సాయిసాయి సాయిరామా యని మీరు రయమున పాడగ రారండి!ప్రేమ మీర ఓ సాయిరామా యని పిలచి తరింతురు లేవండి. | |సాయి | |కుక్క తోకయగు మానవ మనసును చక్కబరచును రారండిఒక్క మనస్సుతో నమ్మి సాయిని చక్కగ స్మరణము చేయండి. | |సాయి | |పుట్టుట గిట్టుట రెండే జన్మకు గట్టివనుచు మది తలచండివట్టి భ్రమలతో మునిగి కర్మలు ఎట్టివి చేయక మెలగండి. | |సాయి | |కలియుట బాయుట కాలవాహిని కాంక్షలు విడిచి చూడండికర్మయోగమే జన్మకు ముఖ్యము ధర్మము నడచి మెలగండి. | |సాయి | |నామస్మరణయె ముఖ్యవిద్యయని నియమముతో సేవించండితక్కినవన్నీ హుళక్కి విద్యలని పక్కకు నెట్టుట చూడండి | |సాయి | |తన తలపెల్లఫలింపకున్న యిక దైవము వలదని అనకండిదయకు ప్రాప్తుడై మెలగిన తలపుల ఫలములు కొరతేముందండి | |సాయి | |కూటికి పేదయు కోటీశ్వరుడును కాటికి ఏగుట సమమండికోతిగుణంబులు మాని ఈ పరంజ్యోతి రూపమును జూడండి | |సాయి | |పామరత్వమే ప్రకృతి అందమను పాటను మీరిక మానండిపరుల బాధలు తమయట్టివియని నియమముగ మదిలో తలచండి | |సాయి | |మానవ ధర్మము మాధవునాజ్ఞని మర్మమెరిగి భజియించండిసర్వజన ప్రియ సాయీశుండనిసారెకు మదిలో వేడండి | |సాయి | |లోకముకై దిగులొందక మీరు లోకేశుని సేవించండివర్ణాశ్రమ ధర్మంబులు వదలక ఓపికతో సాధించండి | |సాయి | |మనసుకు లోనై మరిమాటాడక మాధవ స్మరణము చేయండిమర్మమెరింగిన మరునిముసములో మనసే వారికి గురువండి | |సాయి | |భక్తిజ్ఞానవైరాగ్యములన మాకు శక్తి చాలదని యనకండినామస్మరణతొ కూడినవి నయభయవిశ్వాసములేనండి | |సాయి | |చీకటివెలుగులు కష్టసుఖములు చేసిన కర్మకు ఫలమండిబాగుగ నమ్మక ఓగున ఏడ్చే పామరత్వమును వదలండి | |సాయి | |జాతినీతి మతశాస్త్రములాదిగ దైవలీలలని తలచండిఎట్టి బాధలను పెట్టిన మరువక సాయిరామయని తలచండి | |సాయి | |నరుడైనందుకు పరమాత్మయని తలచిన నరుడని ఎంచండిభగవన్నామము వలదను నరుని నరపశువని భావించండి | |సాయి | |రామకృష్ణ హరిగోవిందా నారాయణ శివయని తలచండిఅన్ని నామములు పరమాత్మవెయని భేదమడచి భజియించండి | |సాయి | |సృష్టియంతయు భగవత్సంతతి భక్తులమని భావించండిభక్తులందరు సోదరీసోదర ప్రేమభావములు పెంచండి | |సాయి | |ప్రేమే దైవము దైవమె ప్రేమయని ప్రేమ తత్త్వమును పెంచండిప్రేమలలో నిష్కామప్రేమనుపట్టు విడక సాధించండి | |సాయి | |సాయిరామ యని నామము తలచిన సర్వ బాధలు సమయునండినియమముతో సేవించువారికి నిశ్చలతత్త్వము కుదురునండి | |సాయి | |పుణ్యకార్యములు చేయకున్నను పాపములను తలపెట్టకండిపాపములన్నింటికంటె మించినది పరులను నిందించేదండి | |సాయి | |ఇట్టి గుణంబులు నేర్చినవారికి ఇహపర సుఖములు కలుగునండిసాయిరామయని భజనలు చేసిన అన్ని సౌఖ్యములు కలుగునండి | |సాయి | |సత్యముధర్మము శాంతముప్రేమ ఉత్తమ స్థితికి త్రోవండికామక్రోధ ద్వేషంబులను చుట్టి చూరను పెట్టుట మేలండి | |సాయి | |బీదసాదలను భేదభావములు సాయికి మదిలో లేవండిపర్తివాసుని పాదము వీడక పదములతో మీరు పాడండి | |సాయి | |
In plain words
Come, all of you, to sing 'Sai, Sai, Sai Rāma' with all speed! Calling 'O Sai Rāma' with overflowing Prema, you will be redeemed; rise up! (Sai…) Come: He sets right the human mind that is like a dog's tail; trusting Sai with a single mind, remember Him well. (Sai…) Hold firmly in your mind that birth and death alone are the two banks of life; do not go about sunk in mere delusions, doing no work of any kind. (Sai…) Meeting and parting are the stream of time; give up your cravings and see; karma yoga is what matters most in life; walk in Dharma and live by it. (Sai…) Hold that the remembrance of the Name is the chief learning, and serve it with discipline; see that all the rest, the hollow learnings, are pushed aside. (Sai…) If all one's wishes do not bear fruit, do not then say there is no need of God; if you live as one who has won His grace, what lack will there be in the fruits of your wishes? (Sai…) The man too poor for a meal and the millionaire alike go to the burning ground; give up the ways of the monkey and behold this form of the Supreme Light. (Sai…) Give up now the song that coarseness is the beauty of Prakṛti; hold it a rule in your mind that the sufferings of others are like your own. (Sai…) Knowing the secret that the Dharma of man is the command of Mādhava, worship Him; pray to Him again and again in your heart as the Sai Lord, beloved of all people. (Sai…) Do not be troubled on the world's account; serve the Lord of the world; without abandoning the Dharma of varṇa and āśrama, achieve it with patience. (Sai…) Without yielding to the mind and talking further, practise the remembrance of Mādhava; for those who know the secret, in the very next moment, the mind itself becomes their guru. (Sai…) Do not say you have not strength enough for Bhakti, Jñāna and Vairāgya; joined with the remembrance of the Name, they are only good conduct, reverence and faith. (Sai…) Darkness and light, hardship and happiness, are the fruit of the karma done; give up the coarseness that does not trust well and weeps in misfortune. (Sai…) Think of caste, morals, creeds, scriptures and all as the līlās of God; whatever sorrows He may give, do not forget; think 'Sai Rāma'. (Sai…) Count him a man who, being born a man, thinks of the Paramātma; regard the man who says he wants no Name of the Lord as a beast in human form. (Sai…) Think 'Rāma, Kṛṣṇa, Hari, Govinda, Nārāyaṇa, Śiva'; knowing all names are the Paramātma's, put away difference and worship. (Sai…) Regard all creation as the offspring of the Lord, and yourselves as His devotees; all devotees, foster feelings of Prema as sisters and brothers. (Sai…) Prema is God, God is Prema: so foster the principle of Prema; among the kinds of Prema, hold fast to desireless Prema and attain it. (Sai…) When the Name 'Sai Rāma' is thought of, all sorrows come to an end; for those who serve with discipline, unshaken steadiness becomes established. (Sai…) Even if you do no deeds of merit, do not set your mind on sins; worse than all sins is the slandering of others. (Sai…) Those who learn such qualities gain happiness here and hereafter; those who sing bhajans of 'Sai Rāma' gain all comforts. (Sai…) Satya, Dharma, Śānti and Prema are the road to the highest state; it is best to roll up lust, anger and hatred and tuck them away in the eaves. (Sai…) No feeling of difference toward the poor and lowly is there in Sai's heart; never letting go of the feet of the Dweller of Parthi, sing with these words. (Sai…)