Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His poems · 2003
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
540
Keep
దినకరుడు శాంతుడై తోచె దినములింక
కురచనయ్యె చలిగాలి చురుకు హెచ్చె
పొలములన్ రేయి గ్రుడ్డి వెన్నెలలోన
కుప్పలన్ నూర్పు కాపులు గొంతులెత్తి
పదములన్ పాడదొడగిరి పచ్చపూలు
జనపచేలకు ముత్యాల సరులుగూర్చె
మిరప పండ్లకు కుంకుమ మెరుపుదాల్చి
బంతిపువ్వుల మొగములల్లంత విప్పి
మన గృహంబుల ధాన్యసంపదలు నిల్పి
సరసురాలైన పుష్యమాసంబునందు
పరగనొప్పుచు సంక్రాంతి పండుగొచ్చె.
541
Keep
పూవుపూవునందు నవ్వుచునుండును
నవ్వునందె ప్రేమ నాట్యమాడు
పూలు కోయుటెట్లు మల కట్టుటెట్లు
గొంతునందు సూది గుచ్చుటెట్లు?
542
Keep
ఏడవకు పసిబాల ఏడవకు తండ్రీ!
ఏడిస్తె నిను భరతవీరుడనరయ్యా...జో...జో...
హంతకుడు హిట్లరు అమర రష్యాపై
దండెత్తి వచ్చెనని జడిసి ఏడ్చితివా...జో..జో..
హిట్లరును చంపుటకు ఎర్రసైన్యంబు
వీరుడౌ స్టాలిను కలరు ఏడువకు...జో...జో..
ఇంకెందుకుర నాన్న అట్టులేడ్చెదవు
ప్రజకైక్యత లేదటంచు ఏడ్చితివా
ఐక్యతగ ప్రజలంత చేరి పోరాడి
స్వాతంత్య్రమును పొందగలరు ఏడువకు...జో..జో..
551
Keep
అన్ని తెలియు వారు అవనియందున లేరు
ఏమి తెలియకుండ ఎవ్వడుండు?
కొంచెమెరుగు వాడు కించిజ్ఞుడగునయా
ఉన్న మాట తెలుపుచున్న మాట.
Previous
←
2002
Next
2004
→