారణము
ప్రతి
ప్రాణియు
చివరకు
పరిపూర్ణతనందుటే
విధి.
పరిపూర్ణత
నందియే
తీరవలెను.
మన
ప్రస్తుత
స్థితి,
మన
పూర్వజన్మ
కర్మలపై
ఆధారపడి
యుండును.
అనగా,
నేటి
భావములకు
మన
పూర్వజన్మ
కారణము.
మన
భవిష్యత్తు
స్థితి
మన
ఇప్పటి
కర్మలయందును,
భావములయందును
ఆధారపడియుండును.
అనగా
మన
అదృష్ట,
దురదృష్టములకు
మనమే
కారణము.
మనమే
కర్తలము.
అయిననూ,
మన
అదృష్ట,
దురదృష్ట
కార్యమున
మనము
ఇతరుల
సహాయము
(‘గురువు
యొక్క
సహాయము’
అని
భావము)
నొందరాదను
నిషేధమేమియు
లేదు.
ఏ
కొలది
మందికో
తప్ప
ఇట్టి
సహాయము
జనసామాన్యమందరికీ
అత్యంత
ముఖ్యము
కూడాను.
ఇట్టి
సహాయము
లభించినపుడు,
మహోత్కృష్ట
శక్తులు
(గురువు
యొక్క
ప్రేమానుగ్రహ
శక్తులు),
సచేతనములకు
(మానవులకు)
పారమార్థిక
జీవనము
అభివృద్ధి
గావించును.
మానవుడు
చివరకు
పావనత్వమును,
పరిపూర్ణత్వమును
పొందును.
2
▾
Meaning
Keep
ఈ
ఉజ్జీవ
శక్తి
గ్రంథముల
నుండి
రాదు.
మానవునకు,
ఒక
మానసిక
తత్త్వము
నుండి
మరొక
మానసిక
తత్త్వము
లభించును.
జీవితమంతయు
మనము
గ్రంథావలోక
నిమగ్నులమయినప్పటికిని,
మనమత్యంత
బుద్ధి
పరిణత
ఆర్జించవచ్చును.
కానీ
చివరకు
మనలో
‘పారమార్థిక
అభివృద్ధి’
లేశమైనను
ప్రాప్తించియుండదు.
బుద్ధి
పరిపాకము
సాధించిన
మానవునకు
పారమార్థిక
పరిపాకము
కూడా
అలవడియే
యుండుననుట
అసత్యము.
విద్యకును
(కేవల
పుస్తక
జ్ఞానము),
సంస్కారమునకును
సంబంధము
లేదు.
లౌకిక
విద్యలు
ఎన్ని
యున్ననూ,
సంస్కారము
లేకున్న
అట్టి
చదువులు
చెత్త
చదువులే.
సంస్కారమును
చక్కగ
నేర్పి,
కూర్చునదే
నిజమైన
విద్య.
3
▾
Meaning
Keep
కేవల
గ్రంథపఠనముచేత,
తత్త్వజ్ఞానమలవడదు
గ్రంథపఠనము
చేత,
అనగా
లౌకిక
విద్యల
చేత
బుద్ధికి
ఒకవేళ
బలము
చేకూరవచ్చునేమో
కానీ,
పారమార్థిక
విషయములను
గూర్చి
అత్యద్భుతోపన్యాసములు
ఈయగలిగి
యుండియు
మనలో
‘పారమార్థిక
జీవనము’
కుంటుబడి
యుండవచ్చును.
కారణమేమన,
మరొక
వ్యక్తి
‘ఆత్మ
ప్రబోధము’
నుండియే
మన
చిత్తమునకు
‘పారమార్థిక
తత్త్వము’
చేకూరకుండా
పోయినదే
కారణము.
4
▾
Meaning
Keep
ఈ
ఆత్మతత్త్వము
హృదయమునకు
హత్తుకొనునట్లు
ఏ
మహాపురుషుని
నుండి
వచ్చునో,
అతనినే
‘గురువు’
అని
అందురు.
ఇది
ఎవరి
హృదయానికి
అలవడునో,
హత్తుకొనునో,
వానినే
‘శిష్యుడు’
అని
అందురు.
విత్తనము
ప్రాణవంతమై
యుండవలెను.
చేను
దున్ని,
చల్లకమునకు
సిద్ధపరచి
ఉండవలెను.
ఈ
రెండునూ
సమకూరెనేని,
యథార్థమగు
పారమార్థిక
సస్యాభివృద్ధి
అత్యద్భుత
రూపమున
వెలువడును.
శ్రోతలు
బుద్ధికుశలత
కలవారై
యుండవలెను.
కానిచో,
తత్త్వ
జ్ఞానములంటుట
కష్టము,
అలవడుట
కష్టము.
ఇట్టి
వారే
గురువులు,
శిష్యులు.
తక్కిన
వారందరూ
‘పారమార్థిక
భావములతో
వినోద
క్రీడా
మాత్రము
గావించువారు’
అని
చెప్పవచ్చును.
5
▾
Meaning
Keep
మానవరూపములో
తప్ప,
ఎవరునూ
భగవంతుని
దర్శింపజాలరు
సామాన్య
గురువులకంటే
మహోన్నతులును,
మహోత్తములును
అగు
మరొక
వర్గపు
గురువులు
కలరు.
వారలనే
“అవతారపురుషుల”ని
అందురు.
వారు
పారమార్థిక
బలమును,
ఇచ్ఛామాత్రమున
కూడా,
ఇతరులకు
అనుగ్రహింతురు.
వారల
ఆజ్ఞలచే
అధమాధములు
సహితము
క్షణమాత్రమున
సిద్ధపురుషులగుదురు.
అట్టివారు
గురువులందరి
గురువులు,
భగవంతుని
యొక్క
మానవరూప
పరమావధులు.
మనము
మానవరూపమున
తప్ప,
భగవంతుని
చూడజాలము,
వారిని
మన
మారాధింపజాలము.
నిజముగా
‘మానవులు
ఆరాధించవలసినది
మానవరూపధారులైన
వారినే,’
అని
పారమార్థిక
విద్య
బోధించును.
మనుష్యావతార
మూర్తులందు
తప్ప
మానవుడెవడును
భగవంతుని
నిజముగా
సందర్శింపజాలడు.
ఇంకోవిధముగా
అతనిని
సందర్శింప
యత్నింతుమేని,
అత్యంత
వికృతాకారమును
ఒకదానిని
కల్పించుకొని,
అదే
ఈశ్వరుని
నిత్య
స్వరూపమున
కన్నా
హీనమైనది
కాదని
విశ్వసింతుము.
6
▾
Meaning
Keep
ఒక
పామరుడు
శివ
ప్రతిమ
చేయ
ఒప్పుకొని
పెక్కు
దినములు
శ్రమించి
కడకు
ఒక
మర్కటమును
నిర్మించెనట!
మనము
మానవులుగా
ఉండినంత
కాలము
అతనిని
మానవునికన్నా
అతీతునిగా
భావింపజాలము.
మానవ
ప్రకృతికి
అతీతమైన
పురుషుని
యథార్థ
స్వరూపమును
దర్శించు
కాలము
వచ్చును.
కానీ,
సామాన్య
దృష్టితో
ఒకింత
విచారించిన
మన
అద్భుత
బుద్ధి
ఏ
మాత్రపు
జ్ఞానముపై
ఆధారపడినదని
పరిశీలించుకొంటిమేని,
అచట
శూన్యమే.
వట్టి
నురుగే
కానవచ్చును.
అట్టివారి
అవతార
ఖండనోపన్యాసములు
వినునట్టి
అవకాశమే
మనకు
ఏర్పడెనేని,
ఆ
ఉపన్యాసకుని
నిలువదీసి
“మహాశయా!
సర్వగతత్త్వము,
సర్వశక్తిత్వము,
సర్వవ్యాపకత్వము
మున్నగు
మాటలకు
మించి
మీకేమైనా
అర్థమయినవా?”
అని
అడగండి.
‘మానవ
ప్రకృతి’
చేత
పరిమితము
కానట్టి
భావము,
అతడేదియును
తెలుపజాలడు.
పుస్తకజ్ఞానము
ఏ
మాత్రము
లేని
సామాన్య
పామరజనులకన్నా
అతనికి
ఈ
విషయములో
ఏ
మాత్రము
అధికారముగాని,
అధికంగా
గాని
తెలియదు.
అంతేగాక,
ఈ
వాచాలురు
ఈ
విధమైన
ప్రబోధలచే
మానవులలో
సంక్షోభమును
వ్యథను
కలిగింతురు.
7
▾
Meaning
Keep
పారమార్థిక
విద్య
అనగా
సత్యానుభూతి
‘పారమార్థిక
విద్య’
అనగా
నిజమునకు
‘సత్యానుభూతి’.
వాచాలత్వమును
సత్యానుభూతిగా
ఏమాత్రమును
భ్రమించరాదు.
ఆత్మ
యొక్క
గర్భాంతరాళమున
చేపడునదే
సత్యానుభూతి.
ప్రస్తుత
సృష్టిక్రమమునందు
మానవుడు
స్వతస్సిద్ధముగా
ఉపాధిగతుడు.
కావున,
మనము
భగవంతుని
మానవునిగానే
చూడగలము.
గత్యంతరము
లేదు.
ఎనుములు
భగవంతుని
ఆరాధించగోరినచో
వాని
ప్రకృతిననుసరించి
అతనిని
ఒక
బ్రహ్మాండమైన
యెనుముగా
భావించును.
కనుక,
మానవుడు
భగవంతుని
ఆరాధించవలెనన్న
వాని
ప్రకృతిని
అనుసరించి
అతనిని
బ్రహ్మాండమైన
మానవునిగానే
భావించవలసియుండును.
మనుష్యుని,
ఎనుమును,
చేపను
వివిధ
పాత్రలుగా
పోల్చవచ్చును.
ఇవన్నియునూ
నీళ్ళు
ముంచుకొనుటకై
భగవత్సముద్రమునకు
పోయినచో
తమ
తమ
ఆకారమునకు,
పరిమాణమునకు
అనురూపముగనే
కదా
తెచ్చుకొనును.
మానవుడు
మానవాకృతితోను,
ఎనుము
ఎనుము
ఆకృతితోను,
చేప
చేప
ఆకృతితోను,
భగవంతుని
తెలుసుకొనును.
వీటన్నింటిలో
కలది
భగవత్సముద్ర
జలమే.
మానవులు
అతనిని
చూచునపుడు
మానవునిగా
చూచును.
తమతమ
రూప
పరమావధిని
అనుసరించే,
ఆయా
రూపములు
కల్పించుకొనగలరు.
Previous
←
Vidyā is what determines the principle of Paramātma
Next
True Vidyā is what teaches humanness
→