The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Song 17

ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపించకున్నాడయా | |ఉ | |లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన తిప్పుచున్నాడయా | |ఉ | |లక్షలాదిగనున్న నక్షత్రములనెల్ల నేల రాల్పక మింట నిల్పుచున్నాడయా | |ఉ | |ఈ ధారుణీ చక్రమిరుసు లేకుండగా ఎల్లవేళల తిప్పుచున్నాడయా | |ఉ | |జీతభత్యము లేక ప్రీతితో మనకొరకు గాలిలో సురిటీలు విసరేడయా | |ఉ | |ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయా | |ఉ | |పొంగి పొరలుచు వచ్చి పృధ్విపై పడకుండ కడలిరాజు కాళ్ళు ముడిచాడయా | |ఉ | |కనిపించకేమి చేస్తున్నాడయా?తెరచాటు తానుండి తెరముందు ప్రజనుంచి తైతక్కలాడించుచున్నాడయా | |ఉ | |

In plain words

He is there, yes, God is there; though the eyes do not see Him, He is there. To drive off the darkness of the worlds, He keeps turning the lamps of sun and moon in the sky. He is there! The stars that stand in lakhs, without letting them fall to earth, He keeps holding in the heavens. He is there! This wheel of the earth, without an axle, He keeps turning at all times. He is there! Without wage or allowance, with love, for our sake, He waves fans through the air. He is there! The sky that shines with no support at all He keeps holding up. He is there! So that, swelling and surging, it does not fall upon the earth, He has made the ocean's king draw in his feet. He is there! Unseen, what is He doing? Staying behind the curtain, setting people before it, He makes them dance to the beat. He is there!

Also read

ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కన్పించకున్నాడయా లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పుచున్నాడయా ॥ఉన్నాడయా॥ లక్షలాదిగనున్న నక్షత్రములనెల్ల నేలరాల్పక మింట నిల్పుచున్నాడయా ॥ఉన్నాడయా॥ ఈ ధారుణీ చక్రమిరుసు లేకుండ ఎల్ల వేళల త్రిప్పుచున్నాడయా ॥ఉన్నాడయా॥ జీత బత్తెము లేక ప్రీతితో మనకొరకు గాలితో సురిడీలు విసిరాడయా ॥ఉన్నాడయా॥ ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయా ॥ఉన్నాడయా॥ పొంగి పొరలుచువచ్చి పృథ్విపై పడకుండ కడలిరాజు కాళ్లు ముడిచాడయా ॥ఉన్నాడయా॥ ఉన్నాడయా దేవుడున్నాడయ కన్నులకు కన్పించకున్నాడయా కన్పించకేమి చేస్తున్నాడయా తెరచాటు తానుండి తెరముందు ప్రజనుంచి తైతక్క లాడించుచున్నాడయా ॥ఉన్నాడయా॥