Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Vidyā Vāhini · The aim of Vidyā is to attain purity and perfection
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
14.
పరిశుద్ధత,
పరిపూర్ణతలను
సాధించుటే
విద్య
లక్ష్యము
నీవు
బోధించు
ఈశ్వరుడు
ఎట్టివాడైననూ
కానిమ్ము,
అది
అప్రధానము.
ఆ
భేదభావములను
గూర్చి
మనకు
వివాదము
వలదు.
ఈశ్వరుని
గురించి
బోధించిన
చాలును.
2
▾
Meaning
Keep
‘ఈ
జగత్తు
కొన్ని
వేల
సంవత్సరముల
క్రిందనే
కల్పించబడినదనియు,
యెప్పుడో
ఒకనాడు
అది
శాశ్వతముగా
అంతరించుననియూ’,
ఇతరులు
విశ్వసించినట్లు
భారతీయులు
విశ్వసించరు.
‘జీవాత్మయు,
జగత్తునూ
శూన్యములో
నుండే
పుట్టింపబడినదనుటయు’
భారతీయులు
విశ్వసించరు.
ప్రకృతి
ఆద్యంతరహితమయినది.
అది
సూక్ష్మరూపము
ధరించి
యుండును.
ఉన్నది
అది
పూర్ణమే
కానీ,
శూన్యము
కాదు.
పూర్ణము
కనుపించకుండినంత
మాత్రమున
శూన్యమని
చెప్పుట
విజ్ఞుల
లక్షణము
కాదు.
3
▾
Meaning
Keep
ఆత్మకు
ఆద్యంతములు,
మరణములు
లేవని
భారతీయుల
విశ్వాసము
మానవుడు
కేవలము
‘స్థూలశరీరమాత్రుడు’
మాత్రమే
కాడనియు,
ఈ
స్థూలశరీరములో
మనస్సనే
‘సూక్ష్మశరీరము’
ఒకటి
కలదనియూ,
దాని
లోపల
అంతకన్నా
మహితమైన
మరొక
వస్తువు
ఇంకొక
శరీరము
మార్పులు
చెందక
ఉండుననియూ,
‘జీవాత్మ’
అనునది
కూడా
ఉన్నదనియు,
దానికి
ఆద్యంతములు
లేవనియూ,
ఇది
మరణమను
మాటనే
ఎరుగదనియూ,
భారతీయుల
విశ్వాసము,
వేద
ప్రమాణము.
ఆరాధన
కాలమందు
మనము
కన్నులు
మూసుకొని
ఈశ్వరుని,
ఊర్ధ్వముఖులమై
మన
లోపల
కనుగొన
యత్నింతుము.
ఇతర
జాతుల
వారు
తమ
తమ
గ్రంథములు
ఈశ్వర
ప్రేరితులచే
వ్రాయబడినవని
వారి
నమ్మకము.
అయితే,
భారతీయులు
వేదములు
ఈశ్వరుని
నుండియే
ఆవిర్భవించినవనియూ,
ఋషుల
హృదయముల
ద్వారా
వచ్చినవనియూ
నమ్ముదురు.
4
▾
Meaning
Keep
ఆత్మ
విశ్వాసము
మానవునకు
అత్యవసరము
విద్యార్థులారా!
‘తాను
తుచ్ఛుడ’నని
రేయింబగలు
తలంచుచుండువాడు
దేనినీ
సాధించలేడు.
తాను
నిర్భాగ్యుడననీ,
అధముడననీ
తలంచువాడు
నిర్భాగ్యుడే
అగును.
అధముడే
అగును.
అట్లుకాక
“నేను
ఈశ్వరాంశమును,
నాలో
దైవత్వమున్నది”,
అని
తలంచిన
నీవు
నిజముగా
దైవమే
కాగలవు.
నీవు
సర్వశక్తి
సంపన్నుడవే
కాగలవు.
“యద్భావం
తద్భవతి”.
మన
భావమే
అన్నింటికీ
ఆధారము.
5
▾
Meaning
Keep
ఆత్మవిశ్వాసము
మానవునకు
అత్యవసరము.
అది
లేకపోవుట
చేతనే
మానవుడు
దానవునిగా
మారుచున్నాడు.
దౌర్బల్యునిగా
దిగజారిపోతున్నాడు.
పూర్వీకులు
ఆత్మవిశ్వాసము
చేతనే
సర్వమును
పొందిరి.
సమస్త
క్షేమములకు,
సమస్త
ఆనందములకు
మూలము
ఆత్మవిశ్వాసమే.
ఆ
విశ్వాసము
కోల్పోయిన
పతనమైపోవును.
విశ్వాసమే
మన
శ్వాస.
శ్వాస
లేకపోయిన,
మనము
శవముతో
సమానము.
శ్వాస
ఉండెనా,
శివముతో
సమానులము.
విశ్వాసమే
మన
శివత్వం,
సర్వశక్తి
సంపన్నత.
అది
పరిపూర్ణమైయుండును.
ఆత్మ
స్వతస్సిద్ధముగానే
పరిపూర్ణము.
అది
సిద్ధించుటకు
వేరు
సాధన
అక్కరలేదు.
ఆత్మవిశ్వాసమొక్కటున్న
చాలును.
6
▾
Meaning
Keep
‘పరిశుద్ధము’
కూడా
మనకు
స్వాభావికమే.
‘పరిపూర్ణత’
ఆత్మస్వాభావికమే.
అపరిశుద్ధత,
అపరిపూర్ణత
మనకు,
అనగా,
మానవులకు
అస్వాభావికము.
ఈ
విషయము
విద్యార్థులు
మరువరాదు.
ఈ
పరిశుద్ధతను,
పరిపూర్ణతను
తెలుసుకొని
ప్రవర్తించుటే
సరియైన
విద్యావిధానము,
విద్యా
విలక్షణము.
7
▾
Meaning
Keep
భారతీయులకు
మతమనగా
ఒక
దివ్యమైన
అనుభూతి
అన్నిటికన్నా
మనము
జ్ఞప్తియందుంచుకొనవలసినది
మరొకటి
కలదు.
భారతీయులకు
మతమనగా
‘అనుభూతి’గానీ,
అందుకు
కొరవడినదేదియూ
కాదు.
స్వయంకృషి
వలన
గానీ,
యేదీ
సిద్ధింపదని
మన
నమ్మకము.
ఈశ్వరకృప
కూడను
స్వయంకృషికి
తోడు
కావలెను.
మత
భావములను
అనుభూతము
చేసుకోవలెను.
మత
భావములను
చిలుకలవలె
పలుకనేర్చిన
చాలదు.
8
▾
Meaning
Keep
అన్నింటికన్నా
మొదట
‘సత్యము’ను
గ్రహించవలెను.
దానిని
మనము
ఎంత
చక్కగా
గ్రహించిన,
అంత
త్వరగా
మత
కలహములు
గానీ,
శాఖాభేదములుగానీ
తరిగిపోవును.
పరాత్పరుడు
సమీప
వస్తువులన్నింటిలో
అత్యంత
సమీపుడు;
దూరపు
వస్తువులన్నింటిలో
అత్యంత
దూరపు
వస్తువు.
ఆ
తత్త్వమును
గుర్తించినగానీ
అట్టివారి
హృదయ
గ్రంథులు
విచ్ఛిన్నములు
కావు.
9
▾
Meaning
Keep
పాశ్చాత్యభాషలో
మానవుడు
విడనాడునది
జీవుని.
భారతీయుల
భాషలో
మానవుడు
విడనాడునది
‘శరీరమును’.
పాశ్చాత్యులు
తామొక
శరీరము
అనియు,
తమకొక
ఆత్మ
కలదనియు
తలంతురు.
భారతీయులు
అట్లుకాక,
మానవుడు
ఆత్మస్వరూపుడనియు,
తనకొక
శరీరమున్నదనియూ
తలంతురు.
రెండింటికీ
అపారభేదము.
కావున,
భౌతిక
సుఖమను
ఇసుక
పునాదులపై
నిర్మింపబడిన
నాగరికతలన్నియూ,
కొలదికాలము
మాత్రమే
నిలచి
తదుపరి
అదృశ్యమగును.
10
▾
Meaning
Keep
అనుకరణ
నాగరికత
కాదు
విద్యార్థులారా!
అనుకరణ
నాగరికత
కానేకాదు.
నీవు
ఒక
ప్రభువు
వేషము
ధరించవచ్చును.
కానీ,
అంతమాత్రమున
నీవు
ప్రభువువగుదువా?
గాడిదకు
పులిచర్మము
కప్పినంత
మాత్రాన
పులి
అగునా?
అనుకరణ,
పిరికితనమునకు
చిహ్నము.
ఇది
పురోగమన
సాధనము
కాదు.
నిజముగా,
అది
మానవుని
భయంకర
రూపమగు
అధోగతికి
సోపాన
సూచన.
మానవుడు
తన్నుతాను
దూషించుకొన
ప్రయత్నించెనేని,
అట్టివాడు
కోలుకోలేడు.
భారతజాతిలో
నేనొకడనని
గర్వించవలెను.
మన
పూర్వీకులకై
గర్వించవలెను.
నేను
పూర్తి
భారతీయుడనని
సగర్వంగా
చెప్పుకొనుటయే
నిజమైన
సాహసము.
11
▾
Meaning
Keep
శ్రేయస్కరమగు
దానిని
ఇతరులవద్ద
అభ్యసింపుము
ఇతరులను
అనుకరింపవలదు
కానీ,
వారిలో
గుణములను
గ్రహింపుము.
మనము
ఇతరులవద్ద
కొన్ని
గుణములు
నేర్చుకొనవలసియుండును.
మనము
భూమిలో
విత్తనములనుంతుము.
దానికి
వలయు
మట్టిని,
గాలిని,
నీటిని
దానికి
సమకూర్తుము.
ఆ
విత్తనము
మొక్క
అయిన
పిదప
మహావృక్షముగా
మారును.
అపుడు
అది
మట్టిగా
గాని,
గాలిగా
గానీ,
నీరుగా
గానీ
అగునా?
తనకు
సమకూర్పబడిన
దానిని
గ్రహించి,
అది
తన
స్వధర్మానుసారమగు
గొప్ప
వృక్షముగా
అగును.
మీరునూ
అట్లనే
ప్రవర్తింతురు
గాక!
మనము
ఇతరుల
వద్ద
నుండి
నేర్చుకొనవలసినదెంతయో
ఉన్నది.
పరావిద్యను
హీనకులజుడనైనను
సేవించి
గ్రహింపుము.
శ్రేయస్కరమగు
దానిని
ఇతరుల
యొద్ద
అభ్యసింపుము.
దానిని
నీ
స్వధర్మానుసారంగా
నీలో
ఇముడ్చుకొనుము.
అంతేకానీ,
ఇతరులుగా
మారరాదు.
ఇది
మనుస్మృతి.
దీనినే
విద్యార్థులు
నేర్వవలసినది.
‘ప్రథమ
విద్య’
ఇదే.
‘ప్రధాన
విద్య’
ఇదే.
Previous
←
The heart must be immersed in God, the hand in work
Next
Vidyā is what teaches sacrifice, simplicity and generosity
→