Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Vidyā Vāhini · Vidyā must bring sāttvic happiness
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
11.
విద్య,
సాత్త్విక
సుఖమును
లభింపజేయాలి
మానవజీవితములో
సాధించవలసిన
ప్రధాన
కార్యము
భగవత్కృప
మనుష్య
జీవితమునందు
సాధించవలసిన
కార్యములన్నిటియందును
ప్రధానమైనది
భగవంతుని
కృప
లేక
ప్రేమ.
అతని
‘ప్రేమ’
వలన
మానవులకు
మంచి
జ్ఞానము
కలిగి,
సుస్థిరమైన
శాంతి
దొరకును.
ప్రతి
మానవుడును
భగవంతుని
యొక్క
నిజస్వరూపమును
ఎరుగుటకు
ప్రయత్నించవలెను.
మొట్టమొదటనే
మానవుడు
అవ్యక్తరూపమును
తెలుసుకొనలేడు.
మొట్టమొదట
ఒక
ఆకారమును
అర్చించవలెను.
దానిని
క్రమక్రమమున
‘శక్తిపాతము’గా
తనలో
ఆవిర్భవించునట్లు
ప్రయత్నించవలెను.
కార్య
నిర్వహణాధికారి
కేవలము
అధికారి
మాత్రమే
కాదు.
సేవాభావము,
మంచి
ప్రవర్తన
కలిగి
ప్రజల
మన్ననలను
అందుకోవలెను.
అప్పుడే
అతను
చిత్తశుద్ధి
కలవాడై,
నిజమైన
అధికారి
కాగలడు.
సన్యాసమనగా
కేవలము
తురీయాశ్రమమును
స్వీకరించి
ప్రజలతో
సంబంధము
లేకుండా,
అరణ్యములందు
తపస్సు
చేసుకొనుట
మాత్రమే
కాదు.
ప్రజల
మధ్య
సంచరించి,
వారి
కష్టసుఖాలను
గ్రహించి,
వారికి
అవసరమైన
ఆధ్యాత్మిక
విద్యాప్రబోధను
గావించుట
యతీశ్వరునకు
అవశ్యము.
సన్యాసిని
ఒక
విధముగ
మత్స్యముతో
పోల్చవచ్చును.
మత్స్యము
చెరువులో
ఎప్పుడూ
తిరుగుతూనే
ఉంటుంది
కాని
ఒకచోట
ఉండదు.
అలా
తిరుగుతూ
నీటిని
శుభ్రము
చేయును.
అలాగే
సన్యాసి
కూడా
దేశం
నలుమూలలా
సంచరిస్తూ
సమాజములో
ఉన్న
మాలిన్యమును
ప్రబోధలచే,
ప్రచారములచే
చైతన్యవంతముగాను,
పరిశుద్ధమైనదిగాను
చేయవలెను.
2
▾
Meaning
Keep
భక్తి
ప్రపత్తులు
ప్రబలునట్లు
చేయు
విద్య
అత్యవసరము
వృక్షమూలములో
నీరు
పోస్తే
వృక్షము
శాఖోపశాఖలై
పుష్పఫలములనందించునే
కానీ
ఆ
నీటిని
కొమ్మలకు,
ఫలములకు,
పుష్పములకు
పోస్తే
అభివృద్ధి
అవుతుందా
వృక్షము?
అటులనే
మూలకారణమైన
‘భక్తి’లేని
మానవ
సమాజము
కూడా
మనలేదు.
కాబట్టి
భక్తి
ప్రపత్తుల
విద్యలను
ప్రజలలో
ప్రబలునట్లు
ప్రవర్తించుట
అత్యవసరము.
అధికారులనగా
అధిక+అరి=అధికారి.
అనగా,
అధిక
శత్రువుగాకుండా
అధికారిగానే
ప్రజాసేవ
చేయాలి.
ఏ
ప్రదేశమందైనను
ప్రజలలో
మనశ్శాంతి
లేక
సుఖసంతోషాదులు
కరువైనపుడు
అచ్చట
దేవాలయములలో
పూజావిధానాలలో
ఏదో
లోపమున్నదనియే
భావించెడివారు
పూర్వులు.
అట్టి
లోపములే
ఉండిన,
గుర్తించి,
లోపములను
సరిదిద్దినచో
ఆ
అరిష్టములు
వెంటనే
కట్టుబడునని,
అనేక
ప్రయత్నములు
సలిపి
చిత్తశుద్ధిని
చేకూర్చెడివారు.
ఇట్టివి
నేడు
మూఢనమ్మకములని
మూటగట్టి
ప్రక్కకు
నెట్టుచున్నారు.
ఇవి
మూఢనమ్మకములు
ఏమాత్రమూ
కావు.
ఆధునిక
విజ్ఞానులు
ఇట్టి
ప్రధాన
సమస్యలను
గ్రహించుకోలేని
దుస్థితిలోనున్నారు.
ఆధునిక
విద్యలలో
పెరిగిన
అవినీతికి
ఇదే
ప్రథమ
స్థితి.
ప్రాచీనులు
అన్నింటినీ
స్వయముగా
అనుభవించి,
గ్రహించిన
పరమసత్యమును
ఆధునికులు
త్రోసివేయుటలోనే
అనాగరికత
అభివృద్ధి
అగుచున్నదన్న
సత్యాన్ని
అధికజనులు
గుర్తించలేకపోవుచున్నారు.
3
▾
Meaning
Keep
ప్రతిప్రాణి
ప్రపంచములో
సుఖమునే
కోరును,
దుఃఖమును
కోరదు.
ధనముపై
కొందరు,
కనకముపై
కొందరు,
వస్తువులపై
కొందరు,
వాహనములపై
కొందరు,
ఈ
విధముగ
ఒక్కొక్క
దానివల్ల
ఒక్కొక్కరు
సుఖమును
ఆశింతురు.
అయితే,
వాస్తవమైన
సుఖము
ఏమిటో
తెలిసినవారు,
తెలిసికొనినవారు
చాలా
అరుదు.
సుఖము
మూడు
రకములుగ
నున్నది.
ఆరంభమున
విషమువలె
నుండి,
విపాకమునందు
అమృతమువలె
ఉండును.
ఇది
ఆత్మబుద్ధిచే
లభించు
సుఖము,
సాత్త్విక
సుఖం.
అనగా
శమదమాది
సాధనములను
అభ్యసించే
సమయమున
మిక్కిలి
శ్రమపడవలసియుండును.
అందుచేత
ఆరంభమున
విషమువలే
అతి
క్లేశకారిగా
ఉండును.
యోగవాశిష్టములో
“ఓ
రామా!
మహా
సముద్రమునైనా
సులభముగా
పానము
చేయవచ్చు.
సుమేరు
పర్వతములనైనను
అవలీలగా
ఊడపెరకవచ్చు,
అగ్నిని
అనాయాసముగా
భుజించవచ్చు.
కానీ,
మనో
నిగ్రహము
చాలా
కష్టమని”
అన్నాడు
వశిష్టుడు.
కాన,
ఒకపరి
ఆ
మనోనిగ్రహమును
గావించితిమా
అదే
అమృతత్త్వము.
అట్టి
అమృతత్త్వమును
పొందుటకు
పూర్వము
అతి
శ్రమ
అనక,
మనోనిగ్రహమునకై
ప్రయత్నించుట
ప్రధాన
కార్యము.
ఇది
ప్రథమ
సుఖము.
4
▾
Meaning
Keep
విపాకముగా,
నిర్వికల్పసమాధి
కాలములో
లభించు
సుఖము
వర్ణనాతీతము.
ఇది
‘అమృతము’తో
సమానము.
నిర్వికల్పమనగా
సంకల్పరహితమైన
స్థితియే.
వికల్పము
లేనిది
నిర్వికల్పము.
దీనిని
సాధనచే
సాధించవచ్చును.
నిర్వికల్ప
సమాధి
రెండు
విధములు
(యోగ
శాస్త్ర
పరంగా
మరియు
అద్వైత
వేదాంత
పరంగా).
ఒకటి
“అద్వైత
భావనారూపము”.
రెండవది
“అద్వైత
అవస్థా
రూపము”.
త్రిపుటీరహితమైన,
కేవల
‘బ్రహ్మాకారమగు
వృత్తి’
కలిగినచో,
అది
“అద్వైత
భావనారూపము”
(యోగ
శాస్త్ర
పరంగా).
సగుణ
స్వస్వరూపావస్థ
యందు
లయము
పొందినచో
“అద్వైతావస్థారూపము”
(అద్వైత
వేదాంత
పరంగా).
5
▾
Meaning
Keep
లౌకిక
విద్యలతోబాటు
అమృత
విద్యలను
కూడ
అభ్యసించాలి
విషయమునకు,
ఇంద్రియమునకు
సంయోగము
వల్లనుద్భవించి
ఆరంభమున
అమృతమువలె
వుండి,
విపాకమున
విషమువలే
వుండు
సుఖము
‘రాజసిక
సుఖము’
అనబడును.
విషయేంద్రియముల
వలన
కలుగు
సుఖము
ఆరంభమున
అమృతమువలే
నుండును.
కానీ,
వెంటనే
బలము,
ప్రజ్ఞ,
మేధస్సు,
ధర్మార్థ,
కామ,
మోక్షములను
చతుర్విధ
పురుషార్థములు
–
వీటియందు
ఉత్సాహము
నశించును.
ఇదే
రాజసిక
సుఖము.
ఆరంభమునందును,
పరిణామమునందును
బుద్ధిని
మోసపుచ్చునదియు,
నిద్ర,
సోమరితనము,
పొరపాట్లు,
వీనివల్ల
కలుగునట్టిదియు
అగు
సుఖము
‘తామసిక
సుఖము’
అనబడును.
ప్రారంభమునందును,
అంతమునందును
కూడా
మానవుడు
‘ఆత్మప్రాప్తి’
యొక్క
మార్గమును
మరచిపోవును.
కనుక,
మూడు
విధములయిన
సుఖములలో
‘సాత్విక
సుఖము’ను
కోరునట్టి
మనోబుద్ధులను
కలిగించునట్టి
విద్యయే
‘నిజమైన
విద్య’.
అది
అతి
శ్రమలతో
కూడియుండును.
“న
సుఖాల్లభ్యతే
సుఖమ్.”
సుఖము
నుండి
మనకు
సుఖము
చిక్కదు.
కష్టమునందే
సుఖమున్నదన్న
సత్యాన్ని
గుర్తించిన,
ఇట్టి
‘విద్య’
మనకు
శ్రమగా
యుండదు.
మానవుడై
పుట్టి,
మట్టి
విద్యలు,
చెత్త
విద్యలతో
పాటు
‘అమృత
విద్య’లను
కూడా
అర్థము
చేసుకొనుటకు,
అనుభవించుటకు
ప్రయత్నించకుండిన
జీవితమే
వ్యర్థము.
Previous
←
One must learn Ātmavidyā and quench the world's thirst
Next
“Adhyātmavidyā vidyānām”
→