Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His songs · 1986
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
15
Keep
పతిసుతులకుదూరమైన పడతి బ్రతుకదేల
ఏపాపఫలంబోగాని యీ తాపము నాకుకలుగజేసె ॥
పతి ॥
16
Keep
దాసానుదాసుడను కావలెనురా
నేనీదాసులకు సేవనే చేయవలెరా.
17
Keep
ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపించకున్నాడయా | |
ఉ | |
లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన తిప్పుచున్నాడయా | |
ఉ | |
లక్షలాదిగనున్న నక్షత్రములనెల్ల నేల రాల్పక మింట నిల్పుచున్నాడయా | |
ఉ | |
ఈ ధారుణీ చక్రమిరుసు లేకుండగా ఎల్లవేళల తిప్పుచున్నాడయా | |
ఉ | |
జీతభత్యము లేక ప్రీతితో మనకొరకు గాలిలో సురిటీలు విసరేడయా | |
ఉ | |
ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయా | |
ఉ | |
పొంగి పొరలుచు వచ్చి పృధ్విపై పడకుండ కడలిరాజు కాళ్ళు ముడిచాడయా | |
ఉ | |
కనిపించకేమి చేస్తున్నాడయా?
తెరచాటు తానుండి తెరముందు ప్రజనుంచి తైతక్కలాడించుచున్నాడయా | |
ఉ | |
18
Keep
ఏల ఇటుల తనయా వలదు
హరి హరి యనబోకుమురా
ఏమి హరియో ఇటు పలుక
ఎవరు నేర్పినారు రా నీకు.
19
Keep
రండి పుణ్యాత్ములారా! శ్రీరాముని భజనకు రండి ధన్యాత్ములారా!
రండి మనమందరము కోదండరాముని భజనలు చేతము రండి పుణ్యాత్ములారా!
శ్రీరాముని భజనకు రండి ధన్యాత్ములారా!
20
Keep
రార వేణుగోపబాల-రాజిత సద్గుణ గుణశీలా నందగోపాలా
నీవెందు రావేలా నేనెందు పోజాల సదలో మదిలో ముదములలర
మా ఎదురుగ నిలువర ॥
రార ॥
Previous
←
1985
Next
1987
→