Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Vidyā Vāhini · True Vidyā is what teaches humanness
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
7.
మానవత్వమును
నేర్పునదే
నిజమైన
విద్య
విద్య
జీవనోపాధి
కొరకు
గాదు,
జీవిత
పరమావధి
కొరకు
మనిషి
ఒక
విత్తనము
వంటివాడు.
గింజ
మొలకెత్తి,
చెట్టు
అయి
ఎలాగైతే
వృద్ధి
చెందునో
అలాగే
మానవుడు
కూడా
పెరిగి,
పరిణామము
చెంది,
అన్ని
విధాలా
పరిపూర్ణుడు
కావాలి.
మానవునికి
రెండు
విధములైన
పరిజ్ఞానములు
కలవు.
ఒకటి
ఇహలోక
పరిజ్ఞానము;
అనగా
ప్రపంచమును
గురించిన
పరిజ్ఞానము.
రెండవది
“పరలోక
పరిజ్ఞానము”
(“పర”
అనగా
అత్యంత
శ్రేష్ఠము,
మోక్షము,
కైవల్యము.
“లోక”
అనగా
ప్రకాశించునది,
అప్రమేయ
కాంతి.
“పరలోక
పరిజ్ఞానము”
అనగా
పారమార్థిక
జ్ఞానము,
ఆత్మవిద్య,
ఆత్మజ్ఞానం,
బ్రహ్మవిద్య,
బ్రహ్మజ్ఞానం).
వీటినే
ఒకటి
‘జీవనోపాధి’,
రెండవది
‘జీవిత
పరమావధి’
అని
కూడా
చెప్పవచ్చును.
జీవించటానికి
కావలసిన
నిత్యావసరాలను
సేకరించుకోవటం:
దీనినే
జీవనోపాధియనియు
అనగా
జీవన
యాత్రకు
సంబంధించిన
వాటిని
సేకరించుకోవటం.
జీవిత
పరమావధి
అనగా
‘జీవించేదెందు
కోసం?
దీనికి
సృష్టికర్త
ఎవరు?
వ్యక్తిత్వమంటే
ఏమిటి?’
అని
గమ్యాన్ని
తెలుసుకోవటం,
పరమావధి.
మరి
గ్రంథాలన్నియూ,
ఈ
శాస్త్రాలన్నియూ,
ఈ
పరలోక
ప్రపంచమును
గురించిన
పరిజ్ఞానమునకు
సంబంధించినవే.
‘మనమిక్కడ
ఎందుకున్నాము?
మనము
ఏమి
చేయవలసి
ఉంటుంది?
మన
పరిణామము
ఎలాగు?’
అనే
దాన్ని
గురించే
చెప్పుతాయి.
2
▾
Meaning
Keep
క్రమశిక్షణ
నిచ్చేటటువంటిదే
విద్య
ప్రపంచములో
సరిగా
జీవించే
పద్ధతి
ఏదైతే
ఉన్నదో
దానికొక
క్రమశిక్షణ
అవసరం.
ఈ
క్రమశిక్షణ
నిచ్చేటటువంటిదే
విద్య.
మనము
లౌకిక
చదువనేది
కష్టపడి
అభ్యసిస్తున్నాము.
వ్యాయామం
చేస్తున్నాము,
క్రమంగా
శరీరము
వృద్ధిచెందడానికి.
ఏదైనా
ఒక
కళను
అనుసరిస్తున్నాము.
దేనికైనా
క్రమంగా
ఒక
శిక్షణ
తీసుకొంటున్నాము.
3
▾
Meaning
Keep
మానవుడు
ఈ
నీమంతో
ప్రారంభించి
క్రమంగా
ఇంద్రియముల
యొక్క
పరిస్థితిని
దాటి,
మనసు
పరిమితిని
దాటి,
శరీరమనే
ప్రహారీ
గోడను
దాటి,
జగత్తనే
ఈ
కనబడే
మహాసత్యాన్ని
తెలుసుకొని,
అనగా
‘ఈ
ప్రపంచ
రూపములో
అంతటా
నిండియున్నదేదో
అదే
తాను’
అన్నటువంటి
స్థితిని
ఊరికే
ఊహతో
మాత్రమే
కాక
నిజంగా
విచారణ
ద్వారా,
అనుభవము
ద్వారా
విశ్వసించి
తెలుసుకోవాలి.
అదే
నిజమైన
విద్య.
సమాజములో
ఎటువంటి
పరిస్థితి
ఉండాలి?
మనిషికి,
మనిషికి
మధ్య
సంబంధాలు
ఎలా
ఉండాలి?
జాతికి,
జాతికి
మధ్య
సంబంధ
బాంధవ్యములు
ఎట్టివిగా
ఉండాలి?
నిత్య
జీవితాలు
ఏ
రీతిగా
జరుపుకోవాలి?
ఇవి
ఎంత
వరకు
హద్దులో
ఉంచుకోవాలి?
ఇవన్నియూ
తెలుపునట్టిదై
యున్నదీ
విద్య.
4
▾
Meaning
Keep
ఉపాధ్యాయునికి
సత్యప్రవర్తన
లేకపోతే
సంఘము
చెడిపోతుంది
ఉద్యోగులందరికన్నా
ముఖ్యంగా
ఉపాధ్యాయుడు
సత్యంగా
ప్రవర్తించాలి.
లేకపోతే
సంఘము
చెడిపోతుంది.
ప్రపంచానుభవం
లేని
పిల్లలు
అతని
చేతులలో
వేలాదిమంది
ఉంటారు.
వారి
లేత
మనస్సులపై
అతని
ఉపదేశ
ప్రభావాలు
ఎక్కువగా
ఉంటాయి.
అందువలన
ఉపాధ్యాయునికి
దురలవాట్లు
ఉండరాదు;
ఎందుకనగా,
పిల్లలు
పెద్దవాళ్ళను
చూచి
అలవాట్లను
అవలంబించే
ప్రమాదము
ఉన్నది.
ఒక్కొక్క
ఉపాధ్యాయుని
దగ్గర
తయారయ్యే
విద్యార్థులు
కొన్ని
వేలమంది
ఉంటారు.
వారందరికీ
ఆ
చెడ్డ
అలవాట్లు
అలవడితే
సంఘము
చెడిపోతుంది.
క్రమంగా
సంఘంలోని
దురలవాట్లు
ఇంకో
విధంగా
ఉపాధ్యాయుణ్ణే
బాధిస్తాయి.
“నీవు
నేర్పిన
విద్యయే
నీరజాక్ష”.
తన
విద్యార్థుల
చేతనే
ఉపాధ్యాయుడు
ఒకానొకనాడు
వెక్కిరింపబడతాడు.
5
▾
Meaning
Keep
రాజు
తన
దేశమందే
గౌరవింపబడతాడు,
పూజింపబడుతాడు.
కానీ,
గుణవంతుడు
అన్ని
దేశములలోనూ
గౌరవింపబడతాడు.
మంచి
రూపముతో
పుట్టినా,
మంచి
యౌవనంగా
ఉండినా,
గొప్ప
కులములో
జన్మించినా,
లౌకిక
విద్యలెన్ని
నేర్చినా,
“ఆధ్యాత్మిక
విద్య”
అను
సద్గుణమే
లేకుండిన,
మోదుగ
పూవులాగా
రాణించుతాడు
మానవుడు.
మోదుగ
పుష్పము
చూచుటకు
అందము
తప్ప,
వాసన
దుర్గంధము.
6
▾
Meaning
Keep
తల్లితో
చిన్నవయస్సులో
శ్రావణుని
పితృభక్తి
నాటకానికి
పోయి
చూచి,
తాను
కూడా
శ్రావణునివలె,
హరిశ్చంద్రునివలె
గొప్ప
గుణవంతుడు
కావాలి
అని
అనుకొని
సత్ప్రవర్తనలతో
చదివెను.
కనుక,
మోహనదాసు
కరంచందు
మహాత్మునిగా
మారాడు.
చదువుకునే
సమయములో
గాంధీకి
ఒక
ఉపాధ్యాయుడుండెడివాడు.
అతడు
తప్పు
మార్గాన్ని
బోధించేవాడు.
కానీ,
గాంధీ
వాటిని
అలవరచుకోలేదు.
అందువలననే,
దేశానికి
స్వరాజ్యము
తేగలిగాడు.
ఇలాంటి
వారు
భారతభూమిలో
వేలకు
వేలు
కలరు.
‘ఆత్మ
విద్య’లను
అభ్యసించినవారే
నాటికీ
నేటికీ
ఆదర్శపురుషులుగను,
ఆదర్శ
స్త్రీలుగను
చిరస్థాయిగా,
అమరజీవులుగా
నిలిచియున్నారు.
7
▾
Meaning
Keep
భారతీయ
సంస్కృతి
సర్వోన్నతమగుటకు
కారణం,
వేదమూల
మగుటయే
సనాతన
భారతీయుల
సంస్కృతి
సర్వోత్తమమైనదని
భారతీయులేకాక,
సర్వదేశీయులు
కూడా
అంగీకరించిన
సత్యము.
దీనికింత
ప్రశస్తి
వచ్చుటకు
కారణము,
ఈ
సంస్కృతి
వేదమూలమగుటయే.
“వేదోఽఖిలో
ధర్మమూలం”.
మానవుడు
మానవత్వమును
విడనాడక,
సమస్త
ప్రాణుల
కంటెను
మిన్నగా
మనుగడ
సాగించుటకు
ఆవశ్యకములైన
విధులన్నియు
‘ధర్మ’
శబ్దము
చేత
వ్యవహరింపబడినవి.
ఇట్టి
విధులన్నిటికీ
వేదమే
నిధి.
గురుకులమందు
గురువు
శిష్యులకు
విద్యను
బోధించిన
తరువాత
శిష్యులకు
గావించు
ఉపదేశము
మరే
ఇతర
దేశమందుగానీ,
మరే
ఇతర
శిష్యులు
గానీ
ఊహించియుండనట్టివి.
“మాతృదేవోభవ”,
“పితృదేవోభవ”,
“ఆచార్యదేవోభవ”,
“సత్యం
వద”,
“ధర్మం
చర”,
“నోయితరాణి”
అనగా
ధర్మముగా
చరింపుము,
సత్యము
చెప్పుము,
సార్థకమైన
కార్యములే
చేయుము,
దీనికి
విరుద్ధమైన
వాటిని
మానుము.
మనకు
హితకరమైన
పనులు
మాత్రమే
అనుష్ఠింపుము.
ఇదే
ఆజ్ఞ,
ఇదే
ఉపదేశం,
ఇవే
వేదోపనిషత్తులు.
ముమ్మారు
శాంతి,
శాంతి,
శాంతిః
కలుగుగాక
అని
చెప్పెడి
వారు
గురువులు.
8
▾
Meaning
Keep
పై
చెప్పిన
ధర్మములందు
ఒక్కొక్కటియు
మహాశక్తివంతమైనది.
మాతా
పితరులనారాధించి,
ధర్మవ్యాధుడు
మహానుభావుడాయెను.
సత్యవ్రతాచరణచే
రాముడు,
హరిశ్చంద్రుడు
మున్నగువారు
అమరులైరి.
సద్ధర్మాచరణ
చేత
మానవులు
మహాపురుషులైరి.
9
▾
Meaning
Keep
“అహింసా
పరమో
ధర్మః”
అని
మనోవాక్కాయ
కర్మలచే
ప్రాణులకు
హింసగావించక
‘గౌతమబుద్ధుడు’
ఆచార్య
పీఠమునలంకరించెను.
ఈ
ధర్మములన్నింటినీ
నియమముతో
యథావిధిగా
పాటించుటయే
జీవితమునందు
ఒక
తపస్సు.
త్రికరణములలో
మనస్సు
మొదటిది.
ఇది
ఆవేశములకు,
ఉద్రేకములకు,
వాంఛలకు
దూరంగా
ఉండవలెను.
పై
గుణములు
మనసుకు
సహజములు.
కామ,
క్రోధ,
లోభ,
మోహ,
మద,
మత్సరములు
మనస్సునందు
ఆవిర్భవించు
ఆవేశాలు.
ఇవి
మానవునకు
అంతర్
శత్రువులు.
ఇందులో
మొదటి
రెండు
అనగా
కామ,
క్రోధములు.
వీటిననుసరించి
బ్రతుకునవే
మిగిలిన
నాలుగు
గుణములు.
కావున,
మొదటి
రెంటిని
అదుపులో
పెట్టి
సాధన
చేసిన
వారే
మానవత్వమును
కాపాడుకొనిన
వారు.
ఇట్టి
విద్యను
నేర్పునదే
“బ్రహ్మవిద్య”.
Previous
←
Vidyā must teach saṃskāra, refinement
Next
Vidyā must show the divinity in oneness
→