Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His poems · 1995
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
411
Keep
చదువు వలన లేదు తర్కవాదమందు లేదు
ప్రాకృతమైన తెలివిచేటలందు లేదు
వివిధ మతములందు వేదవాదమందు లేదు
కలదు కలదు కలదొక్క జాలి హృదయమందె.
412
Keep
ప్రేమతత్వం ప్రబోధించి
సమత మమతలు పొందుపరచి
మానవత్వపు విలువలు తెలిపిన
అతడె దైవము, అతడె సాయి.
413
Keep
పేకాటనాడుచు ప్రీతితో నారాత్రి
గడిపినందులకె జాగరణమగునె
చేపలకొరకునై చెరువులో జాలర్లు
పొంచి చూచెడు దృష్టి ముక్తికగునె
తప్పసారాత్రాగి తన మేను మరచిన
మాత్రాన పరమ తన్మయతనగునె
భార్యపై నల్గియు పస్తు పరుండిన
వాడెల్ల నొకనుపవాసి యగునె
తలపు నీయందె యుంచిన కలదుగాని
భక్తి సుంతైన లేనిదే ముక్తి కలదె!
ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు
సాధుసద్గుణ గణ్యులౌ సభ్యులార!
414
Keep
సాయి అర్థించు మీ నుండి సద్గుణములు
సర్వమానవ సోదర సఖ్యబుద్ధి
స్వార్థ త్యాగంబు పరిశుద్ధ సంఘసేవ
సాయికిచ్చెడి ధనమిదె సత్యముగను.
415
Keep
ఎద్ది లేదనుచుంటిమో అద్ది కలదు
ఎద్ది కలదనుచుంటిమో అద్ది లేదు
ఉన్నదాతడే దైవంబు ఎన్నటికిని
లేనిదయ్యెను విశ్వంబు కానరయ్య.
416
Keep
పుణ్యఫలముచేత పుట్టెను మనుజుడై
దుష్టవాంఛలచేత దుష్టుడయ్యె
జ్ఞానమార్గము వీడి మానవత్వము వీడి
ఇంతకన్నను రాక్షసత్వమేది?
417
Keep
తుమ్మెదా! ఒకసారి కన్నెత్తి చూడమని
చెప్పవే నా మాట శ్రీకృష్ణునకు
మబ్బు గ్రమ్మిన నాదు మానస వీధిలో
కృష్ణభానుని తేజము నిలుపమనుము
ఎండబారిన నాదు జీవిత వృక్షమునకు
చిగురు పెట్టగ వేగ చేయమనవె
చెదరిపోయన నాదు జీవిత సుమ మాల
చెల్వారగూర్చి ధరియించమనవె.
418
Keep
గుటగుట చనుబాలు గ్రోలుచు
పూతన బట్టి చంపు వింతను చూడనైతి
ఎన్ని తాళ్లను కట్టినా పట్టని
నీ బోజ్జను ముద్దాడనైతి
ప్రసవ వేదన పడుట నా వంతు
నీదు ముచ్చటల్ పడుట యశోద వంతు
బిడ్డలుండియు నేనొక గొడ్డురాలనైతి
పుత్రుని కనకుండినను పుత్రవతి యయ్యె యశోద.
419
Keep
ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఏరికైనను తప్పదన్నా!
ఏనాడు ఏతీరు ఎవరు చెప్పాగలరు
అనుభవించుట సిద్ధమన్నా!
రాముడంతటివాడు రమణి సీతను బాసి
పామరుని వలె ఏడ్చెనన్నా!
అలనాటి పాండవులు ఆకులలములు మేసి
అడవిపాలై పోయిరన్నా!
420
Keep
స్నానంబు చేయు ఆ జవరాండ్ర చీరలు
కాజేసినందుకా పూజ నీకు?
గొల్లపూబోండ్లతో జల్లులాడిన నాడు
హర్షించినందుకా అర్ఘ్యమిడుట?
చాలునిక కట్టిపెట్టు పంచాంగమింక
పొగడుకొనబోకు చాలించు మూయినోరు
చాలదీ నాల్క శ్రీకృష్ణు సన్నుతింప
నూరు చీల్కలు చీల్తు నోరోరి భీష్మ.
421
Keep
మంచి మందులేదు మందహాసముకన్న
వైద్యుడెంత గొప్పవాడు అయిన
అవని మందులన్ని అనుపానములెగాని
అసలుసిసలు మందు
Previous
←
1994
Next
1996
→