Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His poems · 1998
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
495
Keep
కోరిక తీరిన వేళ నన్ గొప్పగ పొగడెదరోయి
కోరిక తీరకపోతే ఊరక తెగడుదురోయి
పాపంబౌ పని చేసి ఫలమాపద కలిగిన రోసి
కాపాడవు నీవనుచు నింద నాపై మోపెదరోయి.
496
Keep
వింటగత్తెల చెంతబోకు ఖండితముగ కడు నీచుడౌతావు
కులము వారలు నిను కుండ ముట్టనివ్వరు
బంధువులు నిను చూస్తె బయటకెళ్ళగొడతారు
స్నేహితులు నిను చూస్తె చెప్పుతో కొడతారు.
497
Keep
ప్రకృతియన్న ఆత్మకు అనేక నామధేయంబులు
బట్టబయలంద్రు ఏ పేరు పెట్టలేదు
ఒక్క ఆత్మకే ఇన్ని నామ రూపములు కలవు
498
Keep
గతజీవుడగు పతిన్ బ్రతికించుకున్నట్టి
సావిత్రి భారత సతియె కాదె!
తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చె
చంద్రమతి పవిత్ర పడతి కాదె!
కులసతీత్వమునకై గుండాన దూకిన
సీత భారత ధరాజాత కాదె!
కినిసి దుర్మద కిరాతుని బూది గావించె
దమయంతి భారత రమణి కాదె!
సప్త సాగర పరివేష్టితోర్వితలము
భరత జాతి పాతివ్రత్య ప్రవిమలంబు
భావసంపదకిది మహా పంట భూమి
అఖిల దేశములకిది ఉపాధ్యాయి కాదె!
499
Keep
బిడ్డడుండియూ నేనొక గొడ్డురాలు
బిడ్డ కనకుండిననూ పుత్రవతి యశోద
ఇది నా ఖర్మమా? ఆమె అదృష్టమా?
500
Keep
మనసు మాట పనియు మనిషికొక్కటైన
మనిషి కాదు అతడు మహితుడౌను
మనసు మాట పనియు వేరు వేరైన
మనిషి కాదు అతడు మృగమెగానీ
501
Keep
నిత్యసత్య సుకృతులన్ని వికృతులుగ మారుచుండె
ప్రశాంతి రూపమైన ప్రకృతి ప్రజల వీడి పోవుచుండె
ఆర్యవేద విద్యలణగె దుర్విద్యలు పెరుగుచుండె
502
Keep
సత్యనిత్య సుకృతులెల్ల వికృతిరూపు పొందుచుండె
పవిత్ర ప్రకృతి ప్రతిదినము ప్రజల వీడిపోవుచుండె
ధర్మదయాచరణ సతతం వికృతిరూపు దాల్చుచుండె
వేదమాత ఘోషలన్ని విచారమును పొందుచుండె.
503
Keep
సద్విద్య ఉన్నచో సంస్కారమదియబ్బు
సంస్కారమున్నచో జన్మమదియె
సద్విద్య ఉన్నచో సౌఖ్యంబు చేకూరు
సౌఖ్యంబు వల్లనే కల్గు శాంతి
సద్విద్య ఉన్నచో సత్సంగములు కల్గు
సత్సంగమున్నచో శాంతి అదియె
సద్విద్య ఉన్నచో జన్మ సార్థకమగు
జన్మ సార్థకముచే కలుగు ముక్తి
సత్యనిత్యమైన చదువు చదివినపుడె
సార రహితమౌ సంసార సాగరమున
మునిగి తేలక త్వరలోనె మోక్షమందు
కాన యిట్టి చదువుకై కదలిరండు.
504
Keep
అణువు సూక్ష్మమై అలలారుచుండు
ఘనముకంటె ఘనమై కనిపించు
అణువు ఘనముగ ఘనము అణువుగనుండు
అణువు ఆత్మయే అత్మయే అణువు.
505
Keep
పాటువైనది చెట్టురా పట్టువైనది కొమ్మరా
పాటు తప్పి పట్టు విడిచితె పరబ్రహ్మమె చేరురా
సారమైనది చమురురా సత్యమైనది వత్తిరా
వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవ్వరు రారురా!
కోట ఏడు చుట్టురా కోటలోపల తోటరా
తోటలోనికి పోదమంటె దారి తెలియదు ఎట్లరా?
మదిలొ పొంగే ప్రీతి ఊట అనురాగమనే ఆ నీట
తడుపబడిన హృదయతోట ప్రేమ మొలక అందులో నాట
మనసులోని మన మాట అదియె మథుర బాట.
506
Keep
దొరికె దొరికె 'బాలభాస్కర' బాలకులార! రండి బాలకులారా!
కడుపుబ్బరము, కాళ్ళవాపులు, చేతిమోదలను చెడుగులనుండి
అజాగరూక పోషణనుండి అజీర్ణవిరేచనములనుండి
అన్నిటికీ ఇది బాగవునండీ, బాలకులార! రండి బాలకులార!
అది ఎక్కడ అని అడిగేరన్నా, అదిగదిగో కొట్టె సుబ్బన్న
అంగడియందే దొరకును అన్నా, పండిత శ్రీగోపాలాచార్యుల టానిక్కన్నా...
507
Keep
బంగారు కోటలు
సందుసందల దొంతుశాలలు రాజమేడలు
రంతు చేసెడి కాంత కేళి గృహంబులు
508
Keep
లోభివానిజంప లోకంబులోపల
కొట్టవద్దు వాని తిట్టవద్దు
ధనమునడిగినంత దబ్బున తాచచ్చు
ఉన్నమాట తెలుపుచున్న మాట.
509
Keep
తన జీవితంబు త్యాగంబు చేసియు
సామాజికమును సరిగపరచి
వేదశాస్త్ర ఇతిహాస పురాణముల్
ఇంపుగ నేర్పించినట్టి ఋషులు
Previous
←
1997
Next
1999
→