Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Vidyā Vāhini · The marks of the ideal student
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
16.
ఆదర్శ
విద్యార్థి
లక్షణములు
సమదృష్టి
శుభదృష్టి
విద్యార్థి
సమస్త
ప్రాణికోటి
యందు
దయ,
కరుణ,
ప్రేమలు
కలిగియుండాలి.
‘భూతదయ’
విద్యార్థికి
రెండవ
గుణము.
ఈ
గుణము
లేకున్న
అవిద్యావంతుడగును.
‘భూతదయ’యే
విద్య
యొక్క
ప్రధాన
అర్థము.
ఈ
అర్థముతోనే
వర్తించాలి.
జీవరాసుల
యందు
ద్వేషము
కలిగియుండిన,
అట్టి
విద్యకు
అర్థము
లేదు.
గీతలో
“అద్వేష్టా
సర్వభూతానాం”
అన్న
దానికి
ఇదే
అర్థము.
“సర్వజీవ
తిరస్కారం
కేశవం
ప్రతిగచ్ఛతి”.
ఏ
జీవిని
తిరస్కరించినా,
బాధించినా,
భగవంతుని
తిరస్కరించినట్లే,
భగవంతుని
బాధించినట్లే
అని
గీత
పదే
పదే
ఉపదేశించుచున్నది.
ప్రేమ,
దయ
అను
దైవగుణములు,
కేవలము
మానవుల
వరకే
పరిమితం
చేయక
సమస్త
ప్రాణికోటి
యందు
విస్తరింపజేయాలి.
2
▾
Meaning
Keep
“విద్యా
వినయ
సంపన్నే
బ్రాహ్మణే
గవి
హస్తిని,
శునిచైవ
శ్వపాకేచ
పండితాః
సమదర్శినః”
అనగా
విద్యా
వినయములు
కలిగిన
విద్యావంతుడు
గోవునందును,
బ్రాహ్మణులయందును,
ఏనుగునందును,
కుక్కయందును,
నీచాతినీచ
స్థితి
యందున్న
వ్యక్తియందును
సమదృష్టి
కలిగియుండాలని
పై
శ్లోకమునకు
అర్థముగా
యెరిగి
సమస్త
ప్రాణికోటి
యందునూ
దయా,
ప్రేమలు
చూపవలెను.
సమదృష్టే
శుభదృష్టి.
అట్టి
శుభదృష్టి
కలవాడే
నిజమైన
విద్యావంతుడు.
సమదృష్టి
కలవాడు
విద్యావంతుడు.
సంఘ
దృష్టిని
దూరము
చేయాలి.
ఇటువంటి
అత్యున్నత
తత్త్వమునే
భారతీయ
సంస్కృతి
ప్రబోధించినది.
ఇంతటి
ఉన్నత
బోధ
మరే
విద్యయందునూ,
ఏ
దేశమునందునూ
కనుపించదు.
భారతీయ
విద్య
విశాలమైన,
ఉత్కృష్టమైన
ఆదర్శమును
ప్రబోధించుచున్నది.
ఈనాడు
అట్టి
ఉత్కృష్ట
భావమును
వీడి,
సంకుచిత
విద్యలను
నేర్చి,
సమాజమునే
కలుషితము
గావించుచున్న
విద్యావిధానము
దేశమునకే
ప్రమాదము.
కాన,
విద్యావిధానములో
విశిష్టమైన
మార్పులు
రావాలి.
ఇది
గ్రంథము
ద్వారా
లభించే
విషయము
కాదు.
సంఘ
జీవితములో
నేర్వవలసినవే.
మానవునకూ
మానవునకూ
మధ్యనున్న
సంబంధ
బాంధవ్యముతో
తెలుసుకొనవలసినదే
కానీ
వ్రాతకోతలతో
లభించేవి
కావు.
3
▾
Meaning
Keep
సమాజశ్రేయస్సే
ఉత్తమోత్తమమైన
ధర్మము
ప్రతి
విద్యార్థి
ప్రతి
సందర్భములో
ఉత్తమ
ధర్మమేదో,
ఉత్తమ
ప్రవర్తనమేదో
విజ్ఞతతో
నిర్ణయించుకొని
సమాజాభివృద్ధికి
అవసరమయ్యే
విధంగా
ప్రవర్తించాలి.
ఏ
కారణము
లేకుండా,
యేదో
ఒక
సాకు
చూపించి,
ప్రాణులను
మాత్రము
హింసించరాదు.
లోకములో
అన్నింటికంటే
ఉత్తమ
ధర్మము
సమాజశ్రేయస్సు.
దానిని
దృష్టిలో
ఉంచుకొని
అన్యాయంగా,
అక్రమంగా
అనాచారమునకు
దారి
తీయరాదు,
స్వలాభమునకు
గురికారాదు.
4
▾
Meaning
Keep
విద్యార్థులు
ముఖ్యముగా
నేర్చుకొనవలసినది
మరొకటి.
అదే
శుభ్రత.
ఇది
రెండు
రకములు.
ఒకటి
బాహ్య
శుభ్రత,
రెండవది
అంతః
శుభ్రత.
వీటిలో
ఏ
ఒకటి
లోపించినా,
ఆ
వ్యక్తి
యెందుకూ
పనికిరాడు.
శరీరముపై
ధరించు
వస్త్రములు,
చదువుకొను
పుస్తకములు
మరియు
పరిసర
ప్రాంతములు,
ఇవన్నియూ
బాహ్యశుభ్రత
అనబడును.
అనగా,
లోకరీతిగా
మన
నిత్య
జీవితమునకు
సంబంధించిన
ప్రతి
వస్తువును
శుభ్రముగా
పెట్టుకోవాలి.
పండ్లు,
కండ్లు
మొదలుకొని
తిండ్లు,
బండ్లు
వరకూ
శుభ్రతను
పాటించాలి.
దీని
వలన
ఆరోగ్యము
ఏర్పడును.
శరీరమును
నిత్యమూ
తోమి
స్నానమాచరించకున్న
దేహములో
మురికి
యేర్పడి
దురదలు
ప్రారంభము
కావచ్చును.
కొన్ని
పుండ్లు
బయలుదేరవచ్చును.
ఇవి
అంటువ్యాధులుగా
మారవచ్చును.
మన
స్థితి
హీనముగా
ఉండవచ్చును.
ఒకటి,
రెండు
డ్రస్సులు
మాత్రమే
మనకు
ప్రాప్తించియుండవచ్చును.
వాటినైనా
శుభ్రంగా
పెట్టుకొనవలెను.
మురికి
చేరకుండా
చూచుకోవలెను.
అటులనే
మనము
నిత్యమూ
చదివే
పుస్తకాలు
కూడా
యెక్కడంటే
అక్కడ
పారవేయరాదు.
దానిలో
అనవసరమైన
గీతలు
గీయరాదు.
వ్రాతయినా
వ్రాయరాదు.
కాగితమును
కూడా
పరిశుభ్రపరచుకొనవలెను.
వాటి
శుభ్రత
పదిమందీ
మెచ్చుకొను
రీతిగా
ఉండాలి.
దుర్గంధమును
చేర్చుకోరాదు.
సర్వుల
ప్రేమకు
పాత్రులు
కావలెను.
తాను
నివసించు
పరిసరములను
ఊడ్చి,
తన
గదిని
తాను
శుభ్రంగా
పెట్టుకొనవలెను.
గది
యందు
అసభ్యమైన
చిత్రములను
వ్రేలాడదీయరాదు.
ఆదర్శము,
ఉత్తమ
భావములను
అందించే
చిత్రములనే
తన
గదిలో
వేసుకొనవలెను.
5
▾
Meaning
Keep
ఎంత
సంపద
ఉన్నప్పటికినీ,
ఆరోగ్యము
గనుక
సరిగా
లేకపోయినచో
జీవితమున
సుఖముండదు,
సంపదను
తనివి
తీరా
అనుభవించలేడు.
తింటే
ఆయాసం,
తినకపోతే
నీరసం.
అంతకన్నా
సుఖమేమాత్రమూ
ఉండదు.
కనుక,
బాహ్యశుభ్రత
జీవితమును
ఆనందముగా
అనుభవింపజేయును.
6
▾
Meaning
Keep
మనస్సు
మలినమైతే
భావాలునూ
మలినమే
అగును
ఇక
అంతః
శుభ్రత
అనగా
లోపలనున్న
మనస్సును,
బుద్ధిని
కూడా
ప్రశాంతంగా,
పవిత్రంగా
ఉంచుకొనవలెను.
భావములు
అపవిత్రము,
అశాంతి
సంబంధమైనవే
అయిన,
తాను
శాంతిని
అనుభవించలేడు.
సౌఖ్యమును
అందుకోలేడు.
మనసు
మలినమైతే,
భావాలు
మలినమే
అగును.
మనసు
కలుషితము
కాకుండా
చేసుకొనుటకు
ఎదుటివారి
పరిస్థితులను,
ప్రవర్తనలను
చక్కగా,
వివేకంగా
విచారించి
సక్రమమైన
మార్గాన్ని
నిర్ణయించుకొన
వలసియుండును.
తొందరపాటు
కానీ,
అనుకరణకానీ
మంచిదికాదు.
విజ్ఞతతో,
విచారణతో
మన
హృదయనిర్ణయాన్ని
మనము
చూడాలికానీ,
ఏదో
యెదుటివాడు
అందముగా
తలంచుచున్నాడు
కదా
అని
మనము
కూడా
దానిని
అనుసరించరాదు.
అనుకరణ
నీచమైనది,
బలహీనమైనది.
అజ్ఞానముతో
కూడినది.
అవిద్యా
ప్రభావమైనది.
అది
గొఱ్ఱె
లక్షణము.
మానవులుగా
పుట్టి
విద్యావంతుడుగా
చెలామణి
అవుతూ,
గొఱ్ఱె
మాదిరి
పరుల
మనసును
అనుసరించుట
కానీ,
పరుల
మాటలు
విని
కానీ,
మన
మనసులను
మాలిన్యము
చేసుకోరాదు.
అనేకము
వ్యక్తిగతమైన
విషయములుగా
ఉండవచ్చును.
లేక
పరస్పర
ద్వేషభావములతో
కూడియుండవచ్చును.
అలాంటి
ఇతరుల
భావాలను
మనమెందుకు
అనుసరించవలెను?
మన
భావాలు,
పరుల
భావాలతో
జంట
చేయరాదు.
మన
పవిత్రతను,
మన
విశ్వాసమును,
మన
అనుభవమును
మనము
విడనాడరాదు.
నమ్మకమునకు
కారణములుండవు.
అవి
వారివారి
భావములతో
చేరియుండును.
క్రోధ,
ద్వేష,
అసూయాదులతో
దుర్మార్గమునకు
గురికారాదు.
విద్యార్థులకు
విశాలమైన
భావములు
ఉండవలెను.
కృతజ్ఞత
తత్త్వములు
చేరవలెను.
అప్పుడే
అట్టివారు
ఉత్తమాధిపత్యమునకు
అధికారి
కాగలరు.
అట్టివారినే
సమాజము
కూడ
గౌరవించును.
స్వార్థభావాలు,
సంకుచిత
భావాలు
ప్రక్కకు
నెట్టవలెను.
Previous
←
Vidyā is what teaches sacrifice, simplicity and generosity
Next
The student must be sumati, of good mind, not durmati, of bad mind
→