Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
His songs · 1985
Tap a verse for its meaning
IAST
Telugu
Devanāgarī
Kannada
Tamil
Malayalam
Meaning
Continuous
12
Keep
కర్మ దాట వశమా నరుడా కర్మ దాట వశమా
చిన్న చెలమలో ముంచిననైనా సప్తసాగరాల్ నించిననైనా
కడవెంతో నీరంతేరా కావాలన్నా ఎక్కువ రాదుర | |
కర్మ | |
ధనికుడు తృటిలో బికారికాడా పండితుడింతలో పశువైపోడా
కఱ్ఱపామై కరవను రాదా కర్మ హేతువు కర్మే మూలము | |
కర్మ | |
భుజబలమెంతో చూపినగాని మొనగాడనుచు మురిసిననైన
ముక్కును త్రాడై ముందుకులాగే ఆముగదాడే కర్మరా
ఘన పాఠంబులు చదివినగాని కులదేవతలను కొలచినగాని
కారడవులకే పోయినగాని కఠిన తపస్సులే చేసినగాని | |
కర్మ | |
13
Keep
ఏలా నిరాశ పర్తీశుండుండా ఏలా నిరాశ
సాయీశుండుండ | |
ఏలా | |
పాలించు స్వామి నీ ప్రక్కన నిలబడి
ఆలకించుచూ నీకు దాపుగనుండగ | |
ఏలా | |
తల్లి బిడ్డలు కూడి వేళవేళలయందు
సాయినాధుని పూజ సలుపుచునుండగ | |
ఏలా | |
దీవించు దేవుడు నీ దిక్కైయుండగ
దీన చింతలేలా దిగులొందకె మనసా | |
ఏలా | |
పారమార్థికములలో పడరాని బాధలలో
పడుచున్న భక్తులకు పట్టుకొమ్మైయుండ | |
ఏలా | |
ప్రేమించు సాయి నీ ప్రాపైయుండగ
పశ్చాత్తాపములలో పడబోకు ఓ మనసా | |
ఏలా | |
14
Keep
నీలాల సౌధాల్లొ నీ ఆశ గాథలలో
నా మనో వేదనలొ నా హృదయ రోదనలొ
ఉండేది కృష్ణుడే ఊరకుండేది కృష్ణుడే
మదిలోని భావాల్లో కదలేటి కోరికలలో
తీయని ఊహలలో తూగుటుయ్యాలలో
ఉండేది కృష్ణుడే ఊపుచుండేది కృష్ణుడే
తలచేటి తలపులలో వలచేటి వలపులలో
పిలిచేటి పిలుపులలో కలలు కనే కనులలో
ఉండేది కృష్ణుడే ఊ కొట్టుచుండేది కృష్ణుడే!
నావాడనేననుచు నాదాన నీవనుచు
దరిచేరి దూరమగుచు ఉండేది కృష్ణుడే
దూరమగుచుండేది కృష్ణుడే!
Previous
←
1982
Next
1986
→