Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Vidyā Vāhini · Vidyā is what teaches sacrifice, simplicity and generosity
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
15.
త్యాగ,
నిరాడంబరత,
ఉదారతలను
నేర్పునదే
విద్య
పరోపకారబుద్ధి
విద్యలలో
ప్రధానసూత్రము
కోటి
విద్యలను
నేర్చినను,
త్యాగబుద్ధి
ఒక్కటి
లేకున్న,
నేర్చిన
విద్యలన్నియూ
నిష్ప్రయోజనము.
పరోపకారబుద్ధి,
విద్యలో
ప్రధాన
సూత్రము.
పరోపకారబుద్ధి,
శ్రేష్ఠమైన
విద్య.
ఇతరులకు
ఉపకారము
చేయునపుడు,
స్వార్థము,
సంకుచిత
భావము
మనస్సున
ఏమాత్రమూ
ఉండరాదు.
అంతేకాదు,
ఉపకారభావముతో
ప్రతిఫలమును
ఆశించరాదు.
ఎట్టి
ఫలాపేక్ష
లేక
పరోపకారమను
ప్రధాన
యజ్ఞమును
దృష్టియందుంచుకొనవలెను.
2
▾
Meaning
Keep
చెట్లు
తమ
ఫలములను
తాము
ఎట్లు
ఆరగించవో,
తమ
ఫలములను
త్యాగభావమున
పరులకు
ఎట్లు
అందించుచున్నవో,
నదులు
పరోపకార
భావముతో
తమ
జలమును
తాము
గ్రోలక,
ఇతరుల
తాపమును
ఎట్లు
చల్లార్చుచున్నవో;
ఆవులు
తమపాలను
తమ
బిడ్డలకై
యేర్పడినవైననూ,
పరోపకారభావముతో
పరులకు
ఏ
రీతిగా
పంచిపెట్టుచున్నవో,
అదే
విధముగా
విద్యావంతుడు
తాను
ఆర్జించిన
విద్యను
పరోపకార
చిత్తముతో,
స్వార్థత్యాగముతో
ఇతరులకు
అందించి,
తన
సేవలను
ఇతరుల
నిమిత్తమై
ఆచరించినప్పుడే,
మానవుడు
‘సజ్జనుడను’
నామమును
సార్థకము
చేసుకొనును.
3
▾
Meaning
Keep
సరియైన
విద్యావంతునకు
స్వార్థమన్నది
ఆలోచనలోనే
రాకూడదు;
ఎట్టి
సమయమునందునూ
రారాదు.
అయితే
దురదృష్టవశాత్తు
ఈనాడు
విద్యావంతులకే
మితిమీరిన
స్వార్థము
ప్రవేశించి,
తమతమ
గతులనూ,
మతులనూ
పెడమార్గమును
పట్టించుకొనుచున్నారు.
తమకు,
తమ
వారలకే
విద్య
యొక్క
ప్రాముఖ్యతను
సంకుచితముగా
ఉపయోగించుకొనుచున్నారు.
అందువలన,
వారు
సజ్జనులలో
స్థానమును
సంపాదించుకోలేకపోతున్నారు.
తాము
సంపాదించుకొన్న
విద్యాసంపదను,
ఉదారంగా
పరులకు
దానం
చేయవలెను.
లేకపోతే
మానవజాతి
మనుగడకే
ప్రమాదము.
మానవాభ్యున్నతికి
పరోపకారమను
పవిత్రభావమును,
పవిత్రబుద్ధిని
అలవరచుకొనవలెను.
4
▾
Meaning
Keep
నరనారాయణుల
తత్త్వమును
గుర్తించుకోలేనివాడు
విద్యావంతుడు
కాదు
“మానవ
సేవే
మాధవ
సేవ”
అని
చిలుక
పలుకులు
పలకడం,
మానవులంటే
యెవరో
అసలు
విచారించనైననూ
విచారించక,
తమ
పొట్టలను
పెంచుకోవటం
కోసం,
తమ
వారిని
అభివృద్ధిలోనికి
తెచ్చుకోవటం
అనే
సంకుచిత
చిత్తులై
విద్య
యొక్క
విలువను
వృథా
చేయుచున్నారు.
5
▾
Meaning
Keep
“ఈశ్వరుడు
సర్వభూతములందూ
సాక్షాత్
స్వరూపుడై
యున్నాడ”న్న
సత్యాన్ని
విస్మరించుచున్నాడు
మానవుడు.
ఎవరికి
ఉపకారము
చేసినా,
అది
ఈశ్వరసేవగా
భావించుట
విద్యావంతునకు
ప్రధాన
లక్ష్యమయి
ఉండాలి.
6
▾
Meaning
Keep
నరుడే
నారాయణుడు.
సమస్త
కర్మలు
‘నారాయణసేవ’గా
భావించాలి.
అసలు
‘నారాయణు’డంటే
యేమో,
‘నరుడం’టే
యేమో
ఈనాటి
విద్యార్థికి
తెలియదు.
‘నరనారాయణుల
తత్త్వాన్ని’
గుర్తించుకోలేని
వాడు
విద్యావంతుడే
కాడు.
ఈ
రెండూ
ఉపనిషత్
వాక్యములోని
“తత్”,
“త్వం”
అను
పదార్థముల
అర్థములే.
ఈ
రెంటినీ
గుర్తించనివాడు
తనను
తాను
తెలిసికొననివాడే
అగును.
తనను
తాను
తెలిసికొనని
విద్య,
ఇక
దేనిని
తెలిసికొని
ప్రయోజనమేమి?
దురదృష్టవశాత్తు
ఉపకారము
చేయకపోయిననూ
విద్యావంతులు
ఈనాడు
అపకారములు
కావలసినన్ని
సలుపుచున్నారు.
ఇది
మరింత
విచిత్రము.
7
▾
Meaning
Keep
ఇంగిత
జ్ఞానమును,
విచక్షణాతత్త్వమును
ఉపదేశించునదే
విద్య
నిజమైన
విద్యార్థి
తనకు
ఉపకారము
చేసిన
వానికే
కాక,
తనకు
అపకారము
చేసిన
వానికే
అధిక
ఉపకారము
చేయవలెను.
ఇది
మరింత
పవిత్రము.
ఉపకారము
చేసిన
వానికి
ఉపకారము
చేయుట
సామాన్యము.
అపకారము
చేసిన
వానికి
ఉపకారము
చేయుటే
గొప్ప
గుణము.
ఈ
విషయమున
కొంత
ఇంగితజ్ఞానము,
విచక్షణా
బుద్ధి
అత్యవసరము.
అట్టి
ఇంగిత
జ్ఞానమును,
విచక్షణా
తత్త్వమును
ఉపదేశించునదే
విద్య.
కొన్ని
సమయములందు
మూర్ఖుల
విషయములో
తప్పనిసరిగా
విచక్షణ
చూపించాలి.
చేసిన
మేలు
మరచిన
కృతఘ్నుల
విషయములో
విజ్ఞతను
ప్రదర్శించాలి.
అపకారము
చేసిన
వారిని
దండించడం
ప్రభుత్వము
యొక్క
ధర్మము.
అయితే,
విద్యార్థి
ఆ
స్థాయిని
అందుకొనరాదు.
తన
సహజ
త్యాగమును,
స్వభావమునూ
అయిన
పరోపకార
భావమునే
అధికంగా
అలవరచుకోవాలి.
8
▾
Meaning
Keep
మాతృభూమిని
రక్షించుకోవడం,
ఉత్తమ
ధర్మము.
ప్రతి
విద్యార్థి
ప్రాథమిక
కర్తవ్యాన్ని
కూడానూ
గుర్తించాలి.
కనుక,
ఆయా
పరిస్థితులను
బట్టి
ఉత్తమ
ధర్మమేదో,
తక్షణ
కర్తవ్యమేదో
వివేకంతో
నిర్ణయించుకోవాలి.
విద్యార్థికి
ఆ
మాత్రము
నిర్ణయశక్తి
లేకుండిన,
అతను
విద్యావంతుడే
కాదు.
9
▾
Meaning
Keep
విశ్వశ్రేయస్సులోనే
వ్యక్తి
శ్రేయస్సు
ఇమిడియున్నది
విద్యావంతుడు
లేక
విద్యార్థి
నిరాడంబరత్వమును
కలిగియుండవలెను.
ఆడంబరముతో
నిజముగా
మన
వ్యక్తిత్వాన్ని
మనము
కోల్పోతున్నాము.
ఈ
విషయాన్ని
విద్యార్థి
చక్కగా
గుర్తించాలి.
ఏ
వ్యక్తి
అయిననూ,
అనగా
సకల
శాస్త్రసంపన్నుడైననూ,
గొప్ప
మేధావి
అయిననూ,
వినయవిధేయతలు
కోల్పోయినట్టి
వారు
మేధావులలో,
పండితులలో
లెక్కకు
రారు.
అట్టివారిని
సమాజము
కూడా
గౌరవించదు.
తాత్కాలికంగా
గౌరవించినా,
లోలోన
వారి
గౌరవము
దిగజారును.
అది
రాణించదు.
నిరాడంబరమే
గౌరవమును
అందించును.
అది
శాశ్వతస్థాయికి
తీసుకొనిపోవును.
చిచ్చుబుడ్డివలె
అప్పటికప్పుడు
గౌరవమును
సంపాదించిన,
మరుక్షణమే
అపనిందలకు
గురికావలసి
వచ్చును.
నిరాడంబరము
శాశ్వత
గౌరవమును
చేకూర్చును.
త్యాగ,
నిరాడంబర,
ఉదార
స్వభావములను
నేర్పునదే
విద్య.
10
▾
Meaning
Keep
కొంత
విద్యను
నేర్చినంతనే
తలతిరుగుతుంది
కొంతమందికి.
అలాంటి
వారు
డాబుసరి
కబుర్లు
చెప్పుకొంటూ,
అన్నీ
తెలిసినవారివలె
తిరుగుతుంటారు.
అన్నింటినీ
అభినయం
చేస్తారు.
11
▾
Meaning
Keep
“అన్నీ
వడ్డించిన
విస్తరి
అణగిమణగి
ఉంటుంది,
ఏమీ
లేని
విస్తరి
యెగిరి,
యెగిరి
దూకును”
అన్న
లోకోక్తిని
బట్టి,
అన్ని
హంగులు,
సమర్థత
ఉన్న
వ్యక్తి
నిరాడంబరముగానే
జీవిస్తాడు.
ఏ
శక్తీలేక,
విద్య
యొక్క
తత్త్వమేమో
యెరుగని
వ్యక్తి
ఆడంబరంగా
జీవితాన్ని
గడుపుతాడు.
అంతేకాదు,
తన
లోటును
బహిర్గతం
కానివ్వకుండా
బ్రతకాలని
తాపత్రయపడును.
చివరకు
ఫలము
శూన్యము.
రెంటికి
చెడిన
రేవడి
అవుతాడు.
తనకు
తాను
ఆనందమును
అనుభవించక,
పరులనూ
ఆనందపెట్టక
హాస్యాస్పదములకు
గురి
అవును.
12
▾
Meaning
Keep
కాన,
ఆడంబరాలకు
అవకాశమివ్వక,
అహంకారాన్ని
దరిజేరనియ్యక,
వినయ,
విధేయుడై
విహరించినవాడే
విశ్వశ్రేయస్సును
కోరినవాడగుతాడు.
“విశ్వశ్రేయస్సే
వ్యక్తి
శ్రేయస్స”ని
అనుకొని
బాగుపడినపుడే
దేశము
బాగుపడుతుంది.
నిజమైన
విద్యార్థి
విశ్వశ్రేయస్సును
లక్ష్యమందుంచుకొని
నిరాడంబరంతో
పరోపకార
దీక్షను
పూనాలి.
ఇదే
సరియైన
విద్య.
Previous
←
The aim of Vidyā is to attain purity and perfection
Next
The marks of the ideal student
→