Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Vidyā Vāhini · The heart must be immersed in God, the hand in work
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
13.
హృదయము
ఈశ్వరమగ్నము,
హస్తము
కార్యమగ్నము
కావాలి
భౌతిక
వస్తువు
మీకు
దాసిగాని,
మీరు
వస్తువుకు
దాసులు
కారాదు
విద్యార్థులారా!
భ్రాంతికిని,
అంధకారమునకును
ఆవలనుండు
పురాణపురుషుని,
పురుష
ప్రయత్నముతో
కనుగొనుడు.
నిత్యానందస్థితికి
ఉత్తరాధికారులై
మీరు
జన్మించితిరి.
మీరు
దైవమునకు
ముద్దుబిడ్డలు.
మీరు
పరమపావనులు;
పాపులమని
భావించకండి.
మీరు
సింహము
పిల్లలు;
గొఱ్ఱెలు
కాదు.
అమృతబిందువులమని
భావించండి.
భౌతిక
వస్తువులు
కారు;
భౌతిక
వస్తువు
మీకు
దాసిగానీ,
మీరు
వస్తువుకు
దాసులు
కారాదు.
2
▾
Meaning
Keep
వేదము
ప్రతిభాసించునది
నిష్ఠుర,
నియమముల
యొక్క
ఘోర
సందోహము
కాదు.
అన్ని
నియమములకు
ఒక
ప్రభువు
కలడనియు,
అతని
ఆజ్ఞవలననే
పంచభూతములు
తమతమ
పనులు
తాము
చేయుచున్నవనియు
తెలుపుచున్నది.
అట్టి
ప్రభువును
సేవించుటకంటే
వేరు
ఆరాధన
లేదు.
ఏకైక
ప్రియునిగా
ఇహపరములందుగల
సర్వము
కన్నను,
ప్రియతమ
వస్తువుగా
అతనిని
ప్రేమించవలెను,
స్మరించవలెను;
అదియే
సరియైన
“విద్య”.
3
▾
Meaning
Keep
నీటియందుద్భవించియు,
నీటిచే
తడియక
యుండు
తామరాకువలె
మానవుడు
లోకమున
జీవించవలెను.
అదియే
ప్రధాన
విద్య
యొక్క
విశిష్టత.
అనగా,
హృదయము
ఈశ్వరమగ్నముగాను,
హస్తములు
కార్యమగ్నముగాను
ఉంచుకొని,
మానవుడు
ఈ
లోకములో
జీవించవలెను.
మానవుని
ప్రేమ
వాణిజ్య
వస్తువు
కారాదు.
ప్రేమకు
ప్రేమయే
పరమార్థము.
హిందూమతమనగా
ఏదో
ఒక
సిద్ధాంతమనో,
అభిప్రాయమనో
విశ్వసించుటకై
పోరాడుటయు,
ప్రయత్నించుటయు
కాదు.
దానిని
ప్రత్యక్షముగా
అనుభవించుటే
దాని
తాత్పర్యము.
4
▾
Meaning
Keep
పండ్లనుబట్టి
చెట్టు
యొక్క
గుణము
నిర్ణయింపవలెను.
నీతియందును,
పారమార్థికతయందును,
ప్రేమయందును
లోకమున
అసమానమైయుండు
గుణోత్తములు,
మహనీయులు
భారతీయులు.
భారతీయుల
దృక్పథమున
మానవుడు
పురోగమించునది,
అసత్యము
నుండి
సత్యమునకు
కాదు.
సత్యము
నుండి
సత్యమునకే.
ప్రతి
జీవాత్మ
ఒక
గరుడపక్షి
అనవచ్చును.
అది
పైకి
పైకి
ఎగసి,
క్రమాధిక
బలము
చేకూర్చుకొని
చివరకు
పరిపూర్ణ
తేజోవైభవముతో
సూర్యబింబము
నందుకొనును.
5
▾
Meaning
Keep
అనేకత్వములోని
ఏకత్వమే
ప్రకృతియొక్క
మూలసూత్రము
నానాత్వములోని
ఏకత్వమే
ప్రకృతి
యొక్క
మూలసూత్రము.
భారతీయులు
ఈ
సూత్రాన్ని
గ్రహించిరి.
దానిని
మార్పుచేయ
ప్రయత్నింపరు.
ఇతర
మతములన్నియూ
ఏవో
కొన్ని
సుస్థిర
సిద్ధాంతాలను
ఏర్పరిచి,
వాటినే
అంగీకరించి,
అనుసరించి,
తమతమ
సంఘములతో
సంతృప్తి
పడుచున్నారు.
భారతీయులు
వారివారి
భావమునకు
తగిన
ఆరాధనను
అందించుచూ
వచ్చారు.
మతములన్నియూ
చేయు
పని,
భౌతిక
మానవుని
వికాసమునకు
తోడ్పడి
తనలోని
ఈశ్వరత్వమునుద్దీపించునట్లు
చేయుటయే.
ఒకే
సత్యము
–
వేర్వేరు
స్వరూపములు,
స్వభావములు,
వేర్వేరు
స్థితిగతులకు
అనుగుణంగా
యేర్పడినవే
భారతీయుల
ఆరాధనలు.
“సర్వమతములందును
భగవంతుడు
కలడ”ని,
ప్రపంచములోని
సర్వదిగంతములకునూ
ప్రకటించు
బుద్ధి
వైశాల్యము
ఒక్క
భారతీయులకే
దక్కినది.
ఇది
వారి
అదృష్టము.
మన
పూర్వీకులకై
లజ్జింపకుండుట
జీవిత
నియమములలో
ఒకటి.
పూర్వచరిత్రమును
చదివినకొలదీ
పూర్వకాలముపై
నీ
దృష్టిని
పరిపినకొలదీ
నీ
గర్వము
నీయందు
వర్ధిల్లును.
భారతీయుల
పూర్వీకులు
మహోన్నతినందిరి.
అట్టి
పరిపూర్ణ
విశ్వాసమే
మీ
రక్తములోనికి
కూడా
ఎక్కుగాక!
ప్రసరించుగాక!
అది
మీ
జీవితములో
అవినాభావసంబంధమొందుగాక!
అట్లే
ప్రతి
జాతియందునూ,
ప్రతి
మతమునందునూ
ఒక
ప్రత్యేకత
యుండునని
విశ్వసించుటే
ప్రధాన
విద్య.
6
▾
Meaning
Keep
ఆత్మబలమే
సర్వబలము
ఇంతటి
ఘోర
ఆపదల
పాలయిన
దేశము,
దాస్యముననుభవించిన
దేశము,
ప్రపంచ
చరిత్రలో
మరొకటి
లేదు.
అయినను,
భారతీయులు
ఇప్పటికినీ
ఇంచుమించు
పూర్వకాలపు
జాతిగనే
నిలచి,
యెన్నియో
నూతన
విపత్కర
కల్లోలాలను
యెదుర్కొన
సంసిద్ధులై
యున్నారు.
ఇదియే
భారతీయుల
స్థిర
సిద్ధాంతము.
భగవత్
విశ్వాసము,
ఆత్మ
నమ్మకము,
నాటి
నుండి
నేటి
వరకూ
అదే
కాపాడుకుంటూ
వచ్చుచున్నదని
వారి
దృఢమైన
నమ్మకము.
భారతీయుల
సిద్ధాంతములునూ,
భావములును
హిందూదేశపు
సరిహద్దులలోనే
అణగియుండుట
లేదు.
భారతీయులకు
ఇష్టము
లేకుండిననూ
దేశాంతరములలోనికి
జొచ్చి
పరిక్రమించుచున్నవి.
ఇతర
వాఙ్మయములలోనికి
వాని
సారము
దిగిపోవుచున్నది.
ప్రకృతి
తత్త్వశాస్త్ర
రహస్యములు
మనకు
అన్నవస్త్రములను
మాత్రమే
సమకూర్చును;
ఆధ్యాత్మిక
శాస్త్రము
ఆత్మబలమును
సమకూర్చునన్న
విషయము
విద్యార్థులు
ముఖ్యంగా
గమనించవలసిన
విషయము.
ఆత్మబలము
లేనివారికి
అన్నవస్త్ర
బలము
ఉండి
ఉపయోగమేమి?
ఆత్మబలమే
సర్వబలము.
7
▾
Meaning
Keep
శాఖాసంప్రదాయములుండుటలో
తప్పులేదు
గాని
వైరము
ఉండరాదు
జాతి
అభ్యుదయము
సాధించవలెనన్నచో
మనకు
గల
పారమార్థిక
శక్తులనన్నింటిని
వెదకి,
సేకరించుట
అత్యావశ్యకమని
గ్రహించవలెను.
ప్రాచీనకాలమున
ఇదే
జరిగెను.
భావికాలమున
కూడా
సర్వదా
ఇట్లే
జరుగవలసి
యుండును.
జాతి
సమైక్యత,
అనగా
చెల్లాచెదరై
పడియుండు
పారమార్థిక
భావముల
నన్నింటినీ
ప్రోగుచేయుట
భారతీయ
మతములోగల
ప్రత్యేకమైన
లక్షణమే,
మన
మతమునకు
ఆధారభూతములు.
అవి
ఆకసమువలె
విశాలమూ,
ప్రకృతివలె
శాశ్వతమూ
అయినట్టివి.
శాఖాసాంప్రదాయములు
ఉండుటలో
తప్పు
లేదు.
కానీ,
శాఖావైరములు
మాత్రము
ఉండరాదు.
శాఖావైరములచే
లోకము
నాశనము
కాగలదు.
8
▾
Meaning
Keep
ఏకం
సత్
విప్రాః
బహుధా
వదంతి
ఉన్న
వస్తువు
ఒక్కటే,
కాని
ప్రాజ్ఞులు
అనేక
విధముల
వర్ణించిరి.
ఈశ్వరుడు
ఎట్టివాడు?
అను
విషయమున
మనకు
భావ
భేదములు
ఉండవచ్చును.
మానవ
లక్షణోపేతుడగు
ఈశ్వరుని
ఒకరు
నమ్మవచ్చును.
మరొకరు
మానవలక్షణ
రహితుడయ్యునూ,
మూర్తిత్వముగల
ఈశ్వరుని
నమ్మవచ్చును.
ఇంకొకడు
కేవలము
నిరాకారుడయిన
ఈశ్వరుని
నమ్మవచ్చును.
వీరందరి
భావములకు
వేదములలో
ప్రమాణము
లభించుచున్నది.
అయితే,
మనందరికీ
ఈశ్వర
విశ్వాసమున్నది.
అనగా,
ఒక
అద్భుతశక్తి
గలదనీ,
సర్వమూ
అందు
నుండి
ఉత్పన్నమయి,
సర్వమూ
అందే
నిలచినదనీ,
సర్వమూ
అందే
లయమగుచున్నదనీ
–
ఇదే
వేద
ప్రమాణము.
Previous
←
“Adhyātmavidyā vidyānām”
Next
The aim of Vidyā is to attain purity and perfection
→