Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His poems · 1999
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
510
Keep
చిక్కిన సాయిని వక్కలేయక చక్కచేసుకోండి
పోయిన చిక్కదు పర్తీశుని పాదసేవయండి
భక్తిని యిచ్చి శక్తిని యిచ్చి ముక్తిచేర్చునండి
ఇతరుల మాటలు యింపుగ నమ్మి కొంపతీయకండి
నేర్చుకోండి నేర్చుకోండి బుద్ధులన్ని తీర్చుకోండి కర్మ.
511
Keep
మరచి నిన్నగూర్చి మరచి రేపటిగూర్చి
ఈ ప్రపంచమందు ఈ క్షణాన
చేసిచూపు చేయవలసినవన్ని
అతని హదయమె పండినట్టివాడు
అతని గుండె పండినట్టివాడు
512
Keep
శ్రీరామా నా మనవిని వినుమా
సీతా శిరోరత్నమె గొనుమా
చెలగి విల్లుల లోపలనున్న చిలుక
రీతిని వణుకుచు నీలుచున్న
పలువురు రాక్షస మగువలెల్లరు
బలిమిని ఖడ్గములూపుచు
తలను ద్రుంచే మంటవైచగ
తల్లడిల్లిన సీతజూచితి.
513
Keep
మంచితనమునందు మానవత్వమునందు
నీతియందు నిండునిజమునందు
ఆచరించి చెప్పు ఆచరించి చూపు ఆదర్శములనెల్ల
అతడె యువకుడు ఆమె యువతికాదె
అట్టివారె బెష్టు ఫ్రెండ్సు మీకు
అట్టివారె బెష్టు ఫ్రెండ్సు నాకు.
514
Keep
అంతరాత్మ కన్న అధ్యాపకుడు లేడు
అరయ కాలమె మీకు పరమ గురువు
గ్రంథరాజమేది ప్రత్యక్ష లోకమే
ఎవడు స్నేహితుండు, ఈశ్వరుండె!
Previous
←
1998
Next
2000
→