Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Vidyā Vāhini · Vairāgya is the foundation of the knowledge of Brahman
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
9.
బ్రహ్మజ్ఞానమునకు
వైరాగ్యము
పునాది
సంస్కరింపబడిన
హృదయక్షేత్రమున
విద్య
లెస్సగా
ప్రకాశించును
దేవతలయందుకానీ,
తీర్థయాత్రలయందుకానీ,
మంత్రములందుకానీ,
కడకు
వైద్యునియందుకానీ,
గురువునందుకానీ
ఎంతెంత
నమ్మకము
అధికముగా
నుండునో
అంతంత
ఫలము
మనకు
సిద్ధించును.
అటులనే
ప్రసంగించు
వానిపై
ఎంతెంత
విశ్వాసము
అధికముగా
నుండునో
విషయము
అంత
చక్కగా
హృదయమునకు
అర్థము
కాగలదు.
ఈ
అన్నింటికీ
‘హృదయశుద్ధి’
లేక
‘క్షేత్రశుద్ధి’
లేక
‘చిత్తశుద్ధి’
అత్యావశ్యకమైయున్నది.
ఏలయన,
అనేక
ప్రాపంచ
వ్యవహారముల
మధ్య
నుండి
అకస్మాత్తుగా
విచ్చేసి,
‘విద్య’
యందు
లేక
‘ఆత్మవిచారణ’
యందు
ప్రారంభించిన,
అది
చిత్తమునకు
హత్తుకొనక
వ్యర్థమగును.
మొదట
చిత్తమును
ప్రపంచమువైపు
నుండి
మరల్చి,
ఆత్మోన్ముఖముగ,
అనగా,
అంతర్ముఖముగ
నొనర్చవలెను.
బాగా
దున్నిన
నేలయందు
విత్తనములు
పెట్టిన,
త్వరలో
మొలక
వచ్చును.
అటులనే,
సంస్కరింపబడిన
హృదయక్షేత్రమున
‘జ్ఞానతత్త్వము’,
అనగా
‘విద్య’
లెస్సగా
ప్రకాశించును.
2
▾
Meaning
Keep
ఆత్మవిశ్వాసము
ప్రధాన
విద్య
‘శ్రవణము’
మాత్రము
చేతనే
మీరు
సంతృప్తి
పడరాదు.
శ్రవణము
చేసిన
దానిని
వెంటనే
‘మననము’
చేయవలెను.
మననము
చేసిన
దానిని
‘నిదిధ్యాసము’
గావించవలెను.
అపుడే
“సత్యము”
హృద్గతము
కాగలదు.
తత్త్వము
రక్తనాళములలో
ప్రవేశించి,
మూర్తివంతమై
అలరగలదు.
నేడు
శ్రవణము
ఒక
రోగముగా
మారిపోయినది.
ఉపన్యాసమును
శ్రవణము
చేసి
అంతటితో
అన్నియు
తెలిసికొన్నామని
భావింతురు.
అట్లుకాక
తరించవలెనను
భావము
తీవ్రముగా
నుండవలెను.
మానవుని
యందలి
తత్త్వాభిలాష
‘యోగము’గా
మారవలెను.
యోగమనగా
–
ధర్మముతో
దైవము
కూడిన
విషయము
యోగమగును.
కామక్రోధాదులు
జీవుని
యందు
ఎంతెంత
అధికముగా
నుండునో
అతని
యందున్న
దైవత్వము
అంతంత
సన్నగిల్లుచుండును.
అనగా,
ఆత్మవిశ్వాసము
క్షీణించుచుండును.
ఆత్మవిశ్వాసము
ప్రధానవిద్య.
క్రోధాదులు
ఎంతెంత
నశించునో,
అతని
యందు
ఆత్మవిశ్వాసము,
ఆధ్యాత్మికము
అంతంత
ప్రబలు
చుండును.
బ్రహ్మజ్ఞాన
సాధనమునకు
వైరాగ్యము
పునాది.
పునాది
గట్టిగా
ఉండక,
అనగా
భద్రముగా
లేనిచో,
ఎంత
చిన్న
భవనమైననూ
అచిరకాలములోనే
కూలిపోవును.
3
▾
Meaning
Keep
పూవులు
గుచ్చాలంటే,
మాలను
తయారు
చేయాలంటే
సూది,
దారము,
పూవులు
ఉండాలి
కదా!
అటులనే
‘జ్ఞానము’
కావాలంటే,
‘విద్య’
రావాలంటే,
‘వైరాగ్యమ’నే
సూది,
‘భక్తి’
అనే
దారము,
‘చిత్తైకాగ్రత’
అనే
పుష్పములు
ఉండాలి.
లోకములోని
ప్రతివాడు
విజయమునే
కోరుచుండును
కానీ,
అపజయమును
కోరడు.
సంపత్తునే
ఆశించునుకానీ,
దారిద్ర్యమను
ఆశింపడు.
అయితే
విజయము
కానీ,
సంపత్తుకానీ
ఎట్లు
చేకూరును?
అది
యోచించి
విచారించవలెను.
దానిని
మనము
వెతుకనక్కరలేదు.
4
▾
Meaning
Keep
మాయను
జయించినప్పుడు
మానవుడు
గమనశీలుడు
కాగలడు
సంజయుడే
ధృతరాష్ట్రునకు
తెలిపెను,
“ఎచ్చట
యోగీశ్వరుడైన
కృష్ణుడు,
ధనుర్ధారియైన
అర్జునుడుందురో
అచ్చట
విజయము,
సంపత్తు
లభించును”.
మనకు
ఇంతకంటే
వేరు
ఆదర్శము
ఎందుకు?
విజయమునకు
తాపత్రయపడనక్కరలేదు.
తహతహానీ
పనిలేదు.
ఐశ్వర్యమునకు
పరితపించనక్కరలేదు.
పరమాత్ముని
హృదయమున
చేర్చుకొనుము.
ధైర్యమను
ధనస్సును
ధరించుము.
అనగా,
నిర్మల
హృదయుడవు
కమ్ము.
విజయము,
ఐశ్వర్యము
నీదే.
నీడను
వెంటాడితివా?
కోట్లకొలది
సంవత్సరములకైనను
అది
నీకు
లభించదు.
అది
నీకంటే
ముందుగనే
పరుగెత్తును.
అయితే
నీ
దృష్టి
సూర్యుని
వైపు
మరల్చితివా,
నీ
నీడ
నిన్ను
ఆశ్రయించును;
అనగా,
నీ
నీడ
నీ
వెనుక
నిన్ను
ఆశ్రయించుచూ
రాగలదు.
నీకు
బానిసయై
వర్తించును.
ఇక్కడ
నీడ
ఒక
మాయ.
మాయను
ఆశ్రయించునంతకాలము
నీకు
మాధవుడు
దక్కడు,
చిక్కడు.
మాయను
బానిసగా
చేసుకొంటివా,
మానవుడు
గమనశీలుడు
కాగలడు.
5
▾
Meaning
Keep
జీవుడు
మొట్టమొదట
చేయవలసినది
బంధవిమోచన
యత్నము
జీవుడు
అనాదికాలము
నుండీ
జననమరణ
రూపమగు
ఈ
సంసారబంధమున
తగుల్కొని
అస్వతంత్రుడై
యున్నాడు.
అట్టి
పారతంత్ర్య
వాతావరణము
నుండి
బంధ
విముక్తికై
ప్రయత్నించక,
విలాస
వస్తువులకై
పరుగిడుట
కేవలము
అజ్ఞానము.
బంధనముననున్న
వారు
మొట్టమొదట
చేయవలసినది
బంధవిమోచన
యత్నము.
ఇది
ప్రధానము.
మిగిలినవి
గౌణము.
అయితే,
ఈనాడు
ప్రధానమును
మరచి
గౌణమునందు
తల్లీనమగుచున్నారు.
“తాను
ఆత్మయే
కానీ
దేహాది
సంఘాతము
కాదు”
అను
విషయమును
మాటిమాటికి
స్మరించుచుండవలెను.
6
▾
Meaning
Keep
ఒకరాజు
ఒక
రామచిలుకను
పెంచుచుండెను.
దాని
నివాసము
బంగారు
పంజరము.
దాని
ఆహారము
తీయని
ఫలములు.
దానికి
త్రాగించు
నీరు,
అమృతమువంటి
పానీయము.
నిత్యము
సరదాగా
రాజే
స్వయముగా
ఈ
ఫలపానీయములను
అందించుచూ,
దానితో
మాటలాడుచూ
ఆడుకొనుచుండెడివాడు.
అయినా,
ఆ
రామచిలుకకు
సంతోషమున్నదా?
లేదు.
ఎప్పుడు
చూచినా
విచారంగా
కనిపించుచున్నది.
ఎందువలన?
దాని
మనసు
బంగారు
పంజరము
మీద
కాని,
రుచికరమైన
ఫలపానీయముల
యందు
కానీ,
రాజే
తనకు
సేవ
చేయుచున్నాడను
అధిక
భావముకానీ,
అది
విచారించుటలేదు,
చూచుటలేదు.
“ఏకాంత
వనమున
చెట్టు
కొమ్మలపై
ఎప్పుడు
పోయి
వ్రాలుదునా?”
అని
దాని
చింత.
దాని
శరీరము
రాజభవనమునందు
సర్వ
సౌకర్యములను
అనుభవించుచున్ననూ,
దాని
మనసు
అరణ్యమును
చింతించుచున్నది.
ఎందుకు?
తన
జన్మస్థానము
అరణ్యము.
నివాసము
చెట్టుకొమ్మ.
పరకీయమున
భోగభాగ్యములను
అనుభవించుట
కంటె
స్వకీయ
స్థలమున
సామాన్యముగ
నుండుటయే
మేలని
ఆ
చిలుకకు
అనిపించుచున్నది.
ఈపాటి
బుద్ధి
మానవునికుండినచో
ఇక
వానికేమి
కొదువ?
పరమాత్మ
వాని
జన్మస్థానము,
ప్రకృతి
పరకీయ
స్థానము.
7
▾
Meaning
Keep
బంధమును
గుర్తింపజేయునదే
విద్య
రాజకీయ
రంగమునను,
లేక
మరొక
విధమైన
దేశరక్షణ
విధానమునను
అరెస్టయిన
కొందరు
మహనీయులను
ప్రభుత్వము
వారు
డిటెన్యూల
క్రింద
పరిగణించి
వారిని
పెద్దపెద్ద
బంగళాలలో
ప్రత్యేక
సదుపాయములుగల
భవనములందు
ఉంచి,
వారి
వారి
అంతస్థుకు
తగినట్టు,
భోజన
సౌకర్యములు
అందింతురు,
విలాస
వస్తువులను
సమకూర్తురు.
కానీ,
ఆ
బంగళా
చుట్టూ,
దాని
ఉద్యానవనము
చుట్టూ
పోలీసు
వారు
కాపలా
కాయుచుందురు.
ఏలయన,
అతనిని
ఎంత
గౌరవించినను
ఖైదియే
కానీ,
స్వేచ్ఛగలవాడు
కాడు.
అటులనే
సంసారబంధనముననున్నవాడు
తన
కొసంగు
పంచభక్ష్య
పరమాన్నాదులను
చూచి
మురిసిపోరాదు.
బంధుమిత్రాదులను
చూచి
మిరమిట్లు
పడరాదు.
తానున్నది
బంధమను
సత్యమును
గుర్తించాలి.
అట్లు
గుర్తింపచేయునదే
విద్య.
Previous
←
Vidyā must show the divinity in oneness
Next
One must learn Ātmavidyā and quench the world's thirst
→