Poem 310
వినండయా బోధ వినండయా విని సత్యమార్గమున నడవండయానిదురలేచినదాది నిదురపోయెడుదాక ఆస్తికై కుస్తీలు వేస్తారయారూపాయి కోసమై లోపాయికారిగా అడ్డమైన గడ్డి తింటారయాధనం కోసం దైవధ్యానాలు బోనాలు పెక్కు పన్నాగాలు పన్నేరయాభమి సూర్యుని చుట్టు జనులు ధనము చుట్టు గిరగిరా తిరుగుతుంటారయాలింగలింగాయంచు లింగపూజలు చేసి దొంగసాధనలు మీరు చేస్తారయాస్వార్థంబుకై కీర్తిమర్యాదలాశించి ధూర్తకార్యాలు మీరు చేస్తారయాకలిమి కల్గిననాడు కప్పగంతులు వేసి కలిమి పోయిననాడు క్రుంగిపోయేరయాగొప్పకు పోతారు గోవింద కొడతారు డాబులు దంబాలు మానండయాసర్వభూతములందు సర్వేశ్వరుని మీరు సమముగానెప్పుడు చూడండయా.
In plain words
Listen, sirs, to the teaching, listen; and having listened, walk on the path of Satya, sirs. From the time you wake until you go to sleep, you wrestle for property, sirs; for the sake of the rupee, in secret, you eat whatever grass comes your way, sirs; for money, meditations on God, bōnālu offerings: you hatch many schemes, sirs; as the earth goes round the sun, people go round and round money, sirs; crying "Liṅga, Liṅga!", you worship the liṅga and practise false sādhanas, sirs; for selfish ends, craving fame and honour, you do wicked deeds, sirs; on the day wealth comes you leap about like frogs; on the day wealth goes you sink down, sirs; you chase after greatness and end in ruin; give up your show and your pomp, sirs; always see the Lord of all equally in all beings, sirs.