Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Vidyā Vāhini · “Adhyātmavidyā vidyānām”
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
12.
“ఆధ్యాత్మ
విద్యా
విద్యానాం”
ఏది
వెలుగును
ఇచ్చునో
అది
విద్య
విద్
అను
ధాతువునకు
“య”
అను
ప్రత్యయము
చేర్చినపుడు
“విద్య”
అను
పదము
ఏర్పడుచున్నది.
“య”
అనగా
ఏది,
“విద్”
అనగా
వెలుగు.
“ఏది
వెలుగును
ఇచ్చునో”
అది
“విద్య”
అని
వ్యుత్పత్తి
అర్థము.
కనుక,
“విద్య”
అను
పదము
“బ్రహ్మవిద్య”కు
మాత్రమే
తగినది.
జ్ఞానమును
వెలుగుగా,
అజ్ఞానమును
చీకటిగా
పూర్వీకులు
పేర్కొనిరి.
ప్రకాశ,
అంధకారములు
ఎట్లు
ఒకే
కాలములో,
ఒకే
స్థానమున
నిలువజాలవో,
అట్లే
విద్య,
అవిద్యలు
రెండూ
ఒకే
కాలమున,
ఒకే
స్థలమున
నిలువజాలవు.
కాన,
ప్రగతి
పథమున
పయనించు
ప్రతి
మానవుడు
బ్రహ్మవిద్య
నభ్యసించి
పరిశుద్ధాత్ముడు
కావలెను.
2
▾
Meaning
Keep
విద్య,
తపస్సులు
లేనివారు
పవిత్రులు
కాజాలరు
“ఆధ్యాత్మ
విద్యా
విద్యానాం”
అని
గీతయందు
కూడా
‘విభూతి
యోగము’న
తెలుపబడెను.
అఖిల
విద్యలు
నదులు.
ఆధ్యాత్మవిద్య
సముద్రము.
అన్ని
నదులు
సముద్రమున
కలియునటులే
అన్ని
విద్యలు
ఆధ్యాత్మవిద్యలో
విలీనమగుచున్నవి.
అంతేకాదు,
సాగరసంగమమున
నదులన్నియూ
తమ
ప్రత్యేక
నామరూపములు
కోల్పోయి
అఖండ
సముద్రాకృతి
అయినట్లు,
బ్రహ్మవిద్యా
సాగర
సమ్మేళనమున
బాహ్యవిద్యలన్నియు
స్వరూపనామాదులు
పరిత్యజించుచున్నవి.
“విద్యా
తపోభ్యాం
పూతాత్మా”.
విద్యవలనను,
తపస్సువలనను
మానవుడు
పవిత్రుడగుచున్నాడు.
విద్య
–
బాహ్యవిద్య,
బ్రహ్మవిద్య
అని
రెండు
విధములు.
బాహ్యవిద్య
కేవలము
మానవుని
జీవనోపాధి
కొరకు
ఏర్పడినది.
పెద్ద
విద్యలు
చదివి,
డిగ్రీలు
పొంది,
గొప్పగొప్ప
ఉద్యోగములు
సంపాదించి,
జీవితమును
చీకూచింత
లేకుండా
సుఖప్రదము
చేసుకొనుట.
ఇది
పాకిపని
మొదలు
ప్రధాని
పర్యంతము
గల
సమస్త
పదవులు
బాహ్యవిద్యకు
సంబంధించినవైయున్నవి.
అందువలన
బాహ్యవిద్యలన్నింటినీ
పొట్టకూటి
చదువులుగా
పేర్కొనబడినవి.
ఇక
బ్రహ్మవిద్య,
సమస్త
మానవులను
కృతకృత్యులజేయు
శక్తి
సామర్థ్యములు
కలదై
యున్నది.
ఇది
ఇటు
ఇహలోక
సంబంధమును,
అటు
పరలోక
సుఖమునకు
కూడా
దారులు
కలిగించును,
కల్పించును.
కాన,
అవని
పైనున్న
అన్ని
విద్యలకన్నా
బ్రహ్మవిద్య
మిన్నగా
పరిగణింపబడియున్నది.
అందరినీ
కడతేర్చగల
దివ్యశక్తి
బ్రహ్మవిద్యకు
తప్ప
బాహ్యవిద్యలకు
లేదు.
బ్రహ్మవిద్య
పరబ్రహ్మమును
తెలుపును.
తపస్సు
పరబ్రహ్మతో
కలుపును.
విద్య
జ్ఞానము,
తపస్సు
జ్ఞేయమగును.
మొదటిది
పరోక్షము,
రెండవది
ప్రత్యక్షము.
గురువు
అనగా
గొప్పవాడు
అని
అర్థము.
అనగా,
పై
రెండింటి
యందు
ప్రజ్ఞాపాటవము
కలవాడై
యుండవలెను.
కట్టుగుడ్డ
కంటిన
మాలిన్యము
పోవలెనన్న
సబ్బు,
పరిశుద్ధ
జలమూ
రెండూ
ఎట్లు
అవసరమో,
అటులనే
మనస్సుకంటిన
మాలిన్యము
వైదొలగవలెనన్న
విద్యాతపస్సులు
రెండును
అంత
అవసరము.
అపుడే
అంతఃకరణము
శుద్ధి
కాగలదు.
రెండు
చక్రములు
లేని
బండి,
రెండు
రెక్కలు
లేని
పక్షి
యెట్లు
ప్రయాణము
చేయలేవో,
అటులనే
విద్యాతపస్సులు
లేనివారు
పవిత్రులు
కాజాలరు.
తపస్సు
అనగా
కాళ్ళుపైకి,
తలక్రిందపెట్టి
గబ్బిలమువలే
వ్రేలాడుట
కాదు.
లేదా
ఆస్తిపాస్తులు
వీడి,
ఆలుబిడ్డలను
వీడి,
ముక్కు
మూసుకొని
డొక్కలు
కొట్టుట
కాదు.
కాయిక,
వాచిక,
మానసికముల
మూడింటిని
ఒక్కటిగ
చేసి,
త్రికరణశుద్ధిగ
ప్రవర్తించుటే,
తపస్సు
అనబడును.
ఇది
కర్తవ్య
సహితముగా
చేయవలెను.
ఆత్మతృప్తి
నిమిత్తమై
పడు
ఆరాటమే
తపస్సు.
గీతలో
గురుశిష్యులు
ఆదర్శవిగ్రహాలు.
అధికారమూర్తి
శిష్యుడు,
అవతారమూర్తి
గురువు.
నరోత్తముడు
శిష్యుడు,
పురుషోత్తముడు
గురువు.
మహాత్ముడైన
పార్థుడు
శిష్యుడు,
పరమాత్ముడైన
కృష్ణుడు
గురువు.
ధనుర్ధరుడైన
వాడు
శిష్యుడు,
యోగీశ్వరుడైనవాడు
గురువు.
ఇట్టి
గురుశిష్యులును
అయివుండినపుడే
బ్రహ్మవిద్య
లభ్యమగును.
3
▾
Meaning
Keep
సూత్రధారి
గురువు,
పాత్రధారి
శిష్యుడు
“కరిష్యే
వచనం
తవ”,
అని
గీతలోని
శిష్యుడు,
“నీవు
చెప్పినట్లు
చేస్తాను”
అని
అహంకారమను
గాండీవమును
పారవేసెను.
సూత్రధారి
గురువు,
పాత్రధారి
శిష్యుడు.
నాకొక
కర్తవ్యమంటూ
శిష్యుడు
విఱ్ఱవీగరాదు.
అహంకారముండు
వరకు
గురువు
లేడు;
గురువు
వచ్చెనా,
అహంకారము
ఉండదు.
అన్నీ
ఇచ్చుట
గొప్పతనము
కాదు,
తనను
తాను
ఇచ్చుకొనుట
గొప్ప.
అట్టి
స్థితియందే
గురువు
శిష్యునకు
స్వేచ్ఛనిచ్చును.
“నాయనా!
యథేచ్ఛసి
తథాకురు!
బాగా
ఆలోచించు.
నీకు
నచ్చినట్లు
చేయి”.
అనగా,
చెప్పవలసినవి
చెప్పి,
అహంకారమును
స్వీకరించి
భావ
స్వతంత్రమును,
వ్యక్తి
స్వతంత్రమును
ఇవ్వవలెను.
విద్య
నిర్భంధ
మాఘస్నానము
కాదు.
తన
శిష్యుడు
తనకు
అన్నింటిని
సమర్పించెను
కదా
అని
గురువు
శిష్యునిపై
సుగ్రీవాజ్ఞలు
చలాయించరాదు.
లోభి
గురువు,
సోమరి
శిష్యుడు
నరకము
పాలగుదురు.
గురువులు
విత్తాపహారులు
కారాదు,
హృత్తాపహారులు
కావలెను.
గురువు
అలారమ్
టైమంపీస్
వంటివాడు.
అజ్ఞానమను
నిద్ర
నుండి
లేపి,
ఆత్మజ్ఞాన
ప్రబోధమును
చేకూర్చగలవాడు
గురువు.
4
▾
Meaning
Keep
ఒట్టి
శాస్త్రవిజ్ఞానము,
ఒట్టి
అనుభవ
జ్ఞానము
రెండూ
అసంపూర్ణములు
ప్రయాణమై
గ్రామాంతరము
పోవుచున్న
వ్యక్తికి
మార్గమధ్యమున
నది
అడ్డుతగిలినది.
అది
పొంగి
పొరలుచున్నది.
దాటుటకు
బాటసారి
ప్రయత్నించెను.
అతనికి
మార్గము
కానీ,
లోతు
కానీ
తెలియకుండుట
చేత
అటూ
ఇటూ
చూచెను.
ఎవరో
ఇరువురు
దూరమున
చెట్లక్రింద
వ్యక్తులు
కూర్చొనియుండ
అక్కడికి
వెళ్ళి
చూచెను.
అక్కడ
ఒకడు
కుంటివాడు,
మరొకడు
గ్రుడ్డివాడు.
వారికి
లోతుపాతులు
తెలియవనియు,
వారు
చెప్పు
మాటలను
నమ్మరాదనియు
వెనుకకు
పోయెను.
అనగా
శాస్త్రజ్ఞానము
లేనివాడు
గ్రుడ్డివాడు,
అనుభవ
జ్ఞానము
లేనివాడు
కుంటివాడు.
వట్టి
శాస్త్రజ్ఞానము,
వట్టి
అనుభవజ్ఞానము,
అపూర్ణములు.
రెండునూ
చేరినపుడే
పూర్ణుడు.
వాడే
శిష్యుని
ఉద్ధరించగలడు.
ముండకోపనిషత్తు
వాక్యమిది.
5
▾
Meaning
Keep
మంచి
శిష్యులు
లభించుట
కంటే,
మంచి
గురువులు
లభించుట
లోకమున
మరింత
కష్టము.
అపుడే
శిష్యులు
ఆదర్శజీవులు
కాగలరు.
పరిశుద్ధ
హృదయులైన
విద్యార్థులు,
నిస్వార్థపరులైన
విద్యార్థులు,
నిరహంకారులైన
విద్యార్థులు
లభించినపుడు
ఉత్తమ
గురువులు
ఉఱ్ఱూతలూగుచూ
పరీక్షిత్
మహారాజుకు
అధికారమబ్బగనే
శుకమహర్షి
ప్రత్యక్షమయినట్లు,
గురుశిష్యులు
ఉత్తములుగా
ఉండినపుడు
దేశము
సుక్షేమంగా
ఉండును.
Previous
←
Vidyā must bring sāttvic happiness
Next
The heart must be immersed in God, the hand in work
→