Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Vidyā Vāhini · One must learn Ātmavidyā and quench the world's thirst
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
10.
ఆత్మవిద్యను
నేర్చి
లోకదాహమును
చల్లార్చాలి
నైతిక,
ఆధ్యాత్మిక
రంగములలో
మానవుని
మనస్సు
ఘోరంగా
దిగజారినది
ఈనాడు
లోకమున
సమస్యలు
కొంగ్రొత్త
విస్తృత
స్వరూపమును
ధరించినవి.
అవి
ఒక
వ్యక్తిగత
సమస్య
కానీ,
స్థానిక
సమస్యకానీ
కాదు.
ఇది
ప్రపంచ
సమస్యగా,
మానవ
సమస్యగా
పరిణమించింది.
ఒకవైపు
చూచిన
విజ్ఞాన,
సాంకేతిక,
శాస్త్రరంగమున
బ్రహ్మాండమైన
అభివృద్ధి
కనుపించుచున్నది.
ప్లాస్టిక్సుతోను,
ఎలక్రానిక్స్,
కంప్యూటర్సుతోను
శాస్త్రవేత్తలు
ఊహాతీతమైన
అద్భుతములను
సాధించుచున్నారు.
అణుశక్తికి
సంబంధించిన
శాస్త్రములోను,
అంతరిక్షమునకు
సంబంధించిన
రంగములోను
సాధించిన
విజయములను
చూస్తే
మరింత
ఆశ్చర్యము
కలుగుచున్నది.
మరొకవైపు
చూచిన,
రాజకీయ,
ఆర్థిక
కల్లోలములు,
దేశీయ,
ప్రాంతీయ,
మత,
కుల,
వర్ణ
భేదములు,
ప్రాంతీయ
దురభిమానములు,
విద్యార్థుల
ఆందోళనలు
ప్రపంచమంతయూ
స్వేచ్ఛా
విహారము
సలుపుచున్నవి.
అసమాన,
విరుద్ధమైన
ఈ
రెండింటి
అభివృద్ధులకు
కారణమేమిటి?
నైతిక,
ఆధ్యాత్మిక
రంగమున
మానవుని
మనసు
ఇంత
ఘోరముగా
దిగజారి
పోవుటకు
కారణమేమి?
2
▾
Meaning
Keep
మానవునికి
జ్ఞానమును,
శాంతిని
అందజేయగల
సాధనలు
ఎన్నియో
యున్నవి.
అనగా
వేదము,
శాస్త్రము,
బ్రహ్మసూత్రము,
బైబిల్,
ఖురాన్,
జెండా
అవెస్తా,
గ్రంథసాహెబ్
ఇత్యాది
పవిత్ర
మత
గ్రంథములు
లక్షలకు
గలవు.
మతాచార్యులు,
బోధకులు,
పండితులు,
మహానీయులకు
భారతదేశములో
ఎట్టి
కొరతయూ
లేదు.
లెక్కలేనన్ని
ప్రచారములు
జరుగుచున్నవి.
అయినను
నైతిక,
మత,
ఆధ్యాత్మిక
రంగములో
మానవుని
మనసు
ఇంత
దారుణంగా
దిగజారి
పోవుటకు
కారణమేమి?
3
▾
Meaning
Keep
పూర్వము
కంటే
ఇప్పుడు
మానవులు
దుర్మార్గమునందును,
చెడు
కార్యములయందును
ఎక్కువ
యుక్తిని,
ఎక్కువ
తెలివితేటలతో
క్రూరత్వము
అలవరచుకొనుచున్నారు.
కాకున్న
5500
సంవత్సరములలో
15
వేల
యుద్ధములు
జరిగినట్లు
చరిత్రలు
చాటుచున్నది.
ఈ
యుద్ధములకు
అంతమున్నట్లు
ఎక్కడా
సూచనలు
కనిపించుటలేదు.
అణుయుద్ధ
భయములచే
మానవజాతి
యావత్తూ
హతమయిపోవుచున్నది.
ఈ
విధమైన
భయ,
ఆందోళనలకు
కారణమేమిటి?
4
▾
Meaning
Keep
మానవుడు
శేషించిన
పశుత్వాన్ని
నశింపజేసుకోవాలి
మానవుని
యందు
పశుత్వము
శేషించియున్నదనుట
స్పష్టమగుచున్నది.
ఈ
శేషించిన
పశుత్వాన్ని
నశింపజేసుకోవాలి.
ఆనాడే
మనకు,
మన
దేశమునకు,
యావత్
ప్రపంచమునకు
శాంతి.
మానవునకు
ప్రోగు
చేయుటలో,
నిలువ
చేయుటలో
గొప్ప
విశ్వాసమున్నది.
త్యాగమునకు
పూనుకొనడు.
సత్యమును
విశ్వసించడు.
అసత్యం
జనరంజితం,
సత్యం
జనవిరోధం.
అందువలన
గతమునకు
మరణించుటయను
మనోహర
కళను
మనము
నేర్చుకోలేకపోవుచున్నాము.
మనము
నిరంతరమును
సత్యమును,
అహింసను,
ధర్మమును,
ప్రేమను
మాటలతో
చిలుక
పలుకులవలె
పలుకుచున్నాము.
ప్రచారము
చేయుచున్నాము.
వాటికి
విరుద్ధముగ
ప్రవర్తించుచున్నాము.
సత్యమును
మించిన
మతము
లేదని
నినాదములు
చేయుచున్నాము.
అయినా
విచిత్రమైన
విషయమేమన,
మానవునకు
అక్కరలేనిది
సత్యమొక్కటే.
మానవుడు
అన్నింటినీ
తెలుసుకోగోరుచున్నాడు
కానీ,
సత్యమును
తెలుసుకొనగోరడు.
అందులోనూ
‘తనను
గురించిన
సత్యము’
అసలే
అక్కరలేదు.
తనను
గురించిన
సత్యమును
తాను
తెలుసుకొనుటకు
భయపడుచున్నాడు.
దాని
వైపునకే
చూడడు.
ఒకవేళ
చూచినా,
సమన్వయమును
సమర్థించుటకు
ప్రయత్నించును.
మానవుడు
మొదలు
తన
హింసా
విధానమును,
దౌర్బల్య
విధానమును
పూర్తిగా
విడిచి
వేయవలయును.
5
▾
Meaning
Keep
ఈనాడు
లోకమునకు
కావలసినది,
పవిత్రమైన
మనోహృదయములు
ద్వేషము,
అసూయ,
దూరాశ,
ఆడంబరములు,
ఎల్లవేళల
యందు
మరొకరితో
పోల్చుకొనుట
అనే
దురలవాట్లు
మనలో
నిర్మూలము
కావాలి.
ఈ
పై
గుణములు
సామాన్య
మానవులకే
కాక,
సాధు,
సన్యాసులకు,
పీఠాధిపతులకు,
పండితులకు
సహితము
తలకు
చేరినవి.
వారలందు
కూడా
ఈ
అసూయాది
ద్వేషములు
మితిమీరిపోయినవి.
ఆదర్శపురుషులుగా
నిరూపించవలసిన
ఆచార్యులే
ఇట్టి
తుచ్ఛ
భావములను
అనుసరించిన,
లోకమును
ఏమి
బాగుచేయగలరు?
మరింత
కాలుష్యమును
అభివృద్ధి
చేతురు.
ఈనాడు
లోకమునకు
కావలసినది
క్రొత్త
పద్ధతి
కాదు.
క్రొత్త
విద్య
కాదు.
క్రొత్త
విధానము
కాదు.
క్రొత్త
సమాజము
కాదు,
లేక
క్రొత్త
మతము
కాదు.
ఇవి
ఏమియూ
నేడు
చెలరేగిన
సమస్యలను
పరిష్కరించలేవు.
నేడు
కావలసినది
పవిత్రమైన
మనోహృదయములు.
అట్టి
పవిత్ర
మనోహృదయములు
యువకులైన
బాలబాలికలయందు
విరివిగా
పెరగవలెను.
ఆస్తిక
లోకమున
ఇదియే
మనము
ఈనాడు
సాధించవలసిన
గొప్ప
సాధన.
ఇది
ఒక్క
“బ్రహ్మవిద్య”
వలన
మాత్రమే
సాధ్యమగును.
6
▾
Meaning
Keep
నశించని
వస్తువు
కొరకు
విజ్ఞులు
ప్రయత్నించాలి
ఏది
మొదటను,
తుదియందును
ఉండదో,
మధ్యకాలమున
మాత్రమే
యుండునో,
అది
“మిథ్యము”
అగును.
ఈ
జగత్తు
అంతయు
సృష్టికి
పూర్వము
లేదు.
ప్రళయమందును
ఉండదు.
మధ్యకాలమున
తోచుచున్నది.
ఇది
తాత్కాలికమే
కానీ,
స్థిరము
కాదు.
ప్రపంచమున
ప్రతి
వస్తువును
గూర్చియు
ఈ
విధముగ
యోచించవలెను.
దేహము
పుట్టుటకు
పూర్వము
లేదు.
చనిపోయిన
తరువాత
లేదు.
కాబట్టి,
మధ్యకాలమున
ఘటమువలె
కానుపించుచున్నది.
అదియును
కల్పితము
మాత్రమే.
ఆ
జగత్తునందలి
ఏ
వస్తువైననూ
కాలమునకు,
మృత్యువునకు,
వినాశమునకు
వశీభూతము
కాక
తప్పదు.
చెట్టు
నశించును,
మట్టి
నశించును,
గృహము
నశించును,
దేహము
నశించును,
రాజులు,
రాజ్యములు
కూడా
సర్వమూ
నశించును.
ప్రపంచమున
దృశ్యకల్పితములైనవన్నియూ
నశించును.
కనుక,
నశించని
వస్తువు
ఏదియో
దానికోసము
విజ్ఞులు
ప్రయత్నించాలి.
అట్టి
అమృతమును
వదలి
మృతస్థాయిని
చేకూర్చు
మిథ్యావస్తువులపై
భ్రాంతిని
కలుగుజేసుకొనువారు
మందార
వనమును
వీడి
విషవృక్షములతో
కూడిన
అరణ్యమును
ఆశించినవారే
అగుదురు.
బింబరూపమైన
ఆత్మను
వదలి,
ప్రతిబింబమైన
దృశ్య
పదార్థములను
ఆశించువాడు
అజ్ఞుడే
కానీ
తత్త్వజ్ఞుడు
కాడు.
ఈ
ముల్లోకములందును
మూడు
కాలములందును,
మూడు
అవస్థలయందును
వాస్తవమైన
సుఖము
ఒకింతైనా
లేదు.
పరిచ్ఛిన్నమగు
సంసార
పదమును
మూర్ఖులే
కోరుచున్నారు
కానీ
జ్ఞాని
కాదు.
ఉత్తమ
ఫలమైన
ద్రాక్షాది
లతను
వీడి,
కంటకముల
వైపునకు
పరుగిడునది
ఒంటెయే
కానీ
మరే
జంతువూ
కాదు.
7
▾
Meaning
Keep
దూరము
నుండి
చూచిన
పర్వత
శిఖరములు
రమణీయముగా
తోచును.
సమీపించిన,
అది
భయంకర
అరణ్యము.
అటులనే,
ప్రపంచ
విచారము
చేయక
పూర్వము,
సంసారము
కూడా
రమణీయముగా
ఉండును.
లోతునకు
దిగిచూచిన,
గృహారణ్యము,
ప్రపంచమున
నిజసుఖమును
కలిగించు
వస్తువేదియూ
లేదు.
ఉండిన,
“ఆత్మ”
ఒక్కటే.
ఎండమావులు
ఎంత
ప్రయత్నించిననూ
దాహమును
తీర్చునా?
వాటి
కొరకై
పరువులెత్తితే
మరింత
దాహమును
పెంచుకొనుట
తప్ప,
మరేమీ
ఉండదు.
కనుక,
ఆత్మవిద్యను
నేర్చి,
లోకదాహమును
చల్లార్చుకొనుట
మంచిది.
Previous
←
Vairāgya is the foundation of the knowledge of Brahman
Next
Vidyā must bring sāttvic happiness
→