Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His poems · 2002
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
533
Keep
మౌళిగుల్కెడు చంద్రమఃఖండ కళతోడ
బెడగారు గుల్కెడు జడలతోడ
జడలలో ప్రవహించు చదలేటి జిగితోడ
డంబైన ఫాలనేత్రంబుతోడ
నల్లనేరెడువంటి నల్లని మెడతోడ
కరమున నాగకంకణముతోడ
నడుమును చుట్టిన నాగచర్మముతోడ
మైనిండ నలరు భస్మంబుతోడ
నుదుట తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో
తాంబూల రాగాధరంబుతోడ
ఆరు శాస్త్రములందున నందగించి
నల్ల కలువల హసియించి కొల్లలాడు
మెరుగు చామనచాయ మేనితోడ
పర్తివాసుడు నేడు సాక్షాత్కరించె.
534
Keep
మాను దిద్ద వచ్చు మరి వంపు లేకుండ
దిద్దవచ్చు రాయి తిన్నగాను
మనసు దిద్దగలర మరి వంపు లేకుండ
ఉన్న మాట తెలుపుచున్న మాట.
535
Keep
మంచి మనసు, నడత మంచిగ లేకున్న
మిమ్ము సాయి ఎట్లు మెచ్చుకొనును?
శాంతిప్రేమదాయి సంతోషసుఖదాయి
ప్రేమ సాయి ఎట్లు పెంచుకొనును?
536
Keep
భోగభాగ్యంబలు ఎన్నియో పొందియున&
మసునందున శాంతి మరుగుపడిన
మానవత్వంబు గుర్తింప మరచిరంత
సత్యమును తెలుపు మాట సాయిమాట
537
Keep
మంచి కాలము పదవులు మంచి బ్రతుకు
కోరుచుందురు మనుజులు కోరబోరు
మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత
ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు.
538
Keep
దేహభ్రాంతి లేని మోహమింతయు లేని
త్యాగనిరతులైన యోగివరులు
గురులు నాడు నేడు గురువులట్టివారలె
సత్యమైన బాట సాయి మాట.
539
Keep
“అణువునందున చూడగ అణువునగుచు
ఘనమునందు చూడగ ఘనమునగుచు
అణువు ఘనములు రెండును కూడినట్టి
ఆనందమే ఈ సత్యం”
Previous
←
2001
Next
2003
→