Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His songs · More of His songs
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
76
Keep
అః రహ తవ ఆహ్వాన ప్రచారట సునిశిత ఉదార వాణిహిందు బౌద్ధ శిఖ జైన పారసిహ ముసల్మానే
కిరస్తానీ పూరబ్ పశ్చిమ వాసి తవ సింహాసన బాసి ప్రేమ వాహిని
77
Keep
ఎంత కాలమీ బాధల్ కృష్ణా! ఎందుకోసమీ గాథల్
న్యాము లేదా మాతో వాదా మాపై కరణయె రాదా
మీ గోపికలు మేమవునా కాదా? కించపరచ మర్యాదా! | |
ఎంత | |
78
Keep
ఎంత మంచి తీపు మీరంతా సేవింపుడీ
రాతిని బలు ప్రీతిని ధర నాతిగ జేసిన
సీతాధినాధుడైన శ్రీరామచంద్రనామ | |
ఎంత | |
పోవును దుర్భావము రాబోవు సద్భావముల్
ద్రావంగ ద్రావగన్ పాపమెల్ల బాపగన్
చక్కెరకో నిక్కము బల్ మెక్కెద మదమెక్కగన్
గ్రుక్కంగ గ్రుక్కగన్ కోదండ రామనామ | |
ఎంత | |
దక్షిణ పరీక్షణ ఉపేక్ష చేయజాల నా
పక్షీంద్ర వాహుడైన పట్టాభిరామనామ.. | |
ఎంత | |
79
Keep
ఎవరి గతి యేతుల నుండునో శ్రీ సాయి కెరుక ఎవరి గతి యేతుల నుండునో శ్రీ బాబా కెరుక(ఎవరి…) కర్మాను బంధములను కదా త్రోయ ఎవరి వశం
ధర్మరాజు విరటునింట తమ్ములతో కొలువు లేదా(ఎవరి…)
నిత్య సత్య మనుభవింప సత్యహరిశ్చన్ద్రుడు
మాట కొఱకు తాను మాలవని గొలువ లేదా(ఎవరి..)
శ్రీమాన్ నారాయణుండు రామావతారమెత్తి ఆ మహానుభావు భార్య రవాణాచే దొరకలేదా(ఎవరి.)
80
Keep
ఒక్కనాడైన ఓ చక్కనయ్యా నాతో మక్కువతో ముచ్చటలు చెప్పినావా ॥
ఒక్క ॥
కల్లలేటికో ఓ నల్లనయ్యా నన్ను చల్లనైన చూపులతో చూచినావా ॥
ఒక్క ॥
ఎన్నడైనా ఓ వెన్నదొంగ నాతో తిన్నగాను తియ్యగాను పలికినావా ॥
ఒక్క ॥
81
Keep
ఓయి రామ,ఓ హోయి రామ , నీవు నా అండ నుండు కోదండ రామ, నేను నీ అండ నుండు కోదండ రామ
మంచిగానే వచ్చే సంసార వాబ్ధి, ఇది ముంచివేయునయ్యా ఈ మోహవాధీ
ఏంచి చూడ నీకేది మించాడయ్యా(౨), దయయుంచి నన్ను దరిచేర్చు ఓడవౌచు
ఓయి రామ.
మక్కువైన దాననంచు మాయదారి, ఈ చొక్కటంపు కోర్కె యున్న చుప్పనాతి
చిక్కు పెట్టి నన్ను రట్టు చేసేనయ్యా, దీని ముక్కుచెవులు కోయవైయ్యా మోహనాంగ
ఓయి రామ
పాపాల పుట్టినిల్లు పావనాంగా, ఈ కోపమన్న రావణుండు కోమలాంగా యేపుమీర పదితలల పాపారాజు, దీని రూపుమాపి మా తాపం ఆర్పవయ్యా ఓయి రామ..
వానరములు నెల్లనేలి వానిచేత, కాని కార్యమలరాచేసి కాచినావు వారికన్నా తీసిపోము సాయి రామ(౨), కాన మమ్ముకూడా దిద్ధనీవు కావాలేవా
ఓయి రామ…
మటూమర్యాద పోగొట్టేనయ్యా, ఈ పొట్ట ఈ కబంధుడందు పెట్టణయ్య
కట్టకడకి నా బంత్త పెట్టెనయ్య
దీని మట్టు మాయలాపావ్య్యయా ఓ రామయ్య
ఓయి రామ…
82
Keep
కిట్టయ్య వచ్చునట. నిశ్చయముగా!
మన కట్టాలు బాపునట చిట్టి దేవుడు
నమ్మివచ్చు వారలకు శిరిగుండు అతని లెక్క చేయనట్టి వారికుక్కుగుండు
చక్కనయ్య చెంతచేరి మక్కువతో మొక్కగానే ముక్కు మూయకున్న ముక్తి చిక్కునమ్మా ॥
కిట్టయ్య |
ముక్తి భుక్తి వేరుకాదు బుజ్జితల్లి! అతని భక్తియొక్కటున్న చాలు ప్రియచెల్లి
అల్లిబుల్లి ఆటలకు నల్లనయ్య చిక్కడమ్మా ।
ఎల్లవేళలుల్లమందు తల్లడిల్లరె ॥
కిట్టయ్య |
అతని చూడగోరువారు అవధూతల్ అతని చింతలేనట్టివారు యమదూతల్
ఆశపాశలందు విషయ దాసులయి మోసపోక ఈశుడైన కృష్ణ హృదయవాసి గాదె ॥
కిట్టయ్య |
గోపాలకృష్ణ దేవ ఒక్కసారి ఊదరా చక్కనైన కృష్ణదేవ మక్కువతో పాడెదా
గోపాల బాలా కోరికతీరగా పాడరాదోయి నాతో పంతమేలా? చల్లనీ గీత నా పిల్లనగ్రోవితో పాడవేల తీయగా ఊదవేల హాయిగా ॥
గోపాలకృష్ణ |
83
Keep
కన్ను విప్పి చూడరోరన్న ఈ సాయి దేవుని, కన్ను విప్పి చూడరోరన్న x 2
కన్ను విప్పి చూడరోరన్న, ఈ సాయి దేవుండన్న మర్మము ఎరుగరోరన్న , నీ సాటి మర్త్యుండన్న భావము వీడరోరన్న
మున్నలింగిన పెద్ద లెన్నిన చిన్నలన్నియు నున్న విందు , అన్ని జీవుల కట్టడిలోనున్న గొప్ప వివేకమన్నా.
కన్ను విప్పి చూడరోరన్న ఈ సాయి దేవుని, కన్ను విప్పి చూడరోరన్న x 2
ఉన్న చోటను మాట లేదన్నా ఈ సాయి దేవుడు నెన్నగా ఎందైన కలడన్న
మున్ను షిరిడి నేడు పర్తి ఉన్నవాడనే పేరే గానీ, తన్ను భావన చేయు భక్తుల కన్నులందే మెలగుననా .
కన్ను విప్పి చూడరోరన్న ఈ సాయి దేవుని, కన్ను విప్పి చూడరోరన్న x 2
ఎల్ల రూపులు చూప నోరన్న ఈ సాయి దేవుండు వుల్లసిల్లని పేరు లేదన్న.
వెల్లడించే త్రిమూర్తి రూపములు ఎల్ల అవతారముల చూపె ఎల్లలేని పరాత్పరుఁడు ఎల్లయున తానాయడన్నా
కన్ను విప్పి చూడరోరన్న ఈ సాయి దేవుని, కన్ను విప్పి చూడరోరన్న x 2
పుట్ట గయిగా పుట్టినోరణ ఈ సాయి దేవుడు పుట్టపర్తిని పట్టే వలేనన్నా .
గట్టు చేర్చు మటన్నా వారాల గట్టి ఓడలు పట్టి చూడగా పట్టు బట్టలు కట్టి భక్తుల చుట్టు తిరిగె పుట్ట యోగినీ
కన్ను విప్పి చూడరోరన్న ఈ సాయి దేవుని, కన్ను విప్పి చూడరోరన్న x 2
తెరకీ చే చిక్క బోడన్న ఈ సాయిదేవుని ధీరుడె కనిపట్టి గలడన్న, దూరమైనను కట్టివేయును చేరువైనను కట్టివేయును, తీరిపోయిన నెట్టివేయను కోరి తానే పట్టుబడురా.
కన్ను విప్పి చూడరోరన్న ఈ సాయి దేవుని, కన్ను విప్పి చూడరోరన్న x 2
వట్టి మాటలవాడుగాడన్నా ఈ సాయి దేవుడు బుట్ట బొమ్మలు చూడ బోడన్నా.
చిట్టి పాదము గట్టిగా మది పట్టి నిల్పగ ఎట్టు లెంతగ, గుట్టు గున్ననూ సత్య రూపుని గుటు తెలియక గట్టు దొరకదూ.
కన్ను విప్పి చూడరోరన్న ఈ సాయి దేవుని, కన్ను విప్పి చూడరోరన్న x 2
నమ్మి చెడిన జనుండు లేదన్నా ఈ సాయిదేవుని నెమ్మనమ్మున వీడరోరాన్న .
నమ్మ వారిని వమ్ముసేయని నగదు నారాయణుడు సుమ్మ సమ్మతించి భజించి రామా షన్ను సన్నుత నవ్య తర్పము
కన్ను విప్పి చూడరోరన్న ఈ సాయి దేవుని, కన్ను విప్పి చూడరోరన్న x
84
Keep
కన్నువిప్పి చూడరోరన్నా శ్రీసాయిదేవుని ఎన్నగా ఎందైన కలడన్నా
మున్ను షిరిడి నేడు పర్తి ఉన్నవాడని పేరెగాని
తన్ను భావనజేయు భక్తుల కన్నులందే మెలగునన్నా | |
కన్ను | |
ఉత్తమాటలచేత చిత్తము సత్తు చిత్తానందము నొందదు
విత్తనంబులు లేని భూమిలో మొత్తముగ పంటేమి పండదు | |
కన్ను | |
రోగమును అరికట్టనేరక యోగియైనను పతనమొందును
భోగమును విడనాడు వారికే యోగమది లభించునయ్యా | |
కన్ను | |
ఒట్టిమాటల వాడు కాడన్నా ఈ సాయిదేవుడు బుట్టబొమ్మల చూడబోడన్నా
పట్టుబట్టలుగట్టి భక్తుల చుట్టు తిరిగే పుట్టస్వామిని | |
కన్ను | |
ఇంద్రియములు మనసు నిల్పిన అంధుడైనను ముక్తినొందును
ఇంద్రియములు నిగ్రహించని ఇంద్రుడైన పతనమొందును | |
కన్ను | |
నీతినియమము లేక తిరిగిన ధాతకైన అజ్ఞానమొదలదు
జ్యోతి లేనిదె అంధకారము భూతలంబున లేదటంచును | |
కన్ను | |
బుద్ధి నిలకడలేని మనుజుడు పొందజాలడు శాంతి సుఖములు
విషయసుఖముల వెంట పరుగిడు వెఱ్ఱిజీవికి ఎచట శాంతి | |
కన్ను | |
అల్పగురువుల చెంతజేరకు స్వల్పగుణముల చింత చేయకు
తలపులన్నియు నిలిపివేసిన తనువుకెప్పుడు జన్మ లేదు | |
కన్ను | |
అన్ని మతములు తననెజూపును అన్ని మూర్తులు తనవె రూపులు
అన్నిచెంతల తానెయుండగ అదియెకదా బ్రహ్మపదము | |
కన్ను | |
మతము మతమునకు మధ్య ద్వేషము జాతిజాతికి మధ్య జగడము
దేశదేశమునందు రగడలు దేనికయ్యా మత ప్రబోధలు | |
కన్ను | |
85
Keep
కల్యాణము చూతము రారండి శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి
చూచువారలకు చాలా పుణ్యమట పుణ్యపురుషులు ధాన్య భాగ్యమాట
భాగ్యమాభాగ్యము భేదము లేదట భక్తావెసుల ముక్తి దానమగు…(కల్యాణము చూతము)
అంబారీపై అరగు తేజమాత, ధగధగ మెరిసేది దివ్య రాముడట
రామ అంకమున రమణి సీతాయట సీతారాముల సోదర సేవకులు మన క్షేమమడుగునట
క్షేమము అడిగిన మనకిక కొదువ కదలరే కదలరే బదులిక పలుకక…(కల్యాణము చూతము)
వీణ సన్నములు వింతనగార్లట, పిల్లన గ్రోవులు మేలి మృదంగము
రథముల, గజముల, తుర్గము మేనక వారివెంట గుని వృద్ధ కౌశికుడు
అతని వెంట వృద్ద దశరథుడు, అతని వెంట మంత్రి సుమాత్రుడు, అత్యద్బుతముగా ఆనందముగా అయోధ్య అంతయు కడలి వచ్చినదీ. (కల్యాణము చూతము)
86
Keep
కృష్ణ భక్తియే సర్వసుఖాలో రయ్యో రయ్యో అది లేనివారి గతి ఈ లోకములో నుయ్యో గొయ్యో అయ్యా...అమ్మా... ॥
కృష్ణ భక్తియే ॥
2. తెలివితేటలకు కొదవే లేదూ కలికాలములోనూ, ఓ బాబూ, కలికాలములోనూ
గుణనీతులకూ స్థలమే లేదు పరిపాలనలోనూ అయ్యా... అమ్మా... ॥
కృష్ణ భక్తియే ॥
3. యెవరికి వారే యమునా తీరే అన్నా అన్నా
ఇల్లూ వాకిలి సిరిసంపదలూ సున్నా సున్నా అయ్యా... అమ్మా... ఆ ॥
కృష్ణ భక్తియే ॥
4 ప్రపంచమంతా పైసాకోసం ఒకటే ఆయాసం, ఓ బాబూ ఒకటే ఆయాసం
పైసా పదవులు ఉంటే వారికి అదియే కైలాసం అయ్యా... అమ్మా.... |
కృష్ణ భక్తియే ॥
5. పుణ్యకార్యములు చేయకున్ననూ ఫరవాలేదండి పాపకార్యములకు తలపడకున్నను అంతే చాలండీ అయ్యా... అమ్మా....... ॥
కృష్ణ భక్తియే ॥
87
Keep
కృష్ణా హరే చిన్నికృష్ణా హరే ముద్దుకృష్ణాహరే యని పిలచెదరా!
విష్ణుస్వరూపా సృష్టినిరూపా దుష్టసంహరా నిన్ రమ్మందురా | |
కృ | |
కృష్ణా! శతకోటి మర్తాండతేజుడౌ నీ ముద్దు చేతులకు గొలస కట్టెదరా
ముంగురులు దువ్వి మురళి చేతికి యిచ్చి అందమైన మోము చూచెదరా | |
కృ | |
88
Keep
చూతాము రారే సుదతులార సాయిబాబాను ॥
1 నిలువంగీతొడగునటా నీలి పీతాంబరుడట పరంజ్యోతిరూపుడట పరమాత్ముడు సాయిబాబ
చూ ॥
2 పుటపర్తిపురమునందు భక్తజనుల భవనమందు ముక్తినిచ్చెదననుచుతాను ముఖ్యముగ నిలచినాడట
3 చిత్రావతితీరమందు చిరుకొండ చివరయందు పర్తివాసప్రత్యక్షము పదుగురెదుట చూపునట
4 షిరిడివాసుడట చిన్ని సాయీశుడట హస్తలాఘవమున్నదట అడుగునన్నియిచ్చునట
5 శివరామ క్రిష్ణుడట చిందులందు మారుతట స్వరూపము లతడట సద్భక్తులకు చూపునట
6 కలియుగమునపుట్టినట్టి కలికాలదేవుడట కలుషములను బాపునట కరుణాసముద్రుడట
7 భక్తులతని పరుపులట తన శక్తియే వూయలట నరులపాటలే నాలుగు నాణ్యమైన గొలుసులట
8 భక్తులెచట పిలిచిననను పారిపోవుచుండునట గోవువెంటదూడవోలె దుముకుచును వెళ్ళునట
9 కన్నులందున యెపుడు కారుణ్యపు చూపులట ముద్దులొలుకుచుండునట ముచ్చటైనమాటలట
10 వారి మహిమ తెలియలేక మాయవలలోన చిక్కి మందభాగ్యులగుటకన్నా మంచిదారి దొరికెనట
11 తాను తలచినంతనే విభూతి తన హస్తము తగులునట క్షణమున దానితీసి తల్లడిల్లెడివారికొసగు నట
12 ఎన్ని పనులుండినను దండిగా శ్రీసాయినాధుని
పండు వెన్నెల లగుచు నటి పట్టు వీడక పాడెదము
ఎన్ని పనులుండినను దండిగా శ్రీసాయినాధుని నెలవునకు పట్టువీడక సాగిపోదము
13 రండి రండి మీరూ రమ్యమైన పర్తిపురికి శృంగారించినట్టి సాయిని చూడ్కులలరచూడబోదాము
14 తెలివిలేని మూఢులారా తెలివి తెచ్చుకొనినేడు తరలితరలివేగ మీరు తరలిరండు పర్తిపురికి
15 ముసిముసి నవ్వుతోను ముద్దైన యిసుకనేడు మూసి చూడగానే అదియూ లడ్డ క్రిందపడెను
16 మంత్రతంత్రమనుచు కొందరుమందభాగ్యులనుకొందురు
తెలివిలేని మూఢజనులు మరుగునందు తలచుచుంద్రు
17 ఇవి అన్నియు వదిలిమీరు యిష్టముతో భజనసలిపి
కష్టములను భరియింపగా కదలి రండి పార్థి పూరికి
18 భక్త బృందం తో నేడు బాబా మందిరంబు నందు
కీర్తికలిగినట్టి తులసి హారముకట్టుచుండగా
19 కుషితో సాయిశూడు నేడు కుప్పం భక్తులతో కూడి కోర్కెమీర చెప్పపాట కొనియాడుచు యిందురండి
20 ప్రేమ అనియడి ప్రమిద యందు భక్తి అనెడి నూనె పోసి , క్రోధమనెడి వత్తి నిలిపి కోర్కెమెర్ ఆరాతిదూరు
21. జయ మంగళం సాయినాధ శుభమంగళం గురునాధ
సర్వమంగళంబు మీకు సాయినాధగైకొనుట
22. అవనిలో యీపాట నెవరు పాడినను వినిననుగానీ పర్తీశుడచటవచ్చి. పరంజ్యోతిరూపుచూపునట
89
Keep
చిన్ని కృష్ణ మురళీధర వెన్న చోర నన్ను గావర
కన్న తండ్రి నన్ను బ్రోవ కరుణతో రా రా దేవ దేవా సాయి దేవా(చిన్ని…)
రాధ రమణ కృష్ణ వేదాభరణ, లేదా కరుణ బుడనుత చరన యదు నందన శౌరీ మందార గిరిధారి(చిన్ని…)
భక్త లోక పరిపాల సద్గుణ షీలా, వెదుదు చాలా జాలమాడేలా మౌక్తికాహార కృష్ణ వేగమే రా రా(చిన్ని…)
లీలా మానుష రూప గొప జాలరా కోపమేలరా గోపకుమారా
కల హరణమేల నీ తాలగ జాలా (చిన్ని…)
బృందావన విహారి మది నినుగోరి, భజియింతు మురారి సజ్జనులను చేరి నందనందన కృష్ణ వందన మిథేరా (చిన్ని…)
90
Keep
జగములనేది నాటకంబునాదింతువుగా, ఎరుగ గలరు నీ లీలలు(బాబా)ఎవరైననుగా
కామ క్రోధులకు నీవు కానరావుగా, పాపభీతి కలుగ భక్తుల పాలింతువుగా (ఎరుగ…)
యోగవంతులకు నీవు ఎరుక వస్తువే, దొంగ సన్యాసులకు దూర మండువే
తెలివిలేని మూఢ జనుల(నిన్ను)తలప కుందురు(జగములనేది…
సత్యవంతులకు నీవు సాయ పడుదువే,
అందుకనే నిన్ను సాయి బాబా అందురే, అందుకనే నిన్ను సత్య సాయి అందురే సరగున బ్రోచేతి పార్థివాస అందురు(౨), భక్తుల బ్రోచేటి పార్థివాస అందురు (జగములనేది…)
91
Keep
జాలమేల గోపాలబాల నీ లీలలు కనుగొన మాతరమా!
జాలికలిగి మొరలిడుటకు మేము గజరాజునకూ సరిరాము కదా!
మేలు ఫలంబులు ఎంచితెచ్చుటకు ఆ శబరికి సరిలేము కదా!
చిరుత ప్రాయమున శ్రీహరి హరియని మొరలిడుటకు ప్రహ్లాదులమా కూరిమితోడను చేరదీయుటకు గౌరవమున కుచేలురమా కరుణతోడ కడు ప్రతిజ్ఞ చేయ పుడమిని ధ్రువులము కాము కదా ॥
వేడుకతోడను విందు లొసగుటకు విదురునకు సరిరాము కదా !
ముద్దు కృష్ణుని వద్ద జేరి బలు సుద్దులు విన అక్రూరులమా
92
Keep
తాండవ కేళి సల్పెను పరమేశ్వరుడు శ్రీ సాంబ శివుడు తాండవ కేళి సల్పే కుణ్డలీన్ద్ర కంకణుడు
సలుగాఢక్కా చేపట్టి ఝాన ఝాన ఝాన ఝాన తక యనుచు తాండవ కేళి సల్పెను…
శశికళ మస్తకమున భాసితముగా విభూతి పూసి,
విషము గలమునందున మిస మిస మిస మిస మిసాయని మెఱయఁగ
తాండవ కేళి సల్పెను…
శిఖములో మున్నేటి కన్య ముఖములో మూడవ కన్ను సొగసుగా స్ఫటికక్ష మాలలు నిగ నిగ నిగ నిగాయని మెఱయఁగ
తాండవ కేళి సల్పెను…
సరస్వతి వీణ వీదగా పురందరుండు వేణు ఊదగా హరి మృదంగము బయింపగా ధిమి ధిమి ధిమి తక యనుచు తాండవ కేళి సల్పెను…
రామా దేవి గీతము పాడగా కమలాక్షుడు తాళము వేయగా
ఉమా దేవి కావున హరుడు పరి పరి పరి విధములుగ తాండవ కేళి సల్పెను…
దేవాది దేవేంద్రములు దేవతా గన్ధర్వా శ్రీలు భావమున జనదుం భోజునూ భాని భాని భాని తక యనుచు తాండవ కేళి సల్పెను….
నారదుండు తుంబురు మిటగ జటాజూటమున శిరమున మెఱయఁగ
త్రిశూలము తో తోకుచు హరుడు తదిమ తదిమ తది తక యనుచు
తాండవ కేళి సల్పెను…
గౌరీ దేవి జగములనెలాగ గంగా దేవి నదులైపారగా విఘ్నేశ్వరుడు అటు ఇటు తిరుగగా అవిఘ్నంబుగా ఆడెను హరుడు తాండవ కేళి సల్పెను…
93
Keep
తైతై తైతై తైబొమ్మా!
దీని తమాష చూడర మాయబొమ్మ!
ఖ్యాతిగ దీనికి ముందువెన్కగల
కథ వివరింతును విను జీవా! | |
తై తై | |
మాతృగర్భమున మలమూత్రముల
రోతల నీవు రోదింప
ప్రీతిగ వీరలు పేరంటమ్ములు
చేతురిదెంతటి చిత్రమురా! | |
తై తై | |
పుట్టితి మతి కోల్పోయితి దుర్గతి
పుట్టితినని నేనేడువగా
అట్టే నవ్వుచు నానందించెద
రిట్టి వీరు నీకెవరయ్యా? | |
తై తై | |
మసిలో మట్టిన మలమూత్రములన్
మసలుచు సిగ్గను మాటయె లేక
పసిపాపడవై ఏడ్చుచు లేచుచు
దినమొక నాటకమాడవకొ. | |
తై తై | |
తోడి వారలతొ కూడియాడుచు
వేడుకతో పలు విద్యలు నేర్చుచు
చూడచూడగ చోద్యపు కళతో
ఎడేడునకు ఎదిగే బొమ్మా. | |
తై తై | |
సతియని పతియని సరస భావమున
జత జేరుచు సంసార రంగమున
అతి కౌతుకమున నంతకన్ననిక
అన్యము లేదని ఆడితిరే | |
తై తై | |
బొమ్మను బొమ్మను పొందు పరచి పలు
బొమ్మలు సేయుర బ్రహ్మయ్య
నమ్ముటవన్నియు నావేయని థిం
థిమ్మని వానితొ నాడుదుగా | |
తై తై | |
ధనము గూర్చునెడ దాచిపెట్టునెడ
దానిబెంచ నది చనినపుడున్
తనువుతోడ నీ మనసుతోడ నీ
తాండవమెన్నగ తరమౌనా | |
తై తై | |
కామము, క్రోథము గట్టి కోలగా
తామసంబు ముకుదాడులుగాగన్
కామినియున్ కనకంబు చేతిలో
గంగిరెద్దులై గంతులు వేసే | |
తై తై | |
సాగుచున్నదని లోగిన వారిని
సంకట పెట్టుట సంతసమా?
ఈగ కాలియంతె వికటించిన
నీ గతి తైతకలే కదా! | |
తై తై | |
ఉరిమి చూచుచును కరములూచుచును
ఒడలెరుగని శవమొందుచును
అరచుచునెగురుచు అందరు నవ్వగ
ఆగ్రహమను దయ్యము పట్టిన | |
తై తై | |
చదువెందులకని సంగతి మరచి
ఉదర పూర్తికై ఉరుకులెత్తుచు
ఎదుటి గొప్ప సహింపకేడ్చుచు
సతమతమయ్యే చదువుల బొమ్మా | |
తై తై | |
గుట్టుగ నీ చెడుకోర్కె చెల్లెనని
లొట్టలు కొట్టకు రోరన్నా
చిట్టా రాసే చిత్రగుప్తు కం
డ్లెటుల గంతలు కట్టుదురా! | |
తై తై | |
అందము ప్రాయము ఇంద్రియశక్తియు
ఉందని నిక్కకురోరన్నా
ముందున్నదిరా తొందరలోనే
ముసలితనమ్మను ముసుళ్ళ పండుగ | |
తై తై | |
మసలలేవు కనుమసకలు మోమున
ముడతలు పడె తల నెరిసెనుగా
ముసలి కోతియని పసివారలు నిన్
ముసిముసి నవ్వగ కసరే బొమ్మా | |
తై తై | |
చచ్చు దాక సంసార చింతలో
పుచ్చిన లాభము వచ్చేనా!
అచట నీ యమయాతన కడ్డము
వచ్చేదేదిర పిచ్చయ్యా? | |
తై తై | |
బుఱ్ఱుమనుచు జీవుండను పిట్ట
బుట్టబొమ్మను విడిపోగా
బిఱ్ఱుగ నీల్గిన కఱ్ఱ బొమ్మ యిది
బఱ్ఱున బయటకి పట్టి లాగే | |
తై తై | |
పంచభూత సంభవమౌ మేనికి
పంచత్వము ప్రాప్తించు కదా!
వంచితుడై నాదంచు దీనికై
వాంఛగొంచు దుఃఖించే జీవా! | |
తై తై | |
బంధువులందరు వాకిటి దాకను
వల్లకాటికిని వత్తురుగా
బంధమణచి నిను బాయని ఆప
ద్బంధువు భగవన్నామమెరా! | |
తై తై | |
నమ్ముకొనకు నిత్యమ్మని దేహము
పుట్టి ముంచునది నట్టేటన్
తుమ్మునంతలో తూలిపోవునీ
తొమ్మిది తొఱ్ఱల తోలుబొమ్మ | |
తై తై | |
ఆపదలన్ సౌఖ్యములందున
ఏపుమీరగా ఏడ్చుచు నవ్వుచు
ఆ పరమేశ్వరునానతి మేరకు
ఆడే భోగము తాపా బొమ్మా | |
తై తై | |
ధర్మకర్మ సూత్రంబులకొని నిన్
తానాడింపగ దైవంబు
మర్మమెరుంగక మాయేటందువు
మాధవుచేతి కీల్మొమ్మా | |
తై తై | |
తరతరమును సుస్థిరమనిపించును
పరమావస్థల పాలుచేయుచు
మరునిమిషంబిది మరుగున పడురా
పరమాత్ముడు సల్పిన మాయ బొమ్మ | |
తై తై | |
చెట్టైపుట్టై చీమైదోమై
చిలుకై కొండచిలువయునై
పుట్టుచు గిట్టుచు కొట్టుకొనుచు
గట్టే వెతకని కర్మజీవా! | |
తై తై | |
అరుదుగ దొరికెను నరజన్మంబిది
అరనిముసము వృధా పరుపకురా
తెరువు నెరుగు చని పరమాత్ముని గని
చిరసుఖమొందర చింతాజీవా! | |
తై తై | |
నీ యదృష్టమున సాయికృష్ణుడై
ఆ యఖిలేశుండగుపడురా
హాయిగ సత్యసాయినాత్మలో
అరయుచు నిను నీవే ఎరుగుమురా | |
తై తై | |
నీటుగ మాటలు కోటి పల్కినా
నీ కడుపింతయు నిండదురా
సూటిగ నాత్మజ్యోతిని కన్ననె
ఆటవిడుపు నీకగునయ్యా | |
తై తై | |
వ్యర్థంబగు నీ వెఱ్ఱి బఱ్ఱకథ
విని అజ్ఞానము వీడుము జీవా
సార్థక సత్యసాయి బుఱ్ఱకథ
కని ప్రజ్ఞానము గొనరన్నా | |
తై తై | |
94
Keep
తెలియగ తరమ నరులు కనుగొన వశమా
పరమ తపోనిధులకైనా బ్రహ్మకునైనా
తెలియగ తరమ నరులు కనుగొన వశమా
నీ మహిమ తెలియకేందరో ఈ మాయలో బడిరి
నీ మరుగు జొచ్చినట్టి జనులు మహిమలు గనిరి
నీ మర్మలీల కనుగొన మానవులకు వశమా
తెలియగ తరమ నరులు కనుగొన వశమా
శరణు జొచ్చినట్టి జనుల సన్నిధి జెర్తు నీ సన్నిధి జెర్తు
గర్వించినట్టి జనులను నీ కాలను డ్రోతు నీ కాలను డ్రోతు
శ్రీ సాయి హరే శ్రీ సాయి హరే నామస్మరణ దలచిన చాలు
తెలియగ తరమ నరులు కనుగొన వశమా
95
Keep
త్వరపడుమా త్వరపడుమా
ప్రభుసాయీశుని ప్రేమ పిలుపులవి
వినబడుచున్నవి రమ్మనుచు
పరమార్థము చేకొనుమనుచు | |
త్వరపడుమా | |
యోగసాధనల పనియేలేదట
ఉపదేశంబులు లేవు కదే
ప్రజలకు తరుణోపాయంబగు
శ్రీసాయీశుని నామమటె | |
త్వరపడుమా | |
మత భేదంబుల మాటే లేదట
మానవ సేవయె జేయునటె
మానుగ బాధలు బాపి భక్తులను
మరువక బ్రోచే సాయియటె | |
త్వరపడుమా | |
96
Keep
నన్నెలవా సత్య సాయి బాబా కనీట పదాలు కడిగేను బాబా
ఏ చోట కన్నా నీ రూపమే ఏ నోట విన్న నీ నామమే
మంగళ కారమౌ మార్గము చూపా మహిలో వెలచిన శాంతి స్వరూప
నన్నెలవా సత్య సాయి బాబా కనీట పదాలు కడిగేను బాబా
కన్నీట కెరటాలు అలల తెరల నిను కాచలేకున్నాను కరుణింప మన్నాను
తనువు మనసు అర్పింప నున్నను అందుకో అందుకో బాబా
నన్నెలవా సత్య సాయి బాబా కనీట పదాలు కడిగేను బాబా
యెదలో ఏదో వేదన నాకెలా ఈ వింత శోధన
మనసారా చేసెను ఆరాధన ఆనందముగా చేతు ఆత్మర్పణ
నన్నెలవా సత్య సాయి బాబా కనీట పదాలు కడిగేను బాబా
బ్రోచేవారెవరురా
నిను విన ,నిను విన
రఘువరా, రఘువరా
నను బ్రోచేవారెవరురా
నిను విన రఘువరా
నీ చరణాం భుజములునే
నీ చరణాం భుజములునే
విడజాల కరుణాలవాల
బ్రోచేవారెవరురా ఆ ఆ
చరణం1:
ఓ చతురా ననాది వందిత నీకు పరాకేలనయ్య
ఓ చతురా ననాది వందిత నీకు పరాకేలనయ్య
ఓ చతురా ననాది వందిత నీకు పరాకేలనయ్య
నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములీచ్చి వేగమే
నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములీచ్చి వేగమే
నీ చరణాం భుజములునే
నీ చరణాం భుజములునే
విడజాల కరుణాలవాల
బ్రోచేవారెవరురా ఆ ఆ
సీతాపతే నాపై నీకభిమానము లేదా
సీతాపతే నాపై నీకభిమానము లేదా
వాతాత్మజార్చిత పాద నా మొరలను వినరాదా
భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా
భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా
భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా
నా పాతకమెల్ల పొగొట్టి గట్టిగ నా చెయి పట్టి విదువక
నీ చరణాం భుజములునే
నీ చరణాం భుజములునే
విడజాల కరుణాలవాల
బ్రోచేవారెవరురా ఆ ఆ
బ్రోచేవారెవరురా ఆ ఆ
రామ నన్ను బ్రోవర రామ నన్ను బ్రోవర x 3
ప్రేమతో లోకాభి రామ నన్ను బ్రోవరా x3.
చీమలో బ్రహ్మలో x5 శివకేశవాదులలో
చీమలో బ్రహ్మలో x3 శివకేశవాదులలో
చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో
ప్రేమమీర కాచిఉన్న రామ నన్ను బ్రోవర
పల్లవి
రామ నన్ను బ్రోవరా - ప్రేమతో లోకాభి
అనుపల్లవి
చీమలో బ్రహ్మలో - శివ కేశవాదులలో,
ప్రేమమీర వెలుగుచుండే - బిరుదు వహించిన సీతా,
చరణము
మెప్పులకై కన్న తావు - నప్పు బడక విఱ్ఱవీగి
తప్పు పనులు లేక యుండు - త్యాగరాజ వినుత సీతా
97
Keep
నమో సత్యసాయి బాబా
నమో సత్య సాయి బాబా నమో సత్య సాయి
నమో విశ్వ తేజా జ్యోతి స్వరూపా
అరుణ కాంతిలోన అగుపించే నీ మోము
ఆ మోము కాంచిన అంతరంగము పొంగె
ఈ నాటి ఈ సుఖము ఏ నాడు పొందము
ఏ నోము నోచాము ఎప్పుడు కను గొన్నాము
నమో సత్యసాయి బాబా
విరులు తరులు వికసించినవీ, మనసు తనువు పులకించినవీ
వరుసగ నిలచి వదలము మరచి, తరియించి కోరము నీ చంట నిలచి
నమో సత్యసాయి బాబా
98
Keep
పార్థివాసా సాయి శక్తివేశ, మాకు ముక్తి దారి చూపవయ్యా,సత్య సాయీశ.(పార్థివాస…)
సతీ సక్కుబాయి నిన్ను సందర్సింపగా కోరి, వ్యధలేన్నిచెండెనో మదిలో లేదా
మోక్ష ప్రదాత నిన్ను దీక్షిమ్ప కోరిన, రాణి మీరా చింత ఎలా తెలియదు(పార్థివాస…)
భక్త నందనారు నిన్ను భజన చేయగా కోరి, వ్యధలేన్నిచెండెనో మదిలో లేదా
రాసి త్యాగరాజు నిన్ను రామ రామ ఎనుచు, తిరిగిన కథలెల్ల మరచినావా(పార్థివాస…)
ఎలా కృప కలగదేల రావెల బ్రోవ,
పిలచి మాట్లాడ వేళా బాల గోపాలా
పిలచి మాట్లాడ వేళా సాయి గోపాల(పార్థివాస…)
99
Keep
ప్రభూ మీ నామచింతనే సదా సంతసం
ఈ రాధభక్తి లోకానికి శాంతి పర్వతం
కదళీ కర్జూరం కమ్మని చెరుకురసం
చక్కెర తేనె పండ్లు సారవిహీనాలూ
ప్రభూ మీ నామమే ఈ రాధకు మధురాహారం
మీ కరుణా, హరి హరి మీ స్మరణా
అదియే భూషణం ధరా పోషణం
ఈ రాధభక్తి ప్రతి జీవికి ముక్తి సాధకం
100
Keep
మరిచితివేమో మదిలో మమ్ము సాయినాథ ప్రభువా,సాయినాథ ప్రభువా
మరుగు చేరితిమి మము దరి చేర్చుము(2), మానితావర ప్రభువా కానవ సాయినాథ ప్రభువా(2)
సాయినాథ ప్రభువా(మరిచితి…)
వ్యాధుల తోడన్ బాధలనొందం,వ్యర్థాలను బడితే విదియ మాకు,ఈ ధర పాపంబులు భరియింప(౨)
వెలసితివాటా దేవా కానవ సాయినాథ ప్రభువా(౨) సాయినాథ ప్రభువా(మరిచితి….)
ఆపద్బాంధవుడంచు వింటిని,ఆదరించామని వేడుకొంటిని(౨), మాపై నీ కృప చూపుమాటన్తిన్(౨) మము విడనాడగా జూసెదవా సాయినాథ ప్రభువా(౨), సాయినాథ
101
Keep
యెంత మంచి తీపి మీరంతా సేవింపుడి రాతిని బహుప్రీతిని ధర నాటినిగా జేసినా సీతాదినాథుడైన శ్రీరామచంద్రనామ(యెంత...)
పోవును దుర్భావము రాబోవును సద్భావముల్ ట్రావంగా ట్రావంగా నీ పాపమెల్ల బాపఁగన్(యెంత...)
దక్షిణ పరీక్షణ ఉపేక్ష చేయజాలన పక్షీన్ద్ర వాహనుడైన పట్టాభిరామనామ (యెంత. )
భూషణాది భూషణ విభీషణ సుభాసన పోషించే రాజుగానే బ్రోచునట్టి రామనామ (యెంత...)
చక్కరకొ నిక్కము బలమొక్కడ ముదమెక్కగం, గృక్కంగా గ్రుక్కనఁగన్ కోదండ రామ నామ(యెంత.,)
శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు సంతోషమున జెసి నట్టి సాకేతరామనామ (యెంత...)
సారము రాసాము సుసారా నారికేళము,మీరంగా మీరంగం మేలైన రామ నామ (యెంత...)
102
Keep
రేపే వస్తాడంట గోపాలుడు! మాపే వస్తాడంట గోవిందుడు
రేపు మాపుల వచ్చు గోపాలుడు! మాపల్లె కొస్తాడు గోవిందుడు మన వ్రేపల్లెకొస్తాడు గోవిందుడు
గోవర్ధన గిరి యెత్తిన గోపాలుడు! వ్రేపల్లెను నిలబెట్టిన గోపాలుడు ఈ గోపాలుర కాపాడిన గోపాలుడు!
రేపే వస్తాడంట గోవిందుడు.
నందకుమారుడె గోపాలుడూ కృష్ణా....
సుందర రూపుడె గోపాలుడు అందరి జీవుడె ఆ దేవుడు (మన) వ్రేపల్లెకొస్తాడు గోవిందుడు
రేపే వస్తాడంట గోపాలుడు! మాపే వస్తాడంట గోవిందుడు గోపాలుడూ నంద గోపాలుడు! వేణుగోపాలుడు చిన్ని గోపాలుడు
103
Keep
రేపే సుదినం మనకు (అహాఅహా) అహహహా.... పుణ్యము ఫలియించె (మన) పూబోణులారా పూలమాలలు తేరే
తెల్లని మల్లెల హారం.... తేరిటు వేగముగా (రేపే)
కళ కళలాడే కన్నయ్యకు! కళ కళలాడే కృష్ణయ్యకు
నీలాంబరపూమాలా! నిండుగనూ తేరే (రేపే)
నిగనిగలాడె స్వామికిని! బలువేగమె కొని తేరే (రేపే)
104
Keep
రాబోకు రాబోకురా చందమామ
రాబోకు రాహువు పొంచి ఉన్నాడు త్రోవలోనా
తరులెక్కి గిరులెక్కి తిరిగి చూచేవు
మబ్బుమేఘములలోన మాయమ్యేవు | |
రాబోకు | |
105
Keep
రామ కోదండ రామ రామ పట్టాభి రామ రామ కళ్యాణా రామ రాఘవా…(రామ కోదండ…) రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట
రామ నీ పాటే పాత రామ నీ బాటు బాట(రామ కోదండ…) రామ నీకెవరు తోడూ రామ క్రీగంట చూడు రామ నేను నీ వాడు రామ నాతొ మాటాడు(రామ కోదండ..)
రామ నామమే మేలు స్వామి చింతనే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు రామ నామమే మేలు…(3 లెవెల్స్)నీ నామమే మేలు…(౩ లెవెల్స్)
నామమే మేలు…(3 లెవెల్స్)(రామ కోదండ…)
106
Keep
రమ్మని పిలచితే రావేల నికింత రాజాస మేలరా రాధా విహారా తిమ్మరి వలే నీకై తిరిగి వేదాడితి కమ్మవించు జనక కమల పంజరపు చిలుక
సమ్మతించక ఇతర సుఖములు నెమ్మనమ్మున నినె నమితి
కర్మమేమో కానీ నాపై కరుణ కాగుగాదు ఏమో నిరతము
రమ్మని పిలచితే రావేల నికింత రాజాస మేలరా రాధా విహారా
కరుపురంగము లోన అరుదైయనని గొప్ప ఖగపాటి నేచితివా
ఇల్లు వాకిలి లేదు ఇల్లే సాగర మైయే
ఇట్టి సంపద కలిగే నాని ఇంత గర్వం ఇంకెలా కలిగెను
చెలిమి కలిగిన భక్తులకు కరుణ చూపులు చూడవేమో
రమ్మని పిలచితే రావేల నికింత రాజాస మేలరా రాధా విహారా
గోవులు గాచుట గోపిక వస్త్రపహరి అగుట నే నెఱుగునా
పిడికెడి అటుకులు తినుచు కడు తృప్తి నోదినా కంజాక్ష నీ లీల ఘనముగా వింటిరా
చిక్కి చిక్కని వాడవనుచు ఎక్కడ చూచినను నీవే
అక్కరకు దాక్కున్నా నేనిక మక్కువ తో పూజించ శ్రీపతి.
107
Keep
శ్రీ గణేశ శివుని కుమారా శ్రితజన వినుత ప్రభో(ప్రభో)(౨) శ్రీ గణనాథా సేవిత పాడా (3)
నాగటి నీవని నమ్మితి సదా, నాగాభరణ ననుడాయ గొనవ(శ్రీ గణేశ…)
ఇద్దరు తల్లుల ముద్దు కుమారా (3)
భక్తుడనైతిని వద్ద జేర్పర, కొద్ది కృపను నా గోసంగి బ్రోవర (శ్రీ గణేశ…)
కొగ్గుగమనా న దిక్కునివేరా (3)
మక్కువతోనా మదినిల్పితిరా, అక్కర సేయక ఆదరించారు(శ్రీ గణేశ…)
సజ్జన సాధుల సన్నుత చారాణా (3)
కొజ్జా దేవా గజాసుర హరణ, బొజ్జ విశాల విజయ గజానన(శ్రీ గణేశ…)
శ్రీ కైలాసపుర విఘ్నేశ (3) మొరవిని కరుణతో మేము కావుము ఈశా, ద్విరాట వాదన శాంతా ప్రకాశం (శ్రీ గణేశ…)
శ్రీ సాయీశుని సేవక జనులము (3) సాయి భజనలు చేయుటయు మన్యం , జయమిదరావు రాయం ఉన దేవా భక్తులకావ (శ్రీ గణేశ…)
108
Keep
శ్రీవెలయు గోకులములో కిట్టయ్య చెలగి వేడుక నుండగా
ఆ కంస భూపాలుడూ హంతకుడై హతమార్ప సమకట్టెను ॥
కళ్యాణ | |
అతి పిన్న వయసునందే అందరికి ఆకర్షణీయుడగుచూ కనిపించినట్టి దిష్టీ! బంగారు కిట్టయ్యకంటకుండు ॥
కళ్యాణ | |
కాళీయు నణగదొక్కి కిట్టయ్య కరమున తోకపట్టి నృత్యమాడగా చూచి నా కనుదృష్టి నష్ట పరిహార దిష్టి ॥
కళ్యాణ | |
ఇంద్రయాగము మానగా రుద్రుడై వరుణుడు రాళ్ళ వర్షం కురిపింపగా గోపాలుడూ గిరినెత్తినట్టి దిష్టిని తీతును ॥
కళ్యాణ | |
అమ్మలక్కల దిష్టియూ ఈ అయ్యలప్పల దిష్టియూ ఆబాల వృద్ధ దిష్టి, ఛీ పో! ఛీ పో, పొమ్మని దిగదీతును ॥
కళ్యాణ | |
109
Keep
సాధించెనే ఓ మనసా సాధించెనే
ఓ మనసా సాధించెనే x 2
బోధించిన సయీసుని బోధలు x 3 బొంకు జేసి తా బట్టిన వాడు
సాధించెనే ఓ మనసా
సమయానికి తగు మాటలాడడు సంతోసముల తోనే పంపించెను
సమయానికి తగు మాటలాడడు
పార్థీసుడు సద్ భక్త జనకుడు సంగీత గాన ప్రదాయకుడు ఇతడు
సమయానికి తగు మాటలాడడు
రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత
సారంసుడు
ఇతడు సమయానికి తగు మాటలాడెడు
గోపీ జన మనోరధము మొసంగ లేకనే గేలియు జేసే వాడు
సమయానికి తగు మాటలాడడు
పరమ భక్త వత్సలుడు, సుగుణ పారావారుండాజన్మ మనఘూడి
కలి బాధలు దీర్చు వాడనుచునే హృదంబుజమున జూచు చుండగ
సమయానికి తగు మాటలాడెనే
బలే సాయి దేవ పార్థీష మృదు సుభాశ శేష శయన
పర నారి సోదరాజ విరాజ తురగరాజ రాజనుత నిరామయ కరణ కరచీ తురగరాజ యనుచు వేడుకొన్న నన్ను కాపాడిన వాడు
సమయానికి తగు మాటలాడెనే
శ్రీ వేంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మాన సనికేతన
కనకాంబర ధర లసన్ మకుట కుండల విరాజిత హరే యనుచు నే
పొగడగా త్యాగరాజ గేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు
సమయానికి తగు మాటలాడెనే
110
Keep
సాయి నామము దొరికే కదా తామస గుణముల నరికే కదా కామ క్రోధ మోహాంధకారముల కాల్చి కాల్చి మసిచేసే కదా
అయిదు భూతములు మ్రింగే కదా పరమానందంబున పొంగే కదా ఆయిదైదిరువదియైదుల సంగము ఆది మధ్యము నంతయు వెలసిన (సాయి నామము దొరికే కదా…)
పుట్టుట గిట్టుట పోయే కదా జుట్టు గట్టిగా పాటె కదా దట్టమైన గాఢాంధకారము, పట్ట పగలే మహా జ్యోతి వెలెగెనట (సాయి నామము దొరికే కదా…)
చిత్రావతి తీరము నిలిచే కదా గురుదాసుని మదిలో పలికే కదా పుట్టపర్తి దేశం యూ దయవాసితు కాచీ భాసుర దాసులనేలిన (సాయి నామము దొరికే కదా…)
111
Keep
సాయి నామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా భూమిలో దొరికే ఈ మిఠాయిని తిని, పామరులై చెడిపోవక మునుపే (సాయి నామమును…)
వేదసారమను గోధుమపిండితో,వేదవాంఖ్యమను ఆవు నేయి బోసి ఆధారమైన పెద్ద బంఢము లోన, ఆదిమునులు దీని పాకము బట్టిరి (సాయి నామమును…)
నీబుద్ధి అను కండచక్కర దెచ్చి,సుబుధియాను క్షీరము బోసి, అబద్ధమనియేటి మలినం తీసి, ఆదిమునులు దీని పాకము బట్టిరి (సాయి నామమును…)
రాకరకమైనది సాయి ప్రసాదం,సకలరోగ నివారణ మోయ్ ఒక కాసైనాను ఖరుచ్య్ లెదోయీ, తకరారు సేయక తీసుకొండాయి (సాయి నామమును…)
తారకణమైనది మైనది ప్రసాదం పాత్రా,సారధి దాసుల కీమో యెఱుక దూరము పోయి కొనపనిలేదిక, పుట్టపర్తి పురములో కొల్లగా దొరుకును (సాయి నామమును…)
112
Keep
సాయిసాయి సాయిరామా యని మీరు రయమున పాడగ రారండి!
ప్రేమ మీర ఓ సాయిరామా యని పిలచి తరింతురు లేవండి. | |
సాయి | |
కుక్క తోకయగు మానవ మనసును చక్కబరచును రారండి
ఒక్క మనస్సుతో నమ్మి సాయిని చక్కగ స్మరణము చేయండి. | |
సాయి | |
పుట్టుట గిట్టుట రెండే జన్మకు గట్టివనుచు మది తలచండి
వట్టి భ్రమలతో మునిగి కర్మలు ఎట్టివి చేయక మెలగండి. | |
సాయి | |
కలియుట బాయుట కాలవాహిని కాంక్షలు విడిచి చూడండి
కర్మయోగమే జన్మకు ముఖ్యము ధర్మము నడచి మెలగండి. | |
సాయి | |
నామస్మరణయె ముఖ్యవిద్యయని నియమముతో సేవించండి
తక్కినవన్నీ హుళక్కి విద్యలని పక్కకు నెట్టుట చూడండి | |
సాయి | |
తన తలపెల్లఫలింపకున్న యిక దైవము వలదని అనకండి
దయకు ప్రాప్తుడై మెలగిన తలపుల ఫలములు కొరతేముందండి | |
సాయి | |
కూటికి పేదయు కోటీశ్వరుడును కాటికి ఏగుట సమమండి
కోతిగుణంబులు మాని ఈ పరంజ్యోతి రూపమును జూడండి | |
సాయి | |
పామరత్వమే ప్రకృతి అందమను పాటను మీరిక మానండి
పరుల బాధలు తమయట్టివియని నియమముగ మదిలో తలచండి | |
సాయి | |
మానవ ధర్మము మాధవునాజ్ఞని మర్మమెరిగి భజియించండి
సర్వజన ప్రియ సాయీశుండనిసారెకు మదిలో వేడండి | |
సాయి | |
లోకముకై దిగులొందక మీరు లోకేశుని సేవించండి
వర్ణాశ్రమ ధర్మంబులు వదలక ఓపికతో సాధించండి | |
సాయి | |
మనసుకు లోనై మరిమాటాడక మాధవ స్మరణము చేయండి
మర్మమెరింగిన మరునిముసములో మనసే వారికి గురువండి | |
సాయి | |
భక్తిజ్ఞానవైరాగ్యములన మాకు శక్తి చాలదని యనకండి
నామస్మరణతొ కూడినవి నయభయవిశ్వాసములేనండి | |
సాయి | |
చీకటివెలుగులు కష్టసుఖములు చేసిన కర్మకు ఫలమండి
బాగుగ నమ్మక ఓగున ఏడ్చే పామరత్వమును వదలండి | |
సాయి | |
జాతినీతి మతశాస్త్రములాదిగ దైవలీలలని తలచండి
ఎట్టి బాధలను పెట్టిన మరువక సాయిరామయని తలచండి | |
సాయి | |
నరుడైనందుకు పరమాత్మయని తలచిన నరుడని ఎంచండి
భగవన్నామము వలదను నరుని నరపశువని భావించండి | |
సాయి | |
రామకృష్ణ హరిగోవిందా నారాయణ శివయని తలచండి
అన్ని నామములు పరమాత్మవెయని భేదమడచి భజియించండి | |
సాయి | |
సృష్టియంతయు భగవత్సంతతి భక్తులమని భావించండి
భక్తులందరు సోదరీసోదర ప్రేమభావములు పెంచండి | |
సాయి | |
ప్రేమే దైవము దైవమె ప్రేమయని ప్రేమ తత్త్వమును పెంచండి
ప్రేమలలో నిష్కామప్రేమనుపట్టు విడక సాధించండి | |
సాయి | |
సాయిరామ యని నామము తలచిన సర్వ బాధలు సమయునండి
నియమముతో సేవించువారికి నిశ్చలతత్త్వము కుదురునండి | |
సాయి | |
పుణ్యకార్యములు చేయకున్నను పాపములను తలపెట్టకండి
పాపములన్నింటికంటె మించినది పరులను నిందించేదండి | |
సాయి | |
ఇట్టి గుణంబులు నేర్చినవారికి ఇహపర సుఖములు కలుగునండి
సాయిరామయని భజనలు చేసిన అన్ని సౌఖ్యములు కలుగునండి | |
సాయి | |
సత్యముధర్మము శాంతముప్రేమ ఉత్తమ స్థితికి త్రోవండి
కామక్రోధ ద్వేషంబులను చుట్టి చూరను పెట్టుట మేలండి | |
సాయి | |
బీదసాదలను భేదభావములు సాయికి మదిలో లేవండి
పర్తివాసుని పాదము వీడక పదములతో మీరు పాడండి | |
సాయి | |
Previous
←
2008