Verse 5
The rites at the birth· Verses 1–5
।
।
।
।
।
1When his son was born Nanda was filled with gladness. Great-hearted, he bathed and made himself clean and put on his ornaments, and called the brahmins who know the Veda. 2He had the blessing recited, and the birth rite done for his son as the rule lays down, and the honouring of the fathers and the gods as well. 3He gave the brahmins two hundred thousand milk cows, all of them adorned, and seven hills of sesame covered over with heaps of jewels and cloth worked with gold. 4Things are made clean by time, by bathing and washing, by the rites, by austerity, by sacrifice, by giving, and by being content; and the self is made clean by the knowledge of the self.
5The brahmins spoke auspicious words, and the bards and heralds and singers sang, and the drums and the kettledrums sounded again and again.
The commentators
Bhāgavata Vāhini
36. శ్రీకృష్ణ బాల్యక్రీడలు "స్వామీ! మధురలోని కారాగారవాసమునుండి వ్రేపల్లెకు చేరినది మొదలు, పదునొకండు సంవత్సరములు గోపాలుడు అడవి గొల్లలతో గూడి వ్రజమండల మందలి వనోపవనములందు తాను యెట్టి బాల లీలలను చూపునో విన కుతూహలముగా నున్నది" అని పరీక్షితుడు శుకుని ప్రార్థించెను. శుకుడు చిరునవ్వుతో, "మహారాజా! ఆ ప్రాకృతిక దివ్య బాలకుడైన ఆ గోపాలునియొక్క మనోహరమును, చిత్తాకర్షకమునగు లీలలన్నియు చెప్పుటకు సాధ్యము కాదు. అనుభవించిన వ్రజ గోపబాలురెంతో ధన్యులు. భగవంతుడు నామ, జాతి, కుల, కర్మ, భావ సంబంధాదులను చూడడు. యే భావముతో తనను చేరిననూ ఆదరించి, అండజేర్చి, అశాంతిని దీర్చి, ఆనంద మందించే ఆ గోపాలుని, వసుదేవుడు నంద భవనమున విడిచి వచ్చినది మొదలు, నిత్యము అమందానంద ప్రదాతయగు కృష్ణునకు జయ జయ శబ్దములు మారుమ్రోగెను. దినదినమునకు పెరుగుచూ, అల్లారు ముద్దుగ అమ్మతో ఆడుచూ, దోగాడుచూ, గడప దాటుచూ, కడకు అమ్మానాన్నల చేతివ్రేళ్లు పట్టుకొని తప్పటడుగులు వేయదొడగెను. తల్లిదండ్రులు, కంసుడు పంపు దూతల బారినుండి తప్పించుటకు గోపాలుని యెన్నెన్ని విధముల దాచిననూ, దాగువాడుకాడు. వచ్చిన వారలతో
తానే ముందుపోయి పరిచయము చేసుకొనుచుండెను. లోకాలకే శ్రీ కారుడైన ఆ గోపాలుని దాచువారెవ్వరు? దోచుకొని పోవువా రెవ్వరు? అంతా ఒక లీల! రాజా! ఈ రీతిగా పెరుగుతూ, పెరుగుతూ, తల్లి దండ్రులెంత అరికట్టినా ఆగక, గొల్లపిల్లలతో యమునా తరంగిణీ పుణ్య పులినములందు ఆడుకొనుటకు వెళ్ళెడివాడు. గోవులను మళ్ళించుకొంటూ పోయెడివాడు. స్వచ్ఛమైన శోభాయుక్తమైన ఆ ఆవు దూడల మధ్య ఆడుకొంటూ మనోహరముగా నుండు వేళ చూచిన కన్నులు కన్నులు! శ్రీకృష్ణుని గో-గోప ప్రియత్వం ఆవు దూడలు తెలుపు! గోపాలుడు నలుపు! ఎంత అందముగా ఉండునో, యోచించుకో! అవి కృష్ణుని విడిచి వెళ్ళెడివి కావు. తానూ వాటిని సోదరులవలే, బిడ్డలవలే, ప్రేమించుచుండెను. గోపాలుని హస్తము దూడల మీద పడిన అవి పైమరచి నోరులు తెరచి, తోకలెత్తి, నాలుకలు చాచి, కృష్ణుని ముఖమును, చేతులను నాకెడివి. గోపాలుడు ఒక్కొక్కపరి ఆ గో దూడల మెడను గట్టిగా కౌగలించుకొని, కన్నులు మూసుకొని, మందహాసముతో తూగినట్లు కనిపించుచుండెడివాడు. దూడలు తమ బుల్లి కొమ్ములతో ప్రేమతో గోపాలుని క్రమ్ముచూ, నిత్య వసంత విహారమగు బృందావనమున యమునాతీర సైకతాల పైనా, గో వత్సములతో, గోపాలురతో, పగలు, రాత్రి అనక, విహరించుచుండెను. కడకు, నందయశోదలు పరిచారకులను పంపి బలవంతముగా యింటికి తెప్పించుకొనెడి వారు. ఈ రీతిగా యింటినీ, ఒంటినీ మరచి గొల్ల పిల్లలతో కూడి పెరుగుతూ మరింత పెద్దవాడాయెను. తల్లి దండ్రులు చెప్పకపోయినప్పటికినీ ఆవులను, కోడె దూడలనూ పలుపులు విప్పి, వూరి పశువులు పోవు మార్గములకు తన పశువులనూ మళ్ళించి, గోప బాలురతో తాను కూడనూ కోల భుజమున
వేసుకొని, ఒక తుండు తలకు కట్టుకొని, వారి మధ్య నడుచుచుంటే రాజ బాల సింహమువలే కనిపించెడివాడు. పిల్లలతో వినోదముగా ఆడుచూ, తన ఎడమ చేయి చెవులపై ఉంచుకొని యుచ్చైస్వరమున రాగములు తీయుచూ, ప్రేమ గీతములు పాడు చుండెడివాడు. అట్టి సమయములందు ఎంతో ప్రీతితో గడ్డిని తినుచుండిన గోవులు తినుట మాని, మెడలు చాచి, స్తంభించినట్లు నిలిచి, చెవులు నిక్కబొడిచి, పిలుపునకై సిద్ధముగా ఉండినటుల, లేదా ధ్యానావస్థయందు ఉండినటుల కనుపించెడివి. పాలు త్రాగుటకై అమ్మల పొదుగులలో తలలు పెట్టిన దూడలు, పాలు త్రాగక కన్నులుమూసుకొని కృష్ణ గానమునే గ్రహించుచున్నట్లు కనిపించుచూ, చూపరులకు మహాదాశ్చర్యమును కలిగించుచుండెను. శ్రీకృష్ణలీలలు అద్భుతం, ఆనందమయం రాజా! గోపాలుని లీల లెన్నని, యేమని, తెలుపుదును? అన్నీ అద్భుతములే! సర్వమూ ఆనంద మయములే! ఒక్కొక్క పరి, పిల్లలతో పేచీ పడి కర్ర త్రిప్పుట చూచిన, చేతిలోని కర్ర కంటికి కనిపించునది కాదు. అంత వేగముగా త్రిప్పెడివాడు. ఆ కర్ర త్రిప్పుట మాకునూ నేర్పుమని తోడి బాలరు ప్రార్థించెడి వారు. లోకమునే హస్తమందుంచుకొని చెండువలె త్రిప్పు గోపాలునకు కర్రయేపాటిది? ఇది నేర్చిన వచ్చు విద్య కాదని గోపాలురకు తెలియదు పాపము. ఒక్కొక్క పరి చెట్లపై ఆడుకొనెడి వారు. దొంగ తనను పట్టుటకై వచ్చిన, ఉడుత నడచినా ఊగునట్టి బలహీనమైన, చిట్టచివరి కొమ్మలో పోయి వుండెడి వాడు. అతనిని పట్టుట వీలయ్యెడిది కాదు. అవును మరి, అది సామాన్యులకు అసాధ్యము. సత్ హృదయులకే సాధ్యము. అడవులలో గొల్లపిల్లలతో ఉండినటులే యుండును. వారి భుజములపై చేతులు వేసి వేళాకోళము చేయుచూ, ఆడుచూ ఉండిన గోపాలుడు, క్షణములో
కనిపించక పోవును. ఇంతలో ఏదో ఒక మారు వేషముతో ఎదురుగా నడచుకొని వచ్చుచుండును. గోపాలురు అతడెవ్వడో కొత్తవానిగా భావించి పలుకరించక పోవుచుందురు. ఇంతలో ఫక్కున నవ్వుచూ, "నేనే నేనే, మీరు తెలుసుకొనలేక పోతిరి?" అని కేకలు వేసిన, గొల్లపిల్లలు ఆశ్చర్యపడుచూ ఒక్కొక్క సమయమున భయ భ్రాంతులకు లోనయ్యెడివారు. పగలంతయా ఈ రీతిగా గడపి, సాయంకాల సమయానికి యేమీ యెరుగని బాలునివలే, గోవులతో, పిల్లలతో, పల్లె చేరుచుండెను. ఒక్కొక్క దినమున తల్లి గొడవ చేసి అడవికి పోనీక, ఇంటియందే ఉంచుకొనుచుండెను. అట్టి సమయమున అడవిలోని గొల్ల పిల్లలూ, గోవులు, ఆనాడెంతో విచారముగా డొక్కలు లోనికిపోయి గోవులు ఒకదానిపై ఒకటి తల పెట్టి చెట్టు నీడల పండుకొని ఆహారదప్పులు లేక, ఆనంద కృష్ణుని రాకకై వేచి యుండినటుల, విచారించు చున్నటుల కనిపించెడివి. ఒక్కొక్క దినము, మామ అయిన కంసుడు కొందరిని రాక్షసులను వివిధ వేషములు ధరిపించి, ఆట బొమ్మలతో, తినుబండారములతో, వ్రేపల్లెకు పంపుచుండెడివాడు. ఆ బొమ్మల చుట్టూ గ్రామ పిల్లలు చేరి, వెలలు అడుగుచూ, ఇమ్మని కోరుచూ, వచ్చుచుందురు. కానీ, కృష్ణుడు వచ్చునేమో అని ఆ మారు వేషధారుడైన కంసదూత తదేక దృష్టితో చూచుచుండ, కృష్ణుడు ఆ బొమ్మలను కన్నెత్తి చూచువాడు కాదు. కడకు సాయంకాలము వరకు చూచి, కృష్ణుని యెత్తుకొనిపోవ పాంచి చూచిన, ఆ దుర్మార్గుని గమనించి, వాని చేతికి చిక్కి నటులనే చిక్కి డొక్క చించి, డోలు వాయించి, పగుల గొట్టి, పారవేసెడివాడు. అది వ్రేపల్లె వారలకు వింతగనూ, భయముగనూ ఆశ్చర్య ఆనందముగనూ వుండెడిది. ఒకనాడు మామిడి పండ్ల బండ్లు గ్రామమంతా నిండిపోయెను.. ఇది రాక్షస కృత్యమని గమనించి, ముందుగనే పోయి పండ్లను మాత్రము తీసుకొని అమ్మువానిని యమపురి కంపెను. మామ పంపిన వస్తువులన్నియూ వెనుక…
పంపుట శిష్టాచార విరుద్ధమని తలంచి, అన్నీ అందుకొనుచూ, తెచ్చిన వారలను మాత్రము తిరిగి పంపక వార్త నందనీయక చేయుచుండెను. మహారాజా! భగవంతుడు వ్రజములో చేరినది మొదలు వ్రజ మండల మంతయా లక్ష్మికి క్రీడా స్థలమైనది. నిజముగా లక్ష్మీదేవి వ్రజమండలములో బహిరంగముగా ఆడుకొను చున్నదా అన్నట్లుండును. వేలకు వేలు గోవులు. దధి క్షీరములకు కొదువలేదు. దాచుటకు కానీ, తినుటకు కానీ వీలు కానన్ని పాలు, పెరుగు, వెన్నలను ఏమి చేయుట అని గొల్లలు విచారించు చుండుటచూచి గోపాలుడు తమ ప్రియతములైన గోవుల సారమును పారవేయ అంగీకరించక, తమ బొజ్జ యందే చేర్చుకొనుటకు ప్రయత్నించెను. అదే పాలు, పెరుగు దొంగ అను పేరునకు తగిన ఆధారము. ఈ భోగములను గమనించి, కృష్ణుడు పరమాత్ముడని లోకానికి ఎరిగింప నెంచి, ఇంద్రుడు ఒక యుక్తిని పన్ని అతనికి కోపము వచ్చుటకు ఏదో కారణము కల్పించ యత్నించి, ఇంద్రపూజ మాన్పించినట్లునూ, ఇంద్రుడు రాళ్ళ వర్షము కురిపించి నట్లును, దాని బారినుండి రక్షించుటకై కృష్ణుడు గోవర్ధనగిరి నెత్తినట్లునూ నాటకమాడెను. నిజముగా ఇంద్రునకు కోపము లేదు. కృష్ణుడు పూజలను మాన్పించడు, సామాన్య మానవులకు దైవ తత్త్వము అర్థమగుట కష్టము కనుక, ఇట్టి అమానుష చర్యలతో దైవత్వమును గుర్తించుటకై, ఈ లీలలు సంకల్పించెను. కారణము లేని కార్యము ఉండదనుటకు ఇట్టివి ఒకింత ఆధారములు" అని వివరించెను. ఇంతలో పరీక్షిత్ మహారాజు, అద్భుతగిలి, "ఆహా! ఏమి, గోపాలుని లీలలు యెంత మధురమైనవి! వినగ వినగ వీనులారు చున్నవి. స్వామీ! ఇంకనూ కొన్ని బాల లీలలను వినిపించి తరింపజేయుము" అని ప్రార్థించెను.
In plain words
36. Śrī Kṛṣṇa's Childhood Play "Svāmī! From the time He reached Vrepalle from His dwelling in the prison at Mathurā, what childhood līlās did Gopāla display, for eleven years, in the woods and groves of the Vraja country, together with the forest cowherds? I am eager to hear of them," Parīkṣit entreated Śuka. Śuka smiled. "Mahārāja! It is not possible to tell all the enchanting, heart-captivating līlās of Gopāla, that divine child. The cowherd boys of Vraja who experienced them are blessed indeed. God does not look at name, birth-group, caste, karma, bhāva, relationship and the like. In whatever bhāva one comes to Him, He welcomes one, takes one under His shelter, removes one's unrest and bestows bliss — that Gopāla, ever since Vasudeva left Him at Nanda's house, has forever been the giver of unfailing bliss; cries of "Jaya! Jaya!" rang out for Kṛṣṇa. Growing day by day, playing with His mother as her cherished darling, crawling, crossing the threshold, and at last holding onto His mother's and father's fingers, He began to take His first toddling steps. However many ways His parents hid Gopāla to save Him from the clutches of the messengers Kaṃsa sent, He would not stay hidden. With those who came
He Himself would go ahead and introduce Himself. Who could hide Gopāla, who is the very śrīkāra of the worlds themselves? Who could steal Him away? It is all a līlā! O King! Growing up in this way, growing and growing, however much His mother and father tried to hold Him back, He would not stop, but went off with the cowherd children to play on the holy sandbanks of the rippling Yamunā. He would go along herding the cows. The eyes that saw Him then, playing so enchantingly amid those spotless, radiant cows and calves — those were eyes indeed! Śrī Kṛṣṇa's Love for the Cows and the Cowherds The cows and calves were white! Gopāla was dark! Just imagine how beautiful that must have been! They would never leave Kṛṣṇa and go away, and He too loved them like brothers, like His own children. When Gopāla's hand fell on the calves, they would forget themselves, open their mouths, raise their tails, stretch out their tongues and lick Kṛṣṇa's face and hands. Sometimes Gopāla would hug those calves tightly around the neck, close His eyes, and with a soft smile seem to sway as if half-asleep. With the calves crowding round Him with Prema, with their tiny horns, He would roam, without regard for day or night, with the calves and the cowherds, over the sands of the Yamunā's banks in Bṛndāvana, the pleasure-ground of eternal spring. In the end Nanda and Yaśodā would send servants to bring Him home by force. In this way, forgetting home and self, growing up among the cowherd children, He grew bigger still. Even though His mother and father had not told Him to, He would untie the tethers of the cows and bull-calves, turn His own cattle onto the paths the village cattle took, and He too, together with the cowherd boys, a staff on His shoulder
and a cloth tied round His head, would walk in their midst looking like a royal lion cub. Playing merrily with the children, He would put His left hand to His ear, draw out rāgas in a high, full voice, and go on singing songs of Prema. At such times the cows, which had been grazing with such relish, would stop eating, stretch out their necks, stand as though transfixed and prick up their ears, looking as if they were waiting ready for His call, or as if they were in a state of dhyāna. Calves that had put their heads to their mothers' udders to drink would leave the milk undrunk, close their eyes, and seem to be taking in nothing but Kṛṣṇa's song, filling onlookers with great wonder. Śrī Kṛṣṇa's Līlās: Wondrous and Full of Bliss O King! How many of Gopāla's līlās, and which ones, shall I tell? Every one of them is a wonder! All of them are full of bliss! Sometimes, when He squabbled with the children and twirled a stick, anyone watching could not see the stick in His hand — He twirled it that fast. His companions would beg Him, "Teach us that stick-twirling too!" But what is a stick to Gopāla, who holds the very world in His hand and spins it like a ball? The poor cowherd boys did not know that this was not an art that comes by learning. Sometimes they would play in the trees. When the one playing 'thief' came to catch Him, He would go and perch on the very last, frail twig, which would sway even if a squirrel walked on it. There was no catching Him. Yes, of course — that is impossible for ordinary people; it is possible only for the pure of heart. In the forests He would be just like one of the cowherd children. Gopāla, who had been joking and playing with His arms on their shoulders, would in a moment
vanish from sight. Then He would come walking towards them in some disguise or other. The cowherd boys, taking Him for some stranger, would pass Him by without a greeting. Then He would burst out laughing and shout, "It's me, it's me! Couldn't you tell?" and the cowherd children would be astonished, and sometimes even seized by fear and bewilderment. Having spent the whole day like this, by evening He would come back to the hamlet with the cows and the children, like a boy who knew nothing at all. On some days His mother, making a fuss, would not let Him go to the forest and kept Him at home. At such times the cowherd children in the forest, and the cows, were very sad that day. With their flanks sunken in, the cows would rest their heads on one another and lie down in the shade of the trees, with no thought of food or water, looking as if they were waiting for blissful Kṛṣṇa to come, as if they were grieving. Some days His uncle Kaṃsa would dress up some rākṣasas in various disguises and send them to Vrepalle with toys and sweets. The village children would come and gather round those toys, asking their prices and begging to be given them. But while Kaṃsa's envoy in disguise watched with fixed gaze to see whether Kṛṣṇa might come, Kṛṣṇa would not so much as lift His eyes to look at those toys. At last, when the envoy had watched until evening and then lay in wait to carry Kṛṣṇa off, Kṛṣṇa would see through the wicked fellow, let Himself be caught in his hands as though really caught, then rip open his belly, beat on it like a drum, smash him to pieces and fling him away. To the people of Vrepalle this was strange and frightening, and at the same time a wonder and a joy. One day the whole village filled up with carts of mangoes. Seeing that this was the work of rākṣasas, He went ahead, took only the fruit, and sent the seller to Yama's city. All the things His uncle had sent — back …
to send them would be contrary to proper custom, He thought; so He accepted everything, but those who had brought the things He did not send back, so that no word of it could reach Kaṃsa. Mahārāja! From the time God came to dwell in Vraja, the whole Vraja country became Lakṣmī's playground. It was truly as if the Goddess Lakṣmī were playing openly throughout the land of Vraja. There were thousands upon thousands of cows, and no shortage of curd and milk. The cowherds worried what to do with so much milk, curd and butter, more than they could either store or eat. Seeing this, Gopāla, unwilling to let the essence of their beloved cows be thrown away, tried to gather it all into His own belly. That is the real basis for His name, "the milk-and-curd thief". Noticing these riches, and intending to make known to the world that Kṛṣṇa is the Paramātma, Indra devised a stratagem. He tried to contrive some reason for himself to become angry, and staged a drama: as if Kṛṣṇa had stopped the worship of Indra, as if Indra had then rained down a rain of stones, and as if Kṛṣṇa had lifted Govardhana Hill to protect everyone from its onslaught. In truth, Indra had no anger. Kṛṣṇa does not stop anyone's worship. Because it is hard for ordinary human beings to understand the divine tattva, He resolved upon these līlās so that, through such superhuman acts, they might recognize His divinity. These are some small proofs that there is no effect without a cause," Śuka explained. Then Mahārāja Parīkṣit, marvelling, said: "Ahā! How sweet Gopāla's līlās are! The more I hear, the more my ears are filled. Svāmī! Let me hear still more of His childhood līlās, and so be redeemed!" So he entreated.