Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Vidyā Vāhini · The student must be sumati, of good mind, not durmati, of bad mind
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
17.
విద్యార్థి
సుమతి
కావాలి,
దుర్మతి
కారాదు
అసూయాద్వేషములు
మానవుని
వినాశనమునకు
దారితీయును
సమస్త
అశాంతులకు,
కష్టములకూ
మూలకారణము
‘అసూయ’.
గీతయందు
కూడా
“అర్జునా!
నీవు
అనసూయుడు
కావలెను
కానీ
అసూయాపరుడు
కారాదు”
అని
పదేపదే
ఉపదేశించెను
శ్రీకృష్ణుడు.
ఈ
‘అసూయ’తో
పాటు
‘ద్వేషము’.
ఈ
రెండూ
తోడుదొంగలు.
ఈ
రెండు
గుణములు
విషపురుగులవంటివి.
లేక
వేరుపురుగులవంటివి.
ఎంతో
ఫలపుష్పాలతో
శోభిల్లుచున్న
వృక్షమునకు
వేరుపురుగు
కుదుట్లో
చేరిన,
ఆ
చెట్టు
ఏమైపోవును?
చూచుచుండగనే
దినదినమునకు
వాడి,
ఫలపుష్పాలు
రాలి,
నిర్జీవమైపోవును.
కడకు
ఎండి
నేలకూలును.
అదే
విధముగా
అసూయ,
ద్వేషములు
మానవుని
హృదయమున
చేరెనా,
ఎంతటి
తెలివితేటలు
కలవాడైనా,
ఎంతటి
ఉన్నత
విద్యనభ్యసించినవాడైనా,
పతనమై,
సమాజ
ద్రోహియై,
సంపూర్ణ
మానవత్వమునే
కోల్పోయి,
విమర్శలకు
గురియగును.
వ్యక్తిత్వమునే
నాశనము
చేసుకొని,
కడకు
తన
మిత్రులు
కూడా
శత్రువులుగా
మారి,
గౌరవమర్యాదలనే
మంటగలుపుకొని,
అనేక
దుఃఖములు
అనుభవించును.
‘ఈర్ష్య’కంటే
పరమశత్రువు
మరొకటిలేదు.
తనకంటే
బలవంతుని
చూచో,
లేక
తనకంటే
అధిక
తెలివితేటలు
గలవానిని
చూచో,
ఇంకా
తనకంటే
మంచి
పేరుప్రతిష్ఠలను
అందుకొనువానిని
చూచో
లేక
తనకంటే
మంచి
దుస్తులు
ధరించి
అందముగా
వున్నవానిని
చూచో
ఓర్వలేక
పోవడము,
అంతటితో
మానక
వాని
పతనాన్ని
కోరడం,
గౌరవానికి
హాని
చేయటం,
ఇత్యాది
అవగుణములు,
అవలక్షణములు
విద్యార్థికి
లేక
విద్యావంతునకు
తగిన
సుగుణములు
కావు.
2
▾
Meaning
Keep
విశాలభావములు,
తలంపులను
పెంచుకోవాలి
ఇతరుల
మంచిని
చూచి,
గౌరవమును
చూచి,
గుణగణములను
చూచి,
ఆదర్శములను
చూచి,
ఆనందించవలెను.
విశాలభావాలు,
విశాలమైన
తలపులను
పెంచుకోవాలి.
అసూయ
అను
పరమ
రాక్షసిని
చెంత
చేరనివ్వక
చూచుకోవాలి.
ఆ
రాక్షసి
తన
సర్వస్వమును
నాశనము
గావించును.
అనారోగ్యమును
తెప్పించును.
అసూయాపరునకు
తిండి
అరుగదు.
నిద్రపట్టదు.
క్షణక్షణమునకూ
క్షయరోగివలె
శరీర–మానసిక
శక్తులను
క్షీణింపచేయును.
మనము
కూడా
ఇతరులవలె
మంచి
గౌరవము,
పేరుప్రతిష్ఠలు,
మార్కులు,
తెలివితేటలు
సంపాదించుకోవలెనని
తగిన
కృషి
చేయవచ్చును.
అది
తప్పుకాదు.
అంతేకాని,
ఇతరులు
నాశమై,
నేను
మాత్రమే
పైకి
రావాలను
తలపు
మహాకిరాతకమైనది,
కీడు
చేయునది.
ఇది
విద్యార్థుల
విషపురుగు.
ఆత్మస్తుతి,
పరనింద
–
ఇవి
కూడా
ఆ
కోవకు
చేరినవే.
తాను
ఎంతటి
హీనుడైనా,
నీచుడైనా
తన
తప్పులను
తాను
మంచిగా
చెప్పుకొనుటకు
ప్రయత్నించటం,
పరుల
మంచిని
ఏమాత్రమూ
విచారించక
వారిలో
అన్నీ
దోషములనే
వెతకటం,
ఇవి
కూడా
వేరుపురుగు
సంతతికి
చేరినవే.
ఇతరులను
కించపరచే
విధంగా
మాట్లాడరాదు.
తనకు
ఇష్టమయినపుడు
పరులు
చేసినవి
యేవైనా
మంచిగానే
ఉండును.
తన
యిష్టమే
మారి
విరుద్ధమైన
సమయమున,
ఇతరులు
చేసిన
మంచి
కూడా
చెడ్డగనే
భావించటం
–
ఇట్టివి
ఆత్మద్రోహ
లక్షణాలుగా
రూపొందును.
‘సుమతి
శతకము’న
కూడా
దీనిని
ఈ
క్రింది
విధముగా
వర్ణించెను.
“కూరిమి
గల
దినములలో
నేరములెన్నడును
కలుగునేరవు,
ఆ
కూరిమి
విరసంబైనను,
నేరములే
దోచుచుండు
నిక్కము
సుమతీ”.
కూరిమి,
అనగా
స్నేహమే
విరసమైతే
అన్నీ
నేరాలే
వెతుకుదురు.
ఇట్టివి
‘సుమతి’కి,
అనగా
‘మంచి
బుద్ధి’కల
వానికి
తగినవి
కావు.
విద్యార్థి
సుమతి
కావాలి
కానీ
దుర్మతి
కారాదు.
బండెడు
కట్టెలు
ఒక్క
చిన్న
నిప్పుతో
భస్మీపటలం
కాగలవు.
ఒక
చిన్న
విషపు
బొట్టుతో
కడివెడు
పాలు
ఎందుకూ
పనికి
రాకుండా
పాడైపోవును.
అదే
విధంగా
మానవునిలో,
విద్యార్థిలో
ఎన్ని
సద్గుణములుండినా
ఒక్క
అసూయాద్వేషమనే
అగ్నికణము,
విషబిందువులే
గౌరవాన్ని
భస్మము
చేయును.
బుద్ధిని
నాశము
గావించును.
కనుక,
జీవితరంగములో
విద్యార్థులు
కడు
జాగ్రత్తగా
మెలగవలెను.
అహంకారము,
అసూయ,
క్రోధము,
స్వార్థములవంటి
దుర్గుణములను
చెంత
చేరనివ్వరాదు.
పై
దుర్గుణములు
యువకులను
అతి
త్వరగా
తమ
వలలో
వేసుకొనును.
తమలోని
పవిత్రతను
మచ్చునకైనా
కనుపించకుండా
చేయును.
తనను
తాను
మరిపించును.
ఉద్రేకాన్ని
పురికొల్పి
మంచీ
చెడ్డా
అను
విచక్షణలేక,
నోటికి
వచ్చినట్లు
పలికించును,
చేతికి
వచ్చినట్లు
చేయించును.
3
▾
Meaning
Keep
ఆత్మవిశ్వాసము
ప్రతి
విద్యార్థికి
అత్యవసరము
ఈ
అసూయ
అంతటితో
నిలువదు.
పరులపై
చాడీలు
చెప్పించును.
ఈ
చెడ్డ
అలవాట్లు
సహజంగా
యువకులలో
అధికము.
ఇది
అజ్ఞాన
లక్షణము.
వీటిని
పారద్రోలుటకు
తెల్లవారి,
పరుండునపుడు
తనలోని
దోషములను
విచారించి,
వాటిని
దూరము
చేసికొనుటకు
ప్రయత్నించవలెను.
దైవ
ప్రార్థన
చేయవలెను.
ఒక్క
దైవానుగ్రహాన్నే
పూర్ణంగా
సంపాదించుకొన్న,
ఇట్టి
అవలక్షణాలు
మన
దరికి
చేరవు.
మంచివారలతో
స్నేహము,
మంచిపనులలో
భాగము,
మంచిమాటలతో
చేరిక
విద్యార్థులకు
వివేక
లక్షణాలు.
కనుకనే
నేను
అప్పుడప్పుడు
చెప్పుచుందును.
చెడ్డ
శ్రవణము,
చెడ్డ
మాటలు,
చెడ్డ
వాసన,
చెడ్డ
పనులు
గలవారలతో
స్నేహము
భవిష్యత్తు
నాశనమే
అగును.
పంచేంద్రియ
దోషములు
పంచప్రాణములు
తీయును,
పంచకోశములను
చంపును.
అప్పటికప్పటికి
ఈ
ఇంద్రియ
దోషములు
ఆనందమును,
ఆహ్లాదమును
కలిగించును.
“ముందున్నదిగా
నీ
ముసలము”
అన్నట్లు
భవిష్యత్తులో
బాధలనందించును.
విద్యార్థులకు
ఆత్మవిశ్వాసము
అత్యవసరము.
ఆ
విశ్వాసము
లేకపోవటమే
జీవితానికి
పతనము
ప్రారంభము.
ఈనాడు
లోకమింత
పతనమగుటకు
మూలకారణము,
ఆత్మవిశ్వాసమును
కోల్పోవుటయే.
ఆత్మవిశ్వాసమున్న
వానికి
అన్నీ
శుభములే.
అంతా
మంచే.
ఎక్కడకు
వెళ్ళినా
గౌరవమే,
యేది
ముట్టినా
బంగారమే
అగును.
ఆత్మవిశ్వాసము
లేనివాడు,
తనను
తాను
నమ్మనివాడు
ఎవరిని
నమ్మగలడు?
నమ్మినా,
అది
కృత్రిమమైన
నమ్మకమే
కానీ,
స్వాభావికమైన
నమ్మకము
కాదు.
కడకు
తల్లీ,
తండ్రీ,
భార్యా,
బిడ్డల
యందు
కూడా
నమ్మకముండదు.
అయితే
నమ్మిన
వారల
వలే
నటన
చేతురు.
మాతృ,
పితృ
ద్రోహానికి
పాల్పడుదురు.
కాన,
ఆత్మవిశ్వాసము
ప్రతి
విద్యార్థికి
అత్యవసరము.
కనుక,
విద్యార్థులు
నీతికి
సంబంధించిన,
నిజాయితీలకు
సంబంధించిన
పవిత్రమైన
వారల
చరిత్రలను,
పురాణ
ఇతిహాసములను
పఠనము
చేయుచుండవలెను.
ధర్మశాస్త్రములను
విశ్వసించవలెను.
వాటిని
అలక్ష్యము
చేయరాదు.
మానవాభ్యుదయమునకు
పురాణాలు
ప్రమాణాలు.
Previous
←
The marks of the ideal student
Next
Character is the touchstone of humanity
→