Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Vidyā Vāhini · Vidyā must show the divinity in oneness
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
8.
ఏకత్వములోని
దివ్యత్వమును
నిరూపించాలి,
విద్య
నిష్కామ
సేవ
విద్యయొక్క
హృదయము
నిష్కామ
కర్మయే
యోగము.
ఇది
మానవునియందున్న
పశు
స్వభావములను
రూపుమాపి,
దివ్య
స్వభావములుగా
మార్చును.
‘ఆత్మ
భావన’తో
చేయు
మానవసేవ
తన
అభివృద్ధికే
సహాయపడుతుంది;
ఆధ్యాత్మిక
మార్గములో
మానవుని
వెనుకకు
జూచుకోకుండా
ఆపుతుంది.
వ్రతములు,
పూజలు
మొదలైన
వాటికంటే
సేవయే
శ్రేష్ఠమైనది.
సేవ,
నీలోని
అహంకారమును
ధ్వంసము
చేస్తుంది,
హృదయాన్ని
విప్పుతుంది,
వికసింపజేస్తుంది.
నిష్కామసేవయను,
ఉత్తమోత్తమ
ఆదర్శముపై
నీ
జీవితసౌధమును
నిర్మించుకో.
నిష్కామసేవ
అనే
ఆదర్శము
ద్వారానే
నీకు
ఇతర
ఆదర్శములు,
సుగుణములు
అలవడును.
సేవ
హృదయమును
బహిరంగపరుస్తుంది.
నీ
చైతన్యమును
వికసింపజేస్తుంది.
ఆత్మగంభీరమును
కలిగిస్తుంది.
2
▾
Meaning
Keep
నిష్కామసేవ
విద్య
యొక్క
హృదయము.
పవిత్రప్రేమ
యొక్క
ముఖ్య
వైఖరియే
విద్య
కానీ,
ఇంకొకటి
కాదు.
ఎవ్వడు
మానవకోటికి
మేలు
చేస్తాడో
వాడు
భగవంతునికి
ముద్దుబిడ్డడు.
దేశమునకు
ఆదర్శసోదరుడు.
ఆత్మజ్ఞానపాత్రుడు.
ఇతరుల
మేలు
వృద్ధి
చెందాలని
ఎవ్వడైతే
తన
ధనమును,
బలమును,
ఆలోచనలను,
ప్రసంగమును
(ధనము
మరియు
త్రికరణములు)
వినియోగించునో
వాడే
మహిమగల
మానవుడు.
వాడే
పుడమిపై
పుట్టిన
కారణజన్ముడు.
నిష్కామసేవావ్రతుడు,
స్వధర్మవ్రతుడు
అయిన
మానవుడు
ఎక్కడున్నా
శాంతంగానే
ఉండును.
తన
పరిసర
ప్రాంతములు
కూడా
శాంతంగా
నిండియుండును.
‘సర్వవ్యాపకమైన
ప్రేమ’
అనే
దైవపటము
వద్ద
తన
అహంకారమును
హోమము
చేయించునదే
విద్య.
అట్లు
గావించిన
తదుపరే
ఆధ్యాత్మిక
అభివృద్ధికి
పునాది
వంటి
‘మనో
పవిత్రత’ను
సంపాదించుకొనును.
మనసును
దైవచింతనతో,
హృదయమును
పవిత్రభావములతో,
చేతలు
నిష్కామకర్మలతో
పోషించు
దైవగుణమునే
విద్యయని
చెప్పవీలగును.
సేవలోని
రహస్యమును
మొదట
నేర్వవలయును.
ఇంకొకరికి
నీవు
సేవ
చేయాలి
అంటే,
వానిని
నీవు
అన్ని
విధాలా
సంతోష
పెట్టి
తీరాలి.
అంతేగాని,
‘సేవ
సేవ’
అని
ఇతరులను
బాధించుట
సేవకాదని
కూడా
తెలుపుతుంది
విద్య.
3
▾
Meaning
Keep
సర్వకర్మలను
భగవత్ర్పీత్యర్థము
గావించుట
బ్రహ్మవిద్య
సేవ
చేయునపుడు
తన
సొంత
తృప్తి
కొరకై
చేస్తున్నానను
పద్ధతిలో
చేయరాదు.
నీ
జీవితములో
ఆ
కర్మ
అగత్యమైనదను
భావముతో
చేసి
తీరాలి.
ఇదే
విద్య
యొక్క
అంతర్భావము.
ఇల్లు
కట్టుటకు
ఇటుకలు,
సున్నము
ఎంత
అవసరమో,
అలాగే
తన
విధాయకమైన
పని
చేయాలనే
త్రికరణశుద్ధిగల
సంకల్పమును
కలిగించు
విద్య
సేవకంత
అవసరము.
ఇట్టి
విద్యనే
దేశాభివృద్ధికి
కీలకము.
4
▾
Meaning
Keep
మానవకోటికి
క్షేమమును
కలిగించు
రహస్య
మార్గమేమన,
ఇతరులకు
సేవ
చేస్తూ,
వారి
వల్ల
తాను
సేవ
పొందాలని
వేచియుండకుండుటే.
అనగా
తిరిగి
ప్రతిఫలమును
ఆశించకుండుటే.
కర్మ
అను
చెట్టు
యొక్క
వేరులను
నిర్మూలము
చేయు
గొడ్డలి
యేదంటే
‘సర్వకర్మలను
భగవత్
ప్రీత్యర్థం’
గావించుటే.
ఇది
ప్రధాన
యజ్ఞము.
ఈ
యజ్ఞము
యొక్క
సారమే
“బ్రహ్మవిద్య”.
ఈ
శరీరములోని
ప్రతి
నరములోనికి,
ఎముకలోనికి,
జీవాణువులోనికి,
సేవాభావము
జొరబడాలి.
ఇట్టి
సేవాభావము
ప్రతి
ఆధ్యాత్మిక
సాధనకు
హస్తగతమైపోవాలి.
5
▾
Meaning
Keep
సేవ,
ప్రేమయొక్క
మనోహరపుష్పము
సేవ,
ప్రేమ
యొక్క
మనోహర
పుష్పము.
హాని
చేయని
గుణము
ఆ
పుష్పము
యొక్క
సువాసన.
దయతో
కూడిన
చిన్న
పనులు,
మర్యాదలు
నీకు
అలవాటు
అయేటట్లు
అభ్యసిస్తే
అవి
నీ
స్వభావమునకు
గొప్ప
శోభను,
ఆకర్షణను
కలిగిస్తాయి.
ఉత్తమోత్తమమైన
సుఖము
ఏదంటే
తృప్తి.
ఎచ్చట
కఠినముండదో,
పవిత్రత
ఉండునో
అచ్చట
సౌశీల్యత
కాచుకొనియుండును.
ఎచ్చట
దురాశ
ఉంటుందో,
అచ్చట
దుర్గుణములు
కాచుకొనియుంటాయి.
ఒంటి
యెద్దువలె
విడిగా
ఉండాలనే
ప్రేరణను
పూర్తిగా
ధ్వంసం
చేయాలి.
అట్టి
తలంపు
కలలో
సహితము
కానరారాదు.
“మొదట
నిన్ను
నీవు
సంస్కరించుకో”మని
బోధిస్తుంది
విద్య.
“తరువాత
ఇతరులను
చక్కబరచు”
అని
ఆదేశిస్తుంది
విద్య.
‘భగవదర్పితమైన
నిష్కామ
సేవ’
మోహమును
తొలగించును.
దేశ
భక్తి,
దేశ
ప్రేమ,
ఇవి
సకల
మానవకోటి
పై
ప్రేమ
కన్నా
ఎన్నో
రెట్లు
తక్కువ.
అనగా,
సకల
మానవులపై
ప్రేమ
కలిగియుండుటే
నిజమైన
భక్తి.
6
▾
Meaning
Keep
నీ
పనులు,
నీ
అభినయములు,
నీ
చూపులు,
మాటలు,
తిండి,
దుస్తులు,
నడక
–
వీటి
ద్వారా
నీ
స్వభావము
ఋజువైపోతుంది.
కనుక,
మన
మాటలు,
ఆటలు,
తలపులు,
నడకలు
సరియైనవిగా,
సాత్వికమైనవిగా,
అవికారమైనవిగా
ఉండాలి.
ఇతరుల
వలన
మనము
నేర్చుకోగలిగిన
మంచివి
ఎన్నియో
ఉన్నవను
భావములు
మనలో
కలగాలి.
ఆవేశము,
ఇచ్ఛాశక్తి,
సంకల్పము,
క్రియాశక్తి,
తెలివి,
జ్ఞానశక్తి,
మీ
ఉద్ధేశములు
యావన్మందికీ
సంబంధించినవై
యుండాలి.
మీ
హృదయము
అందరికీ
సంబంధించినదై
యుండాలి.
ఆలోచనలు
కూడా
అంతే.
గుడ్డ
ఎలాగైతే
దారాలతో
నిండి
వుంటుందో
అలాగే
సంఘము,
దేశము,
వ్యక్తులతో
కూడి
ఉంటుంది.
భోజన
సమయమున
ఏ
యజ్ఞము?
ఇది
కక్కుర్తితో,
చిత్త
వికారముతో
తినరాదు.
జీవితానికి
మందులాగా
భోంచేయాలి.
ఎదురుపడే
ప్రతి
కష్టము
నీ
మనోశక్తిని
వృద్ధి
నొందించుకొనుటకు,
నీవు
అధిక
బలవంతుడగుటకు
లభించే
సదవకాశముగా
భావించాలి.
ప్రకృతి
యొక్క
పద్ధతి
యేదంటే,
వృద్ధి
పొందుటే.
దైవత్వము
యొక్క
పద్ధతి
యేదంటే,
ఏకమగుటే.
7
▾
Meaning
Keep
ఎవడైతే
ఇతరులను
ద్వేషిస్తాడో
లేక
చిన్నబరుచునో
వాడు
నిజముగా
మూర్ఖుడు.
ఏమంటే,
నిజముగా
తాను
తననే
ద్వేషించుకొనుచున్నాడు.
తనను
తానే
చిన్నబుచ్చుకొనుచున్నాడు.
ఇది
వానికి
తెలియదు.
అట్టి
తెలియని
తత్త్వమును
తెలియజెప్పి
ఏకత్వమందున్న
దివ్యత్వాన్ని
నిరూపించాలి
విద్య.
8
▾
Meaning
Keep
మంత్రాలను
స్మరించి,
మాధవుని
పూజించే
సుజనులు
కావాలి
విద్యార్థులు
హృదయమను
తోటలో
దైవమను
గులాబి
మొక్కలు,
వినయమనే
మల్లె
మొక్కలు,
ఔదార్యమను
చంపక
మొక్కలు
పాతి
పోషించాలి.
విద్యార్థి
మందుల
పెట్టెలో
విచక్షణ
అను
మాత్రలు,
ఆత్మ
నిగ్రహమను
ద్రావకము,
నమ్మకమను
దైవభక్తి,
ఓర్పు
కలిసిన
పొడిని
ఉంచుకోవాలి.
అప్పుడే
అజ్ఞానమను
భయంకరమైన
వ్యాధి
నివారణ
కాగలదు.
ప్రపంచములో
నాశనము
చేయు
శక్తులున్నాయి.
వాటి
ప్రక్క
ప్రక్కనే
మానవకోటిని
ఉద్ధరించే
నిర్మాణాత్మక
శక్తులు
కూడా
ఉన్నాయి.
యంత్రాలను,
బాంబులను
పూజించే
జడ
జీవులు
కారాదు
విద్యార్థులు.
మంత్రాలను
స్మరించి,
మాధవుని
పూజించే
సుజనులు
కావాలి.
అధికారము
ఒక
విధమైన
‘నిషా
పదార్థము’.
అది
మనిషిని
నాశనము
చేయును,
దౌర్భాగ్యములను
పుట్టించును.
విద్య
పుణ్యము
చేకూర్చును.
Previous
←
True Vidyā is what teaches humanness
Next
Vairāgya is the foundation of the knowledge of Brahman
→