Passage 4
Passages 1–24
రెండవ అధ్యాయము ఏబది ఆరవ శ్లోకము మొదలు డెబ్బది రెండవ శ్లోకము వరకు స్థితప్రజ్ఞాని లక్షణములు, దాని మహిమను విశదీకరించెను. తరువాత భగవంతుడు “సాంఖ్యులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము, ముక్తి మార్గమునకు నేనే ప్రవచించిన వేర్పరచితిని. కాన క్షణమాత్రమైననూ కర్మ చేయక ఎవ్వడునూ ఉండలేడు. ప్రతివాడునూ ప్రకృతికి లోంగక, కర్మ చేయక తప్పదు. కాన కర్తవ్యకర్మ చేయుము. కర్మ చేయకుండుట కంటే కర్మ చేయుటే మంచిది.
“కర్మ చేయకుండిన జీవయాత్ర దుర్లభము. నడవలేదు. అందులోను బంధనలు కలిగించని కర్మలు యజ్ఞరూపములగు కర్మలు. ఇక మిగిలిన సర్వకర్మలూ బంధకారణములే. కనుక కౌంతేయా! ఆసక్తి వదలి యజ్ఞార్థముగ కర్మలు చేయుము.” అని ఈ కర్మ జన్మస్థానమును తీసుకొని చక్కగా అర్జునుని హృదయము అదురునట్లు, కదులునట్లు బోధించెను. తదుపరి మరల పరమాత్మ నుండి వేదములు, వేదముల నుండి కర్మలు, కర్మలనుండి యజ్ఞములు, యజ్ఞములనుండి వర్షములు, వర్షముల నుండి అన్నము, అన్నము నుండి భూతప్రాణులు కలుగుచున్నట్లు తెలిపెను.
“ఈ రీతిగా తిరుగుచున్న జగచ్చక్రమును అనుసరించియే తిరవలెను సుమా! ఒకటి చక్కగా విను, బావా! ముల్లోకములందునా నేను విధిగా చేయవలసిన పని యేదియూ లేదు. పొందినది కాని, పొందవలసినది కాని యేదియూ లేదు. అయినా నేనే సదా కర్మలయందు మెలగుచున్నాను. దీనిని నీవు యోచించు! నేనే కర్మలు చేయని యెడల ఈ లోకము పూర్తిగా నశించును. అంతియేకాక లోకదుర్గతికి నేనే కారణమగుదును. ఆత్మ నిష్ఠమగు బుద్ధితో సమస్త కర్మములను నా యందు సమర్పించి యే ఆశయమూ, ఏ మమకారమూ లేనివాడవై ఈ ఆరాటము మాని నీవు యుద్ధము చేయుము” అని ఆజ్ఞాపించెను.
“భగవత్ సృష్టి చక్రము సక్రమముగా నడవవలెనన్న, ప్రతివాడునూ కర్మ చేసియే తీరవలెను. ఎట్టివానికైననూ ఇది తప్పునది కాదు. పరమజ్ఞాని సహితము కర్మ చేయకుండా ఉండుటకు వీలులేదు. తిండి తీర్థములు తీసుకొనుట, ఉచ్ఛ్వాస నిశ్వాసములు సహితము కర్మలు కావా? అట్టివి చేయక ఎట్టి వాడైననూ ఉండగలడా? ప్రపంచము చేతనైనను లేక సమాజము చేతనైనా, ఏమైననూ సరే మనము ఏదో ఒక విధమైన ఉపకారము పొందుచునే యున్నాము కదా!”
“అంత యెందుకు బావా! బ్రహ్మాండమైన ఈ విశ్వమంతయూ ఒక పెద్ద కర్మాగారమే. ఈ కర్మాగారమున ప్రతి మానవుడూ ఏదో ఒక విధమైన ఉపాంగములవలె ఉన్న వారలే. కనుక ఏయే అంగములకు తగిన కర్మ ఆ ఉపాంగములైన మానవుల పాలికి వచ్చును. దానిని పరమాత్మ కర్మగా భావించి చేయవలెను. బావా! ఇంతెందుకు? ప్రపంచములో పనిచేయని వస్తువు కాని, భూతము కాని ఒక్కటయిననూ కలదా, చెప్పుము? చెట్టు, చేమ, దోమ, రాయి, రప్ప, గాలి, వాన, ఎండ, చలి ప్రతి ఒక్కటియూ కర్మలు చేయుచునే యున్నవి. సూర్య చంద్రాదులు కర్మలు చేయకుండిన జరగదు. గాలి, అగ్ని, కర్మచేయకున్న పని జరగదు. భూమి, ఆకాశము కర్మలు చేయకున్న లోకము నిలువదు. వింటివా?”
“కనుక ఈ కాయముతో కర్మ చేయకుండా ఉండిన వారు లోకమునకు రారు, లేరు. వారి వారికి తగిన కర్మలు వారు అప్రమత్తతతో నిర్వహించుచు పోయిననే ఈ విశ్వచక్రము నిరాటంకముగా నడువగలదు. బావా! జ్ఞానులు కర్మ యెందుకు చేయవలెనని, నీవూ శంకించ వచ్చును; నీకే కాదు, లోకమున మానవులందరికీ కలుగ వచ్చును. ఉత్తమ స్థానమునగల పురుషుల ఆచరణలే సర్వసామాన్యులకు ఆదర్శము. పెద్దవారల, అనుభవజ్ఞులైన వారల కర్మలే ధర్మములు. అట్టివారల బాధ్యతలు కూడా అత్యుత్తమమైనవిగా యుండును. “మేము చేయనక్కరలేదు; మేము అన్నియూ అనుభవించినవారమే. ఆ కర్మలకూ మాకు సంబంధములేదు. వాటితో పనేమి?” అని పెద్దలు జ్ఞానులు అయినవారు ఊరకుండిన సామాన్య మానవులైన అజ్ఞానుల గతి యేమైపోవును? అప్పుడు తప్పక ధర్మగ్లాని సంభవించును”.
అందుకనే ధర్మసంరక్షణ నిమిత్తము, ధర్మమును పెద్దలైనవారు పోషించి అట్టి ధర్మకర్మలను ఆచరణలో పెట్టుటకు, వారు ముందాచరించి ఇతరులకు అందించవలెను. తామే యెంతయో చేసి, చేయించి, చూచి, చూపించిన గాని అజ్ఞానులు కొంత మాత్రమైననూ నేర్చుకొని ఆచరణకు అడుగిడజాలరు.
ఒక్క విషయమును మనము చక్కగా యోచించవలెను. ఇప్పుడు మనదేహమున ఉష్ణమెంతయుండును? 98.4 డిగ్రీలున్నది. ఏ కారణములచే మన దేహముల ఇంత ఉష్ణము గలదు? దీనికి కొట్టు అధికమైన ఉష్ణమును సూర్యుడు అనుభవించుకొని యుండుట వలన గదా!
అట్లుకాక ఇంత వేడి తాను ఎందుకు భరించుకొనవలెనని సూర్యుడూరకుండిన ఇక లోకమున మానవుల గతి యేమైయుండెడిదో! అట్లనే “ఈ బ్రహ్మాండమైన విశ్వకర్మను నేను చేయవలసిన అవసరం లేదని ఊరకుండిన ఇక ఈ విశ్వము యేమైయుండెడిదో! అందువలన నేనే కర్తవ్యమని కర్మ నాచరించుట ఏ ఆదాయము కొరకు? నాకు వచ్చు సుఖమేమి? ఫలమేమి? యోచించుకో, బావా! ఈ లోకమున కర్మ ధికారులే అధికముగా ఉన్నారు. వారి వారి యోగ్యతను కాని ధర్మ కర్మ మార్గములను కాని వారు తెలిసికొనలేని అజ్ఞాన స్థితిలోనున్నార. అట్టి వారు ప్రముఖ వ్యక్తుల ఆచరణలనుసరించి తరించవలెను.” అని కర్మాచరణను గురించి బోధించుచూ కృష్ణుడు వచించెను. జ్ఞాని కర్మ నాచరించుచూ అజ్ఞానికి మార్గదర్శి కావలెను. కనుక ఎట్టివారైననూ కర్మను తు.చ. చేయక తప్పదు. నాకు భూమితో అవసరములేదు కదా అని విమానము ఆకాశముననే యుండునా? దానిలో ఎక్కు ప్రయాణీకులు పైకెగురలేరు కదా! అందువల్ల వారల కొరకై అది ఆయా స్టేషనులలో దిగి వారినెక్కించుకొని పైకి ఎగిరిపోవునట్లు, కర్మలతో జ్ఞానులకు అవసరము లేకపోయిననూ అర్హత కలిగినవారలకు మార్గదర్శికులుగా వారిని గోంపోవుటకు తాను కూడనూ నడుమముట్టి కర్మాచరణకు వంగవలెను సుమా! అజ్ఞానులను ఉద్ధరించుటకు అధర్మ కర్మలను మార్పుటకు జ్ఞానులు, తమ తమ స్థాయి నుండి దిగి వచ్చి పామరులైన వారలతో కలిసిమెలిసి కర్మలు ఆచరించవలెను. జనకాదులవంటి వారుకూడనూ ధర్మకర్మలు చేయలేదా? అశ్వపతి మహాశయుడు కర్మ నాచరించలేదా?
అంతట అర్జునుడు అమాంతరమైన ప్రశ్న అడుగగా దానికి కృష్ణపరమాత్మ ఇట్లనెను. “బావా! సర్వపాపములకు సమస్త అనర్థములకు మూలకారణము అది బీజము, కామము”. దానిని గురించి విశదీకరించి దేహోత్పత్తిబుద్ధికలవారికి దీనిని జయించుట చాలా కష్టమనియు, బ్రహ్మతత్వ బుద్ధి కలవానికే ఇది సాధ్యము కాగలదనియు బ్రహ్మతత్వబుద్ధి కలుగవలెనన్న సర్వకర్మలా భగవత్ ప్రీత్యర్థముగా చేయవలెననియు, ఈ విషయము విప్పి స్వరూపమని భావించవలెననియు, మూడవ అధ్యాయమును వివరించెను. ఈ అధ్యాయమున ప్రారంభమై కర్మమీమాంస ఐదవ అధ్యాయముతో ముగించెను. ఈ అధ్యాయమున మూడు ముఖ్యమైన విషయములను తెలిపెను. ఒకటి ప్రతివాడునూ కర్మలు ఆచరించవలెననియు అట్లు ఆచరించకుండిన సృష్టియే లేదనియు, రెండవది, పెద్దవారు అనుభవజ్ఞులు అయిన వారల కర్మలే సామాన్యుల కాదర్శములనియు, మూడవది లోకమున కర్మాధికారులే అధికులు కనుక వారికి ఆదర్శులుగా, జ్ఞానులు కూడనూ కర్మల నాచరించవలెననియు, ఈ మూడింటిని అర్జునునకు అతి ప్రీతితో బోధించెను. అంతటితో మానక కృష్ణపరమాత్మ, సకల కర్మలకూ పరమావధి జ్ఞానమనియు, అంతఃకరణ మాలిన్యమును పోగొట్టుకొనుటకు ఈశ్వరానుగ్రహమునకు కూడా చరమ దశ జ్ఞానమేయని, జ్ఞానము ఆనంద సాధనమే కాక అనంత ధామము కూడా అని స్పష్టముచేసి జ్ఞానమార్గము ప్రారంభించెను.
భగవద్గీతా శాస్త్రమునందు అమూల్యమైన రత్నము జ్ఞానయోగముగా మెరయుచున్నది. “నహి జ్ఞానేన సదృశం పవిత్ర మిహవిద్యతే” అన్నారు. అంతేగాక ఏడవ అధ్యాయములో కూడనూ “జ్ఞానీత్వాత్మైవ మే మతమ్” అన్నారు. ఈ విధముగానే అనేక చోట్ల జ్ఞానయోగ ప్రాశస్త్యాన్ని వెలిబుచ్చినారు. అందువల్లనే జ్ఞానయోగమును ఆధ్యాత్మిక సాధనకు గమ్యస్థానంగా భావించవలెను. సర్వశాస్త్రములు జ్ఞానముతో అంత్యము చేయుచున్నవి. జ్ఞానస్వరూపానుసంధానంలో మిగులునది తానే. అంతా తనలోనూ, తనలో అంతనూ ఉండును. తత్వ విచారణ చేసి తెలిసికొనుటయే జ్ఞానము. కర్మలు చేయుట కాని వదలుట కాని ముఖ్యము కాదు. దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము ఇత్యాది ఇంద్రియ వ్యాపారమేదియూ ఆత్మకు చేరినది కాదు.
అది ఊరకున్నప్పటికీ ఆ కర్మ కూడనూ ఆత్మకు చెందింది కాదు. ఈ రీతిగా తెలిసికొనుటకే జ్ఞానమని పేరు. ప్రతికర్మ కూడనూ జ్ఞానపూర్వకంగా చేయవలెను. జ్ఞానము అందుకనే ప్రవృత్తి నివృత్తి మార్గములు బోధించుచూ ఆసక్తతను అభివృద్ధిపరచుచూ, మానవుని ముక్తి సామ్రాజ్యమునకు నిష్కామ కర్మ మార్గమున కొనిపోవుచున్నది. కాన మోక్ష ప్రాప్తికి జ్ఞానము తిన్నని తెన్ను. అందుకనే జ్ఞానమువంటి పవిత్రము వేరులేదు. అజ్ఞానముకంటే అపవిత్రము కానరాదు. “వ్యష్టిలో సమిష్టిని సమిష్టిలో వ్యష్టిని చూడు; అదే జ్ఞానము. అన్ని క్షేత్రములకూ క్షేత్రజ్ఞుడు ఒక్కడే. అట్టి క్షేత్రజ్ఞుడైన ఆత్మయే తానని తెలుసుకొనుటే జ్ఞానము. ఆత్మయే పరమాత్మయని తెలిసికొనుట విజ్ఞానము” ఈ యోగమును సర్వజ్ఞుడైన కృష్ణుడు అర్జునునకు సంశయమును నివారింపదలచి ఉపదేశింప మొదలిడెను.
“బావా! ఈ పవిత్ర జ్ఞాన యోగమును పూర్వము నేను సూర్యునకు ఉపదేశించితిని. అది పరంపరగా మనువునకు, ఇక్ష్వాకునకు ప్రాప్తించి వారి ద్వారా రాజర్షులు తెలిసికొనిరి. అంతటితో అది లోకమున నశించెను. అట్లు నశించిన అవ్యయమైన ఈ యోగమును తిరిగి లోకమునకు అందించుటలో నేనే తిరిగి కంకణము కట్టవలసివచ్చినది” అని అన్నాడు కృష్ణుడు.
ఇచట నశించినది అని తెలిపి, తదుపరి ఈ యోగము అవ్యయమైనది అని అనుటలో పరస్పర విరుద్ధభావము కలుగక తప్పదు. అందుకు కారణము లేకపోలేదు; అవ్యయమనగా నాశరహితము. నాశరహితమైన ఈ యోగము నశించినదని అనుటలో, విరుద్ధమైన అర్థము కాక మరేమగును? ఈ యోగమున నాశరహితమైన రెండు ఫలములు ఉండుటచేత దీనికి అవ్యయ యోగమని కూడా పేరు వచ్చినది. ఆ ఫలములేవన ఈ యోగమునకు ఆధారమైనది, అది అయినది వేదము. ఇది అవ్యయమైనది! ఇక రెండవది కారణఫలము; ఈ యోగమునకు ఫలము మోక్షము. అదియునూ నాశరహితమైనది. ఇందులో సందియము లేదు. ఇట్టి అవ్యయ ఫలప్రదమైన ఈ యోగము కాలకర్మ, కాల రూపములచేత ఆచార ప్రచారములు లేక అడుగున పడుటచేత అనగా అదృశ్యమగుటచే నశించినదని చెప్పవలసివచ్చినది కాని అది నశించునట్టిది కాదు. అడుగునపడి అదృశ్యస్థానముననున్న ఈ యోగమును తిరిగి బయటకు తీయుటనగా ఆచార ప్రచారములోకి అందించుటే దీని భావము కాని, నశించినదానిని తిరిగి సృష్టించేది కాదు. అది నశించలేదు. అదృశ్యమునకు నశించుట అనియు దృశ్యమునకు సృష్టించుట అనియు సామాన్య భావలందు ఉపయోగింతురు. అంతమాత్రమునకే ఈ యోగము నశించునదని భావించరాదు. నశించునట్టిదానిని పరమాత్ముడు ఏ నాటికీ బోధించడు.
ఇక సూర్యుని విషయమందు కూడనూ సామాన్యముగా మనము కొంత విచారించవలసిన విషయము కలదు. భారతీయులకు సూర్యునికి సన్నిహిత సంబంధము కలదు. అనాది కాలము నుండి సూర్యుని స్థానము భారత వీరులైన క్షత్రియులకే కాక సామాన్య ప్రజలకు కూడనూ ప్రధాన స్థానమే కాక, పవిత్రమగు వీరమును ధరించినది, వహించినది. క్షత్రియ జాతికి మూలపురుషుడు సూర్య భగవానుడు. భారత సంస్కృతిలో ఇట్టి పవిత్రస్థానము మరెవరికీ లేదు.
భారతీయులే కాక యావత్ ప్రపంచమునకే సూర్యుడు ప్రత్యక్ష భగవానుడు. ప్రపంచమంతయూ కాలముచే నడుచుచున్నది. కనుక కాలానికి కూడనూ ప్రధాన ఆధారము సూర్యుడు. కాలము తనవలననే కలుగుచున్నది. కనుక కాలుడు సూర్యుని పుత్రుడని కూడ వాడుచున్నాము. ప్రతిమానవుని జీవితము కాలముచే కట్టుబడినది. కనుక జీవితమునకు సూర్యుడే ఆధార, ఆరాధ్య దేవుడై యున్నాడు. ఎవరికీ అర్పితము చేసిననూ చేయకున్ననూ మానవుని సర్వకర్మలూ సూర్యునకు మాత్రమే అర్పితము చేయక తప్పించుకొన వీలులేదు.
మానవుని జీవిత ప్రమాణమును దినదినమునూ కలిగించి హరించు చున్నాడు. అంతియేకాక అతని ద్వారా ఈ లోకమునకు ఎంత ఉపకారమున్నది వేయిమాటలతో చెప్పనక్కరలేదు. నిత్యానుభవమే ప్రత్యక్ష సాక్షి. లోకమునందలి పాడిపంటలకు, సస్యశ్యామలములకు మూలకారకుడు సూర్యుడే. అతని కిరణముల చలువ సోకకుండిన పాడిపంటలు యందు పటుత్వముండదు. తన సూటియైన కిరణముల ద్వారా సముద్ర జలమును పైకిచ్చేది అక్కడ తనచే సృష్టింపబడిన మేఘముల స్వరూపమున ఇమిడి, వాటిని ప్రజల యొక్క ధర్మకర్మల ఫలముల ననుసరించి ఆయా స్థానములందు క్రిందికి వర్ష రూపమున అందించుచున్నాడు. అతను నిరంతరము ధర్మదేవత స్వరూపమును ధరించి తారతమ్యమును పాటించక తనకెదురైన వాటినన్నింటిని పలుకరించుచూ, తన తేజస్సును వాటితో చేర్చుచున్నాడు.
సూర్యుడు మహాత్యాగి, ఒక నిమిషమైననూ తన సుఖమును కాని, విశ్రాంతిని కాని ఆశించక కర్తవ్య కర్మ నాచరించుచు నిష్కామ కర్మయోగి, నిరాడంబరముకల నిర్గర్వి. లోకమునకు ఎవ్వరూ చేయనంతటి ఉపకారముననూ క్షేమముననూ తాను చేయుచూ, అందిచు చుండిననూ తానేమి చేయనివానివలె నటించుచుండును. ఇన్ని కార్యములు నావలన లోకమునకు జరుగుచున్నవి కదా! నేను లేకుండిన లోక మేగతి పట్టియుండునో అని ఏనాడూ గర్వముతో తలంచడు.
ఎంతవేడయిననూ సహించి ఓపికతో ఎంత పని అయిననూ చేసి లోక క్షేమమును అందించుచున్నాడు! సూర్యుడే శ్రమ అని తలంచినట్లయి ఉండిన లోకమే స్థితిలో ఉండెడిదో ఊహలకు కూడనూ అందదు. అసలు మానవుని దేహమందు ఈ మాత్రపు వేడి నిలచియున్నదన్న దీనికి కారణం సూర్యుడంతటి వేడిని సహించుకొనుటయే కాని వేరు కాదు. దీనిని బట్టి చూడగా దేహమును కూడనూ తానే కాపాడుచున్నాడు. తన శక్తిని కొంత దేహమున ఇముడ్చును. ఆ సూర్య కాంతే దేహమున కొంత లేకుండిన అది ఒక జడము నిస్సారమయి యుండెడికదా!
సూర్యుడే విసుగు విరక్తి చెందిన లోకమంతా ఒక నిమిషములో మంటిపోయియుండెడిది. కాన అతడు ఏ విధమైన విసుగూ లేక అతి ఓపికతో లోకమును రక్షించుచున్నాడు. ఇది అతను సహజమని భావించుచున్నాడు. కాని సర్వుల కోసమని భావించుటలేదు.
సహజ కర్మలంటే పేరు ఉట్టిపడును. కాని, అసహజ కర్మలందు అంత శాంతము చేరుటకు వీలులేదు. సహజ కర్మలు ఎప్పటికీ ఏ ఒక్కరికీ భారమనిపించవు. అహంకారమున ఆచరించిన కర్మలయందే విసుగు, విరక్తి, అశాంతి, భారమూ తాండవమాడును. అందుకు ఆశ్చర్యము కూడనూ తోడగును. సహజమునకు అట్టివి చేరవు.
ఒక విషయమును చూదము. మానవుడు ఎప్పుడైనా సుఖముగా జీవించుచుండిన ఎవ్వరూ ఏమయ్యా సుఖంగా ఉన్నావని ప్రశ్నించరు. అదే దుఃఖముగా నుండిన ప్రతివాడూ ఎందుకయ్యా దుఃఖముగా ఉన్నావని ప్రశ్నల వర్షం కురిపింతురు. కారణమేమి? మానవుడు సుఖస్వభావము కలవాడు; అందువలన ఆశ్చర్యము కలుగదు. అందులో దుఃఖము మానవునకు అస్వభావము కనుక అంత ఆశ్చర్యము కలిగించి అనేక ప్రశ్నలకు గురిచేయును. దుఃఖము భ్రాంతితో ఏర్పడినది కాని అది సహజమైనది కాదు. అందువలన అన్ని వికారములు కలుగును.
దీనిని బట్టి చూడ సహజమునకు విసుగు కాని, భారము కాని ఆశ్చర్యముకాని, గర్వము కాని విరుద్ధమైన కల్పిత వికారములని సూర్యభగవానుడు ప్రత్యక్షముగా మానవులకు బోధించుచున్నాడు.
సూర్య భగవానుని కర్మ కృత్రిమము కాదు. కనుకనే ఏ ఆరాటము కాని, ప్రచారము కాని లేక నిశ్శబ్దముతో సకాలమునకు సక్రమ పద్ధతినొసంగించుచున్నాడు. తనవలన కలిగిన కాలమును కూడ వ్యర్థగావించక దానినే మానవుల జీవితప్రమాణముగా నియమించి కాలము వలన ఆనంద ఆహారములనే గాక, మంచి చెడ్డలను కూడ నిర్ణయించి జీవులకు మార్గదర్శకుడై మెలగుచున్నాడు. జీవులకు సద్గతి మార్గము సమకూర్చుచున్నాడు. ఇట్టి గుణవంతుడూ, మహాత్యాగి, నిష్కామకర్మయోగి కనుకనే భగవంతుడు మునుపు ఈ యోగమును సూర్యునకు బోధించియుండుట; లేకున్న, సామాన్యులకు ఇట్టిది సాధ్యమా! ఇప్పుడు ఈ అవ్యయమయిన ఈ యోగమును తిరిగి ప్రజా ప్రతినిధిగా నిలచిన అర్జునునికి బోధించుచున్నాడన్న, అర్జునుడు సూర్యుడంతటి గుణశాలి అయిఉండవలెను గదా! ఇతని చరిత్ర ఎంతటిదయియుండెనో పాఠకులు యోచించవచ్చును. అంతటి పవిత్రతే ఈ అర్జునునియందు లేకుండిన కృష్ణపరమాత్మ, ఇంత ప్రయత్నము ఎందుకు సంకల్పించి యుండును? అర్హత లేనిదే అందరికీ భగవంతుడు అందుబాటులో ఉండడు. తన సంకల్పమునకు తగిన అర్హత అర్జునునియందు ఉన్నదనుటలో సందియము లేదు.
1From the fifty-sixth through the seventy-second ślokas of the second chapter, the marks and greatness of the sthita-prajña are explained. Bhagavān then says: 'I have distinguished two paths to Mukti: Jñāna Yoga for those established in Sāṅkhya, and Karma Yoga for the Yogīs. Yet no one can remain even for a moment without action. Everyone, being subject to Prakṛti, must act. Therefore perform the Karma that is yours to do. Action is better than the refusal to act.' 2'Without action even the journey of embodied life cannot continue. Actions that do not bind are those performed in the spirit of yajña; all other actions become causes of bondage. Therefore, Kaunteya, relinquish attachment and perform Karma for the sake of yajña.' In this way Kṛṣṇa took up the very origin and place of Karma and taught until Arjuna's heart was stirred. He then showed the wheel: from Paramātma come the Vedas; from the Vedas, Karma; from Karma, yajña; from yajña, rain; from rain, food; and from food, living beings. 3'Dear one, one must move in harmony with this revolving wheel of the world. Listen carefully. In all the three worlds there is nothing that I am obliged to attain, nothing lacking that I must gain. Yet I remain ceaselessly engaged in Karma. Reflect on this. If I Myself ceased to act, the world would fall into ruin, and I would become the cause of its decline. Therefore, with Buddhi established in the Ātma, offer all actions to Me, free yourself from expectation and mamakāra, cast off this feverish agitation, and fight.' 4'For Bhagavān's wheel of creation to move in order, every being must perform its part. No one is exempt. Even the highest jñānī cannot live without some action. Are eating, drinking, inhaling and exhaling not actions? Can anyone continue embodied life without them? And do we not constantly receive help in one form or another—from society, from the world, from countless visible and invisible sources?' 5'Why say more, dear one? This entire vast universe is one great workshop. Every human being is like a component within it. According to the place of each component, the fitting Karma comes to that person; it should be performed as Paramātma's work. Is there even one thing or being in the world that does nothing? Trees and plants, insects, stones, wind, rain, sunlight and cold—all perform their functions. If the Sun and Moon ceased their activity, order would fail. If air and fire did not act, life would fail. If earth and space did not perform their functions, the world could not stand. Do you hear?' 6'Therefore no one comes into this embodied world and remains wholly without Karma. Only when each performs the work suited to him with vigilance can the universal wheel move unobstructed. You may ask why jñānīs should continue to act. This doubt may arise not only in you but in people everywhere. The conduct of those who occupy higher positions becomes the model for the many. The actions of elders and those rich in experience become Dharma for those who look to them. Their responsibility is therefore especially great. If elders and jñānīs were to say, "We need do nothing; we have experienced everything. These actions no longer concern us," what would become of ordinary people who still live in ignorance? Dharma-glāni, the decline of Dharma, would surely follow.' 7For the protection of Dharma, therefore, elders must uphold it in their own lives. They should first practise Dharmic action themselves and then pass it on to others. Only after seeing it done, and seeing again and again how it is done, can those who lack understanding begin to learn and step into practice. 8Consider one simple matter. The human body maintains a temperature around 98.4 degrees. From where does even this bodily warmth ultimately come? Is it not because the Sun bears an immeasurably greater heat? 9If the Sun were to say, 'Why should I endure such heat?' and become inactive, what would happen to humanity? In the same way, if one who knows were to say, 'I have no need to take part in this vast work of the universe,' what would become of the world? Why does the wise one act? Not for personal gain, pleasure or fruit. In this world many are qualified for action but do not yet understand either their own fitness or the path of Dharmic Karma. Such people must learn by observing the conduct of those who stand before them. Therefore the jñānī should act and become a guide to the ajñānī. No one, however elevated, can simply abandon Karma without consequence for others. An aeroplane may belong to the sky, but can it remain forever aloft because it has no need of the earth? Passengers cannot board it there. It descends to the appropriate station, takes them aboard, and rises again. Likewise, even if jñānīs have no personal need of Karma, they must descend, so to speak, into action in order to lift those who are ready. To raise the ignorant and transform adharmic activity, the wise must come down from their own level, mingle with ordinary people, and act among them. Did not Janaka and others perform Dharmic Karma? Did not the great Aśvapati act? 10Arjuna then asked an urgent question, and Kṛṣṇa Paramātma replied: 'Dear one, the root and seed of every pāpa and every calamity is kāma—desire.' He explained that kāma is very difficult to conquer for one whose Buddhi is centred on bodily birth and identity, but it can be overcome by one established in Brahma-tattva. To gain such Brahma-tattva-buddhi, all Karma must be performed for the pleasure of Bhagavān. In this way the third chapter is unfolded. The discussion of Karma that begins here continues through the fifth chapter. Three principal truths are emphasised: every person must act, and without action creation itself could not continue; the conduct of elders and the experienced becomes the model of ordinary people; and because most people in the world still stand primarily in the field of Karma, jñānīs too should act as living examples. Kṛṣṇa teaches these three points to Arjuna with great affection. He then moves further: the ultimate end of all Karma is Jñāna; the final purification of the antaḥkaraṇa and the maturity of Īśvara-anugraha culminate in Jñāna; Jñāna is not merely a means to Ānanda but the doorway to the infinite abode. Thus He begins the path of Jñāna. 11Jñāna Yoga shines in the Bhagavad Gītā like a priceless jewel. 'Na hi jñānena sadṛśaṁ pavitram iha vidyate'—there is nothing here so purifying as Jñāna. In the seventh chapter Bhagavān also says, 'jñānī tv ātmaiva me matam'—the jñānī is My very Self, in My view. In many places He reveals the greatness of Jñāna Yoga. Therefore Jñāna Yoga may be understood as the destination of spiritual Sādhana. All śāstras culminate in knowledge. In the contemplation of one's Jñāna-svarūpa, what remains is oneself alone: all is in oneself, and oneself is in all. To inquire into tattva and know it is Jñāna. Merely doing Karma or abandoning Karma is not the essential matter. The operations of body, Manas, Buddhi, Chitta and the senses do not belong to the Ātma. 12Even the body's apparent inactivity does not become an action of the Ātma. To know this clearly is Jñāna. Every action should therefore be informed by knowledge. Jñāna teaches both pravṛtti and nivṛtti in their right place, cultivates non-attachment, and through the path of Niṣkāma Karma leads man toward the kingdom of Mukti. Jñāna is the direct road to Mokṣa. Hence nothing is as pure as Jñāna, and nothing so impure as ignorance. 'See the whole in the individual and the individual in the whole; that is Jñāna. The Kṣetrajña in all kṣetras is one. To know that the Ātma, the Kṣetrajña, is oneself is Jñāna. To know that this Ātma is Paramātma is Vijñāna.' Sarvajña Kṛṣṇa began teaching this Yoga to remove Arjuna's doubts. 13'Dear one, I taught this sacred Jñāna Yoga long ago to the Sun. Through the lineage it passed to Manu, then to Ikṣvāku, and through them the rājarṣis knew it. In time it disappeared from the world. Therefore I have again taken upon Myself the task of restoring this imperishable Yoga to humanity,' Kṛṣṇa said. 14At first there appears to be a contradiction: how can Kṛṣṇa say that this Yoga 'disappeared' and also call it avyaya, imperishable? There is a reason. Avyaya means that which does not perish. This Yoga is called Avyaya Yoga because both its foundation and its fruit are imperishable. Its foundation is the Veda, which is imperishable. Its fruit is Mokṣa, which too is imperishable. When such a Yoga falls out of living practice and transmission through the effects of time and human conduct, it becomes hidden; in that sense people say it has 'perished.' The meaning is not that the Yoga itself has been destroyed. To bring it out again means to restore it to practice and transmission, not to recreate something that had ceased to exist. In common speech we call what becomes invisible 'lost' and what becomes visible again 'created.' Do not therefore imagine that this Yoga is itself perishable. Paramātma would never teach as ultimate truth something subject to destruction. 15There is also something to reflect upon concerning the Sun. Indians have a close and sacred relation to Sūrya. From ancient times the Sun has occupied a central and holy place not only for the heroic Kṣatriya lineages of Bhārata but for the people as a whole. Sūrya Bhagavān is regarded as the primordial source of the Kṣatriya lineage. Few symbols have held so direct and sacred a place in Indian culture. 16Nor is Sūrya only for Indians; for the whole world he is the directly visible form of Bhagavān. The world moves through time, and the Sun is the principal visible measure of time. Time itself is experienced through his movement; thus Yama, the Lord of time, is traditionally spoken of as the son of the Sun. Every human life is bound by time. Therefore Sūrya becomes both support and object of reverence for life. Whether a person consciously offers his actions to anyone or not, all embodied activity ultimately unfolds under the Sun's order. 17Day after day he measures and consumes the span of human life. Yet his service to the world is beyond the need for a thousand words; daily experience is witness enough. The crops of the earth and the green abundance of life depend upon the Sun. Without the touch of his rays, fields cannot flourish. Through those rays he lifts water from the seas, gathers it into clouds, and according to the order of nature and the fruits of people's Dharma and Karma, returns it as rain in the appropriate places. Without discrimination he shines upon whatever stands before him, sharing his radiance equally. In this sense he stands visibly as a form of Dharma-devatā. 18Sūrya is a mahā-tyāgī. Not for a moment does he seek personal pleasure or rest. Performing his duty without expectation, he is a Niṣkāma Karma Yogī, free of display and pride. Though no one renders a greater service to the world's welfare, he behaves as though he had done nothing at all. He never thinks with pride, 'So much happens because of me; what would the world do without me?' 19He bears immense heat with patience, performs unceasing work, and gives well-being to the world. If the Sun himself felt burdened by his labour, one cannot imagine what condition the world would be in. Even the warmth in the human body is possible because Sūrya bears and gives such power. In that sense he sustains the body too, placing a portion of his energy within embodied life. Without even that measure of solar energy, the body would be inert and without vitality. 20If Sūrya were overcome by disgust or weariness, the world could be destroyed in a moment. Yet without resentment he protects it with immense patience. He does not regard this as a burden performed for others; it is his own svabhāva, his natural Dharma. 21That is the mark of sahaja-karma—action natural to one's being. In unnatural or ego-driven action, such peace is difficult. Natural action does not feel like a burden. It is in action performed through ahaṁkāra that weariness, aversion, restlessness and heaviness dance. They do not belong to what is truly natural. 22Consider another example. If a person is living happily, no one ordinarily asks, 'Why are you happy?' But if he is unhappy, everyone asks, 'Why are you sad?' Why? Happiness is natural to man, and therefore it causes no surprise. Sorrow is contrary to his deeper nature; hence it provokes surprise and questions. Sorrow arises through bhrānti, not as the natural condition of the Self. Therefore it gives rise to many disturbances. 23In this way Sūrya Bhagavān teaches humanity directly that weariness, burden, astonishment and pride are artificial distortions, contrary to the ease of one's true natural function. 24The Karma of Sūrya Bhagavān is not artificial. Therefore, without agitation or publicity, silently and at the proper time, he performs it in perfect order. Even the time that arises through him is not wasted: it becomes the measure of human life. Through the cycles of time, not only food and joy but the ripening of good and bad are ordered, and thus he serves as a guide for beings. Because he embodies such qualities—great Tyāga, Niṣkāma Karma Yoga and freedom from pride—Bhagavān first taught this Yoga to Sūrya. Would such a teaching have been entrusted casually? Now the same imperishable Yoga is being taught again to Arjuna, who stands as the representative of humanity. Should not Arjuna therefore possess qualities worthy of Sūrya? The reader may reflect upon the greatness of his life. If such purity had not been present in Arjuna, why would Kṛṣṇa Paramātma have undertaken so much for him? Bhagavān does not reveal the highest to one wholly without fitness. There is no doubt that Arjuna possessed the adhikāra suited to the divine purpose.